YSR Rythu Bharosa Payment Status YSR Rythu Bharosa Payment Status

YSR Rythu Bharosa Payment Status


YSR Rythu Bharosa Payment Status

వైస్సార్ రైతు భరోసా లేటెస్ట్ న్యూస్ - ysr rythu bharosa latest updates :

  • తేదీ 07.11.2023 న ఉదయం 9-00 గం॥ లకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి. శ్రీ వై. యస్. జగన్ మోహన్ రెడ్డి గారు రైతు భరోసా / పి.యం కిసాన్ 2వ విడత DBT ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నందు విడుదల చేయడం జరుగుతుంది.
  • రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ప్రతి ఏడాది రైతు భరోసా ద్వారా 7500 మరియు పిఎం కిసాన్ ద్వారా 6000 రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. 
  • ఇందులో భాగంగా ప్రతి ఏడాది మే నెలలో అక్టోబర్ నెలలో మరియు జనవరి నెలలో ఈ అమౌంట్ ని ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది. 
  • తాజాగా అక్టోబర్ నెలకి సంబంధించి విడుదల కావలసి ఉన్నటువంటి నాలుగు వేల రూపాయలు అనగా కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 మరియు రాష్ట్ర ప్రభుత్వ వాటా 2 వేల రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను నవంబర్ 7న జమ చేయనున్నట్లు ప్రకటించింది.
  • వైఎస్సార్ రైతు భరోసా పథకం 2023-24 సంబంధించి క్రొత్తగా అప్లై చేసుకోవడానికి తేదీ 12-09-2033 నుండి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
  • ఏటా 3 విడతల్లో రూ. 13,500.ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500, అక్టోబర్/నవంబర్ నెల ముగిసేలోపే ఖరీఫ్ పంట కోత సమయం. రజీ అవసరాల కోసం రూ.4,000, పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి/ఫిబ్రవరి నెలలో రూ. 2,000.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఆర్థికంగా భరోసాన్ని కల్పించే ఉద్దేశంతో ప్రారంభించబడిన పథకమే రైతు భరోసా పథకం ( YSR Rythu Bharosa scheme ). ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి రైతుకు పిఎం కిసాన్ ( PM Kisan ) తో కలిపి ప్రతి సంవత్సరం రూ. 13,500 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రైతులు వైయస్సార్ రైతు భరోసా ( YSR Rythu Bharosa scheme ) పథకాన్ని పొందుతున్నారు.



YSR Rythu Bharosa scheme :

పథకం పేరు వైస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ 
ప్రారంభించినదిరాష్ట్ర - కేంద్ర ప్రభుత్వం  
ప్రారంభం2019 అక్టోబర్ 15
లబ్దిదారులు రైతులు , కౌలు రైతులు   
దరఖాస్తు విధానంగ్రామా వార్డు సచివాలయాలు ద్వారా 
దరఖాస్తు మొదలు ప్రభుత్వం నిర్ణయించిన తేదీల్లో   
ప్రయోజనాలు రూ.13,500
దరఖాస్తు ఫీజుఉచితం
అధికారిక వెబ్సైట్www.ysrrythubharosa.ap.gov.in 


వైయస్సార్ రైతు భరోసా ( YSR Rythu Bharosa scheme ) /PM Kisan పథకం వివరాలు:

  • రైతు భరోసా ( YSR Rythu Bharosa scheme ) పథకాన్ని 2019 జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రైతుల కోసం ప్రారంభించబడిన సంక్షేమ పథకం. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది.
  • ఈ పథకం ప్రస్తుత ప్రభుత్వం జూలై 2019 లో విజయవంతంగా ప్రారంభించింది. మొదటిసారిగా దీనిని 2019 అక్టోబర్ 15 న అమలు చేయడం జరిగింది.
  • ( YSR Rythu Bharosa scheme ) పథకం ద్వారా రూ. 13,500 రైతులకు వార్షిక ప్రాతిపదికన చెల్లించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 7500 ను మరియు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద 6000 కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
  • వీటితో పాటు, అర్హతగల రైతులకు ఉచిత బోర్వెల్లు మరియు జీరో వడ్డీ రుణాలు కూడా ఈ పథకం కల్పిస్తుంది..
  • ఈ పథకం కింద సహాయం చేసే మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. వైయస్ఆర్ రైతు భరోసా పథకం ( YSR Rythu Bharosa scheme ) రాష్ట్ర స్థాయి సంక్షేమ పథకం మరియు అర్హత ఉన్న రైతులు సున్నా వడ్డీ రుణాలు పొందగలిగే అర్హులైన రైతులను ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తుంది...
  • కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కౌలు రైతులు ఈ పథకం కింద సంవత్సరానికి 2500 రూపాయలు పొందుతారు.
  • రైతులకు ఉచిత బోర్వెల్ సౌకర్యాలు, రోజులో తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ కల్పన, రాష్ట్రాలలో కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటు ఈ పథకం లో భాగం, అయితే రైతులకు చెందిన ట్రాక్టర్ల రహదారి పన్నును ఈ పథకం కింద కొనసాగించరు.
  • వ్యవసాయం పైన ఆధారపడినవారికి జీవిత బీమా సౌకర్యం కూడా ఇవ్వబడుతుంది, ఇది రూ.5 లక్షలు. అలాగే, ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుంది. పాల డెయిరీలు తిరిగి తెరవబడతాయి మరియు పెండింగ్లో ఉన్న అనేక నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తవుతాయి.


వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్  ( YSR Rythu Bharosa scheme - PM Kisan ) అర్హుల జాబితా ఎలా తెలుసుకోవాలి ?

Step 1 : కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి. 

rythu bharosa pm kisan list

Step 2 : మీయొక్క రాష్ట్రము జిల్లా మండలము గ్రామాన్ని ఎంచుకొని Get Report పై క్లిక్ చేయండి. 


Step 3 : Farmer Name వద్ద మీ పేరు ఉన్నట్టు అయితే వాటికీ PM Kisan నగదు జమ అవుతుంది.



వైయస్సార్ రైతు భరోసా ( YSR Rythu Bharosa scheme ) పథకంలో ఏ విధంగా చేరాలి ?

వైయస్సార్ రైతు భరోసా పథకంలో రైతులు సులభంగా చేరవచ్చు. పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు వైయస్సార్ రైతు భరోసా కింద లబ్ధిని పొందవచ్చు. దీనికిగాను రైతు పేరు మీద, రైతు కవులు చేస్తున్నట్టయితే కౌలుదారునిగా గుర్తింపు ఉన్నట్టయితే అర్హులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు వారికి దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


రైతు భరోసా ( YSR Rythu Bharosa scheme ) పథకానికి అర్హతలు ఏమిటి ?

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో అతను 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.
  • రైతులు లేదా కవులు రైతులు ఈ పథకానికి అర్హులు.


రైతు భరోసా ( YSR Rythu Bharosa scheme ) పథకానికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ?

రైతు భరోసా పథకానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఆనులైన్లో ఎటువంటి వెబ్సైట్ ఉండదు. ప్రభుత్వం కాలానుసారం విడుదల చేసే టైం లైన్ ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంటుంది ఆ సమయంలో సంబంధిత రైతు భరోసా ద్వారా దరఖాస్తులను సబ్మిట్ చేయవలసి ఉంటుంది.


వైయస్సార్ రైతు భరోసా ( YSR Rythu Bharosa scheme ) దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ?

  • భూమికి సంబంధించి పట్టా /హక్కుదారి పత్రం 
  • ఆధార్ కార్డు
  • బ్యాంకు పాసు బుక్
  • రేషన్ లేదా రైస్ కార్డు 


( YSR Rythu Bharosa scheme ) ప్రతి సంవత్సరం ఎంత నగదు వస్తుంది ?

వైయస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు రూపాయి 13500 అందిస్తుంది ఈ నగదు ఒకేసారి రావు . మూడు విడతల రూపంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. ఇదే పథకాన్ని వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం అని కూడా పిలుస్తారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నగదుతో కలిపి రైతు భరోసా డబ్బులు లభిస్తాయి కనుక.


( YSR Rythu Bharosa scheme ) రాష్ట్ర ప్రభుత్వం ఎంత నగదు అందిస్తుంది ?

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అనే పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 అందిస్తుంది. ఈ డబ్బును మూడు విడతల రూపంలో రైతుల బ్యాంకు ఎకౌంట్లోకి ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా జమ అవుతుంది. రూ.2000 చొప్పున మూడు విడతల్లో రూ.6000 రైతులకు అందుతుందన్నమాట. ఈ డబ్బులకు అదనంగా ఏపీ ప్రభుత్వం ₹7,500 అందిస్తుంది మొత్తం ₹13,500 రైతులకు లబ్ధి చేకూరుతుంది.


వైయస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి ?( YSR Rythu Bharosa scheme payment status) 

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి

rythu bharosa payment status

Step 2 : Know Your Status ఆప్షన్ పై క్లిక్ చేయాలి అందులో Know ypur rythu bharosa status (2023-24) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3 :దరఖాస్తుదారుని ఆధార నెంబర్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి

Step 4 : చివరగా 

  1. దరఖాస్తు దారిని పేరు 
  2. పేమెంట్ స్టేటస్ 
  3. ఏ బ్యాంకులో నగదు జమ అయిందో ఆ బ్యాంకు పేరు 
  4. ఎకౌంట్ నెంబరు చివరి ఆరు నెంబర్లు 
  5. ఎంత నగదు జమయిందో నగదు 

చూపిస్తుంది.

Hon'ble  CM will be releasing financial assistance to farmers  under "YSR Rythu Bharosa - PM Kisan" Video 



Post a Comment

0 Comments