Vahanamitra Payment Status - Payment Acknowledgement
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా వైస్సార్ వాహనామిత్ర పథకం అందిస్తున్న విషయం తెలిసిందే .ఈ పథకం ద్వారా ఆటో . టాక్సీ మరియు రేషన్ సరఫరా చేయు MDU వాహనదారులకు ఒకరికి సంవత్సరానికి రూ.10,000/- అందించటం జరుగును . అందులో భాగంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి కొత్త దరఖాస్తుల ప్రక్రియ ఆగష్టు నెలలోనే పూర్తి అయ్యింది మొదటి షెడ్యూల్ ప్రకారం ఆగష్టు నెలలోనే నగదు కూడా జమ అవ్వవలెను కానీ పథకం లాంచ్ తేదీ సెప్టెంబర్ 29 కు పొడిగించటం జరిగింది . 2023-23 వైస్సార్ వాహనామిత్ర నగదు తేదీ సెప్టెంబర్ 29 నుంచి జమ అవ్వటం మొదలు అవ్వనుంది .
ఎవరికీ రూ .10,000/- జమ అవ్వనుంది .....
వైస్సార్ వాహనామిత్ర పథకం కు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మరియు గత సవత్సరం లబ్ది పొంది ప్రస్తుతం అర్హత ఉన్న వారందరికీ ఈ సవత్సరం రూ.10,000 జమ అవ్వనుంది . అయితే అప్లికేషన్ చేసిన తరువాత చాలా మందిలో వారి అప్లికేషన్ అప్రూవల్ అయ్యిందో లేదో అని లేదా అప్లికేషన్ ఏ స్థాయిలో ఉందొ తెలుసుకోవాలి అని ఉంటుంది . వైస్సార్ వాహనామిత్ర అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోటానికి కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చెయ్యండి .
Vahanamitra Payment Status Link 👇
పైన ఇవ్వబడిన లింక్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ తో పాటుగా పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు . పేమెంట్ స్టేటస్ వెంటనే అప్డేట్ అవ్వదు . పేమెంట్ అయిన వారం తరువాత అప్డేట్ అవ్వటం జరుగును .
జాబితాలో పేరు లేని వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ...
కొత్తగా దరఖాస్తుకు ఏ అప్లికేషన్ లు కావాలి ....
- Application Form - Click Here
- RC బుక్ జిరాక్స్
- డ్రైవింగ్ లైసెన్స్
- కాస్ట్ సర్టిఫికెట్ (AP Seva)
- ఇన్కమ్ సర్టిఫికెట్ (AP Seva)
- బ్యాంకు బుక్ మొదటి పేజీ జిరాక్స్
- ఆధార్ కార్డు జిరాక్స్
- రైస్ కార్డు జిరాక్స్
- ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్.
కొత్తగా దరఖాస్తుకు అర్హతలు ...
- ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
- ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి రైస్ కార్డు ఉండాలి
- స్వంతంగా కార్ టాక్సీ గాని ,ఆటో గాని ఉండాలి
- దరఖాస్తు దారునికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
- ఒరిజినల్ RC తన పేరు మీద ఉండాలి
- కుటుంబం లో ఒక్క వాహనానికి మాత్రమే ఈ స్కీం పరిధి లోకి వస్తుంది
- వేరే రాష్ట్రం లో వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్లు అడ్రస్ ను ఆంధ్రప్రదేశ్ కి మార్చుకుంటేనే అర్హులు
- బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి
- మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు
- మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు
- కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు
- కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి
- పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
- కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు
- కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు