ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటి ?
What Is Aadar Document Update ?
2010 నుంచి 2016 వరకు ఆధార్ ఇచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఆధార్ ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న బోగస్ ఆధార్ కార్డులను ఏరివేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆధార్ ఉన్న పౌరుడు వారి పేరు & అడ్రస్‌ను సరైన ఆధారాలతో ధృవీకరించుకోవాలి.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి ?
whom to do Aadar Document Update ?
ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు దేటిన ప్రతీ ఒక్కరు కూడా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోటానికి ఎం ఎం కావాలి?
Waht is required for aadar Document Update ?
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కోసం మీ POI అనగా పేరు, ఫోటో కలిగి, POA అనగా చిరునామా కలిగిన ఒరిజినల్ ఆధారాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేసి చేసుకోవాలి.
ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ మరియు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు తేడా ఏంటి?
What is difference between Aadar Biometric Update and Aadar Document Update ?
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ మరియు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ వేరు. బయోమెట్రిక్ అప్డేట్ అనగా బయోమెట్రిక్ / కళ్ళు / చేతి వేళ్ళు అప్డేట్ చేయటం, అదే ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే మీ డాక్యుమెంట్ లు అప్లోడ్ చేయటం.ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసాక ఆధార్ కార్డులో ఏ మార్పులు జరగవు కొత్త కార్డు రాదు, కానీ ఆధార్ కార్డు అప్డేట్ లో ఉంటుంది
ఆధార్ వచ్చిన సవత్సరం ఎలా తెలుసుకోవాలి?
How to Find Aadar start or Generated Date ?
ఆధార్ కార్డులు జనరేట్ అయిన కొత్తలో లేదా అప్డేట్ చేసుకున్న తరువాత ఇంటి చిరునామాకు / Online లో జనరేట్ చేసుకున్న ఆధార్ లో ఎడమ వైపు ఆధార్ జనరేట్ అయిన తేదీ ఉంటుంది. ఉదాహరణకు 03/08/2012 అని ఉంటే ఆ ఆధార్ కార్డు 2012 లో జనరేట్ అయ్యింది అని అర్థము. వారికి ఆధార్ డాక్యుమెంట్ చేయాలి అని అర్థము. అలా 2016 వరకు ఉన్న వాటికీ చెయ్యాలి.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు ?
How many ways to do aadar document update ?
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను రెండు రకములుగా చేసుకోవచ్చు. మీ సొంత లాగిన్ లో మరియు ఆధార్ సేవా కేంద్రాల్లో. మీ సొంత లాగిన్ లో చేసుకోటానికి మీ ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే సరిపోతుంది. అదే ఆధార్ సేవా కేంద్రాల్లో చేయటానికి ఆధార్ - మొబైల్ లింక్ అవసరం లేదు.
ఆధార్ లొ పేరు, ప్రూఫ్ లొ పేరు ఒకేలా ఉండాలా ?
What are the exceptions of POI for aadar document update ?
ఆధార్ కార్డులో ఉన్న పేరు మరియు POI Proof లో ఉన్న పేరు కొన్ని వెసులుబాటులు ఇవ్వటం జరిగింది అవి,
- ఇంటి పేరు, పేరు తారు మారు అయినా పర్వాలేదు[ex Kadiyam Ravi (aadar), Ravi Kadiyam(POI) ]
- చిన్న స్పెల్లింగ్ తప్పు ఉన్న పర్వాలేదు [ex Kadiyam Ravi (Aadar), Khadiyam Ravi (POI) ]
- పలికే టప్పుడు ఒకేలా విన్నపడిన పర్వాలేదు
- మొత్తం పేరుకు బదులు లెటర్ లు మాత్రేమే ఉన్న పర్వాలేదు [ex Kadiyam Ravi(aadar), K Ravi(POI) or K Ravi(aadar), Kadiyam Ravi(POI]
- ఆధార్ ఇంటి పేరు ఉంది POI లో లేకుండా POI లో C/O లో ఇంటి పేరు ఉంటే పర్వాలేదు. [ ex Kadiyam Ravi (aadar), Ravi(POI) and Kadiayam Is Surname of C/O ]
- PAN కార్డును సంతకం ఉన్నా, లేకున్న పర్వాలేదు.
ఆధార్ లొ చిరునామా , ప్రూఫ్ లొ చిరునామా ఒకేలా ఉండాలా ?
What are the exceptions of POA for aadar document update ?
ఆధార్ కార్డులో ఉన్న చిరునామా మరియు POA Proof లో ఉన్న చిరునామా కోసం మాత్రమే కొన్ని వెసులుబాటులు ఇవ్వటం జరిగింది. అవి
- గ్రామం పేరు మరియు మండలం లేదా జిల్లా సరిగా ఉండి POA లో PIN కోడ్ లేకపోయినా పర్వాలేదు.
- గ్రామం పేరు మరియు PIN కోడ్ సరిగా ఉండి POA లో మండలం / జిల్లా పేర్లు లేకపోయినా పర్వాలేదు.
- POA కు ఆధార్ కు ల్యాండ్ మార్క్, వార్డ్ నెంబర్ వంటి వాటిలో చిన్న తేడాలు ఉన్నా పర్వాలేదు.
- దరఖాస్తు దారుడు అప్లికేషన్ లో ఎక్కువ వివరాలు ఇచ్చి, POA లో అన్ని లేకపోయినా పర్వాలేదు.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు ఫీజు ఎంత ?
What is the fee for aadar document update ?
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను మీ సొంత లాగిన్ లో June 14 , 2025 వరకు ఉచితంగా చేసుకోవచ్చు. June 14 తరువాత మాత్రం సొంత లాగిన్ లో చేసుకుంటే 25/- ఛార్జ్ ఉంటుంది. ఆధార్ సేవా కేంద్రాల్లో మాత్రం ఎప్పుడు 50/- ఛార్జ్ ఉంటుంది.
సొంతముగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేసుకోవాలి ?
how to do aadar document update in slef login ?
how to do aadar document update in mobile ?
సొంత లాగిన్ లో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే విధానము :
Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. (Click Here పై క్లిక్ చేయండి)ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ?
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు POI & POA గా ఏ ఏ డాక్యుమెంట్ లు ఉపయోగపడతాయి ?
POI అనగా Proof Of Identity అంటే మీ గుర్తిపు కు సంబందించిన ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. POA అనగా Proof Of Address అంటే మీ చిరునామాకు సంబందించి ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు మరియు భారత దేశ చిరునామా ఉండాలి.
POI డాక్యుమెంట్లు :
- భారతీయ పాస్ పోర్ట్
- పాన్ కార్డు
- రేషన్ కార్డు
- ఆరోగ్యశ్రీ కార్డు
- ఓటర్ కార్డు
- డ్రైవింగ్ లైసెన్సు
- పెన్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు
- రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కార్డు
- వికలాంగుల కార్డు
- డొమెసేల్ సర్టిఫికేట్
- నివాస ధ్రువీకరణ పత్రము
- ఉపాధి హామీ జాబు కార్డు
- లేబరు కార్డు
- పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా పై చదువులకు సంబంధించి ఒరిజినల్ మార్క్స్ సీటు
- ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు
- ఆధార్ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఫార్మేట్
- పెన్షనర్ ఇండక్షన్ డాక్యుమెంటు
- ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రము
Note : POI వాడే రుజువు పత్రంలో తప్పనిసరిగా వ్యక్తి యొక్క పేరు మరియు ఫోటో ఆధార్ కార్డులో ఉండేలా ఉండాలి. గ్రూపు ఫోటోతో ఉన్న పరవాలేదు.
POA డాక్యుమెంట్లు :
- భారతీయ పాస్ పోర్ట్
- రేషన్ కార్డు
- ఆరోగ్యశ్రీ కార్డు
- ఓటర్ కార్డు
- వికలాంగుల కార్డు
- డొమెసేల్ సర్టిఫికేట్
- నివాస ధ్రువీకరణ పత్రము
- ఉపాధి హామీ జాబు కార్డు
- లేబరు కార్డు
- ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు
- విద్యుత్ బిల్లు
- టెలిఫోన్ ల్యాండ్ లైన్ లేదా పోస్ట్ పెయిడ్ మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ బిల్లు
- రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చినటువంటి వాలెట్ రిజిస్ట్రేషన్ సేల్ అగ్రిమెంటు లేదా గిఫ్ట్ డిడ్
- గ్యాస్ కనెక్షన్ బిల్లు
- కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా పిఎస్యు లేదా రెగ్యులేటరీ బాడీస్ లేదా స్టాట్యూచరి బాడీస్ ఇచ్చినటువంటి వసతి కేటాయింపు పత్రము
- లైఫ్ లేదా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ
- పెన్షనర్ యొక్క ఇండక్షన్ డాక్యుమెంట్
- ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రము
Note : POA వాడే రుజువు పత్రంలో తప్పనిసరిగా వ్యక్తి యొక్క చిరునామా, ఆధార్ కార్డులోని చిరునామా దగ్గరగా ఉండాలి ఉండాలి.
253539112189
ReplyDeleteHii
ReplyDelete733848047290
ReplyDeleteHay
ReplyDeleteHii
ReplyDeleteహాయ్
ReplyDelete9491602667
ReplyDeleteAdhaar ki phone number ela link up cheyali sir
ReplyDelete