Jagananna Pasu Arogya Suraksha Program Jagananna Pasu Arogya Suraksha Program

Jagananna Pasu Arogya Suraksha Program

Jagananna Pasu Arogya Suraksha Program


Jagananna Pasu Aarogya Suraksha Camps - JPASC

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం జగనన్న పశు ఆరోగ్య సురక్ష క్యాంపు (Jagananna Pasu Aarogya Suraksha Camps - JPASC) అనే ప్రోగ్రామ్ను త్వరలో ప్రారంభించనుంది. దానికిగాను ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద తిరుపతి, ఎన్టీఆర్ మరియు విజయనగరం జిల్లాలలో నవంబర్ నెలలో క్యాంపులను నిర్వహించనున్నారు. ఆ క్యాంపులు జరిగే తీరు, అవసరమయ్యేవి, ఏ విధంగా చేయాలి అని పూర్తి వివరాలు తెలుసుకోవటం జరుగును.

వెంటనే డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలలో క్యాంపులను నిర్వహించనున్నారు .ఈ క్యాంపులు జగనన్న సురక్ష , జగనన్న ఆరోగ్య సురక్ష ఏవిధంగా నిర్వహించారో ఆ విధంగా నిర్వహించడం జరుగును. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి మండలంలో మొత్తం నాలుగు క్యాంపులను నిర్వహించడం జరుగుతుంది. అందులో ఒకటి మెగా క్యాంపు గాను మరియు మూడు చిన్న క్యాంపులను నిర్వహించడం జరుగుతుంది.

పైలెట్ ప్రాజెక్టుగా ముందుగా తిరుపతి జిల్లాలో నవంబర్ 7వ తారీఖున, ఎన్టీఆర్ జిల్లాలో నవంబర్ 10 వ తారీఖున మరియు విజయనగరం జిల్లాలో నవంబర్ 14వ తారీఖున జగనన్న పశు ఆరోగ్య సురక్ష క్యాంపులను నిర్వహించడం జరుగుతుంది. 

Jagananna Pasu Aarogya Suraksha Camps -  jpasc Order Copy pdf  👇

Click Here

Jagananna Pasu Aarogya Suraksha Camps Guidelines 

1. క్యాంపు నిర్వహణ సంబందించి :

  • ప్రజా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ముందుగానే ఒక కార్య ప్రణాళికను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది.
  • రైతుల అందరికీ కూడా ముందుగానే విషయాన్ని తెలియజేయాలి.
  • ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పెద్ద మొత్తంలో ప్రచారం చేయవలసి ఉంటుంది.
  • పెద్ద మొత్తంలో పశువులు ఉంచేందుకు అనువైన ప్రదేశంలో మాత్రమే ఈ క్యాంపులను నిర్వహించవలసి ఉంటుంది.
  • అవసరమైన అన్ని మందులు క్యాంపు సమయమునికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
  • పైలట్ క్యాంపులో తక్కువలో తక్కువ 500 పశువులు హాజరు అయ్యేలా చూసుకోవాలి.


2.వెటర్నరీ టీం ఏర్పాటు : 

 వెటర్నరీ టీములను క్యాంపుకు ముందుగానే ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది ఆ టీములో కింద తెలిపిన సభ్యులు ఉంటారు

  1. అసిస్టెంట్ డైరెక్టర్ AVH
  2. లోకల్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
  3. డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్ డాక్టర్లు / SVVU ( గైనకాలజీ మెడిసిన్ మరియు సర్జరీ )
  4. SVV విద్యాలయం నుంచి ఇంటర్సిప్ స్టూడెంట్ లు
  5. ADDLs / CADDLs నుంచి స్క్రీనింగ్ టీము


3. క్యాంపుకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు :

 కింద తెలిపిన అవసరమయ్యేవి అన్నీ కూడా పైలెట్ క్యాంపులో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి

  • షామియానా - 500 ప్రజలకు
  • టేబుల్ -  50
  • చైర్లు - 500
  • త్రాగునీరు - అవసరం అయ్యేంత 
  • సిబ్బందికి ఫలహారాలు - 125 మందికి సరిపోయేలా
  • బ్యానర్లు మరియు పబ్లిక్ అడ్రస్ సిస్టం - అవసరం అయ్యేంత
  • మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు - 125 మందికి సరిపోయేలా


4. క్యాంపు రోజు నిర్వహించవలసిన పనులు :

  • స్థానిక ప్రజా ప్రతినిధులకు ముందుగానే తెలియజేసి క్యాంపు రోజు వారు హాజరు అయ్యే విధంగా చూసుకోవాలి
  • గౌరవనీయులైన మినిస్టర్లకు మరియు గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు ఆహ్వానించి వారి చేతిలో మీదుగా అవకాశం ఉంటే క్యాంపులను ప్రారంభించవలసి ఉంటుంది.
  • పశువులకు సంబంధించి శాస్త్రీయ నిర్వహణ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు తెలియజేసే సదస్సు అయినా రైతు సదస్సును క్యాంపు తో పాటుగా నిర్వహించవలసి ఉంటుంది.

  • రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత పశువుల యొక్క ఆరోగ్య చరిత్ర ప్రకారం సంబంధిత వార్డులకు పంపించడం జరుగుతుంది.
  • పశువులను సంబంధిత వార్డులో ఉన్నటువంటి డాక్టర్లు పరీక్షించిన తరువాత అవసరమైన మందులు ఇవ్వటం మరియు ఇతర రికమండేషన్ చేయవలసి ఉంటుంది.
  • పశువులకు అవసరమయ్యే మందులను పూర్తి ఉచితంగా రైతులకు మందులు సరఫరా కౌంటర్ వద్ద ఇవ్వవలసి ఉంటుంది.
  • గర్భిణీ మరియు పాలిచ్చే జంతువులకు పోషకాహార సప్లమెంటు లను ఇవ్వవలెను.
  • బ్రూసెల్లోసిస్ దృష్టిలో ఉంచుకొని కాలానుగున నివారణ టీకాలను వెయ్యవలసి ఉంటుంది.
  • జంతువులను పరీక్షించిన తరువాత డి వార్మింగ్ అవసరమైనచో డి వార్మింగ్ కూడా చేయవలసి ఉంటుంది.
  • జంతువులకు పరీక్షలకు సంబంధించి అన్నీ కూడా వైయస్సార్ నియోజికవర్గ స్థాయి వ్యాధి నిర్ధారణ ల్యాబ్ లో చేయవలసి ఉంటుంది.
  • పశువులకు పెద్ద ఆపరేషన్లు అవసరం అయినచో క్యాంపు రోజున వారికి సర్జరీ ఎప్పుడు పడుతుందో ఆ తేదీతో కూడినటువంటి స్లిప్పును ఇవ్వటం జరుగుతుంది. పశువులను డాక్టర్ వైయస్సార్ పశు ఆరోగ్య సేవ అంబులెన్స్ (1962) ద్వారా దగ్గరలో ఉన్న వెటర్నరీ పాలీ క్లినిక్ తీసుకువెళ్లడం జరుగుతుంది. 
  • కృత్రిమ గర్భధారణ మరియు సెక్స్ క్రమబద్ధీకరించబడిన వీర్య గర్భధారణ క్యాంపు రోజున జరుగుతుంది.

GSWS Helper WhatsApp Channel

4.1 జగనన్న పశు ఆరోగ్య సురక్ష క్యాంపు లో కింద తెలిపిన కౌంటర్లు మరియు వార్డులు ఉండవలెను : 

  1. Registration counter / రిజిస్ట్రేషన్ కౌంటరు
  2. Gynecology ward / గైనకాలజీ వార్డు
  3. Medical ward / మెడికల్ వార్డు
  4. Calf ward / పిల్ల పశువుల వార్డు
  5. Diagnostic counter / దయాగ్నొస్టిక్ కౌంటర్
  6. Drug Distribution Counter / మందుల సరఫరా కౌంటర్ 


5.Follow-Up Cases - తదుపరి కేసుల చికిత్స సంబంధించి :

  • చికిత్స పూర్తి అయిన పశువులను తదుపరి సంబంధిత వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వారు చూసుకుంటారు.
  • చికిత్స పూర్తి అయిన తరువాత పశువులకు అవసరమయ్యే మందులు అన్నీ కూడా ఉండేలా చూసుకోవాలి.
  • క్యాంపు రోజున ఎవరెవరికి ఏ మందులు ఇస్తున్నారు అనే విషయాలతో కూడిన రికార్డును మరియు రైతుల acquittance ను మెయింటైన్ చేయవలసి ఉంటుంది.


6. క్యాంపుల మానిటరింగ్ :

  • DAHO మరియు డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ల వారు క్యాంప్లను మోనిటరింగ్ చేయుదురు.
  • క్యాంపు నిర్వహణ విషయాలు ఎన్ని పశువులకు ట్రీట్మెంట్ చేశారు మరియు ఎంతమంది రైతులు లబ్ధి పొందారు విషయాలతో కూడిన పూర్తి రిపోర్టును హెడ్ ఆఫీస్ కు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
  • సీనియర్ అధికారులతో కూడిన డైరెక్టర్ వారు క్యాంపులకు హాజరు అవవలసి ఉంటుంది .
  • DAHO వారు క్యాంపుల నిర్వహణకు సంబంధించిన ఖర్చులకు ఇంటరెస్ట్ ఫండ్స్ నుండి నగదు ఇవ్వవలసి ఉంటుంది.

Jagananna Pasu Arogya Suraksha Program Volunteer Survey Process 👇

Click Here