Aadhaar Card Download , Signature Validation &Unlock Process
ఆధార్ - మొబైల్ లింక్ ఉంటె :
- ఆధార్ కార్డును రూపాయి ఛార్జ్ లేకుండా ఆనులైనులో మీకు మీరుగా మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి గాను ఆధార్ కార్డు నెంబరు మరియు ఆధార్ కార్డుకి ఫోను నెంబరు లింక్ అయి ఉండాలి.
ఆధార్ - మొబైల్ లింక్ లేక పోతే (లేట్ ప్రాసెస్):
- ఆధార్ కార్డుకు ఫోను నెంబరు లింకు లేకపోతే మీకు సమయం ఉన్నట్లయితే ఆధార సేవా కేంద్రంలో ఆధార్ కార్డుకు ఫోను నెంబరు లింకు చేసుకున్న తరువాత ఆధార్ కార్డును ఇప్పుడు చెప్పబోయే విధానంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్ - మొబైల్ లింక్ లేక పోతే (వెంటనే):
- అలా కాకుండా ఆధార్ కార్డుకి ఫోను నెంబరు లింకు లేకుండా వెంటనే ఆధార్ కార్డు కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్లి, మీ ఆధార్ నెంబరు మరియు మీ వేలిముద్రలు వేసి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్ నెంబర్ లేదు , నెంబర్ లింక్ లేదు :
- ఆధార్ కార్డు నెంబరు లేకుండా కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు చేసిన సమయంలో రసీదుపై ఉండే నమోదు ఐడి (EID) ద్వారా ఆధార్ PVC కార్డు ఆర్డర్ పెట్టుకుంటే మొబైల్ నెంబరు లింకు మరియు ఆధారు నెంబరు లేకుండా కొన్ని రోజుల్లోనే పోస్ట్ ద్వారా ఇంటికి కార్డు వస్తుంది.
- Retrieve EID / Aadhaar Number అనే ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నెంబర్ లేదా Enrolment ID ను తెలుసుకోవచ్చు. దానికి గాను మీరు ఆధార్ చేసినప్పుడు / ఆధార్ లొ ఉన్న పూర్తి పేరు, మొబైల్ నెంబర్ లేదా Email ఐడి ఉండాలి. ఆధార్ - మొబైల్ OTP అవసరం ఉంటుంది. ఆధార్ నెంబర్ లేదా Enrolment ID మొబైల్ కు మెసేజ్ రూపం లో వస్తుంది. వచ్చాక క కింద తెలిపిన విధంగా ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పై ఆధార్ సేవల ఛార్జ్ లు :
- మీ మొబైల్ లొ ఆధార్ డౌన్లోడ్ కు : ₹0/- (ఉచితం)
- ఆధార్ సెంటర్ లొ వేలి ముద్రల ద్వారా ఆధార్ డౌన్లోడ్ కు : ₹30/-
- ఆధార్ సెంటర్ లొ ఆధార్ - మొబైల్ లింక్ కు : 50/-
- ఆధార్ PVC కార్డు ఆర్డర్ కు : 50/-
Aadhaar Card Download Process
ఆధార్ కార్డు డౌన్లోడ్ విధానము
ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చెయ్యండి
Enter Aadar Number వద్ద మీ 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 28 అంకెల Enrolment ID నెంబర్ (బాల ఆధార్ వారికీ , కొత్తగా ఆధార్ చేసుకున్న వారికీ) లేదా 16 అంకెల Virtual ID ను ఎంటర్ చేయండి.
![]() |
Enrolment ID |
![]() |
Aadhaar Number |
![]() |
Virtual ID |
తరువాత Send OTP పై క్లిక్ చెయ్యండి. ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది. ఆధార్ కు ఏ నెంబర్ లింక్ అయ్యిందో తెలుసుకోండి - Click Here
![]() |
Aadhaar OTP |
Enter OTP వద్ద ఆ OTP ను ఎంటర్ చేయండి.Verify & Download పై క్లిక్ చేయండి.
ఆధార్ కార్డు PDF File గా డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేస్తే Password అడుగుతుంది. Password అనేది 8 డిజిట్ లుగా ఉంటుంది. ఆధార్ కార్డు ప్రకారం మీ పేరు లొ మొదటి నాలుగు లెటర్ లు కాపిటల్ లొ, మీ పుట్టిన సంవత్సరం కలిపి Password గా ఉంటుంది.
ఉదా. ఆధార్ కార్డు లొ పేరు Anish Y Kumar అని పుట్టిన సంవత్సరం ఆధార్ ప్రకారం 1989 అయితే అప్పుడు పాస్వర్డ్ ANIS1989 అవుతుంది.
ఆధార్ Signature Verify చేయు విధానము
ఆధార్ ఓపెన్ చేసాక Signature Not Verified అని చూపిస్తుంది.
దానిని Verified గా మార్చాలి అనుకుంటే ముందుగా ఆధార్ ను Adobe Acrobat ద్వారా ఓపెన్ చేయాలి. మొబైల్ అయితే Adobe యాప్ లొ ఓపెన్ చేయాలి.
Password అడుగుతుంది. ముందు చెప్పినట్టు Password ఎంటర్ చేయండి.
కింద చూపిన విధంగా గా Signature Symbol పై క్లిక్ చేసి Validate All పై క్లిక్ చేస్తే Signature Valid కు మారితుంది.అప్పుడు ప్రింట్ లేదా Save చేసుకోండి. మరీ Signature Not Verified ఉండదు.
Aadar Card Lock తీసువేయు విధానము
ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చెయ్యండి..
Select PDF File పై క్లిక్ చేయండి. ఆధార్ కార్డు ను సెలెక్ట్ చేయండి.
Unlock PDF పై క్లిక్ చేయండి.
ముందు గా చెప్పిన పాస్వర్డ్ ను ఎంటర్ చేసి Send పై క్లిక్ చేయండి.
Download Unlocked PDFs పై క్లిక్ చేస్తే పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఇక Password అడగదు.
ఆధార్ సంబందించిన సేవలు - Click Here
9909734962
ReplyDelete989882204012
ReplyDeletepaletiNarasimhaRao@1976gmail.com
ReplyDelete