Ayushman Bharat Cards eKYC Process Ayushman Bharat Cards eKYC Process

Ayushman Bharat Cards eKYC Process

Ayushman Bharat Cards eKYC Process

PMJAY eKYC - E-KYC and Download the Ayushman Card by GSWS Volunteers

రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్ - Dr. వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు పై నమోదు చేసి కార్డులను పంపిణీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలను మరియు అర్బన్ వార్డులను ఆయుష్మాన్ గ్రామపంచాయతీలుగా మరియు ఆయుష్మాన్ అర్బన్ వార్డులుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వ హెల్త్ డిపార్ట్మెంట్ వారు విధి విధానాలు ఖరారు చేసి ఉన్నారు.

ఒక లక్ష 94 వేల కుటుంబాలకు గాను ప్రస్తుతానికి 1,31 వేల కుటుంబాలు ఈ కార్డులకు నమోదు చేసుకోవడం జరిగినది. మిగిలిన 63 లక్షల లబ్ధిదారులకు నమోదు ఇంకను చేయవలసి ఉంది. ముందుగా నమోదు చేసిన వారి యొక్క కార్డులను డిస్ట్రిబ్యూషన్ చేయుటకు మరియు నమోదు పూర్తి చేయుటకు గాను 15 రోజుల మెగా డ్రైవ్ ను 2023 తేదీ అక్టోబర్ 16 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగును.


eKYC మరియు కార్డు డౌన్లోడ్ విధానం (వీడియో) :


ఆయుష్మాన్ యాప్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?

ఆయుష్మాన్ యాప్ ను కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

Download Mobile App


అసలు ఆయుష్మాన్ యాప్ అంటే ఏమిటి ?

ఆయుష్మాన్ భారత్ PMJAY పథకానికి సంబంధించి అన్ని అప్డేట్లను, సేవలను ఒకే చోట పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అప్లికేషను రూపొందించడం జరిగినది.  

ఆయుష్మాన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా

  • ఆయుష్మాన్ భారత్ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల లబ్ధిదారుల ఈకేవైసీను చేసుకోవచ్చు.
  • కొత్తగా PMJAY పథకం కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
  • వెరిఫై అవ్వని ఆపరేటర్ eKYC చేయవచ్చు
  • హెల్త్ బెనిఫిట్స్ అప్డేట్లను చూసుకోవచ్చు
  • PMJAY కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు
  • లబ్ధిదారుల కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయవచ్చు.
  • ముందుగా కార్డు ఉన్నట్టయితే కొత్త కుటుంబ సభ్యులను ఆడ్ చేయవచ్చు.


ఆయుష్మాన్ యాప్ ను ఎవరు ఉపయోగించవచ్చు ?

ఆయుష్మాన్ యాప్ లో మొత్తం రెండు లాగిన్లు ఉంటాయి. మొదటిది లబ్ధిదారులకు రెండవది ఆపరేటర్ వారికి ఉంటుంది. మొబైల్ యాప్ లో ఎవరికీ ఏ ఆప్షన్ లో ఉంటాయో చుడండి 

లబ్ధిదారులు :

  • సెర్చ్
  • eKYC
  • లింక్ ఆధార్
  • కుటుంబ సభ్యున్ని జోడించడం 
  • ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్  


ఆపరేటర్ (గ్రామా వార్డు వాలంటీర్లు) : 

  • సెర్చ్
  • eKYC
  • లింక్ ఆధార్
  • కుటుంబ సభ్యున్ని జోడించడం 
  • ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్ 
  • కార్డు డెలివరీ అప్డేట్


వాలంటీర్లు eKYC ఎలా తీసుకోవాలి ?

Step 1 : వాలంటీర్లు ముందుగా పైన ఇవ్వబడిన మొబైల్ అప్లికేషన్ను మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలి.

Step 2 : మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత Select Language వద్ద భాష ను ఎంచుకొని Login పై క్లిక్ చేయాలి.

Login As వద్ద Operator అని సెలెక్ట్ చేసి Register Mobile No / User ID వద్ద వాలంటీర్ మొబైల్ నెంబర్ Auth Mode వద్ద Password / Mobile OTP / Aadhaar OTP లో ఒకటి సెలెక్ట్ చేసి OTP అయితే ఓటిపి ఎంటర్ చేయాలి లేదా పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ ఎంటర్ చేసి కాప్చ కోడు ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.

Step 3 : వాలంటీర్ యొక్క ఈ కేవైసీ పెండింగ్ ఉన్నట్టయితే ముందుగా ఈకేవైసీను పూర్తి చేసుకోవాలి.

దానికిగాను లాగిన్ అయిన వెంటనే Complete eKYC వద్ద Auth Mode వద్ద Aadhaar OTP అని సెలెక్ట్ చేసి 6 అంకెల OTP ఎంటర్ చేసి Proceed పై క్లిక్ చేయాలి. Consent చదివి Tick చేసి Allow పై క్లిక్ చేయాలి. eKYC వివరాలు అన్నీ సరిచూసుకొని Proceed పై క్లిక్ చేస్తే eKYC పూర్తి అయినట్టు. ఈ కేవైసీ ముందుగా పూర్తి అయినట్టయితే పై విధంగా చేయనవసరం లేదు. 

Step 4 : కార్డుల eKYC చేయుటకు గాను వాలంటీరు లాగిన్ అయిన వెంటనే search beneficiary పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లబ్ధిదారుని రాష్ట్రము, జిల్లా, ఆధార్ నెంబరు వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.

Step 5 : సెర్చ్ వివరాలు అనుగుణంగా లిస్టు చూపిస్తుంది.

అందులో లబ్ధిదారుని పేరుపై క్లిక్ చేసి Aadhaar OTP / Finger Print / IRISH Scan / Face Auth ద్వారా eKYC చేయాలి. ఆధారు నెంబరు పక్కన ఉండే Verify ఆప్షన్ పై క్లిక్ చేసి OTP ఎంటర్ చేసి, లబ్ధిదారుని ఫోటో తీసుకొని, ఈ కేవైసీ వివరాలు సరి చూసుకున్న తరువాత, additional information వివరాలు అనగా ఫోన్ నెంబరు ఉందా లేదా, ఉంటే మొబైల్ నెంబరు, మొబైల్ నెంబరు వెరిఫికేషన్ ఓటిపి ద్వారా, బంధుత్వము, పిన్కోడు, రాష్ట్రము, జిల్లా, గ్రామము లేదా పట్టణము వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

Step 6 : సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఆమోదం పొందితే "Download Card" ఆప్షన్ ద్వారా కార్డును పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

User Manual :



GSWS Helper WhatsApp Channel


ఆయుష్మాన్ భారత్ eKYC రిపోర్ట్ : 

PMJAY Ayushman Bharat eKYC Report :

Step 1 : మొదట లింక్ ఓపెన్ చేయాలి .
Click Here
Step 2 : CARD-DRIVE అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Login పై క్లిక్ చెయ్యకూడదు.

Step 3 : eKYC RECEIVED REPORT - STATE WISE ను ఎంచుకొని అవసరం అనుగుణంగా Today / Yesterday / Weekly / Last 30 Days ను ఎంచుకోవాలి. ఇక్కడ Last 30 Days ఎంచుకోవాలి.

Step 4 : State గా Andhra Pradesh ను ఎంచుకోవాలి.
District సెలెక్ట్ చేసుకోవాలి.

Step 5 : అప్పుడు User ID & Password అడుగుతుంది.
User ID : 28stateuser
Password : APstateuser@28 ఎంటర్ చేయాలి.
or 
User ID : apsha
Password apsha#4321ఎంటర్ చేయాలి.
Step 6 : మండలం సెలెక్ట్ చేసుకున్న వెంటనే మండల పరిధిలో Operator గా నమోదు అయిన వాలంటీర్ల పేర్లు వస్తాయి. eKYC Mode / Authentication Mode లో Requested
Approved, Rejected, Pending, Delivered, OTP Finger, Iris,Face లిస్ట్ లు వస్తాయి. మండలం పేరు సెలెక్ట్ చేసుకున్న తరువాత డౌన్లోడ్ బటన్ ⬇️ పై క్లిక్ చేస్తే Excel డౌన్లోడ్ అవుతుంది.


ఆయుష్మాన్ భారత్ కార్డుల eKYC చేయు సమయం లో వాలంటీర్ కు కొత్త లాగిన్ క్రియేట్ చెయ్యటం మరియు ఉన్న మొబైల్ నెంబర్ అప్డేట్ చేయు విధానం :

కొత్త లాగిన్ క్రియేట్ చెయ్యటం : 

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Click Here
Step 2 : SIGN UP పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Number వద్ద వాలంటీర్ వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి E-KYC Mode వద్ద Aadhaar OTP / Fingerprint లో Aadhaar OTP సెలెక్ట్ చేసాక ఆధార్ కు లింక్ అయ్యే మొబైల్ కు వచ్చే OTP ను ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చెయ్యాలి.

Step 3 : Personal Information పేజీ లో పేరు, జెండర్, వయసు, చిరునామా ఎంటర్ చేసాక Email ID మరియు మొబైల్ నెంబర్ లకు OTP వస్తాయి వాటిని ఎంటర్ చేసి SUBMIT చేయాలి.

Step 4 : Role Details ఓపెన్ అవుతాయి. అందులో
  • Parent Entity - SHA AP
  • Entity Type - Division
  • Entity Name - IT
  • User Role - Operator - BIS
  • Application - BIS
అని ఎంటర్ చేయాలి.

Step 5 : తరువాత User Name - మీకు నచ్చినది ,Password మరియు Confirm Password వద్ద గొప్యంగా ఉండే పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి Submit పై క్లిక్ చెయ్యండి. తరువాత Submit చేసాక Account Created అని మెసేజ్ వస్తుంది. OK పై క్లిక్ చేయాలి. 

మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే విధానం : 

Step 1 : కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.
Click Here

Step 2 : Registered Mobile Number / User ID వద్ద మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేస్తే అప్పుడు Authentication Mode లో Mobile OTP / Aadhaar OTP / Password అనే ఆప్షన్ లలో Mobile OTP లేదా Aadhaar OTP లో ఒకటి సెలెక్ట్ చేసి OTP ఎంటర్ చేసి Captcha Code ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.

Step 3 : వాలంటీర్ డాష్ బోర్డు చూపిస్తుంది. అందులో ప్రొఫైల్ వివరాలు,లాగ్, ఎప్పుడు లాగిన్ అయ్యారు అనే వివరాలు ఉంటాయి.

Step 4 : కుడివైపు చివరన కనిపిస్తున్న వాలంటీర్ పేరుపై క్లిక్ చేస్తే అందులో డ్రాప్ డౌన్ లో Update Details ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబరు,ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీను ఎంటర్ చేసి మిగతా వివరాలు నమోదు చేసి ఫైనల్ సబ్మిట్ చేస్తే మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది.

కొత్త లాగిన్ నమోదు చెయ్యటం మరియు మొబైల్ నెంబర్ చెయ్యటం User Manual : 


Post a Comment

0 Comments