Jagananna Aarogya Suraksha Survey Process Jagananna Aarogya Suraksha Survey Process

Jagananna Aarogya Suraksha Survey Process

Jagananna Aarogya Suraksha Survey Process


జగనన్న ఆరోగ్య సురక్ష - Jagananna Aarogya Suraksha 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 30వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ఆరోగ్య సంబంధిత పధకాలు పై అవగాహన పెంచడానికి రాష్ట్రవ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్ (VHC)/అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) పరిధిలో వైద్య శిబిరాలను నిర్వహించేందుకు రూపొందించబడిన ఒక సమగ్ర కార్యక్రమం.


జగనన్న ఆరోగ్య సురక్ష అంటే ఏమిటి? 
What is Jagananna Aarogya Suraksha ?

జగనన్న ఆరోగ్య సురక్ష అనేది పైన పేర్కొన్న విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులకు ఆరోగ్య సేవలు అందించేందుకు తీసుకువచ్చిన కొత్త కార్యక్రమం.

ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించడం జరుగుతుంది

  1. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ANM మరియు వాలంటీర్లు తమ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటారు. అవసరమైన వారికి కావలసిన టెస్టులు కూడా చేస్తారు. ఎవరికైతే డాక్టర్ తో తదుపరి కన్సల్టేషన్ అవసరం ఉంటుందో వారిని క్యాంపు నిర్వహించే రోజున డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళటం
  2. ఈ కార్యక్రమంలో ఇంటింటి సర్వే అయిపోయిన తర్వాత గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆరోగ్య క్యాంపులను నిర్వహిస్తుంది. పైన ముందుగా గుర్తించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారిని ఈ క్యాంపులో డాక్టర్లు ఉచితంగా పరిశీలించి చికిత్స అందిస్తారు.


జగనన్న ఆరోగ్య సురక్ష  క్యాంపులను ఎప్పటి నుంచి నిర్వహిస్తారు? ఎక్కడ నిర్వహిస్తారు?

  • ఈ క్యాంపులను పాఠశాల ప్రాంగణంలో కానీ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిసరాలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ మరియు సన్నద్ధత అంతా కూడా సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభమవుతుంది
  • ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. రిపోర్టింగ్ కోసం ప్రస్తుతం జగనన్న సురక్ష యాప్ ను ఇందుకోసం ఉపయోగించనున్నారు. అదేవిధంగా వాలంటీర్లను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారు.
  • తొలి ఆరోగ్య సురక్ష క్యాంపును సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది.


వాలంటీర్లు మరియు ANM లు చేయవలసిన పనులు :
Jagananna Aarogya Suraksha Volunteers & ANM Duties :

  1. వాలంటీర్స్ మరియు ANM లు ప్రతి ఇంటికి వెళ్లి GSWS వాలంటీర్ App లో ఇచ్చిన Questions తో సర్వే చేయాలి. మరియు సర్వే సమయంలో photo తీసి అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.
  2. ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని App లో నమోదు చేయాలి. వారిని క్యాంపు రోజు క్యాంపు సచివాలయం వద్దకు తీసుకురావాలి.
  3. జగనన్న ఆరోగ్య సురక్ష బ్రోచర్లు పంపిణీ చేయాలి.
  4. ఆరోగ్య శ్రీ పథకానికి సంబందించి వినియోగం మరియు ప్రయోజనాల పైన ప్రజలకు అవగాహన కల్పించాలి.

 

జగనన్న ఆరోగ్య సురక్ష Timelines :
Jagananna Aarogya Suraksha Timelines :

  • సెప్టెంబర్ 7 : campaign Schedule MPDO'S ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.
  • సెప్టెంబర్ 8 : State level meeting నిర్వహిస్తారు.
  • సెప్టెంబర్ 12 : ANM's కి Departmental ట్రైనింగ్ మరియు వాలంటీర్స్ కి FOA 's ద్వారా ట్రైనింగ్ తేదీ లోపు పూర్తి చేయడం జరుగుతుంది.
  • సెప్టెంబర్ 15 : జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ కార్యక్రమం ప్రారంభం
  • సెప్టెంబర్ 20 : ఆరోగ్య శ్రీ పంప్లెట్స్ (Brochures )
  • సెప్టెంబర్ 30 : జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు

Download Official Order Copy 👇
Click Here

జగనన్న ఆరోగ్య సురక్ష వాలంటీర్ల పనులు : 
Jagananna Aarogya Suraksha  Volunteer Works :

  1. వాలంటీర్ తన క్లస్టర్ పరిధి లో ఉన్న ప్రతి ఇంటిని వైద్య శిబిరానికి ముందు 2 సార్లు సందర్శించాలి. శిబిరం యొక్క 20 రోజుల ముందు మొదటిసారి (గ్రామీణ ప్రాంతాల్లో ) శిబిరం యొక్క 20 రోజుల ముందు (పట్టణ ప్రాంతాల్లో) మరియు శిబిరానికి 7 రోజుల ముందు రెండవసారి సందర్శించాలి.
  2. ANM ఇంటిని సందర్శిస్తారని మరియు రక్త పోటు బ్లడ్ షుగర్ మరియు ఇతర పరీక్షలు వంటి అవసరమైన ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారని వాలంటీర్ గృహానికి వెళ్ళినప్పుడు ప్రజలకు తెలియజేయాలి.
  3. వాలంటీర్ వైద్య శిబిరానికి సంబంధించి నిర్ణీత తేదీన సంబంధిత వైద్యులు వారికి చెకప్ చేసి అవసరమైన ఆరోగ్య సంబంధిత మందులను అందిస్తారని ప్రజలకు సమాచారాన్ని తెలియజేయాలి.
  4. హౌస్ హోల్డ్ లో మీ అందరి చేత ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ ని డౌన్లోడ్ చేపించి సిటిజన్ ఓపెన్ చేశారని వాళ్ళింటికి నిర్ధారించుకోవాలి.
  5. కింద తెలిపిన విధంగా మొబైల్ యాప్ లొ చేయాలి.

గ్రామ లేదా వార్డు వాలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలో వారందరికీ కూడా సర్వే చేయవలసి ఉంటుంది. సర్వేను GSWS Volunteer అనే మొబైల్ అప్లికేషన్ లొ చేయాలి. కొత్తగా యాప్ అప్డేట్ అవ్వటం జరిగింది.

Download App

ముందుగా హోం పేజీలో ఆరోగ్య సురక్ష అని ఆప్షన్ పై టిక్ చేయాలి. మొదటిసారి క్యాంపు రోజుకు గ్రామాల్లో 20 రోజుల ముందున, పట్టణ ప్రాంతంలో 15 రోజుల ముందు సర్వేను మొదలు పెట్టాలి. మొదటిసారి చేయువారు "మొదటి విడత" అనే ఆప్షన్ను ఎంచుకోవాలి.



వెంటనే వాలంటరీ క్లస్టర్ పరిధిలో ఉన్న కుటుంబ వివరాలు అన్నీ కూడా చూపిస్తుంది అందులో కుటుంబ పెద్ద పేరు, కుటుంబ హౌస్ మ్యాపింగ్ ఐడి , అడ్రస్సు మరియు ప్రస్తుత స్టేటస్ చూపిస్తుంది. Status - Pending ఉన్నవారికి సర్వే చేయాలి, Completed అని ఉంటే పూర్తి అయినట్టు.


:: రౌండ్ - 1 సర్వే ::

రౌండ్ - 1 సర్వే లొ కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూపిన 4 ప్రశ్నలు అడుగుతుంది

ప్రశ్న 1 : గత సంవత్సరంలో మీరు లేదా మీ కుటుంబం నుంచి ఎవరైనా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఏదైనా పయో్ర జనము పోందారా?

సమాధానం : అవును / కాదు

పై ప్రశ్నకు సమాధానం కాదు అయితే వెంటనే కింద ప్రశ్న అడుగుతుంది అవును అయితే రెండవ ప్రశ్నకు వెళ్తుంది.

ప్రశ్న 1.a : మీకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం మరియు ఈ పథకం యొక్క పయో్ర జనాలు గురించి అవగాహన ఉందా ?

సమాధానం : అవును / కాదు

ప్రశ్న 2 : పజ్రలందరికీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం జగనన్న పభ్రుత్వం అందిస్తున్న అనేక సేవలు ఇవి.

వీటిలో మీరు ఏ సేవలను వినియోగించుకున్నారు?

  • ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్య చికిత్స
  • కోవిడ్ - 19 చికిత్స
  • ఉచితంగా వైద్యు ల సంపద్రింపులు
  • రోగ నిర్ధారణ కోసం నగదు రహిత పరీక్షలు
  • ఉచిత మందులు
  • 108 అంబులెన్స్ సేవలు
  • 104 మొబైల్ క్లీనిక్ సేవలు
  • ఫ్యా మిలీ డాక్టర్ సేవలు
  • ఆరోగ్య ఆసరా
  • డాక్టర్ వైఎస్ఆర్ కంటివెలుగు
  • వైఎస్ఆర్ సంపూర్ణపోషణ/పోషణ
  • ఇతరములు


ప్రశ్న 3 : మీ మొబైల్ ఫోన్ లో ఆరోగ్య శ్రీ సిటిజన్ యాప్ ఉందా?

సమాధానం : అవును / కాదు. ( సమాధానం కాదు అయితే, వారిఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేయడంలో స హాయం

చేయండి)

ప్రశ్న 4 : మీరు మీ సమీపంలోని గ్రామీణ/పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పు డైనా సందర్శించారా?

సమాధానం : అవును / కాదు


సిటిజెన్ నుంచి అన్ని ప్రశ్నలకు సమాధానం తీసుకున్న తర్వాత వాలంటీర్ వారు సంబంధిత ఇంటి నుండి ఎవరో ఒకరి ఈ కేవైసీ ని తీసుకోవాలి. eKYC కు బయోమెట్రిక్ / ఐరిష్ / ఫేస్ /OTP ఆప్షన్ లు ఉంటాయి.


:: రౌండ్ 2 సర్వే ::

రౌండ్ 2 సర్వేకు సంబంధించి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు శిబిరానికి ఏడు రోజుల ముందు సర్వేను చేయవలసి ఉంటుంది. ముందుగా చెప్పుకున్న విధంగా ఆరోగ్య సురక్ష ఆప్షన్లో ఇంటిని సెలెక్ట్ చేసుకున్న తరువాత POST VISIT అనే ఆప్షన్ ఎంచుకోవాలి. సర్వేలో మొత్తం ఐదు ప్రశ్నలు అడుగుతుంది.



ప్రశ్న 1 : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మెడికల్ స్క్రీనింగ్ కోసం ANM లేదా CHO మీ ఇంటికి వచ్చారా ? 

సమాధానం : వచ్చినట్టయితే అవును అని రాకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. 


ప్రశ్న 1.a : మీ ఇంటిలో కింద సభ్యులలో ఎవరైనా ఉన్నారా ?

సమాధానం : ఈ ప్రశ్నకు గాను ఇంటిలో ఉన్నటువంటి అందరి పేర్లు చూపిస్తుంది పక్కనే వారి యొక్క ప్రస్తుత స్థితి అనగా గర్భవతుల / శిశువుల / కౌమార బాలికల / లేదా ఇతరుల అని సెలెక్ట్ చేయాలి. 


ప్రశ్న 2 : ఈ సందర్శన సమయంలో ANM లేదా చూడు మీ ఇంటిలోని వారికి ఎవరైనా రాపిడ్ టెస్ట్ నిర్వహించారా? 

సమాధానం : టెస్టులు చేసినట్టయితే అవును అని టెస్టులు చెయ్యకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి.


ప్రశ్న 3 : మీ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు జరిగే తేదీ మరియు వేదికతో కూడిన టోకెన్ స్లిప్పు మీకు అందిందా ? 

సమాధానం : అందినట్లయితే అవునా అని అందకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. 


ప్రశ్న 4 : జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుకు వస్తున్న సీనియర్ డాక్టర్ని కలవడానికి మీ టైం స్లాట్ తెలుసా ?

సమాధానం : తెలిసినట్లయితే అవును అని తెలియకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. 


ప్రశ్న 5 : అవసరమైన సర్టిఫికెట్లు మరియు పత్రాలు నిర్ధారించడానికి మీరు గతంలో నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపుకు హాజరయ్యారా ? 

సమాధానం : హాజరు అయితే అవును అని అవ్వకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి.


పై ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చిన తరువాత సంబంధిత ఇంటికి సంబంధించి ఎవరిదైనా ఈ కేవైసీను తీసుకోవాలి. ఇంతటితో వాలంటీర్లకు సంబంధించి మొబైల్ అప్లికేషన్ లో పని పూర్తి అయినట్టు. 


సర్వే రిపోర్ట్ లింక్  👇

Click Here