Jagananna Chedodu Scheme 2023-24 Jagananna Chedodu Scheme 2023-24

Jagananna Chedodu Scheme 2023-24

 

Jagananna Chedodu Scheme 2023-24 agananna Chedodu Scheme 2024 Payment Statu , Application Status , Documents Requires ,Important Dates, Benfits ..

       జగనన్న చేదోడు పథకం 2023-24  | Jagananna Chedodu Scheme 2024 Payment Statu , Application Status , Documents Requires ,Important Dates, Benfits ..


  • అక్టోబర్ 5, 2023 మధ్యాహ్నం 2 లోపు ఎవరికి అయితే చేదోడు సంబందించిన అర్జీలు నమోదు చేసారో వారివి అర్హుల జాబితాలోకి పరిగణించటం జరుగును. 
  • పైన తెలిపిన సమయం తర్వాత ఎవరు అయితే అర్జీలను నమోదు చేసి ఉంటారో వారి పేర్లను బై అన్యుయల్లో పరిగణించటం.
  • షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో Other అని పెట్టినవి మరియు "profession not matched with business" అని పెట్టిన అర్జీలు కొత్త షాప్ రిజిస్ట్రేషన్ నెంబర్లు తో అర్జీ నమోదు చేసి ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగును. 
  • కొన్ని సచివాలయాలలో షాపు రిజిస్ట్రేషన్ నెంబర్కు బదులుగా అప్లికేషన్ నెంబర్తో అర్జీను నమోదు చేసి ఉన్నారు వారు మరల షాపు రిజిస్ట్రేషన్ నెంబర్తో అర్జీలు నమోదు చేయవలసి ఉంటుంది. 
  • విద్యుత్ వినియోగం మరియు అర్బన్ ప్రాపర్టీ ట్యాగ్గింగ్ ఎవరైతే అక్టోబర్ 5 మధ్యాహ్నం 2 గంటల లోపు పూర్తి చేసి ఉంటారో వారివి ప్రస్తుత లిస్టులో పరిగణించడం జరుగును. మిగతా వారివి బై ఆన్యువల్ శాంక్షన్ పరిగణించడం జరుగును. 
  • బార్బర్లు మరియు టైలర్లకు విద్యుత్ వినియోగం మరియు అర్బన్ ప్రాపర్టీ ట్యాగ్గింగ్ తప్పనిసరి. 
  • అక్టోబర్ నెల 19న సీఎం జగన్ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు.జగనన్న చేదోడు పథకం 4 వ విడత లో భాగంగా రజక, నాయీ బ్రాహ్మణులు,దర్జీల ఖాతాల్లో రూ. 10వేల చొప్పున జమ చేయనున్నారు. దాదాపు 3.30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ఇప్పటివరకు 3 విడతల్లో రూ.927 కోట్లను జమ చేసింది.
  • జగనన్న చేదోడు పథకం 2023 సంవత్సరానికి సంబంధించి తుది అర్హుల మరియు అనర్హుల జాబితా (Final eligible and Ineligible lists) విడుదల చెయ్యడం జరిగింది. 
  • రజకులు(చాకలి వారు),నాయి బ్రాహ్మణులు (కటింగ్ చేయు వారు) మరియు టైలరింగ్ చేయువారికి జగనన్న చేదోడు పథకం ద్వారా ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు అందిస్తున్న విషయం తెలిసినదే. BC-A రజక కులం వారికి రజకుల విభాగం లొ , BC-A నాయి బ్రాహ్మణ కులం వారికి నాయి బ్రాహ్మణ విభాగం లొ, అన్ని కులాల వారికి టైలరింగ్ విభాగం లొ అర్హత ఉంటుంది.
  • దరఖాస్తుదారుడు తప్పనిసరిగా 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. కట్ ఆఫ్ తేదీన ఆగస్టు 31, 2023 ను పరిగణించాలి.
  • క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ మరియు షాపు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా గ్రామా లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తుదారుని ఆధార్ పై తీసుకొని ఉండాలి.
  •  అన్ని పథకాల లాగా ఈ సంవత్సరం చేదోడు రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్ ప్రక్రియలో డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారికి ఎటువంటి ప్రమేయం ఉండదు. పూర్తి బాధ్యత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారు వహించాలి.


జగనన్న చేదోడు పథకం 2023-24 / Jagananna Chedodu Scheme 2024 :

పథకం పేరు జగనన్న చేదోడు
ప్రారంభించినదివైస్ జగన్మోహన్ రెడ్డి  
లబ్ధిదారులుచేతి వృత్తుల వారు 
ప్రయోజనాలురూ.10 వేలు 

జగనన్న చేదోడు పథకం అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ?

కొత్తగా దరఖాస్తు చేసిన వారు మరియు గత సంవత్సర లబ్ధిదారుల అప్లికేషన్ స్టేటస్ ను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుసుకోవచ్చు .

Click Here


గత సవత్సర లబ్దిదారులకు ఎం చెయ్యాలి ?

  • గత సంవత్సర లబ్ధిదారులు మరలా కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదు . వారికి కేవలం ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా ఈ సంవత్సరం అమౌంట్ బ్యాంకు అకౌంట్ లో వెయ్యటం జరుగును . గత సంవత్సరానికి సంబందించిన లబ్ధిదారుల యొక్క వివరాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ కొరకు Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో తేదీ 07-09-2023 నాడు ఆప్షన్ ఇవ్వటం జరుగును .


కొత్త గా దరఖాస్తు చేయు వారికి ఎం చేయాలి ?

  • ఈ సంవత్సరం చేదోడు పథకానికి కొత్తగా అర్హత కలిగి వున్న లబ్ధిదారులు వుంటే, అటువంటి వారికి కొత్తగా దరఖాస్తు చేయుటకు గానుBeneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో త్వరలో ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది.
Download New BOP App 👇


ఏ  ఏ డాక్యుమెంట్లు కావాలి  ?

  • చేదోడు పథకానికి సంబందించిన కొత్త మరియు పాత  లబ్దిదారులందరూ కూడా వారి యొక్క ఆధార్ నెంబర్ కు లింక్ అయిన Caste, Income certificates అంటే ఏపీ సేవ పోర్టల్ లో తీసుకున్న సర్టిఫికెట్ మరియు Shop Establishment certificate కచ్చితంగా కలిగి వుండాలి.

NOTE : లబ్ధిదారులు గతంలో AP Seva portal ద్వారా  పొందిన certificates (Caste, Income & Shop Establishment) కలిగి వున్నచో మరి కొత్తగా certificates కు apply చేసుకోవాల్సిన అవసరం లేదు.


జగనన్న చేదోడు పథకం టైం లైన్ :
Jagananna Chedodu Scheme Time Line :

  • 08-09-23 నుంచి 16-09-23 : BOP మొబైల్ అప్లికేషన్ లొ కొత్త దరఖాస్తుల రిజిస్ట్రేషన్ మరియు పాత లబ్ధిదారుల ఫీల్డ్ వెరిఫికేషన్
  • 08-09-23 నుంచి 18-09-23 : కొత్త మరియు పాత లబ్ధిదారుల అన్ని స్థాయిలో ఆమోదం
  • 19-09-23 : అర్హుల మరియు అనర్హుల జాబితా  సోషల్ ఆడిట్
  • 19-09-23 నుంచి 24-09-23 : అభ్యంతరాల స్వీకరణ
  • 25-09-23 : తుది అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల
  • 26-09-23 : జిల్లా కలెక్టర్ వారి ఆమోదం
  • 29-09-23 : పథకం లాంచింగ్.


జగనన్న చేదోడు పథకానికి అర్హతలు ఏమిటి   ?

  • ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి
  • రైస్ కార్డు కలిగి ఉండాలి
  • రజక, నాయిబ్రాహ్మణ, టైలరింగ్ వృత్తి చేస్తున్నవారు


జగనన్న చేదోడు పథకానికి ఎంత అమౌంట్ ఇస్తారు ?

  • సంవత్సరానికి ₹ 10,000 రూపాయలు


జగనన్న చేదోడు పథకం లబ్ది విధానం ఎలా ఉంటుంది ?

  • DBT అనగా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలో అమౌంట్ జమ అవుతుంది.


జగనన్న చేదోడు పథకం కు ఏ ఏ డాక్యుమెంట్ లు కావాలి  ?

  • అప్లికేషన్ ఫారం 
  • ఆధార్ కార్డు జిరాక్స్
  • రైస్ కార్డు జిరాక్స్
  • బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
  • రిజిస్ట్రేషన్ నెంబరు / రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ( సచివాలయాల్లో / మీసేవ లో రిజిస్ట్రేషన్ జరుగును ) 
  • షాపు తో లబ్ధిదారుడి ఫోటో
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ అప్డేట్ హిస్టరీ ( అడిగే అవకాశం ఉంది )


Shop Establishment Certificate  :  


AP Seva portal నుంచి గతంలో లబ్ధిదారులు పొందిన "Shop Establishment certificate" నకు validity expire అయి వుంటే, అటువంటి లబ్ధిదారులు సచివాలయం నందు వారి యొక్క Shop Establishment certificate ను కచ్చితంగా 'renewal' చేయించుకోవాలి. Shop Establishment Certificate - Renewal option :: Shop Establishment certificate ~ Renewal కి సంబందించి , త్వరలో AP Seva portal _ DA/WEDPS login నందు provision ఇవ్వటం జరుగుతుంది.


జగనన్న చేదోడు పథకం 2023-24 ప్రశ్న - సమాదానాలు :
Jagananna Chedodu FAQ :


ప్రశ్న 1 : చేదోడు పథకానికి సంబంధించి , కొత్త లబ్ధిదారులతో పాటు, గత సంవత్సరానికి సంబందంచిన లబ్ధిదారులు కూడా Caste, Income మరియుShop Establishment certificate కలిగి వండాలా?

సమాధానం : లబ్ధిదారులందరూ కూడా AP Seva portal ద్వారా పొందిన  Caste, Income certificates మరియుShop Establishment certificate కచ్చితంగా  కలిగి వండాలి. లబ్ధిదారులు గతంలో AP Seva portal ద్వారా పొందిన  certificates కలిగి వున్నచో మరి కొత్తగా certificates కు apply చేసుకోవాల్సిన  అవసరం లేదు.

ప్రశ్న 2 : కొంతమంది లబ్ధిదారులు గతంలో AP Seva portal నంచి తీసుకున్న  Shop Establishment certificates కలిగి ఉన్నారు ? అటువంటి లబ్ధిదారులు ఇప్పు డు మరి కొత్తగా Shop Establishment certificate తీసుకోవాలా?

సమాధానం :  గతంలో AP Seva portal నుంచి పొందిన Shop Establishment certificate నకు validity ఉంటె , మరి కొత్తగా తీసుకోవాల్సిన  అవసరం లేదు. Validity expiry అయ్యి వంటే, అటువంటి లబ్ధిదారులు కచ్చితంగా వారి యొక్క certificate న Renewal చేయ్యంచుకోవాలి.

ప్రశ్న 3 : గతంలో తీసుకున్న Shop Establishment certificate నకు validity ఎంత వరకు వున్నదనే విషయం ఏ విధంగా నిర్ధారించుకోవాలి?

సమాధానం : లబ్దిదారులు గతంలో తీసుకున్న Shop Establishment certificate నకు validity ఎంత వరకు వుంటుంది? అనే విషయం Establishment certificate నందు "validity" అనే column నందు mention చేయబడి వుంటుంది. గమనించగలరు.

ప్రశ్న 4 : లబ్ధిదారులు Shop Establishment - Renewal certificate ను ఏ విధంగా పొందవచ్చు?

సమాధానం : AP Seva portal ~DA/WEDPS login నందు provision enable చేయడం జరుగుతుంది.

ప్రశ్న 5 : మొబైల్ అప్లికేషన్ నందు వెరిఫికేషన్ కు వచ్చిన గత సంవత్సరానికి చెందిన కొంతమంది లబ్ధిదారులలో ఈ సంవత్సరం చేదోడుకు సంబంధించి అనర్హులు ఉన్నారు వారిని ఏ విధంగా అనర్హులుగా అప్డేట్ చేయాలి?

సమాధానం : అటువంటివారిని అనర్హులుగా అప్డేట్ చేయుటకు గాను BOP మొబైల్ అప్లికేషన్ లో Not Recommended అని ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది సంబంధిత WEA/WWDS వారు Authentication ద్వారా అనర్హులుగా అప్డేట్ చేయవచ్చు లేదా NBM పోర్టల్ ద్వారా కూడా అనర్హులు చేయవచ్చు.

ప్రశ్న 6 :  గత సంవత్సరానికి సంబంధించిన కొంతమంది లబ్ధిదారులు ఈ సంవత్సరం చేదోడు పథకానికి అనర్హులు అటువంటి వారు కూడా క్యాస్ట్ ఇన్కమ్ మరియు షాపు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలా ?

సమాధానం :  అనరులకు ఎటువంటి సర్టిఫికెట్లు అవసరం లేదు.

ప్రశ్న 7 : మొబైల్ అప్లికేషన్లో లబ్ధిదారుల యొక్క ఈ కేవైసీ ద్వారా షాపు జియో ట్యాగ్గింగ్ వెరిఫికేషన్ చేసిన తరువాత ప్రాసెస్ ఏమిటి ?

సమాధానం : వెరిఫికేషన్ చేసిన తర్వాత WEA/WWDS NBM లాగిన్ లొ సర్టిఫికెట్ల వివరాలు నమోదు చేయాలి.

ప్రశ్న 8 : BOP యాప్ లొ Not Recommended గా చేసిన లబ్ధిదారుల వివరాలు కూడా NBM పోర్టల్ కు ఫార్వర్డ్ అవుతాయా ?

సమాధానం : Not Recommended చేసినవి ఫార్వర్డ్ అవ్వవు.

 ప్రశ్న 9 : వెబ్ సైట్ నందు సర్టిఫికెట్లతో పాటుగా ఫీల్డ్ వెరిఫికేషన్ ఫారం మరియు షాపు వెరిఫికేషన్ ఫోటో కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలా?

సమాధానం :  వెరిఫికేషన్ ఫారం తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫోటో తప్పనిసరి కాదు.

ప్రశ్న 10 :  మొబైల్ అప్లికేషన్ లో కాస్ట్ ఇన్కమ్ మరియు షాపు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వివరాలు అప్డేట్ చేయుటకు ఎటువంటి ఆప్షన్ లేదు అప్పుడు ఏం చేయాలి ?

సమాధానం :  మొబైల్ అప్లికేషన్ నందు లబ్ధిదారుల యొక్క షాపు జియో ట్యాగింగ్ మరియు ఈ కేవైసీ పూర్తి చేసిన తరువాత మాత్రమే NBM లాగిన్ నందు సర్టిఫికెట్ యొక్క వివరాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

ప్రశ్న 11 :  వాలంటీర్ల యొక్క లాగిన్ లో కూడా చేదోడు వెరిఫికేషన్ చేయవచ్చా ?

సమాధానం :  లేదు. చేయుటకు అవకాశం లేదు. కేవలం WEA/WWDS వారి లాగిన్ లో మాత్రమే వెరిఫికేషన్ ఆప్షన్ ఇవ్వడం జరిగినది. WEA/WWDS వారు మాత్రమే వెరిఫికేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది.

ప్రశ్న 12 :  గత సంవత్సరానికి సంబంధించి వెరిఫికేషన్ లిస్ట్ నందు కొంతమంది లబ్ధిదారులు వివరాలు రాలేదు వారికి ఏం చేయాలి ?

సమాధానం :  అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా వెరిఫికేషన్ లిస్ట్ నందు పేరు లేకపోతే వారికి కొత్తగా దరఖాస్తు చేయాలి .

ప్రశ్న 13 : చేదోడు 2023-24 సంవత్సరానికి సంబంధించి కొత్తగా దరఖాస్తు ఎక్కడ ? ఎవరి దగ్గర ? అప్లికేషన్ చేసుకోవాలి ?

సమాధానం : సచివాలయం లోని WEA / WWDS వారు BOP యాప్ లాగిన్ లొ కొత్తగా దరఖాస్తు చేయుటకు ఆప్షన్ ఉంటుంది.

ప్రశ్న 14 : గత సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారులు చనిపోయిన లేదా వివిధ కారణాల వలన ఈ సంవత్సరం చేదోడు పథకానికి అనర్హులైతే అదే కుటుంబానికి చెందిన సభ్యులు ఈ పథకానికి అర్హులు అవుతారా?అటువంటి సందర్భంలో ఏ విధంగా వెరిఫికేషన్ లేదా కొత్తగా దరఖాస్తు చేయాలి ?

సమాధానం :  అనర్హులైన లబ్ధిదారులను మొబైల్ అప్లికేషన్ నందు అనర్హులుగా అప్డేట్ చేసిన తరువాత అదే కుటుంబం నుంచి అర్హత కలిగిన వ్యక్తికి కొత్తగా దరఖాస్తు చేయవలెను.

ప్రశ్న 15 : కొంతమంది లబ్ధిదారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్న సచివాలయ పరిధిలో కాకుండా వేరే ప్రాంతాల యందు షాపు కలిగి వృత్తి నిర్వహిస్తూ ఉంటారు లేదా హౌస్ ఓల్డ్ ఒక సచివాలయ పరిధిలో షాపు మరొక్క సచివాలయ పరిధిలో ఉన్న సందర్భంలో ఏ విధంగా వెరిఫికేషన్ చేయాలి ?

సమాధానం : మొబైల్ అప్లికేషన్ లో సెర్చ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. షాపు ఏ సచివాలయ పరిధిలో ఉంటుందో సంబంధిత WEA/WWDS వారు సెర్చ్ ఆప్షన్ ద్వారా షాపు జియో ట్యాగింగ్ మరియు వెరిఫికేషన్ చేయాలి.

ప్రశ్న 16 : సెర్చ్ ఆప్షన్ ద్వారా వేరే సచివాలయాల యొక్క WEA/WWDS తో BOP మొబైల్ అప్లికేషన్ నందు వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి, NBM లాగిన్ నందు ఏవిధంగా వెరిఫికేషన్ చేయాలి ?

సమాధానం : BOP యాప్ నందు వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత లబ్ధిదారులు షాపు ఉన్న సచివాలయ WEA / WWDS వారి NBM లాగిన్ లొ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయుటకు ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది.

ప్రశ్న 17 : కొంతమంది టైలర్లు వారి యొక్క ఇంటిలో టైలరింగ్ పనులు చేస్తూ ఉంటారు అటువంటి వారు అర్హులు అవుతారా ?

సమాధానం : గృహంలో ప్రత్యేక రూములో టైలరింగ్ షాపు కలిగి ఉండి అదే వృత్తిమీద ప్రధానంగా ఆధారపడ్డ వారు అర్హులు.

ప్రశ్న 18 : కొంతమంది రజకులు వారి యొక్క ఇంటి వద్దనే వృత్తి నిర్వహిస్తున్నారు అటువంటి వారు అర్హులు అవుతారా?

సమాధానం :  రజక వృత్తి ప్రధానంగా జీవనాధారంగా ఉన్నవారు మాత్రమే అర్హులు అవుతారు.

ప్రశ్న 19 :  కొంతమంది బార్బర్లు వారి యొక్క ఇంటి వద్దనే వృత్తి నిర్వహిస్తున్నారు అటువంటి వారు అర్హులు అవుతారా?

సమాధానం :  బార్బర్ వృత్తి ప్రధాన జీవనాధారంగా ఉన్నవారు మాత్రమే అర్హులు అవుతారు.

ప్రశ్న 20 :  కొంతమంది మొబైల్ లాండ్రి కలిగి ఉన్నారు అటువంటి వాటిని షాపుగా పరిగణించవచ్చా ?

సమాధానం :  అవును పరిగణించవచ్చు.

ప్రశ్న 21 : వాహనిమిత్ర,నేతన్న నేస్తం,మత్స్యకార భరోసా లాంటి వృత్తిపరమైన పథకాల యందు ముందుగా లబ్ధిదారులుగా ఉన్నవారు వారి కుటుంబ సభ్యులు చేదోడు పథకానికి అర్హులు అవుతారా ?

సమాధానం :  డైరెక్ట్ లబ్ధిదారుడిగా ఉన్నవారు అనర్హులు వాళ్ల కుటుంబ సభ్యులలొ ఒకరు అర్హులు అవుతారు.

ప్రశ్న 22 : చేయూత కాపు నేస్తం,ఈ బీసీ నేస్తం, అమ్మ ఒడి పథకాల యందు ముందుగా లబ్ధిదారులుగా ఉన్నవారు వారి కుటుంబ సభ్యులు చేదోడు పథకానికి అర్హులు అవుతారా ?

సమాధానం :  అర్హులు

ప్రశ్న 23 :  రైతు భరోసా పథకం నందు లబ్ధి పొందుతున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు చేదోడు పథకానికి అర్హులు అవుతారా ?

సమాధానం :  అర్హులు

ప్రశ్న 24 : అంగన్వాడీ వర్కర్లు లేదా అంగన్వాడీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు చేదోడు పథకానికి అర్హులు అవుతారా ?

సమాధానం : అంగన్వాడి వర్కర్ లేదా ఆశా కార్యకర్తలు డైరెక్ట్ గా లబ్ధిదారులుగా అనర్హులు కానీ వారి కుటుంబ సభ్యులు అర్హులు.

ప్రశ్న 25 : వాలంటీర్లు చేదోడు పథకానికి అర్హులు అవుతారా ?

సమాధానం :  అనర్హులు 

ప్రశ్న 26 :  ఒకే కుటుంబంలో ఇద్దరికీ దరఖాస్తు చేయవచ్చా ?

సమాధానం :  ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే అర్హులు 

ప్రశ్న 27 :  టైలరింగ్ వృత్తికి సంబంధించి కొంతమంది బట్టలు కాకుండా బ్యాగులు సీట్ కవర్లు మాత్రమే కుడుతున్నారు అటువంటి వారు చేదోడు పథకానికి అర్హులు అవుతారా ?

సమాధానం :  అనర్హులు 

ప్రశ్న 28 : కొంతమంది టైలరింగ్ వారు లేదా బార్బర్లు లేదా రజకులు వృత్తి చేసుకుంటూ వేరేవృత్తులు కూడా నిర్వహిస్తున్నారు అటువంటివారు చేదోడు పథకానికి అర్హులు అవుతారా?

సమాధానం :  ఆ కుటుంబం యొక్క ముఖ్య లేదా పూర్తి జీవనాధారం టైలరింగ్ లేదా బార్బర్ లేదా రజకులు అయి ఉండాలి.

ప్రశ్న29 :  వైయస్సార్ పెన్షన్ కానుకకు సంబంధించి పెన్షన్ తీసుకునేవారు చేదోడు పథకానికి అర్హులు అవుతారా ?

సమాధానం :  వయసు 60 సంవత్సరాల లోపు ఉండి వృత్తిపరమైన పెన్షన్ పొందిన వారు అర్హులు.

ప్రశ్న 30 :  చేదోడు పథకానికి సంబంధించి వయసు పరంగా అర్హత ఏమిటి ?

సమాధానం :  తేదీ ఆగస్టు 31 2023 నాటికి లబ్ధిదారులు 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 


జగనన్న చేదోడు పథకం హెల్ప్ లైన్ నెంబర్ ఎంత  ?

  • 1902 ( జగనన్నకు చెబుదాం )


జగనన్న చేదోడు పథకం డౌన్లోడ్లు : 

  • చేదోడు అప్లికేషన్ ఫారం : Click Here
  • చేదోడు  GO 5 : Click Here
  • చేదోడు GO 59 : Click Here
  • షాప్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ( FRESH / RENUAL ) : Click Here 
  • చేదోడు 2023-24 యూసర్ మాన్యువల్ : Click Here 
  • చేదోడు 2023-24 వెరిఫికేషన్ ప్రాసెస్ : Click Here
  • Self Declaration Form : Click Here 



Post a Comment

0 Comments