Jagananna Vidya Deevena JVD eKYC Update
జగనన్న విద్య దీవెన (2022-23) 4th క్వార్టర్ eKYC అప్డేట్ రావటం జరిగింది. కొత్తగా అప్డేట్ అయిన BOP యాప్ లో ఈ eKYC ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
విద్యార్థులు పేర్లు eKYCకు రాకపోవటానికి కారణాలు :
- ఇప్పటికే SC విద్యార్థులు రాష్ట్ర వాటాలో 40% అమౌంట్ పొందిన స్టూడెంట్స్ పేర్లు 4వ త్రైమాసికంలో BOP యాప్ లో విడుదల చేయబడవు.
- 2022-23 కి సంబంధించి ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయినా స్టూడెంట్స్ కి 2nd క్వార్టర్ విడుదలలోనే 2వ ,3va & 4వ క్వార్టర్ అమౌంట్స్ రిలీజ్ చేయడం జరిగింది
- JVD SC స్టూడెంట్స్ కి రాష్ట్ర వాటా 40% (4 క్వాటర్స్ అమౌంట్స్) ఒక క్వాటర్ లో ఇవ్వడం జరుగుతుంది. అలా అమౌంట్స్ రిలీజ్ అయినా వాళ్ళ స్టూడెంట్స్ పేర్లు BOP యాప్ లో కనపడవు,వాళ్లకు eKYC అవసరం లేదు.
- ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కి కూడా రెండో విడతలో మూడు క్వాటర్స్ JVD అమౌంట్స్ రిలీజ్ చేయడం జరిగింది వాళ్ల పేర్లు కూడా 4వ క్వార్టర్ eKYC లోకి రావు (ఫైనల్ ఇయర్ విద్యార్థులు అందరు కాలేజ్ లో హాల్ టికెట్స్ మాపింగ్ చేయించుకోవాలి)
- అలాగే కొంతమంది స్టూడెంట్స్ స్టేటస్ Pending at college for principal e sign అని వచ్చింది. స్టూడెంట్స్ కాలేజీ లో కాంటాక్ట్ అవ్వాలి.స్టూడెంట్ అనర్హులు అయినా వాళ్ళ పేర్లు కూడా eKYC లోకి రావు.
- విద్యార్థులు పేర్లు eKYC కు రానివారు అందరు ఒకసారి సచివాలయం లోని వెల్ఫేర్ సహాయకుల స్టూడెంట్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే ఎందుకు రాలేదు అనే విషయం తెలుస్తుంది
జగనన్న విద్యా దీవెన 2022-23 4వ విడత eKYC చేయు విధానం :
Step 1 : వాలంటీర్లు ముందుగా కింద తెలిపిన మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని వాలంటీర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బయోమెట్రిక్ లేదా ఐరిష్ లేదా పేస్ ద్వారా లాగిన్ అవ్వాలి.
Step 2 : హోమ్ పేజీ లో "జగనన్న విద్యా దీవెన" ఆప్షన్ పై టిక్ చేయాలి.eKYC ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత పేజీ లో "2022-2023 (4th Quarter)" అనే ఆప్షన్ పై టిక్ చేయాలి.
Step 3 : తరువాత పేజీ లో "Jagananna Vidya Deevena Data(2022-23)" ఆప్షన్ పై టిక్ చేయాలి.
Step 4 : తరువాత పేజీ లో సచివాలయం కోడ్ మరియు వాలంటీర్ క్లస్టర్ నెంబర్ ను ఎంచుకోవాలి. వెంటనే వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఉండే విద్యార్థుల వివరాలు అనగా విద్యార్ధి పేరు, C/O పేరు, ఆధార్ చివరి నాలుగు నెంబర్లు చూపిస్తుంది.
Step 5 : eKYC కొరకు పేరు పై క్లిక్ చేసాక Select Student Status ఎంచుకొని ఉద్యర్థి మారజించి ఉంటే Death అని బ్రతికి ఉంటే Live అని ఎంచుకొని, స్టూడెంట్ తో సచివాలయ ఉద్యోగి లేదా వాలంటీర్ వారు సెల్ఫీ తీసుకొని, స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, Consent పై టిక్ చేసి బయోమెట్రిక్ / ఐరిష్ / పేస్ ఆప్షన్ లో ఒక ఆప్షన్ ద్వారా eKYC పూర్తి చెయ్యాలి. Data Saved Successfully అని వస్తే eKYC పూర్తి అయినట్టు.
Step 6 : స్టూడెంట్ మరణించినట్టు అయితే eKYC చేయు సమయం లో Status ను Death గా నమోదు చేసి సచివాలయ ఉద్యోగి / వాలంటీర్ వారి బయోమెట్రిక్ / ఐరిష్ / పేస్ ద్వారా eKYC పూర్తి చెయ్యాలి.
వాలంటీర్ వారీగా JVD 2022-23 4వ విడత eKYC రిపోర్ట్ :
కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి వాలంటీర్ వారీగా ఎన్ని eKYC కు వచ్చాయి , ఎన్ని పూర్తి అయ్యాయో తెలుసుకోవచ్చు .
జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెక్ చేయు విధానం :
Jagananna Vidya Deevena 2023 Status :
ప్రతి ఏటా విద్యార్థులకు ఫీజు అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులు ప్రతి క్వార్టర్ కి సంబంధించి తమ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలను కింది లింక్ ద్వారా చెక్ చేయవచ్చు. పూర్తి ప్రాసెస్ కింది. లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి
Step 1 : క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి
Step 2 : పై లింక్ లో login బటన్ పైన క్లిక్ చేయండి
Step 3: తరువాత User ID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి
Step 4: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేయండి. మీరు మొదటి సారి లాగిన్ అవుతుంటే లేదా password మర్చిపోతే నెక్స్ట్ స్టెప్ లో ఇచ్చిన విదంగా కొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి .
Step 5: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేసి , Capcha లో ఉన్నవి అదే విదంగా type చేసి signin బటన్ పైన క్లిక్ చేయండి
Step 7: తరువాత Application Id దగ్గర పైన ఉన్న లేటెస్ట్ మరియు సరైన విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి . ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చేయండి
Step 8: క్రిందికి scroll చేస్తే మీకు ఈ విధంగా విద్యా దీవెన [RTF ] మరియు వసతి దీవెన [MTF ] స్టేటస్ చూపిస్తాయి
పై విధంగా Payment Status లో Success ఉంటె Release bank details లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది . Bill Approved ఉండి పేమెంట్ స్టేటస్ ఇంకా అప్డేట్ కానీ వారికి ఒకటి లేదా రెండు రోజులలో అమౌంట్ పడుతుంది . ఆ తర్వాత నే స్టేటస్ Success గా మారుతుంది. Quarter wise పేమెంట్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు Note: ముఖ్య గమనిక : అమౌంట్ రిలీజ్ చేసాక లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించడానికి టైం పడుతుంది.