GSWS Volunteers Salary Process in HERB Portal
ఇదివరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్ల గౌరవ భృతి రూ.5000/- (+200/- పేపర్ బిల్) నేరుగా సంబంధిత DDO CFMS లాగిన్ లో గల BLM టైల్ లోకి వచ్చేవి.దానిని ఎటువంటి మార్పులు చేయలేని పరిస్థితి ఉండేది. అంటే ఎవరైనా వాలంటీర్ సెలవు పై వెళ్లిన లేదా గైర్హాజరైనటు వంటి వారి జీతాలు తగ్గించడానికి అవకాశం ఉండేది కాదు.
మే నెల,2023 నుండి వారివి కూడా రెగ్యులర్ ఉద్యోగస్తుల మాదిరిగానే బిల్లు తయారు చేసుకునే అవకాశాన్ని హెర్బ్ పోర్టల్ నందు కొత్తగా ఇచ్చారు.
ఇప్పుడు వాలంటీర్ జీతాల బిల్లు ఏ విధంగా ప్రాసెస్ చెయ్యాలి ,ఏ విధంగా అమౌంట్ ను తగ్గించాలి STEP BY STEP వివరించడం జరుగుతుంది.
Step 1 : ముందుగా Payroll HERB పోర్టల్ క్లిక్ చేసి DDO వారి CFMS ID మరియు హెర్బల్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
Step 2 : లాగిన్ అయ్యాక పైన HR & PAY ROLL పై క్లిక్ చేయండి. అప్పుడు దిగువున కనపడుతున్న "PAY BILL SUBMISSION" నందు గల "VOLUNTEER PAY BILL SUBMISSION" పై క్లిక్ చేయండి
Step 3 : అప్పుడు ఓపెన్ అయ్యే పేజీలో మీరు ఏ పంచాయతీ వాలంటీర్ల బిల్లు పెట్టాలనుకుంటున్నారో ఆ పంచాయతీ డిడిఓ కోడ్ (DDO CODE) ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత హెడ్ ఆఫ్ ఎకౌంటు(HOA) ఒక్కటే ఉంటుంది దాన్ని కూడా సెలెక్ట్ చేసి "Get Data" బటన్ పై క్లిక్ చేయండి.
Step 4 : అప్పుడు ఆ పంచాయతీకి సంబంధించిన వాలంటీర్ల డేటా మొత్తం ఓపెన్ అవుతుంది. మీరు ఎవరైనా వాలంటీర్ యొక్క జీతాన్ని కొన్ని రోజులు తగ్గించాలి. అని అనుకున్న యెడల వారి పేరు చివరన గల "Action " అనే ఆప్షన్ అనగా కంటి ( 👁) గుర్తుపై క్లిక్ చేయండి
Step 5 : అప్పుడు కనిపిస్తున్న స్క్రీన్ లో "No.of Working Days" అనే డ్రాప్ డౌన్ లిస్ట్ పై క్లిక్ చేసి మీరు ఆ వాలంటీర్ కు ఎన్ని రోజులు జీతం పెట్టాలి అని అనుకుంటున్నారో అన్ని రోజులు ఎంపిక చేసుకోండి. తరువాత "Refresh Pay Bills" పై క్లిక్ చెయ్యగానే సక్సెస్ మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది దానిపై ఒకే చేయగానే ఆ వాలంటీర్ కి ఎన్ని రోజులైతే తగ్గించాలనుకుంటున్నారు అన్ని రోజులు తగ్గి జీతం కనిపిస్తుంది. తదుపరి Back బటన్ పై క్లిక్ చెయ్యండి. అలా ఎంతమంది వాలంటీర్లవి తగ్గించాలి అని అనుకుంటున్నారో అంతమంది తగ్గించుకోవచ్చు.
Step 6 : తదుపరి ఎడమవైపు పైన గల చెక్ బాక్స్ క్లిక్ చేయగానే అంతమందికి ఎంపిక కాబడతాయి. తరువాత దిగువున గల "Save& Next" పై క్లిక్ చెయ్యండి.
Step 7 : తదుపరి ఓపెన్ అయిన పేజీలో మీద బాగానే
- Form 47,
- Form47 Summary,
- Flyleaf,
- Variation
ఆప్షన్ ల పై క్లిక్ చేసి ఆ ఫార్మ్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీయాలి. దానిపై డిడిఓ సంతకాలు, స్టాంప్ వేసి సిద్ధంగా ఉంచుకోవాలి
Step 8 : తదుపరి దాని దిగున గల "Pay Roll Rules" నందు గల చెక్ బాక్స్ లు నందు అవసరమగు వాటిని క్లిక్ చెయ్యండి
Step 9 : చివరగా E Sign Confirmation (OTP Through) లేదా Biometric Confirmation చెయ్యాలి. (రెగ్యులర్ జీతాలు పెట్టిన మాదిరిగానే). అప్పుడు CFMS LOGIN లో BLM కి బిల్స్ రావడం జరుగుతుంది. యధావిధిగా BLM లో HERB పోర్టల్ నందు డౌన్ లోడ్ చేసిన డాక్యుమెంట్స్ తో పాటు డ్యూటీ సర్టిఫికెట్ అప్లోడ్ చేసి బిల్స్ ట్రెజరీకి పంపించాలి.
వాలంటీర్ల నెలవారీ హాజరు రిపోర్ట్