YSR Aarogya Sri App Installation Process By Grama Ward Volunteers
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ పరిధిలో పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్లు వారి యొక్క క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి వారి మొబైల్లో ఆరోగ్యశ్రీ మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి, ఆరోగ్యశ్రీ కార్డు వివరాలకు సంబంధించి మరియు మొబైల్ అప్లికేషన్లో ఉన్న అన్ని విషయాలను వారి క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయవలసి ఉంటుంది. గ్రామ వార్డు వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉపయోగించుకునే విధంగా తెలియజేయవలసి ఉంటుంది.
వైస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ సేవలు :
- మీరు మీ కుటంబ సభ్యులు ఆర్యోగ్యశ్రీ క్రింద పొందిన చికిత్సలకు సంబంధించిన వివరాలు పొందవచ్చు..
- చికిత్స తర్వాత విశ్రాంతి కాలానికి గాను మీ ఖాతాలో జమయ్యే ఆరోగ్య ఆసరా ఆర్థిక సహాయం మొత్తాన్ని కేసుల వారీగా తెలుసుకోవచ్చు.
- చికిత్స సమయంలో మీకు చేసిన వైద్య పరీక్షలు రిపోర్టులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- మీకు ఉచితంగా చికిత్స అందించినందుకు గానూ, నెట్వర్క్ ఆసుపత్రికి డా॥ వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం నుండి జమకాబడిన మొత్తం, మొదలైన వివరాలు నేరుగా మీరే తెలుసుకోవచ్చు..
వాలంటీర్ వారు ఏం పని చేయాలి ?
గ్రామా లేదా వార్డు వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్నటువంటి వారి మొబైల్ అప్లికేషన్లో ఆరోగ్యశ్రీ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఆరోగ్యశ్రీ నెంబరు లేదా ఆధార్ నెంబర్ ద్వారా అప్లికేషన్లో లాగిన్ అవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అప్లికేషన్ ద్వారా ఏ ఏ సర్వీసులను పొందవచ్చు ఏ ఏ విషయాలను తెలుసుకోవచ్చో కూడా క్లుప్తంగా తెలియజేయాలి.
వాలంటీర్ పరిధిలో ఉన్న అన్ని ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్లను ఎలా తెలుసుకోవాలి ?
వాలంటీర్ తమ పరిధిలో ఉన్న అందరి ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్లను తెలుసుకునేందుకు చిన్న ఉపాయం ఉన్నది. GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లోకి లాగిన్ అయిన తరువాత హోమ్ పేజీ లో "సేవల డెలివరీ" సెక్షన్ లో "ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణి" ఓపెన్ చేసి "Completed" పై క్లిక్ చేస్తే వాలంటరీ క్లస్టర్ పరిధిలో ఉన్న అందరి కుటుంబ పెద్ద పేర్లు మరియు వారి ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ లను చూపిస్తుంది.
ఆరోగ్యశ్రీ మొబైల్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?
ఆరోగ్యశ్రీ మొబైల్ అప్లికేషన్ను కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వాలంటీర్ వారు క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి గ్రూపు సభ్యులకు ఈ పోస్టును షేర్ చేసినట్లయితే వారు కింద లింక్ ద్వారా వారికి వారుగా మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటారు.
అప్లికేషన్లో ఎలా లాగిన్ అవ్వాలి ?
Step 1 : ముందుగా పైన ఇవ్వబడిన మొబైల్ అప్లికేషన్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయాలి.
Step 2 : USER LOGIN పేజీ చూపిస్తుంది. అందులో enter UHID or Aadhaar No అని ఉన్న దగ్గర ఆరోగ్య శ్రీ నెంబర్ లేదా సిటిజెన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. పేద Scan అని చూపిస్తున్న దగ్గర ఆరోగ్య శ్రీ కార్డు పై ఉండే స్కానర్ ను స్కాన్ చేసిన సరి పోతుంది. తరువాత Submit పై క్లిక్ చేయాలి.
Step 3 : otp verification! పేజీ చూపిస్తుంది. అక్కడ చూపిస్తున్న మొబైల్ నెంబర్ 4 అంకెలు సరి అయితే Continue పై క్లిక్ చేస్తే 4 అంకెల OTP వస్తుంది, ఆ OTP ఎంటర్ చేసి లాగిన్ అయితే సరి పోతుంది. నెంబర్ సరి అయినది కాక పోతే not you పై క్లిక్ చేసి UHID No వద్ద ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్, Family Head Aadhar no. వద్ద కుటుంబ పెద్ద ఆధారం నెంబరు ఎంటర్ చేసి verify పై క్లిక్ చేసిన తరువాత వారి వద్ద ఉన్న మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. మరలా లాగిన్ పేజీకి వెళ్లి ఆధార్ నెంబరు లేదా ఆరోగ్యశ్రీ కార్డు నెంబరు ఎంటర్ చేసి రిజిస్టర్ సమయంలో ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయితే సరిపోతుంది.
Note : ఆరోగ్యశ్రీ కార్డు నెంబరు లేదా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా లాగిన్ అయ్యే సమయంలో మొబైల్ నెంబరు లింకు లేదు అని చూపించినట్టయితే మొబైల్ నెంబర్ను కూడా వెంటనే మొబైల్ ఫోన్లో అప్డేట్ చేసుకోవచ్చు. దానికిగాను అప్డేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు నెంబరు మరియు కుటుంబ పెద్ద ఆధార నెంబరు ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత వారి వద్ద అందుబాటులో ఉన్న మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత మరల లాగిన్ పేజీలో ఆరోగ్యశ్రీ కార్డు నెంబరు లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే రిజిస్టర్ చేసే సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వవచ్చు.
ఆసుపత్రిలో ఉచితంగా అందించే సేవలు:
- ఉచిత అడ్మిషన్.
- డాక్టర్ సంప్రదింపులు (ప్రతి రోజు).
- నర్సింగ్ సేవలు (ప్రతి రోజు).
- అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలు.
- అవసరమైన మందులన్నీ ఉచితముగా ఇవ్వబడును.
- శస్త్ర చికిత్స (ఆపరేషన్) / చికిత్స).
- శస్త్ర చికిత్సలకు అవసరమైన ఇంప్లాంట్లు,
- అల్పాహారము, భోజనము (రెండు పూటలు).
- డిశ్చార్జ్ సమయంలో సరిపడా మందులు.
- మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రెస్ట్ పీరియడ్ కోసం అయ్యే ఖర్చు నిమిత్తం ఆరోగ్య ఆసరాగా డబ్బులు సైతం మీ బ్యాంకు అకౌంట్ కు పంపిస్తారు.
- ఇంటికి వెళ్ళడానికి అవసరమయ్యే చార్జీలు ఉచితముగా ఇవ్వబడును.
- 10 రోజుల తరువాత ఆసుపత్రికి వచ్చి మీరు మళ్ళీ ఉచితంగా చూపించుకోవచ్చు.
- అవసరమైన చికిత్సలకు ఒక సంవత్సరం పాటు డాక్టర్ సంప్రదింపులు, వైద్య పరీక్షలు మరియు మందులు కూడా ఉచితంగా అందిస్తారు.
- డిశ్చార్జ్ అయ్యే సమయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు రాలేదని, మీరు సొంత డబ్బులు చెల్లించ లేదని, ఎవరికి, ఏ అవసరానికి డబ్బులు ఇవ్వలేదని, ఎవ్వరు మందుల పేరుతోను, టెస్ట్ లు పేరుతోను, లేక మరెవరి పేరుతోను డబ్బులు మీతో కట్టించుకోలేదని ధ్రువీకరిస్తూ మీరు ధృవీకరణ పత్రం సంతకం చేసి ఇవ్వాలి.దానితో పాటు సమ్మతి పత్రం కూడా ఇవ్వాలి.
- దీని వల్ల మీకు ఉచితంగా వైద్యం అందుతుంది. ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకుంటే వారి మీద చర్యలు తీసుకోబడతాయి.
ఆరోగ్యమిత్ర మీ సేవ కోసం ప్రభుత్వంచే నియమించ బడ్డవారు, ఆరోగ్యశ్రీ లోగో కలిగిన తెల్లటి ఆప్రాన్ ధరించి ఉంటారు, వారు మీరు ఆసుపత్రిలో చేరిన నాటి నుండి మీరు కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు మీకు సహాయ పడతారు.