Jagananna Suraksha Programme 2023 Jagananna Suraksha Programme 2023

Jagananna Suraksha Programme 2023

jagananna suraksha programme  Jaganna Suraksha program from June 23 Jagananna Suraksha: అర్హులై ఉండి పథకాలు అందని వారి కోసం Andhra Pradesh Chief Minister announces ... - The Pioneer   Jagananna Suraksha: ఇక ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం    CM Jagan announces month-long Jagananna Suraksha programme to resolve public's issues Andhra Pradesh: Government to launch ‘Jagananna Suraksha’ programme on June 23

Jagananna Suraksha Programme 2023



Latest Information / కొత్త సమాచారం
జులై 31 అప్డేట్ : 
చనిపోయిన వారికి మరియు వలసలో ఉన్న వారికి అప్డేట్ చేయుటకు GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది .అందుకు గాను వాలంటీర్ వారు యాప్ ఓపెన్ చేసి హోమ్ పేజీ లో "సురక్ష కార్యక్రమం" అనే ఆప్షన్ లో హౌస్ హోల్డ్ ను సెలెక్ట్ చెయ్యాలి .అందులో ఎవరు అయితే చనిపోయారో లేదా వలసలో ఉన్నారు వారి పేరు ను సెలెక్ట్ చెయ్యాలి .అందులో కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారా ?  అనే ప్రశ్నకు 
  1. అవును 
  2. మరణించారు 
  3. తాత్కాలికంగా రాష్ట్రము లోని వేరొక ప్రాంతం లో ఉన్నారు 
  4. వేరే రాష్ట్రముకు వలస వెళ్లారు 
  5. సర్వే లో పాల్గొడానికి ఇష్టపడటం లేదు 
తాత్కాలికంగా రాష్ట్రము లోని వేరొక ప్రాంతం లో ఉన్నారు ఆప్షన్ ఎంచుకుంటే వారు ప్రస్తుతం ఉన్న జిల్లా , గ్రామం , సచివాలయం ను ఎంచుకోవాలి . తరువాత సబ్మిట్ చెయ్యాలి .

కింద పేరు పై క్లిక్ చేస్తే ఆ టాపిక్ కు వెళ్ళవచ్చు


1. Latest Updates:

  • GSWS VOLUNTEER APP న్యూ అప్డేట్ లో సురక్ష సర్వే కి సంబంధించి రెండు ప్రశ్నలు జూలై 26 అప్డేట్ చేయబడ్డాయి. 
  • జగనన్న సురక్ష క్యాంప్ డే నాడు JKC Desk కు వచ్చిన కంప్లైంట్స్ ను నవశకం బెనిఫిసియారీ Management NBM పోర్టల్ లో అప్లోడ్ చెయ్యాలి.
  • జగనన్న సురక్ష ప్రోగ్రాం కు సంబందించిన కొత్తగా "జగనన్న సురక్ష ప్రోగ్రాం అర్జీల రిపోర్ట్" ఆప్షన్ ఇవ్వటం జరిగింది. AP Seva పోర్టల్ లొ రిపోర్ట్ సెక్షన్ లొ అందుబాటులో ఉంటుంది. గమనించగలరు.
  • జగనన్న సురక్ష క్యాంపు జరిగే గ్రామ సచివాలయానికి 15 వేలు మరియు వార్డు సచివాలయానికి 25 వేల రూపాయలను క్యాంపు నిర్వహణ ఖర్చుల కోసం సచివాలయాల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం.
  • గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వారు తేదీ 23-06-2023 శుక్రవారం ఉదయం 11:00 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి "జగనన్న సురక్ష ప్రోగ్రాం" ను ప్రారంభించారు. 
  • GSWS Volunteer App లో వాలంటీర్లుకు జగనన్న సురక్ష ఆప్షన్ ను గ్రామా లేదా వార్డు సచివాలయంలో క్యాంపు తేదీ ముందు 7 రోజుల నుంచి మాత్రమే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది.
  • క్యాంపు సమయంలో సర్వీసులకు  ఎటువంటి యూజర్ చార్జీలు ఉండవు. Statutory ఛార్జ్ లు ఉంటాయి. 
  • గ్రామ వార్డు సచివాలయం లొ సర్వీస్ లకు గాను రిజిస్ట్రేషన్ ను క్యాంపు తేదీ కు 7 రోజుల ముందు నుంచి అవకాశం కల్పించటం జరుగును. సచివాలయం లొ PSDA / WEDPS, WEA/WWDS, PS/WAS, VRO/WRS వారి AP SEVA పోర్టల్ లొ సర్వీస్ లకు టోకెన్ జనరేట్ చేయిటకు ఆప్షన్ ఇవ్వటం జరిగింది.కేవలం ఆ ఆప్షన్ లొ రిజిస్ట్రేషన్ చేస్తే నే సర్వీస్ ఛార్జ్ ఉచితంగా ఉంటుంది.

1.1 జగనన్న సురక్ష క్యాంపుకు ముందు ఏడు రోజులలో చేయవలసిన పనులు : 

  • వాలంటీర్ అప్లికేషన్ లో జగనన్న సురక్ష సర్వే షెడ్యూల్ చేయబడిన తేదీకి వారం రోజులు ముందు ప్రారంభం అవుతుంది. 
  • వాలంటీర్ జగనన్న సురక్ష సర్వే చేసి, ప్రజలకు అవసరమయ్యే సర్వీసులు గుర్తించి వాటికి సంబందించిన డాక్యుమెంట్స్ సేకరించాలి. ఏవైనా డాక్యుమెంట్స్ లో సందేహాలు ఉంటే సచివాలయం ను సంప్రదించాలి. వాలంటీర్ లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ తయారీ లో సహకారం అందించాలి. 

1.1.1 టోకెన్లు జారీ :

  • వాలంటీర్ అప్లికేషన్ లో సర్వే మాత్రమే జరుగుతుంది. టోకెన్ జెనరేట్ అవ్వదు అనే విషయాన్ని గుర్తించండి. వాలంటీర్ లబ్దిదారులు కావలసిన సర్వీసులు గుర్తించి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ సమగ్ర పరిచి డిజిటల్ అసిస్టంట్ లేదా వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టంట్ లేదా గ్రామ రెవెన్యూ అధికారి లేదా పంచాయతీ కార్యదర్శి వారి ఏపీ సేవ పోర్టల్ లో టోకెన్ జారీ చేయాలి. 
  • ప్రతి సర్వీసుకు ఒక టోకెన్ జారీ అవుతుంది. 
  • టోకెన్ జారీ అయిన తరువాత డిజిటల్ అసిస్టంట్ లాగిన్ లో సర్వీస్ అప్లయ్ చేయాలి (పాత పద్ధతి లోనే, ముందు టోకెన్ జెనరేట్ అయ్యి ఉంటే సర్వీస్ ఛార్జ్ లు ఉండవు) 
  • డిజిటల్ అసిస్టంట్ లాగిన్ లో సర్వీస్ కూడా ఇవ్వాలి కనుక టోకెన్ జారీకి మిగిలిన లాగిన్లు అనగా (WEA/VRO/PS) లకు ప్రాధాన్యం ఇవ్వండి. 
  • టోకెన్ జారీ, సర్వీస్ రిక్వెస్ట్ షెడ్యూల్ తేదీకి వారం ముందు నుంచి ప్రారంభం చేయవచ్చు. కానీ సర్టిఫికెట్స్ క్యాంప్ జరిగిన తేదీన ప్రింట్ ఇవ్వాలి. 
  • టోకెన్ క్యాంప్ తేదీ వరకే చెల్లుబాటు లో ఉంటుంది .

1.1.2 జగనన్న సురక్ష క్యాంప్ లో ఆధార్ సేవలు :

  • జగనన్న సురక్ష క్యాంప్ లో ఆధార్ డ్రైవ్ కూడా జరుగుతుంది. ఇందులో ఆధార్ కార్డ్ మొబైల్ లింకింగ్ కొరకు మాత్రమే టోకెన్ జారీ చేయాలి. తప్పని సరి బయోమెట్రిక్ అప్డేట్ సర్వీస్ కొరకు మరియు ఇతర సర్వీస్ ల కొరకు టోకెన్లు జారీ చేయవలసిన అవసరం లేదు. ఆధార్ లో మొబైల్ అప్డేట్, తప్పని సరి బయోమెట్రిక్ అప్డేట్,కొత్తగా ఆధార్ నమోదు మాత్రమే ఉచితంగా అందించబడతాయి.  
  • ఆధార్ సెంటర్ ఉన్న డిజిటల్ అసిస్టంట్ లకు అన్ని క్యాంప్ లకు డ్యూటీలు వేయబడతాయి. ఆధార్ సెంటర్ ఉన్న సచివాలయం లో వారం ముందు నుంచి జరిగే టోకెన్ రిజిస్ట్రేషన్ మరియు సర్వీస్ రిక్వెస్ట్ కొరకు WEA మరియు ఇంఛార్జి అరేంజ్మెంట్స్ చేయబడతాయి.
  • ముందుగా సర్వే చేయు సమయంలో వాలంటీర్లు వారి మొబైల్ అప్లికేషన్లో ఎవరికైతే ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ అవసరం ఉంటుందో వారిని సెలెక్ట్ చేస్తారు.
  • క్యాంపు రోజున సచివాలయ పరిధిలో క్యాంపు ఎక్కడైతే పెడతారో అక్కడికి ఆధార్ సేవా కేంద్రాన్ని క్యాంపు మోడ్  లో తీసుకురావడం జరుగుతుంది.
  • ఆరోజు కేవలం తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్,కొత్తగా ఆధార్ నమోదు సర్వీసులు చేయడం జరుగుతుంది.
  • సర్వీసులు యధాతదం గా క్లయింట్ లో చేయాలి , తరువాత సంబంధిత DA/WEDPS వారు వారి లాగిన్ లొ ఆధారు సేవలను జోడించే సమయంలో
  • Service Raised Date : సురక్ష క్యాంపు తేదీ
  • Type of Service : "Jagananna Suraksha Aadhar Linking With Mobile" ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
  • No Of Services Provided : క్యాంపు రోజు ఇవ్వబడిన మొత్తం సర్వీసుల సంఖ్యను ఇక్కడ ఎంటర్ చేయాలి.
  • Amount : అమౌంట్ సున్నాగా చూపించడం జరుగును.
  • తరువాత Add Service పై క్లిక్ చేస్తే, ఆధారు సర్వీసులన్నీ కూడా జగనన్న సురక్ష ప్రోగ్రాంలో భాగంగా ఉచితంగా అందించినట్టు ఆన్లైన్ అవుతుంది.

ఆధార్ కార్డుకు , మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
 
Click Here

1.1.3 సర్వీస్ ఛార్జ్ సున్నా అవ్వాలి అంటే పాటించవలసిన విషయాలు :

DA/WEDPS వారి లాగిన్ లొ సర్వీస్ ఛార్జ్ సున్నా అవ్వాలి అంటే పాటించవలసిన విషయాలు :
  1. ఏ వ్యక్తి కి సర్వీస్ చేయాలో వారి ఆధార్ తో మాత్రమే ఆధార్ నెంబర్ తో మాత్రమే సర్వీస్  (Caste,income,Rice card, etc) కు జగనన్న సురక్ష టోకెన్ జనరేట్ చేయాలి.
  2. తరువాత అదే ఆధార్ తో DA/WEDPS వారి లాగిన్ తో సర్వీస్ కు అప్లికేషన్ చేయాలి. అప్పడు ఛార్జ్ జీరో చూపిస్తుంది.

1.1.4.Re-Issuance of Certificates ఇచ్చే విధానము :

  • జగనన్న సురక్ష ప్రోగ్రాంలో భాగంగా సర్వే మొదలు అయ్యే రోజు నుంచి క్యాంపు రోజు లోపు అనగా ఏడు రోజులలో ఎవరైనా సరే కుల మరియు ఆదయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసినట్లయితే ముందుగా గతంలో వారు ఆధార లేదా కుల ధ్రువీకరణ పత్రం తీసుకున్నారో లేదో చెక్ చేయాలి. 
  • AP Seva పోర్టల్ హోమ్ పేజీ లొ ఉన్న "Enter Your Aadhar" అనే ఆప్షన్ ద్వారా దరఖాస్తుదారిని ఆధార నెంబరు ఎంటర్ చేసినట్టయితే అతను గతంలో Caste & Income ఏపీ సేవా పోర్టల్ ద్వారా తీసుకున్నట్లయితే ఆ వివరాలు చూపిస్తాయి. గతంలో తీసుకున్నట్లయితే Re-Issuance Of Certificates సర్వీస్ ద్వారా Caste & Income అందించాలి. దానికి గాను కింద తెలిపిన విధంగా టోకెన్ రిజిస్ట్రేషన్ చేయవలెను.
  1. Reissuance of certificate – Income
  2. Reissuance of certificate – Integrated 
  • ఈ విధానం ద్వారా సర్టిఫికెట్ను వెంటనే 15 నిమిషాల లోపు (Category - A) తీసుకునే వెసులుబాటు ఉంటుంది, ఈ సర్టిఫికెట్లు జీవితకాలపు వ్యాలిడిటీతో, అన్ని అవసరాలకు పనికొస్తాయి.
  • గతంలో తీసుకోకపోయినట్టయితే సాధారణ కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం టోకెన్ రిజిస్ట్రేషన్ చేసి సర్వీసును అందించవలసి ఉంటుంది.

1.1.5.క్యాంపు పూర్తి అయిన రోజు సిద్ధం చేసుకోవలసిన డేటా : 


  1.  క్యాంపుకు  వేయబడిన ఆధార్ కిట్ సచివాలయము మరియు కోడు
  2. డాష్ బోర్డు ప్రకారము ఆధార్ మొబైల్ నెంబర్ లింకింగ్ కొరకు జనరేట్ చేసిన టోకెన్ల మొత్తం
  3.  క్యాంపు రోజు ఇచ్చిన  ఆధార మొబైల్ నెంబర్ లింకింగ్  సేవల సంఖ్య
  4. క్యాంపు రోజు ఇచ్చిన మిగతా ఆధార్ సేవల సంఖ్య
  5. క్యాంపుకు హాజరైనటువంటి మొత్తం ప్రజల సంఖ్య
  6. క్యాంపు సమయానికి మొత్తం రిజిస్టర్ చేసిన సేవల సంఖ్య
  7. నమోదు చేసిన మొత్తం అర్జీల సంఖ్య
  8. క్యాంపు రోజున ఇవ్వబడిన మొత్తం సర్టిఫికెట్ల సంఖ్య
  9. Remarks

2.వాలంటీర్లు సర్వే చేయు విధానం :


Step 1 : గ్రామ వార్డు వాలంటీర్లు GSWS Volunter కొత్త వెర్షన్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.

2.1 Latest అప్లికేషన్ లింక్ 👇🏿👇🏿


Download App

Step 2 : జగనన్న సురక్ష ప్రోగ్రాం లో భాగంగా GSWS Volunteer కొత్త వెర్షన్ మొబైల్ అప్లికేషన్ లొ Home Page లొ Suraksh అనే ఆప్షన్ ఇవ్వటం జరుగును . ఆ ఆప్షన్ టిక్ చేసాక క్లస్టర్ లొ హౌస్ హోల్డ్ డేటా వస్తుంది.
Step 3ఎవరికి అయితే సర్వే చెయ్యాలో ఆ కుటుంబ పెద్ద పేరును సెలెక్ట్ చేసుకోవాలి. ఆరు దశల ధ్రువీకరణ వివరాలు అనగా 
  1. Wet Land
  2. Dry Land
  3. FOUR WHEELER
  4. GOVT EMPLOYEE
  5. ELECTRICITY LAST 6MONTHS UNITS
  6. Urban Property
చూపిస్తాయి. తరువాత వరుసగా ప్రశ్నలు చూపిస్తాయి.

ప్రశ్న 1 : రైతులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం జగనన్న ప్రారంభించిన పథకాలు ఏంటో తెలుసా? (పౌరుడు తన సమాధానం చెప్పాక కింద ఉన్న అన్ని ఆప్షన్స్ ని చదవండి)
  1. వైఎస్ఆర్ రైతు భరోసా
  2. సున్నా వడ్డీ పంట రుణాలు
  3. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం
  4. వైఎస్ఆర్ పెన్షన్ కానుక
అవగాహన లేనివారికి తెలియజేయండి.

ప్రశ్న 2 : మహిళల జీవనోపాధి కోసం జగనన్న ప్రారంభించిన పథకాలు ఏంటో తెలుసా? (పౌరుడు తన సమాధానం చెప్పాక కింద ఉన్న అన్ని ఆప్షన్స్ ని చదవండి)
  1. వైఎస్ఆర్ ఆసరా
  2. వైఎస్ఆర్ చేయూత
  3. అమ్మ ఒడి
  4. వైఎస్ఆర్ పెన్షన్ కానుక
అవగాహన లేనివారికి తెలియజేయండి.

ప్రశ్న 3 : మన పిల్లల భవిష్యత్తు కోసం జగనన్న అందిస్తున్న పథకాలు ఏంటో తెలుసా? (పౌరుడు తన సమాధానం చెప్పాక కింద ఉన్న అన్ని ఆప్షన్స్ ని చదవండి)
  1. జగనన్న విద్యా దీవెన/జగనన్న వసతి దీవెన
  2. జగనన్న గోరుముద్దా
  3. జగనన్న విద్యా కానుక
  4. మన బడి నాడు - నేడు.
అవగాహన లేని వారికి తెలియజేయండి.

ప్రశ్న 4 : మీరు ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి.

ప్రశ్న 5 : జగనన్న ప్రారంభించిన ప్రభుత్వ పథకాలు మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడ్డాయని భావిస్తున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి.

ప్రశ్న 6 : గత ప్రభుత్వం కంటే జగనన్న ప్రభుత్వంలో మీకు ఎక్కువ మేలు జరుగుతోందని మీరు నమ్ముతున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి

మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు "జగనన్న సురక్షా" అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు మీ సచివాలయంలో ఒక రోజు గడిపి, సంక్షేమ పథకాలు, ధృవీకరణ పత్రాలకు సంబంధించి మీకు ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తారు.___________తేదీన జగనన్న సురక్షా శిబిరం మన సచివాలయంలో నిర్వహిస్తారు. ప్రభుత్వ పథకాలు, ధృవీకరణ పత్రాలకు సంబంధించిన సమస్యలకు అక్కడిక్కడే పరిష్కారం పొందవచ్చు.

ప్రశ్న 7 : ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి.

ప్రశ్న 8 : పై ప్రశ్నకు (ప్రశ్న 7 కు) మీ సమధానం 'అవును' అయితే అది ఏ పథకానికి సంబంధించినది?
  1. వైఎస్ఆర్ రైతు భరోసా
  2. వైఎస్ఆర్ సున్నా వడ్డీ (ఎస్.హెచ్.జిలు)
  3. జగనన్న అమ్మఒడి
  4. వైఎస్ఆర్ ఆసరా
  5. వైఎస్ఆర్ పెన్షన్ కానుక
  6. వైఎస్ఆర్ షాదీ తోఫా/వైఎస్ఆర్ కళ్యాణమస్తు
  7. జగనన్న విద్యా దీవెన
  8. వసతి దీవెన
  9. వైఎస్ఆర్ చేయూత
  10. జగనన్న తోడు
  11. జగనన్న చేదోడు
  12. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ

ప్రశ్న 9 : మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏ మైనది?
 ఇచ్చిన ఆప్షన్ లో ఒక ఆప్షన్ ను ఎంచుకోవాలి. సిటిజన్ చెప్పిన సమస్య ఆప్షన్లో లేకపోతే తరువాత సెక్షన్ 9.1 లొ ఎంటర్ చేయాలి.

ప్రశ్న 10 : అర్హత ఉండి మీ కుటుంబం లో ఎవరైనా పెన్షన్ పొందలేకపోతున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి
 కుటుంబంలో ఎవరైనా పెన్షన్ పొందలేకపోతే దానికి కారణం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ చూపించకపోతే అప్పుడు సెక్షన్ 10.1 లొ మాన్యువల్గా ఎంటర్ చేయాలి.సెక్షన్ 10.1.1 లొ ఇంట్లో రెండవ వ్యక్తి ఏ రకపు పెన్షన్కు అర్హులో తెలియజేయాలి.

ప్రశ్న 11 : మీకు లేక మీ కుటుంబ సభ్యులు ఏదైనా ప్రభుత్వ ధృవీకరణ పత్రం' పొందడంలో సమస్య ఉందా ?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి.

ప్రశ్న 12 : మీ కోసం నేను కొన్ని ధృవీకరణ పత్రాలు చదువుతాను. వీటిలో దేనినైనా పొందేందుకు దయచేసి మీకు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా సమస్య ఉంటే తెలియజేయండి ?
  1. కుల ధృవీకరణ పత్రం (ఇంటిగ్రేటెడ్ నివాసం మరియు కులం)
  2. ఆదాయ ధృవీకరణ పత్రం
  3. జనన ధృవీకరణ పత్రం.
  4. మరణ ధృవీకరణ పత్రం
  5. లావాదేవి కొరకు మ్యూటేషన్/సవరణల కొరకు మ్యూటేషన్
  6. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (FMC)
  7. ఆధార్ నెంబరుకు మొబైల్ నెంబరు అనుసంధానం చేయడం
  8. సి.సి.ఆర్.సి.కార్డు
  9. House Hold split (కుటుంబ సభ్యుల మార్పు చేర్పులు)
  10. ( Addition / Split of Rice Card) బియ్యం కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం & తొలగించడం.
  11. ఇతరులు

మీ కుటుంబం, మీ భద్రత బాధ్యతను జగనన్న తీసుకున్నాడు. మన రైతు జీవనోపాధికి భద్రత కల్పించడం దగ్గర్నుంచి.. మహిళలకు భద్రత కల్పించడం, వారు సాధికారత సాధించేలా చేయడం మరోవైపు పిల్లలకు చదువు, యువతకు ఉపాధి కల్పించి వారిని ఉద్యోగులుగా, పారిశ్రామిక వేత్తలుగా చేయడం వరకు అన్నీ ఆయనే బాధ్యత తీసుకున్నాడు. అంతేకాదు మన ఆరోగ్యం, శ్రేయస్సు గురించి కూడా చర్యలు తీసుకున్నాడు. అందుకే ఇంకా మీకు ప్రభుత్వం తీర్చగలిగిన సమస్యలు ఏవైనా ఉంటే జగనన్న సురక్ష శిబిరానికి రండి. ఈ శిబిరాన్ని _____-____-2023 వ తేదీన మన సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్నారు.

ప్రశ్న 13 : మీరు మన సచివాలయంలో జరగనున్న జగనన్న సురక్షా శిబిరానికి హాజరవదల్చుకున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి.

వ్యక్తి ఫోటో తీయాలి.బయోమెట్రిక్ / ఐరిష్ / పేస్ ఆప్షన్ ద్వారా eKYC పూర్తి చేయాలి.  లొకేషన్ Capture చేసి ఆన్ చేసి డేటా Submit చేయాలి. 


Note : పై ఆప్షన్లకు అనుగుణంగా మొబైల్ అప్లికేషన్ త్వరలో అప్డేట్ అవ్వనుంది. ఇదే పేజీలో అప్డేట్ అయినటువంటి మొబైల్ అప్లికేషన్ ఎప్పటికీ అప్పుడు అప్డేట్ చేయడం జరుగును. 

వెర్షన్ 6.2.4 కొత్త అప్డేట్ 
GSWS VOLUNTEER APP న్యూ అప్డేట్ లో సురక్ష సర్వే కి సంబంధించి రెండు ప్రశ్నలు ఈరోజు(జూలై 26) అప్డేట్ చేయబడ్డాయి.
కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారా?
  1. అవును 
  2. మరణించారు (Death)
  3. తాత్కాలికంగా రాష్ట్రంలోని వేరొక ప్రాంతానికి వలస వెళ్లారు (Migration)
  4. వేరే రాష్ట్రానికి వలస వెళ్లారు
  5. సర్వే లో పాల్గొనడానికి ఇష్టపడట్లేదు (Not Interested)
Migration ఐతే జిల్లా, మండలం, సచివాలయం సబ్మిట్ చేయాలి. మీ సమాధానం అవునుఐతే జిల్లా, మండలం, సచివాలయం ఎంచుకొని సర్వే చేయాలి.

2.2 Volunteer Survey Report :  👇🏿

Click Here

3.11 రకముల సర్వీస్లు - కావాల్సిన డాక్యుమెంట్లు :


S.NOServiceDocumentsVerification
workflow
FeeApplication Form
1Integrated Certificate (Caste and Residence Certificate)• SSC marks memo or Transfer Certificate or DOB extract from Municipality/Gram Panchayat
• Previously issued Caste Certificate (Either applicant/his/her parents/his/her family members) [wherever applicable]
DA/WEDPS →VRO → RI →Tahsildar →RDO (Specific Castes)NILClick Here
2Income Certificate• Copy of IT Returns/Pay Slips (Any other documents for income proof)
• Ration Card/EPIC Card/Aadhar Card
DA/WEDPS →VRO → RI →Deputy TahsildarNILClick Here
3Birth Certificate• As per hospital records / Field Verification
• UBD Portal – for births after 2015.
PS/WAS NILClick Here
4Death Certificate• Field verification/
• FIR/Postmortem copy
PS/WAS NILClick Here
5Marriage Certificate (In rural within 60days and in urban within 90 days) - AP compulsory marriage act• Aadhar card
• Marriage invitation card
• Marriage photo
• Passport size photos of witnesses
• Proof of age – Aadhar card
• Proof of residence – rice card/telephone bill/electricity bill/Aadhar card/voter ID /passport/driving license/MGNREGS job card
DA/WEDPS →PS/MCIf applying within 30 days after marriage. (100/ statutory charge must be collected) If applying after 30 days of marriage (200/ statutory charge must be collected)Click Here
6

Mutation for Transactions

• Registered Documents
• Aadhar Card /Other id and Address Proof
• Passport Photograph of the applicant

• Old Pattadar Passbook /ROR 1B /Adangal Copies
• Signature of Applicant
• Link documents.

DA→Tahsildar →VRO→Tahsildar(100/- for passbook printing needs to be collected)Click Here
Mutation for CorrectionsDA→Tahsildar→VRO→TahsildarNILClick Here
7Family Member Certificate• A notarized affidavit containing Name, Age and Relationship with deceased.
• Document (Ration Card/Voter Id/Passport/Passbook, Aadhaar etc.) indication the relationship of the applicant with the deceased.
• Death Certificate/FIR.
DA/WEDPS →VRO → RI→Tahsildar NILClick Here
8Aadhaar mobile Linking• Aadhaar Card NIL

Click Here (0-5)

Click Here (5-18)

Click Here (Above 18)

9Household SplitMarriage Split
• Marriage Certificate
• Rice Card
• Aarogyasri Card
• Family Member Certificate
• Passport
• Aadhaar Card indicating W/O
Divorce Split:
• Divorce Certificate
Single old age person above 60 years:
• Pension
• Aadhaar Card
DA/WEDPS→WEA/WWDS→ PS/WAS →MPDO/MCNILClick Here
10CCRC • Aadhaar Card
• Pattadar Passbook
• Passport size photo
• Land owner willing letter
VRONILClick Here
11New Rice Card

• Aadhaar card
• For Widow/Widower split – Spouse Death Certificate
• Divorcee Split (with children) – Divorce Certificate
• Single Member Split – if widow/widower then upload spouse death certificate
• Unmarried above 50 years –upload photo along with Tahsildar

DA/WEDPS →VRO and Ekyc→ TahsildarNILClick Here
Splitting of Rice CardNILClick Here

3.1 కౌలు గుర్తింపు కార్డులు - 2023 : రైతు సోదరులకు సూచనలు 

  • ఈ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంట కాలానికి సంబంధించి పొలం కౌలుకు సాగు చేసే ప్రతి రైతు సోదరులు కూడా తప్పనిసరిగా రెవిన్యూ శాఖ వారు జారీ చేసే  " కౌలు గుర్తింపు కార్డు (CCRC)" తప్పనిసరిగా తీసుకోవాలి.
  • ఈ గుర్తింపు కార్డు తీసుకుంటే మాత్రమే ఈ సంవత్సరం కౌలు దారులకు పంట నమోదు చేయడానికి వీలు ఉంటుంది. పంట నమోదులో పేరు నమోదు అయితే మాత్రమే ప్రభుత్వం వారు అందించే పథకాలు భూ యజమానులతో పాటుగా కౌలు రైతులకు కూడా వర్తిస్తాయి.
CCRC అర్జీ కొరకు కావలసినవి :
  1. సొంత రైతు పొలం పాస్ బుక్ జిరాక్స్ / 18 జిరాక్స్
  2. సొంత రైతు ఆధార్ కార్డు జిరాక్స్
  3. కౌలు రైతు ఆధార్ కార్డు జిరాక్స్
  4. కౌలు రైతు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు-3
  5. కౌలు కార్డ్
CCRC కార్డు వలన ఉపయోగాలు : 
  1. కౌలు రైతులకు (BC, SC, ST, మైనారిటీ లకు మాత్రమే) వై.ఎస్.ఆర్. రైతు భరోసా రావాలన్నా
  2. పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికైనా,
  3. పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందటానికైనా,
  4. పంటల భీమా పొందటానికైనా అర్హులు.
గమనిక : పై విషయాల మీద ఏవైనా సందేహాలు ఉంటే మీ సంబంధిత వాలంటీర్లను కానీ, VRO గారిని కానీ, రైతు భరోసా కేంద్రంలో ఉండే VAA గారిని కానీ సంప్రదించగలరు.

4. జగనన్న సురక్ష వాలంటీర్లకు విధి విధానాలు : 


మొదటిరోజు - శిక్షణ :
వాలంటీర్లు,గృహ సారథులు మరియు సచివాలయ కన్వీనర్లు కు FOA, MLO ల ఆధ్వర్యంలో శిక్షణ.
తర్వాతి రోజు - ప్రతి ఇంటికి వెళ్లడం :
వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు మరియు సర్టిఫికెట్ లకు సంబంధించి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కావలసిన పత్రాలను అప్పుడే సేకరిస్తారు.
వారం రోజుల తర్వాత - జగనన్న సురక్ష క్యాంపు :
మండల స్థాయి అధికారులు ప్రతి సచివాలయంలో ఒకరోజు ఉండి అక్కడకక్కడే పథకాలు పరిష్కారం మరియు పత్రాలు జారీ చేస్తారు.

4.1ప్రతి ఇంటికి వెళ్లే విధానం :

  1. ప్రతి ఇంటికి వెళ్లే సమయంలో వాలంటీర్లకు ముందుగానే మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది .ఆ మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్ వారికి లాగిన్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అందులో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నలను సిటిజన్ కు వినిపించి వారి యొక్క సమాధానాలను ఫారం రూపంలో ఎంటర్ చేయవలసి ఉంటుంది.
  2. ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన పాకెట్ (చిన్న) క్యాలెండర్ ను ఫారం నింపే సమయంలోనే సిటిజన్ కు ఇవ్వవలసి ఉంటుంది. 
  3. పాకెట్ క్యాలెండర్ ఇచ్చే సమయంలో ఇస్తున్నట్టుగా లొకేషన్ తో కూడిన ఫోటోను యాప్ లొ అప్లోడ్ చేయడం.
  4. వారికి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ కు సంబంధించిన పత్రాలను (డాక్యుమెంట్ లు) సిరిజన్ నుండి తీసుకో వాలి.
  5. సిటిజన్ నుండి తీసుకున్నటువంటి డాక్యుమెంట్లను సచివాలయంలో సమర్పించి సంబంధిత టోకెన్లు తీసుకోవాలి.
  6. ఆ టోకెన్ నెంబర్ను ఎవరి వద్దనైతే పత్రాలు తీసుకుంటారో వారికి ఇవ్వాలి.

4.2 క్యాంపు రోజు చేయవలసిన పనులు :

  1. సమస్యలు ఉన్న వ్యక్తులను క్యాంపుకు తీసుకొని రావాలి.
  2. టోకెన్ నెంబరు సమర్పించడానికి సహాయం చేయాలి   
  3. మండల అధికారి వద్దకు సిటిజన్ ను తీసుకొని వెళ్ళాలి.
  4. ఆమోదం పొందిన పత్రాలను వారికి ఇచ్చే సమయంలో సహాయం చేయాలి .
  5. ఇతర ఫిర్యాదులు ఏమైనా ఉంటే జగనన్నకు చెబుదాం హెల్ప్ డెస్క్ కు తీసుకువెళ్లాలి.

4.3 వాలంటీర్లు గుర్తుంచుకోవలసిన విషయాలు :

  1. పనిని సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి MLO, మండల ఇన్చార్జిలు కలిసి ఏర్పాటుచేసిన శిక్షణ సమావేశానికి హాజరు అవ్వాలి.
  2. గ్రామ సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోండి ప్రజల సమస్యలను సంబంధించిన పత్రాలను గుర్తించి పౌరుల నుండి తీసుకొని సచివాలయంలో సమర్పించండి.
  3. ప్రతి ఇంటిని సందర్శించి వాలంటీర్ యాప్ లో సర్వేను పూర్తి చేయండి.
  4. ఇంటికి తాళం వేసి ఉంటే వేరే సమయంలో మళ్లీ సందర్శించండి.
  5. మీ సచివాలయ పరిధిలో క్యాంపు జరిగే తేదీని ప్రతి ఇంట్లో పలుమార్లు చెప్పండి.
  6. ఆ వ్యక్తి అనుమతితో వారి జియో ట్యాగ్ చేయబడిన చిత్రాలను క్లిక్ చేయండి.
  7. అదే రోజున యాప్ వాట్స్అప్ గ్రూపుల్లో ఫోటోలు మరియు అప్డేట్లను షేర్ చేయండి.
  8. క్యాంపు రోజున మీరు సచివాలయ పరిధిలోనే తప్పకుండా ఉండండి.
  9. పథకాలు లేదా డాక్యుమెంట్ సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులు అందరినీ క్యాంపుకు రావడానికి ప్రోత్సహించండి.
  10. క్యాంపుకు ముందు ఫిర్యాదు చేయని వ్యక్తులను కూడా తమ సమస్య పరిష్కారం కోసం క్యాంపు రోజు సందర్శించవచ్చు.

4.4 ఈ క్రింది పత్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి :

  1. కుల ధ్రువీకరణ పత్రము
  2. ఆదాయ ధ్రువీకరణ పత్రము
  3. జనన ధ్రువీకరణ పత్రము
  4. మరణ ధ్రువీకరణ పత్రము
  5. వివాహ ధ్రువీకరణ పత్రము
  6. కుటుంబ సభ్యులను ధ్రువీకరణ పత్రము
  7. మ్యుటేషన్ లావాదేవీలు
  8. ఆధార్ ఫోన్ నెంబర్ అనుసంధానము
  9. పంట సాగు హక్కు కార్డు (CCRC)
  10. కొత్త / Split రైస్ కార్డు
  11. హౌస్ హోల్డ్ మాపింగ్ విభజన 


4.5 జగనన్న సురక్ష కార్యక్రమం లో వాలంటీర్స్ యొక్క పనులు : 

  • ఈ సురక్ష క్యాంపు కి వారం రోజుల ముందు నుండి (జూన్ 24) వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్లవలెను. 
  • వాలంటీర్లు సిటిజెన్ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క రెస్పాన్స్  ని Volunteer App లో Form fill చేయాల్సి ఉంటుంది (యాప్ ఇంకా రాలేదు)
  • ఫారం సబ్మిట్ చేసిన తర్వాత వాలంటీర్స్ Pocket Calendar ని citizen కి ఇస్తారు. 
  • ఆ క్యాలెండరు పట్టుకున్నట్లుగా Citizen కి Geo-Tagged Photo తీసి App లో Upload చేయాలి.
  • Schemes మరియు Service Requests కి సంబందించిన Issues ఏమైనా ఉన్నట్లయితే ఆ డాకుమెంట్స్ కలెక్ట్ చేసి సచివాలయం కి సబ్మిట్ చేయాలి
  • డాకుమెంట్స్ ని సచివాలయం కి ఇచ్చిన తర్వాత వారు ఇచ్చే Token Number ని Citizen కి అందజేయాలి


4.6 క్యాంపు రోజు వాలంటీర్ పనులు : 

  • ఉదయం 09:30 కి మండల అధికారులు సచివాలయం కి వస్తారు.
  • Issues మరియు service requests ఉన్న citizens ని సచివాలయం వద్దకు వాలంటీర్ తీసుకురావాలి. 
  • మండల అధికారుల చేతుల మీదగా సచివాలయం కి తెచ్చిన service requests  లో Approve అయిన సర్టిఫికెట్స్ ని citizens కి అందజేయాలి.

5.జగనన్న సురక్ష సచివాలయ ఉద్యోగుల పాత్ర :


5.1క్యాంపు ముందు :

  1. Participate in interaction with the citizens. Ensure that Service Requests are generated for all the issues raised during the door-to-door visit.
  2. Ensure that all the necessary enquiries are conducted and complete for issue / process of Certificates / Documents by the day of the camp.

5.2 క్యాంపు రోజు :

  1. Ensure that stationery is adequately placed for e the issuance of Certificates / Documents to the beneficiaries.
  2. Ensure facilities are maintained at the venue for registration of service requests.

6. జగనన్న సురక్ష టైం లైన్ :


Jagananna Suraksha timeline :

  1. వాలంటీర్లు వారి క్లస్టర్ లొ ఇంటిని సందర్శించితేది - జూన్ 24 నుంచి
  2. సచివాలయాల స్థాయిలో జగనన్న సురక్ష క్యాంపుల ప్రారంభించు తేదీ - జులై 1 నుంచి
  3. జగనన్న సురక్ష ప్రోగ్రామ్కు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించుట - జూన్ 24 నుంచి

7. Jagananna Suraksha Technical Support Numbers :


S.NODISTRICTNAME OF DRPCONTACT NO
1ALLURI SITHARAMA RAJUSETTI. SUNEEL KUMAR9154374188
2ANAKAPALLI K.TRINATH KUMAR9154374189
3ANANTHAPURAMU K.SURYANARAYANA REDDY9154374196
4ANNAMAYYA SAGILI.CHAKRADHAR RAJU9154374197
5BAPATLA S.RAJA GOPAL RAO9154374198
6CHITTOOR P. RUPESH9154374200
7EAST GODAVARIN. CHAITANYA SAI TEJA9154374202
8ELURU RIYAZ KHAN9154374204
9GUNTUR MANCHALA KIRAN9154374205
10KADAPA N.SUBBA NARASIMHULU9154374207
11KAKINADA P.SRUTHI KIRAN9154374209
12KONASEEMA A. NAGESWARA RAO9154374210
13KRISHNAIMMANENI RAJESH9154374213
14KURNOOL AZMEERA GOPI KRISHNA9154374214
15NANDYALBANDARU RUBENU9154374215
16NELLOREHARISH. SOMAVARAPU9154374217
17NTRNAGA MAHESH9154374218
18PALNADUM.VIJAY9154374220
19PARVATHIPURAM MANYAMT. UMA MAHESHWARA RAO9154374221
20PRAKASAMBANDARU.SRIKANTH9154374223
21SRI SATHYA SAICHUKKA. SUNEEL KUMAR9154374225
22SRIKAKULAMB. MANOJ KUMAR9154374226
23TIRUPATHIBHAVANI SHANKAR9154374227
24VISAKHAPATNAMCHIRANJEEVI 9154374228
25VIZIANAGARAMGIRIJALA NAGARJUNA9154374230
26WEST GODAVARIVINAY MATTE9154374231


8. జగనన్న సురక్ష క్యాంపు తేదీ తెలుసుకునే విధానము :


Know Your Jagananna Suraksha Camp Date :

Step 1 : మీ సచివాలయ పరిధిలో ఏ రోజు జగనన్న సురక్ష క్యాంపు ఉంటుందో తెలుసుకోవటానికి ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి.
Click Here
Step 2 : Home Page లొ Know your Jagananna Suraksha camp date అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 :తరువాత ఆయా సచివాలయ పరిధికి సంబంధించిన వ్యక్తి యొక్క ఆధార నెంబర్ లేదా సచివాలయం ఉన్నటువంటి జిల్లా మండలం గ్రామమును సెలెక్ట్ చేసి Check Status పై క్లిక్ చేయాలి. వెంటనే 
  1. సచివాలయం పేరు, 
  2. మీ యొక్క సచివాలయం కోడు,
  3. సచివాలయం యొక్క షెడ్యూల్ తేదీ 
చూపించడం జరుగును. 


9. ఆగస్టు 1న అర్హులకు పథకాలు :

  • జగనన్న సురక్ష ద్వారా వివిధ పథకాలకు అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన మంజూరు చేసి లబ్ధి. చేకూరుస్తారు.
  • అర్హత ఉన్నవారు ఎవరూ మిస్ కాకూడదన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశాల్లో ఒకటి. 26 జిల్లాలను ప్రత్యేకాధికారులుగా నియమించిన అధికారులంతా ఆయా ప్రాంతాల్లో నెలకు రెండు దఫాలు పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
  • కలెక్టర్ల పర్యటన కూడా చాలా ముఖ్యమైన అంశం. ప్రతి జిల్లా కలెక్టర్ వారానికి రెండు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. 
  • నాలుగు సచివాలయాల్లో జాయింట్ కలెక్టర్ పర్యటించాలి, కార్యదర్శులు, డీలు నెలకు కనీసం రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. ఐటీడీవో దీవో, సబ్ కలెక్టర్, ఆర్డీతో, మున్సిపల్ కమిషనర్లు వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలి.

10. జగనన్న సురక్ష CM ప్రోగ్రాం వీడియో  :


11. Jagananna Suraksha Downloads :

  1. Jagananna Surakhsa Pocket Calender pdf   
  2. Jagananna Suraksha SOP Final pdf  
  3. Jagananna Suraksha Program GO.10 
  4. Jagananna Suraksha Volunteers Works pdf 
  5. Jagananna Suraksha Over View pdf 
  6. Jagananna Suraksha Pailot Project in Sachivalayam pdf
  7. Jagananna Suraksha Team Composition & Scheduling Module Over View  
  8. Jagananna Suraksha Banner, Hologram, Standee 
  9. Re-Issuance of Certificates User Manual 
  10. Mee Seva Services User Manual 
  11. Un-Used Token Deletion Process  
  12. Camp Start Data Entry User Manual
  13. Jagananna Suraksha Grievances Report