Check Aadhaar Document Update Status Check Aadhaar Document Update Status

Check Aadhaar Document Update Status

Check Aadhaar Document Update Status In Telugu


Aadhaar Document Update Status In Telugu

ఆధార్ కార్డు కలిగి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( Aadhaar Document Update ) ను చేసుకోవాలి. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనగా ఆధార్ కార్డులోని పేరు మరియు చిరునామాతో సరిపోయే ఒరిజినల్ పత్రాలను సమర్పించాలి. ఈ సర్వీస్ ఆనులైనలో ఉచితంగా 2024 December14 వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ సేవా కేంద్రాలలో మరియు ఆధార్ కేంద్రం కలిగిన గ్రామ వార్డు సచివాలయాలలో కూడా 50 రూపాయల ఫీజుతో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సేవా కేంద్రం లేని  గ్రామ వార్డు సచివాలయాలలో కూడా ఆధార్ క్యాంపులను ప్రతి నెల నిర్వహించడం జరుగుతుంది. ఆయా తేదీలను ముందుగానే తెలుసుకొని ప్రజలందరూ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీసును పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోని వారికి భవిష్యత్తులో ఆధార్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉన్నది మరియు రానున్న రోజుల్లో ఫీజు కూడా పెరిగే అవకాశం ఉంది. కావున అందరూ డాక్యుమెంట్ అప్డేట్ ( Aadhaar Document Update )  ను పూర్తిచేసుకోగలరు.


ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు  ? 

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను రెండు రకములుగా చేసుకోవచ్చు. My Aadhaar Portal సొంత లాగిన్ లో మరియు ఆధార్ సేవా కేంద్రాల్లో. My Aadhaar Portal సొంత లాగిన్ లో చేసుకోటానికి మీ ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే సరిపోతుంది. అదే ఆధార్ సేవా కేంద్రాల్లో చేయటానికి ఆధార్ - మొబైల్ లింక్ అవసరం లేదు. My Aadhaar Portal సొంత లాగిన్ లో చేసుకోటానికి ఎటువంటి అప్లికేషన్ ఫారం అవసరం లేదు అదే ఆధార్ సేవా కేంద్రాల్లో చేసుకోవాలి అంటే తప్పనిసరిగా అప్లికేషన్ ఫారం అవసరం ఉంటుంది .


ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు అవసరం అయ్యే పత్రాలు ఏమిటి ?

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు లోని POI (Proof Of Identity) అనగా పేరు, ఫోటో మరియు POA (Proof Of Address) అనగా చిరునామాతో కూడిన రెండు రుజువు పత్రాలు ఉండాలి. కొన్ని సందర్భాలలో పేరు,ఫోటో మరియు చిరునామా మూడు కలిగిన ఒకే రుజువు పత్రంతో డాక్యుమెంట్ అప్డేట్ అవుతుంది.

POI డాక్యుమెంట్లు :

  1. భారతీయ పాస్ పోర్ట్ 
  2. పాన్ కార్డు
  3. రేషన్ కార్డు
  4. ఆరోగ్యశ్రీ కార్డు 
  5. ఓటర్ కార్డు
  6. డ్రైవింగ్ లైసెన్సు
  7. పెన్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు
  8. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కార్డు
  9. వికలాంగుల కార్డు
  10. డొమెసేల్ సర్టిఫికేట్
  11. నివాస ధ్రువీకరణ పత్రము 
  12. ఉపాధి హామీ జాబు కార్డు
  13. లేబరు కార్డు
  14. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా పై చదువులకు సంబంధించి ఒరిజినల్ మార్క్స్ సీటు
  15. ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు
  16. ఆధార్ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఫార్మేట్
  17. పెన్షనర్ ఇండక్షన్ డాక్యుమెంటు 
  18. ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రము 

Note : POI వాడే రుజువు పత్రంలో తప్పనిసరిగా వ్యక్తి యొక్క పేరు మరియు ఫోటో ఆధార్ కార్డులో ఉండేలా ఉండాలి. గ్రూపు ఫోటోతో ఉన్న పరవాలేదు.


POA డాక్యుమెంట్లు :

  1. భారతీయ పాస్ పోర్ట్ 
  2. రేషన్ కార్డు
  3. ఆరోగ్యశ్రీ కార్డు 
  4. ఓటర్ కార్డు
  5. వికలాంగుల కార్డు
  6. డొమెసేల్ సర్టిఫికేట్
  7. నివాస ధ్రువీకరణ పత్రము 
  8. ఉపాధి హామీ జాబు కార్డు
  9. లేబరు కార్డు
  10. ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు 
  11. విద్యుత్ బిల్లు
  12.  టెలిఫోన్ ల్యాండ్ లైన్ లేదా పోస్ట్ పెయిడ్ మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ బిల్లు
  13.  రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చినటువంటి వాలెట్ రిజిస్ట్రేషన్ సేల్ అగ్రిమెంటు లేదా గిఫ్ట్ డిడ్
  14.  గ్యాస్ కనెక్షన్ బిల్లు
  15. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా పిఎస్యు లేదా రెగ్యులేటరీ బాడీస్ లేదా స్టాట్యూచరి బాడీస్ ఇచ్చినటువంటి వసతి కేటాయింపు పత్రము
  16. లైఫ్ లేదా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ
  17. పెన్షనర్ యొక్క ఇండక్షన్ డాక్యుమెంట్
  18. ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రము

Note : POA వాడే రుజువు పత్రంలో తప్పనిసరిగా వ్యక్తి యొక్క చిరునామా, ఆధార్ కార్డులోని చిరునామా దగ్గరగా ఉండాలి ఉండాలి.


ఆధార్ కార్డులోని పేరు రుజువు పత్రంలోని పేరు ఒకేలా ఉండాలా ?

ఆధార్ కార్డులో ఉన్న పేరు మరియు POI Proof లో ఉన్న పేరు కొన్ని వెసులుబాటులు ఇవ్వటం జరిగింది అవి,

  1. ఇంటి పేరు, పేరు తారు మారు అయినా పర్వాలేదు[ex Kadiyam Ravi (aadar), Ravi Kadiyam(POI) ]
  2. చిన్న స్పెల్లింగ్ తప్పు ఉన్న పర్వాలేదు [ex Kadiyam Ravi (Aadar), Khadiyam Ravi (POI) ]
  3. పలికే టప్పుడు ఒకేలా విన్నపడిన పర్వాలేదు
  4. మొత్తం పేరుకు బదులు లెటర్ లు మాత్రేమే ఉన్న పర్వాలేదు [ex Kadiyam Ravi(aadar), K Ravi(POI) or K Ravi(aadar), Kadiyam Ravi(POI]
  5. ఆధార్ ఇంటి పేరు ఉంది POI లో లేకుండా POI లో C/O లో ఇంటి పేరు ఉంటే పర్వాలేదు. [ ex Kadiyam Ravi (aadar), Ravi(POI) and Kadiayam Is Surname of C/O ]
  6. PAN కార్డును సంతకం ఉన్నా, లేకున్న పర్వాలేదు.


ఆధార్ కార్డులోని చిరునామా POA రుజువు పత్రంలోని చిరునామా ఒకేలా ఉండాలా ?

ఆధార్ కార్డులో ఉన్న చిరునామా మరియు POA Proof లో ఉన్న చిరునామా కోసం మాత్రమే కొన్ని వెసులుబాటులు ఇవ్వటం జరిగింది. అవి

  1. గ్రామం పేరు మరియు మండలం లేదా జిల్లా సరిగా ఉండి POA లో PIN కోడ్ లేకపోయినా పర్వాలేదు.
  2. గ్రామం పేరు మరియు PIN కోడ్ సరిగా ఉండి POA లో మండలం / జిల్లా పేర్లు లేకపోయినా పర్వాలేదు.
  3. POA కు ఆధార్ కు ల్యాండ్ మార్క్, వార్డ్ నెంబర్ వంటి వాటిలో చిన్న తేడాలు ఉన్నా పర్వాలేదు.
  4. దరఖాస్తు దారుడు అప్లికేషన్ లో ఎక్కువ వివరాలు ఇచ్చి, POA లో అన్ని లేకపోయినా పర్వాలేదు.


ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి ? 

Aadhaar Document Update Status In Telugu

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అయ్యిందా లేదా అని స్టేటస్ ను మొత్తం మూడు విధాలుగా తెలుసుకోవచ్చు. 

  1. ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా 
  2. రసీదు నెంబర్ ద్వారా
  3. మై ఆధార్ సైట్ ద్వారా 


1. ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా తెలిదుకునే విధానం :

Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. (Click Here పై క్లిక్ చేయండి)
Click Here
Step 2 : Login పై క్లిక్ చేయాలి. 

Step 3 : Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.


Step 4 : Home Page లొ Aadhaar Update History అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 5 : Check Your Aadhaar Update History పేజీ ఓపెన్ అవుతుంది.

Step 6 : ఫోన్ లొ అయితే Screenshot లేదా కంప్యూటర్ లొ అయితే Cntl+P ద్వారా ప్రింట్ కామెండ్ ఇవ్వవాలి.

  • Destination - Save as PDF
  • Pages - All
  • Layout - Portrait
  • Paper Size - A4
  • Pages Per Sheet - 1
  • Margins - None

గా పెట్టుకోవాలి.

Step 7 : Scale ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అన్ని ఒకే పేజీ లొ కావాలో, రెండు పేజీ లొ కావాలో సరి పోయేట్టుగా నెంబర్ ఇవ్వాలి తరువాత Save పై క్లిక్ చేయాలి.

Step 8 : కొత్తగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ విజయవంతం అయినవి కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ లొ చూపిస్తుంది. Type లొ Demographic Update గా అప్డేట్ అవుతుంది. గమనించగలరు.ఆధార్ అప్డేట్ హిస్టరీ ఓపెన్ చేసిన తర్వాత చివరి రెండు అప్డేట్ లలో ఎటువంటి మార్పులు లేకపోతే వారికి డాక్యుమెంట్ అప్డేట్ అయినట్టు అర్థము.



2. రసీదు నెంబర్ ద్వారా : 

ఆన్ లైన్ లో లేదా ఆధార్ సేవా కేంద్రం లొ లేదా గ్రామ వార్డు సచివాలయ ఆధార్ సేవా కేంద్రాల్లో ఆధార్ సేవలు అనగా కొత్త ఆధార్ కార్డు, బాల ఆధార్ మరియు ఆధార్ లొ మార్పులకి సంబందించిన సేవలు పొందిన తరువాత రసీదు ఇస్తారు. 


రసీదు ను Enrolment Receipt అంటారు.ఆ రసీదు లొ మొత్తం రెండు బాగాలు ఉంటాయి. 

  • మొదటిది నమోదు నెంబర్ 14 నెంబర్ లు , 
  • రెండవ భాగం లొ తేదీ, సమయం కలిపి 14 అంకెలు ఉంటుంది.

నమోదు నెంబర్  ఉదా.1234/56789/01234 గా ఉంటే తేదీ 15/05/2023 (రోజు/నెల/సంవత్సరం) , సమయం 16/35/18(గంటలు/నిముషాలు/సెకనులు) అయితే అప్పుడు Enrolment ID అనేది రెండు సెక్షన్ లు కలిపి 28 నెంబర్ లు ఉంటాయి. ఈ సందర్భం లొ 1234567890123420230515163518 (ఇక్కడ సంవత్సరం, నెల ఆ తరువాత రోజు ను వేయాలి ).



ఈ విధానంలో కింద తెలిపిన సేవల స్టేటస్ లు తెలుసుకోవచ్చు

  1. బాల ఆధార్
  2. కొత్త ఆధార్ (5 సంవత్సరాలు పైబడి)
  3. ఆధార్ లొ వివరాల అప్డేట్
  4. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ (SRN నెంబర్ ద్వారా)
  5. ఆధార్ PVC కార్డు ఆర్డర్ (SRN నెంబర్ ద్వారా)
  6. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( Enrolment ID ద్వారా)


ఆధార్ అప్డేట్ స్టేటస్ తెలుసుకునే విధానము

Step 1 : ముందు గా కింద లింక్ ఓపెన్ చెయ్యండి.

Click Here

Step 2 Enter Enrollment ID, SRN or URN వద్ద 14 అంకెల నమోదు నెంబర్ లేదా 28 అంకెల Enrollment ID లేదా 14 అంకెల SRN నెంబర్ ను ఎంటర్ చేయాలి. Enter Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Submit పై క్లిక్ చేయాలి.


Step 3కింద చూపిన విధంగా గా  Completed  అని చూపిస్తూ, Your Aadhaar has been generated. While your Aadhaar is being printed and posted to you, please download eAadhaar from www.UIDAI.gov.in అని వస్తే సర్వీస్ పూర్తి అయినట్టు. సర్వీస్ పూర్తి అయితే Aadhaar Card Download చేసుకోవచ్చు. లేదా ఆధార్ కార్డును Aadhaar PVC Card రూపంలో లొ అనగా ATM కార్డుల ఉండే విధంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 


Step 4 కింద చూపించినట్టు Validation Stage చూపించి, Your request has been rejected due to data/process error. If you do not already have an Aadhaar number from any prior enrolment, please re-enrol at an authorized enrolment center. List of enrolment centers available on official website www.UIDAI.gov.in అని వస్తే రిజెక్ట్ అయ్యింది అని అర్థము. అటువంటి అప్పుడు కారణాలు తెలుసుకొని మరలా నమోదు / అప్డేట్ చేసుకోవాలి.



3. మై ఆధార్ సైట్ ద్వారా :

Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. (Click Here పై క్లిక్ చేయండి)
Click Here
Step 2 : Login పై క్లిక్ చేయాలి. 

Step 3 : Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.

Step 4 : My Aadhaar పోర్టల్ లో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసి ఉంటె వారికి మాత్రమే కింద చూపిన విధంగా కంప్లీటెడ్ వాలిడేషన్ స్టేజ్ (Completed Validation Stage) అని చూపిస్తుంది ఆలా వస్తే వారికి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ పూర్తి అయి నట్టు అర్థము . Pending అని వస్తే వారికి ఇంకా అవ్వ లేదు అని అర్థము .


Note : ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసి 3 నెలలు పూర్తి అయినా పూర్తి అవ్వక పోతే అప్పుడు వారు ఆధార్ సేవ కేంద్రాల్లో ఆధార్ డాక్యూమెంటర్ అప్డేట్ చేసుకోవాలి .


Aadhaar Document Update Links :


Post a Comment

0 Comments