YSR Kapu Nestham Scheme 2023 YSR Kapu Nestham Scheme 2023

YSR Kapu Nestham Scheme 2023

 YSR Kapu Nestham kapu nestham eligibility in telugu kapu nestham application pdf in telugu

YSR Kapu Nestham Scheme 2023

  • కాపు నేస్తం పథకానికి సంబందించిన కొత్తగా దరఖాస్తు చేయు సమయం లొ హౌస్ హోల్డ్ మాపింగ్ ప్రకారం కులాన్ని నిర్దారించారాదు. వారి కుల ధ్రువీకరణ ప్రకారం వారు బలిజ , ఒంటరి , కాపు & తెలగ కులానికి చెందిన వారు అయితే వారిదరఖాస్తు ను స్వికరించి దరఖాస్తు చేయాలి. హౌస్ హోల్డ్ మాపింగ్ లొ తరువాత మార్పులు చెయ్యటం జరరుగును.
  • కాపు నేస్తం పథకం కాపు, బలిజ, ఒంటరి మరియు తెలగ కులాల వారికి వర్తిస్తుంది. శెట్టిబలిజ , పూస బలిజ , గాజు బలిజ వారికి వర్తించదు.
  • వైస్సార్ చేయూత, వైస్సార్ ఈబీసీ నేస్తం పొందిన వారికి వర్తించదు. 
  • వైయస్సార్ కాపు నేస్తం 2023-24 పథకము ఆగస్టు నెల 2023లో లాంచింగ్ ఉంటుంది. కొత్తగా దరఖాస్తు చేయుటకు చివరి తేదీ జులై 22.
  • వైఎస్ఆర్ కాపు నేస్తం 2023-24 పథకానికి సంబంధించి NBM పోర్టల్ WEA/WWDS లాగిన్ లో "Kapu Nestham Field Verification" మాడ్యుల్ ఎనేబుల్ చెయ్యడం జరిగింది.
  • వైయస్సార్ కాపు నేస్తం 2023-24 పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తు చేయుటకు గాను NBM పోర్టల్ లొ DA/WEDPS వారి లాగిన్ లొ అవకాశం కలదు. కొత్తగా 2023-24 సంవత్సరానికి దరఖాస్తు చేయు విధానము - Click Here 
  • గత సంవత్సర లబ్ధిదారులు మరలా కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదు .
  • ఆధార్ అప్డేట్ హిస్టరీ సచివాలయం లోని DA / WEDPS వారు డౌన్లోడ్ చేసి వెరిఫికేషన్ చేసిన డాక్యుమెంట్ మాత్రమే అప్లోడ్ చెయ్యాలి .దరఖాస్తు దారుడు తెచ్చిన డాక్యుమెంట్ తీసుకోకూడదు . Download AUH - Click Here 
  • WEA/WWDS వారు తప్పనిసరిగా లబ్ధిదారుల ఇంటిని సందర్శించాలి మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ ఫారమ్ మరియు లబ్ధిదారుడితో పాటు WEA/WWDS ఫోటో అప్‌లోడ్ చేయాలి.
  • కాపు నేస్తం గత సంవత్సర లబ్ధిదారుల వెరిఫికేషన్ కు క్యాస్ట్ & ఇన్కమ్ అవసరం లేదు. అప్లోడ్ టైమ్ లొ ఆప్షనల్ గా ఉంటుంది. 

2.వైస్సార్ కాపు నేస్తం పథకం లక్ష్యం : 

కాపు, బలిజ, తెలగ కులాల మహిళల జీవన ప్రమాణాలను పెంచడం వైయస్ఆర్ కాపు నేస్తం పథకం యొక్క ముఖ్య లక్ష్యం.


3.వైస్సార్ కాపు నేస్తం పథకం ప్రయోజనాలు :

  • ఇది కాపు మహిళల జీవనోపాధి అవకాశాలు మరియు జీవన ప్రమాణాలను పెంచుతుంది.
  • AP ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలకు రూ.75,000/-, సంవత్సరానికి రూ.15,000/- చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా దరఖాస్తుదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.


4.వైస్సార్ కాపు నేస్తం పథకం అర్హతలు :

  1. కాపు వర్గానికి చెందిన మరియు 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు.పుట్టిన తేదీ 01.08.1963 to 31.07.1978 మధ్య ఉండాలి.
  2. మొత్తం కుటుంబ ఆదాయం రూ. 10,000, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000/- రూపాయలు. 
  3. కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి మరియు పొడి భూమి కలిసి ఉండాలి.
  4. కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకూడదు
  5. కుటుంబానికి 4 వీలర్ (టాక్సీ, ఆటో, ట్రాక్టర్లు మినహాయింపు) ఉండకూడదు
  6. కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు.
  7. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేని కుటుంబం లేదా 750 అడుగుల కంటే తక్కువ నిర్మించిన ప్రాంతం.


5.వైస్సార్ కాపు నేస్తం పథకంకు ఎలా దరఖాస్తు చేయాలి :

పాత లబ్దిదారులకు  :
గత సంవత్సరం వరకు లబ్ది పొందిన వారి వివరాల లిస్ట్ వెరిఫికేషన్ కొరకు సచివాలయం లోని WEA/WWDS అధికారుల NBM లాగిన్ లోకి వస్తాయి . వచ్చిన వెంటనే గ్రామా లేదా వార్డు వాలంటీర్లకు సమాచారం అనిందించటం జరుగును . వారు దరఖాస్తు దారుల  వద్ద వెరిఫికేషన్ కొరకు అవసరం అయినా డాక్యుమెంట్ లు తీసుకొని , BoP Mobile అప్లికేషన్ లో లబ్ధిదారుల వద్ద బయోమెట్రిక్ eKYC  తీసుకోవటం జరుగును . ఆలా చేసిన వారికీ ఈ సంవత్సరం 2023 లో నగదు జమ అవుతుంది . 

5.1. WEA / WWDS వారి లాగిన్ లో వెరిఫికేషన్ ప్రాసెస్: 
  • "Kapu Nestham Field Verification" module enabled in NBM portal (WEA/WWDS LOGIN) UNDER NBM SCHEMES MODULE-->YSR KAPU NESTHAM--> VERIFICATION-->SELECT F.Y 2023-2024 THEN APPLs WISIBLE 
  • అప్లికేషన్ ID మీద క్లిక్ చేస్తే PRE-POPULATED FIELD VERIFICATION FORM DOWNLOAD అవుతాది దాన్ని PRINT తీసుకుని మిగిలిన COLUMNs FILL చేసి SIGN తీసుకుని,WEA/WWDS SIGN చేసి PHOTO WITH BENEFICIARY AND FIELD VERIFICATION FORM UPLOAD చేసి సబ్మిట్ చేయాలి.

కొత్త దరఖాస్తు దారులకు :
కొత్తగా ఈ సంవత్సరం దరఖాస్తు చాగేసుకోవాలి అనుకునే వారు కింద తెలిపిన డాక్యుమెంట్ లను సచివాలయం లో PSDA / WEDPS వారికి అంధివంచినట్టు అయితే అర్హత ప్రమాణాల మేరకు దరఖాస్తు ఆన్లైన్ చెయ్యటం జరుగును .దరఖాస్తు చేయు సమయం లో దరఖాస్తు దారులు బయోమెట్రిక్ లేదా ఐరిష్ లేదా మొబైల్ ఓటీపీ ద్వారా eKYC ఇవ్వవలసి ఉంటుంది.  దరఖాస్తు దారులు కింద తెలిపిన విధంగా వారి దరఖాస్తు  స్టేటస్ తెలుసుకోగలరు . 

6.వైస్సార్ కాపు నేస్తం పథకం దరఖాస్తుకు కావాల్సినవి :

  1. దరఖాస్తు ఫారం - Click Here
  2. ఆధార్ కార్డు 
  3. రైస్ కార్డు 
  4. కాస్ట్ సర్టిఫికెట్ (AP Seva అనగా సచివాలయం లో పెట్టినవి )
  5. ఇన్కమ్ సర్టిఫికెట్ (AP Seva అనగా సచివాలయం లో పెట్టినవి )
  6. ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్.
  7. బ్యాంకు బుక్  మొదటి పేజీ 
  8. ఆధార్ అప్డేట్ హిస్టరీ


7.వైస్సార్ కాపు నేస్తం పథకం అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే విధానము :

వైస్సార్ కాపు నేస్తం పథకానికి సంబంధించి లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ ను కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా ఎవరికీ వారు వారి మొబైల్ లో ఆధార్ నెంబర్ తో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు 
Click Here to Check Application Status

8.ఆధార్ కార్డు కు ఏ బ్యాంకు అకౌంట్  లింక్ అయినదో తెలుసుకునే విధానము 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు గాను నగదును డైరెక్టర్గా బ్యాంకు ఖాతాలో కాకుండా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలో మాత్రమే నగదును జమ చేయడం జరుగుతుంది. కావున సంక్షేమ పథకాలకు అర్హులైనటువంటి వారు వారి ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు కాకా లింక్ అయినదో తెలుసుకునేందుకు తప్పనిసరిగా ఆధార్ కార్డుకు ఫోను నెంబర్ లింక్ అయ్యి ఉండాలి

ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకునే విధానము: 👇
Click Here

9.వైస్సార్ కాపు నేస్తం Downloads :


10. వైస్సార్ కాపు నేస్తం 2023-24 షెడ్యూల్ :

18 జులై : వైస్సార్ కాపు నేస్తం కు సంబంధించి ఉత్తర్వులు విడుదలకు చివరి తేదీ 
22 జులై : కొత్త దరఖాస్తు లు నమోదుకు చివరి తేదీ 
26 జులై : ఫీల్డ్ వెరిఫికేషన్ కు చివరి తేదీ 
27-28 జులై : ఆరు దశల ధ్రువీకరణ కు చివరి తేదీ 
29 జులై : గ్రామా వార్డ్ సచివాలయం లో సోషల్ ఆడిట్ కొరకు దరఖాస్తు దారుల  లిస్ట్ లు పెట్టుటకు చివరి తేదీ  
30 జులై - 7 ఆగస్టు : సోషల్ ఆడిట్ పై ఏవైనా కంప్లైంట్ లు తీసుకునేందుకు చివరి తేదీ 
9 ఆగస్టు : చివరి అర్హుల , అనర్హుల జాబితా చేయుటకు చివరి తేదీ 
10-15 ఆగస్టు : లబ్ధిదారుల eKYC కు చివరి తేదీ 
10-12 ఆగస్టు : జిల్లా కలెక్టర్ వాయఱి నుంచి ఆమోదం కు చివరి తేదీ 
ఆగస్టు నెలలో : అర్హులకు నగదు జమ చేయుట 

Post a Comment

0 Comments