Order Aadhaar PVC Card In Telugu
Order Aadhaar Card: ఏటీఎం కార్డ్ సైజ్‌లో ఆధార్ కార్డ్
మీ ఆధార్ కార్డును ATM కార్డుల ఉండేలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి గాను కేవలం మొబైల్ ఫోన్ , ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ₹50/- ఉంటే చాలు. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ కూడా అవసరం లేదు. ఈ విధానం లొ బాల ఆధార్ చేసుకున్నాక ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా రాకపోయినా కార్డును ఆర్డర్ పెటరుకోవచ్చు.
ఎలా ఆధార్ PVC కార్డు ఆర్డర్ పెట్టుకోవాలో చూద్దాం.
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేయాలి
Step 2 : Aadhaar Number వద్ద ఆధార్ నెంబర్ లేదా Enrolment ID దగ్గర ఆధార్ నమోదు నెంబర్ ఎంటర్ చేయాలి. బాల ఆధార్ చేసినవారికి ఆధార్ కార్డు రాకపోతే ఈ ఆప్షన్ పనిచేస్తుంది. Enter Chaptcah లొ చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి My Mobile Number Is Not Registered ను సెలెక్ట్ చేయాలి.
Step 3 : Enter Mobile Number లొ మీ దగ్గర ఏ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కు లింక్ అయిన నెంబర్ అవసరం లేదు. Send OTP పై క్లిక్ చేయాలి.
Step 4 : మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు ఆరు అంకెల OTP వస్తుంది.
Step 5 : ఆ OTP ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.
Step 6 : I hereby confirm that I have read and understood the payments cancellation refund process పై క్లిక్ చేయండి.
Step 7 : UPI సెలెక్ట్ చేయండి.
Step 8 : Phone Pay సెలెక్ట్ చేయండి. (మీరు ఏ ఆప్షన్ అయిన ఎంచుకోవచ్చు)
Step 9 : మీ Phone Pay హోమ్ పేజీ లొ UPI ఐడి ఉంటుంది.
Step 10 : మీ Phone Pay UPI ఐడి ఎంటర్ చేయండి.Verify పై టిక్ చేయండి.
Step 11 : మీ పేరు చూపిస్తుంది. తరువాత Processed పై క్లిక్ చేయండి.
Step 12 : 5 నిముషాల టైమర్ ఓపెన్ అవుతుంది.
Step 13 : ఆ టైం లొ మీ Phone Pay App లొ పేమెంట్ నోటిఫికేషన్ వస్తుంది.Pay పై క్లిక్ చేయండి.పేమెంట్ చేయండి.
Step 14 : ₹50/- పేమెంట్ అయినట్టు చూపిస్తుంది.
Step 15 : Enter Captcha అని ఉన్న వద్ద పక్కనే చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేయండి.
Step 16 : Download Acknowledgment పై క్లక్ చెయ్యండి.
Step 17 : Pdf Download అవుతుంది. అందులొ SRN నెంబర్ Note చేసుకోండి. ఇంతటితో కార్డు ఆర్డర్ ప్రాసెస్ పూర్తి అయినట్టు. ఆధార్ చిరునామా కు Speed Post ద్వారా వస్తుంది.
PVC Aadhaar Card Order Status :
Step 1 : మీ PVC ఆధార్ కార్డు ఆర్డర్ స్టేటస్ తెలుసుకోటానికి కింద లింక్ పై క్లిక్ చేయండి.
Step 2 : Enter Enrollment ID, SRN or URN నెంబర్ వద్ద SRN నెంబర్ ఎంటర్ చేసి Captcha ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.
Step 3 : Date Of Dispatch దగ్గర కార్డు పంపిన తేదీ చూపిస్తుంది.