Postal Ballot Vote 2024 Complete Process in Telugu Postal Ballot Vote 2024 Complete Process in Telugu

Postal Ballot Vote 2024 Complete Process in Telugu

పోస్టల్ బ్యాలెట్ ఓటు రానివారు ఎం చెయ్యాలి ? 

పోస్టల్ బ్యాలట్ ఓటు రాని వాళ్ళు ఈ నెల 9 వ తేదీ వరకు RO లకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల కమిషన్. ఎన్నికల విధులు లో ఉన్న ఏ ఉద్యోగికి ఓటు నిరాకరించరాదు. కావున అందరు returning officers ప్రతి ఉద్యోగి నుండి ఈ నెల 8 తేది వరకు దరఖాస్తులు తీసికొని తక్షణమే ఓటు కల్పిస్తారు. కావున ఏవరి ఓటు నమోదు కాకపోయనా మరల నేడు RO గారికి ఇచ్చి వెంటనే ఓటు వినియోగించుకోవచ్చు. 


ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్ డ్యూటీ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తో పాటు 33 విభాగాలకు చెందిన వారు తమ ఓట్ హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలి . 

అర్హులు:

1) ఎన్నికల విధులు నిర్వర్తించే పోలింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది, వీడియోగ్రాఫర్స్, డ్రైవర్స్, మొదలగువారు.

2) ఓటర్ల జాబితాలో సర్వీస్ వోటర్ గా నమోదు కాబడిన వివిధ సైనిక దళాల సిబ్బంది.

3) ప్రజాప్రతినిధి చట్టము 1951, సెక్షన్ 60 ప్రకారం అర్హులు అయిన దిగువ తెలిపిన వారు 

  • 40% దాటిన వికలాంగత్వము గల దివ్యాంగులు (AVPD).
  • ఓటర్ జాబితా ప్రకారం, 85 సంవత్సరాల వయసు దాటిన వయోవృద్ధులు అయిన ఓటర్లు (AVSC).
  • ప్రస్తుతం కోవిడ్ బాదితులుగా ఉన్న ఓటర్లు (AVCO).
  • అత్యవసర సేవలు గా గుర్తించబడిన ప్రభుత్వ శాఖల సిబ్బంది (రైల్వే, ఆర్టీసీ, పైర్, వైద్యం మొదలగు)

పోస్టల్ బ్యాలెట్ ఓటు కొరకు దరఖాస్తు చేయు విధానము  : 

పోస్టల్ బ్యాలెట్ ఓటు కొరకు ఎలక్షన్ విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు తప్పనిసరిగా Form 12 ను సంబంధిత RO వారికి దరఖాస్తు చేసుకోవాలి. ఎలక్షన్ ఆర్డర్ తో పాటుగా ఫారం 12 ను ఇస్తారు. అలా ఇవ్వని పక్షాన  ఉద్యోగులు కింద ఇవ్వబడిన ఫారం ను ప్రింట్ తీసుకొని వివరాలు ఫిల్ చేసి RO గారికి సమర్పించవలసి ఉంటుంది. 

Download Form 12 pdf  

 ఫిల్ చేయుటకు కావలసిన వివరాలు  :

  1. నియోజకవర్గ నెంబరు 
  2. నియోజకవర్గ  పేరు 
  3. ఉద్యోగి పేరు 
  4. ఉద్యోగి ఓటర్ కార్డు నెంబరు  
  5. ఉద్యోగి ఓటర్ సీరియల్ నెంబరు 
  6. ఉద్యోగి ఓటర్ పార్ట్ నెంబరు
  7. ఉద్యోగ చిరునామా  
  8. ఉద్యోగి సంతకము


పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ ఎప్పుడు వేయాలి ? 

ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓట్ హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ కు ముందు వినియోగించుకోవాలి . RO వారు తెలిపిన తేదీల్లో  పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ వెయ్యవచ్చు . SMS రూపం లో కింద తెలిపిన విధంగా కూడా తేదీ తెలుస్తుంది . 

You XXXXXXXXXXXXX are requested to attend your Enrolled Constituency facilitation centre along with your Form-12 / Corrected Form-12, Order copy, Voter ID, Aadhar/ID card to avail the postal ballot and cast your vote on Date 04-05-2024.-District Election Officer, Srikakulam District. 


పోస్టల్ బ్యాలెట్ ఓటు కోసం తీసుకు వెళ్ళవల్సిన డాక్యుమెంట్ లు : 

  1. Form-12 / Corrected Form-12
  2. Election Order copy, 
  3. Voter ID, 
  4. Aadhar/ID card 


పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాల్సిన చోటు : 

  • సర్వీస్ ఓటర్లు: ఎలక్ట్రానికల్ ట్రాన్ఫర్ పోస్టల్ బ్యాలట్ విధానము ద్వారా.
  • ఎన్నికల సిబ్బంది: రిటర్నింగ్ అధికారి నిర్దేశించిన తేదీలలో ఏర్పాటు చేసిన ఓటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ నందు.
  • ఏఏపీడీ, ఏవీ ఎస్ సి, ఏవీ సి ఓ (హోమ్ ఓటింగ్): రిటర్నింగ్ అధికారి ఏర్పాటు చేసిన పోలింగ్ టీమ్ సహకారంతో ఓటర్ ఇంటి వద్ద.
  • ఏవీఈఎస్: రిటర్నింగ్ అధికారి నిర్దేశించిన తేదీలలో ఏర్పాటు చేసిన పోస్టల్ ఓటింగ్ సెంటర్ లో. 

పోస్టల్ బ్యాలెట్ ఫారంల సమాచారం : 

  1. 13A(Form - A) (డిక్లరేషన్)
  2. 13B(Form - B) (చిన్న కవర్)
  3. 13C (Form -C) (పెద్ద కవర్)
  4. 13D అంటే సూచనలు.( మన కోసం)
  5. Ballot paper  


13A(Form -A) : 

ఇది పేపర్ రూపం లో వుంటుంది.దీని మీద మన డీటెయిల్స్ అండ్ Gazetted officer signature చేయించాలి. గెజిటెడ్ ఆఫీసర్స్ అక్కడే అంటే ఫెసిలిటేషన్ సెంటరు లో ఉంటారు 

13B (Form - B) : 

అంటే ఇది ఎన్వలప్ కవర్, Envelop cover కి Form - B అని పేరు అంతే, ఇది చిన్న కవర్.దీని మీద Ballot Paper సీరియల్ రాయాలి, (వాళ్ళే రాసి ఇస్తారు,) Ballot పేపర్ మీద మనం అనుకున్న టిక్ మార్క్ పెట్టీ చిన్న కవర్లో (Form -B)పెట్టీ సీల్ చేయాలి.

13C (Form - C)

ఇది పెద్ద కవర్ , దీనికి ఫామ్-C అని పేరు అంతే కానీ, ఇది కవర్ మాత్రమే. దీనిమీద మాత్రం మీ సిగ్నేచర్ మరియు అసెంబ్లీ/ పార్లమెంట్ ఎది ఐతే అది రాయాలి.

Ballot paper ( Model ):


పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయు విధానం : 

  • మీ ఓటు ఉన్న పోలింగ్ స్టేషన్ (బూత్) (పార్ట్ నెంబర్) నెంబర్ ఓటర్ల జాబితాలో మీ ఓటు క్రమ సంఖ్య తెల్సుకోవాలి. ఓటర్ తన ఎపిక్ కార్డ్ కానీ, భారత ఎన్నికల సంఘం చే గుర్తించబడిన ఏదైనా ఇతర గుర్తింపు పత్రము మరియు తన యొక్క ఎన్నికల విధుల నియామక పత్రం తో facilitation center వద్దహాజరు కావాలి.
  • facilitation centerలో ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు.
  • ప్రతి ఓటర్ కు పోస్టల్ బ్యాలట్ పేపర్ తో పాటు ఈ దిగువ తెలిపిన ఫార్మ్స్ మరియు కవర్స్ ఇస్తారు. అసెంబ్లీ బ్యాలట్ పేపరు, కవర్ 13B మరియు 13C PINK రంగులో ఉంటాయి. లోక్ సభ బ్యాలట్ పేపరు తెలుపు రంగు లోను, కవర్ 13B మరియు 13C GREEN రంగు లో ఉంటాయి.

a. ఫార్మ్ 13 A-డిక్లరేషన్

b. ఫార్మ్ 13 B-కవర్ A(చిన్న. లోపల కవర్).

c. ఫార్మ్ 13 C-కవర్ B(పెద్ద, బయట కవర్)

d. ఫార్మ్ 13D ఓటర్ కి సూచనలు.

  • వీటిని కుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలి. హడావిడి లేకుండా ప్రశాంతంగా చేస్తే ఓటు చెల్లుతుంది.
  • ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్లి, బ్యాలట్ పేపర్ మీద ఓటు ను మీకు నచ్చిన అభ్యర్థి కి క్రాస్ మార్క్ ద్వారా లేదా టిక్ రూపం లో నమోదు చెయ్యాలి.
  • బాలట్ పేపర్ మీద ఎట్టి పరిస్థితులలో సంతకం చెయ్యరాదు, ఓటరు గుర్తింపు తెలిపే ఏ విధమైన గుర్తులు వ్రాయరాదు.
  • ఫార్మ్ 13 A- డిక్లరేషన్ ఫార్మ్ లో మీ బ్యాలట్ పేపర్ సీరియల్ నంబర్ ను తప్పనిసరిగా వ్రాయాలి మరియు ఓటర్ సంతకం తప్పనిసరిగా చెయ్యాలి.
  • ఓటరు యొక్క గుర్తింపును, ఫార్మ్ 13-A లో గెజిటెడ్ అధికారి తప్పనిసరిగా ధృవీకరించాలి. [గెజిటెడ్ అధికారి facilitation center వద్ద అందుబాటులో ఉంటారు.
  • ఓటు నమోదు చేసిన బ్యాలట్ పేపర్ ను ఫార్మ్ 13 -B అంటే ఇన్నర్ కవర్ A లో పెట్టి సీల్ చెయ్యాలి.
  • ఇన్నర్ కవర్ A పై మీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చిరునామా వ్రాయాలి.
  • ఇన్నర్ కవర్ Aపై పోస్టల్ బ్యాలట్ సీరియల్ నంబర్ తప్పనిసరిగా వ్రాయాలి.ఇన్నర్ కవర్ Aలో మీ బ్యాలట్ పేపర్ తప్ప మరి ఏ ఇతర డాక్యుమెంట్ ఉండరాదు.
  • బ్యాలట్ పేపర్ ను సీల్ చేసి పెట్టిన కవర్ A మరియు మీ డిక్లరేషన్ ఫార్మ్ ను విడివిడిగా ఫార్మ్ 13-C అనగా కవర్ Bలో పెట్టి సీల్ చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారి చిరునామా పుర్తిచేయవలెను.
  • కవర్ B పై ఓటరు యొక్క సంతకం తప్పక చెయ్యాలి.
  • అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్ లో వేయాలి.

గమనిక:

  • ఓట్ల లెక్కింపు కేంద్రము నందు కవర్ Bని తెరవగానే, కవర్ Aమరియు ఓటరు డిక్లరేషన్ ఫార్మ్ విడివిడిగా లేకపోతే మీ పోస్టల్ బ్యాలట్ కవర్ Aను ఎట్టి పరిస్థితులలో పరిగణనలోకి తీసుకోరు.




పార్లమెంటుకు వేరుగా, అసెంబ్లీకి వేరుగా రెండు సెట్ల Form 13A (డిక్లరేషన్), Form 13B (చిన్న కవర్), Form 13C (పెద్ద కవర్), Form 13D (సూచనలు) లకు జతగా పార్లమెంట్ & అసెంబ్లీల బ్యాలెట్ పేపర్లు మీకు అందజేస్తారు


పార్లమెంట్ విభాగపు [ MP అభ్యర్తి ] ఓటు వేయు విధానం : 

  • Form 13A (డిక్లరేషన్) లో పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ Serial No. తప్పనిసరిగా రాసి, మిగిలిన అన్ని వివరాలు పూరించి, ఉద్యోగి సంతకం చేసి, గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించాలి.
  • పార్లమెంట్ విభాగపు బ్యాలెట్ పేపర్ నందు మీ ఓటరు కార్డు నందు ఉన్న Part No. & Serial No. తప్పనిసరిగా రాసి, మీకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా √ లేదా X లలో ఏదో ఒకటి మాత్రమే గుర్తించాలి
  • Form 13B (చిన్న కవర్) పైన పార్లమెంట్ విభాగపు బ్యాలెట్ పేపర్ Serial No. తప్పనిసరిగా రాసి, Form 13B (చిన్న కవర్) లోపల మీరు ఓటు వేసిన పార్లమెంట్ విభాగపు బ్యాలెట్ పేపర్ ఉంచి సీలు చేయాలి. 
  • Form 13C (పెద్ద కవర్) పైన ఉద్యోగి తప్పనిసరిగా సంతకం చేసి, మిగిలిన అన్ని వివరాలు పూరించి, Form 13C (పెద్ద కవర్) లోపల పూరించిన Form 13A (డిక్లరేషన్) & సీలు చేసిన Form 13B (చిన్న కవర్) ఉంచి సీలు చేయాలి.


అసెంబ్లీ విభాగపు [ MLA అభ్యర్తి ] ఓటు వేయు విధానం : 

  • Form 13A (డిక్లరేషన్) లో పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ Serial No. తప్పనిసరిగా రాసి, మిగిలిన అన్ని వివరాలు పూరించి, ఉద్యోగి సంతకం చేసి, గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించాలి.
  • పార్లమెంట్ విభాగపు బ్యాలెట్ పేపర్ నందు మీ ఓటరు కార్డు నందు ఉన్న Part No. & Serial No. తప్పనిసరిగా రాసి, మీకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా √ లేదా X లలో ఏదో ఒకటి మాత్రమే గుర్తించాలి
  • Form 13B (చిన్న కవర్) పైన పార్లమెంట్ విభాగపు బ్యాలెట్ పేపర్ Serial No. తప్పనిసరిగా రాసి, Form 13B (చిన్న కవర్) లోపల మీరు ఓటు వేసిన పార్లమెంట్ విభాగపు బ్యాలెట్ పేపర్ ఉంచి సీలు చేయాలి. 
  • Form 13C (పెద్ద కవర్) పైన ఉద్యోగి తప్పనిసరిగా సంతకం చేసి, మిగిలిన అన్ని వివరాలు పూరించి, Form 13C (పెద్ద కవర్) లోపల పూరించిన Form 13A (డిక్లరేషన్) & సీలు చేసిన Form 13B (చిన్న కవర్) ఉంచి సీలు చేయాలి.

Note : సీలు చేసిన పార్లమెంటు విభాగపు Form 13C, అసెంబ్లీ విభాగపు Form 13C లను వేరువేరుగా ఏర్పాటు చేసిన డబ్బాలలో వేయవలెను. 



ఓటు వేయు సమయం లొ జాగ్రత్తలు : 

పోస్టల్ బ్యాలట్ రద్దు చేయు విషయాలు : 

  • Form 13A డిక్లరేషన్ లో అసెంబ్లీ / పార్లమెంట్ పేర్లు వ్రాసారా, లేదా.
  • అదే Form 13A లో మీకు ఇచ్చిన పోస్టల్ బ్యాలట్ సీరియల్ నెంబర్ ఖాళీ లో పూరించారా లేదా.
  • Form 13 A లో పోస్టల్ బ్యాలట్ వేసే వ్యక్తి సంతకం చేసి, అడ్రస్ వ్రాసారా? లేదా?
  • అదే Form 13A డిక్లరేషన్ లో గెజిటెడ్ సంతకం ఉన్నదా? లేదా. గెజిటెడ్ సంతకం క్రింద స్టాంప్ ఉన్నదా? లేదా తప్పనిసరిగా చూస్తారు అవి లేకపోతే మన పోస్టల్ బ్యాలట్ invalid చేస్తారు.
  • బ్యాలట్ పేపర్ లో మనకు నచ్చిన వారికి ఓటు మార్క్ చేసిన తరువాత ఆ బ్యాలట్ పేపర్ ను తగిన రీతిలో మడత పెట్టి inner కవర్ "A" లో ఉంచి కవరు అతికించాలి. మరియు కవరు పైన వివరాలు పూరించి తప్పనిసరిగా బ్యాలట్ సీరియల్ నెంబర్ కవరు పైన కూడా వేయాలి. అక్కడ బ్యాలట్ సీరియల్ నెంబర్ వేయకపోతే మీ ఓటు invalid అయినట్లే.
  • ఇప్పుడు డిక్లరేషన్ (Form 13A), మరియు inner"A".బ్యాలట్ ఉంచి అతికించిన కవరు ఈ రెండు కలిపి outer cover "B" ( Form 13 C) లో ఉంచి outer cover"B" అతికించాలి.outer cover పైన వివరాలు పూర్తి చేసి signature of the voter అని ఉన్నచోట తప్పనిసరిగా సంతకం చేయాలి.


పోస్టల్ బ్యాలట్ లెక్కించేటపుడు : 

  • డిక్లరేషన్ పై assembly/పార్లమెంట్ వ్రాసారా, లేదా
  • బ్యాలట్ సీరియల్ నెంబర్ ఉన్నదా, లేదా
  • గెజిటెడ్ signature ఉన్నదా లేదా
  • బ్యాలట్ పేపర్ లో సరిగా tick/cross మార్క్ సరిగా గుర్తించారా, లేదా
  • బ్యాలట్ పేపర్ ఉంచిన inner "A" cover పైన బ్యాలట్ సీరియల్ నెంబర్ వేసారా, లేదా
  • డిక్లరేషన్ (Form 13A), inner "A" (Form 13B బ్యాలట్ ఉంచిన కవర్ ) ఈ రెండు outer cover"B" నందు ఉంచి outer కవర్ "B" పైన signature of the voter అన్న చోట సంతకం ఉందా, లేదా అని చూసి అన్ని సక్రమంగా ఉంటే మీ పోస్టల్ బ్యాలట్ లెక్కింపు లోనికి వెళుతుంది. 

ఇందులో చెప్పిన ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మీ పోస్టల్ బ్యాలట్ invalid అవుతుంది.


ఎవరెవరికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుంది :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులు 
  • మీడియా
  • పోలీస్, 
  • పౌర రక్షణ, 
  • మెట్రో, 
  • రైల్వే రవాణా సేవలు,
  • దూరదర్శన్ ఉద్యోగులు, 
  • బీఎస్ఎన్ఎల్, 
  • విద్యుత్ శాఖ,
  • పోస్టల్‌ టెలిగ్రామ్‌, 
  • ఆకాశవాణి, 
  • ఆరోగ్యశాఖ, 
  • ఫుడ్ కార్పొరేషన్, 
  • రాష్ట్ర మిల్క్‌ యూనియన్‌, 
  • మిల్క్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ
  • విమానయానం, 
  • ఆర్టీసీ, 
  • ట్రాఫిక్‌ పోలీసు, 
  • అంబులెన్స్‌ సేవలు, 
  • షిప్పింగ్‌, 
  • ఫైర్‌ ఫోర్స్‌, 
  • విపత్తు నిర్వహణ,
  • ట్రెజరీ, 
  • అటవీశాఖ,
  •  సమాచార ప్రజాసంబంధాల శాఖ, 
  • ఎనర్జీ, 
  • ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 

ఇలా మొత్తం 33 విభాగాలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ విధానం వీడియో ( యూట్యూబ్ ) : 


Note : ఈ పోస్ట్ కేవలం సమాచారం నిమిత్తం మాత్రమే . పూర్తి సమాచారం , మార్పుల కొరకు మీ మీ RO వారిని కాంటాక్ట్ అవ్వగలరు . 

మరింత సమాచారం >>
close