Death Certificate Upload Process in Bima Portal Death Certificate Upload Process in Bima Portal

Death Certificate Upload Process in Bima Portal

Death Certificate Upload Process in Bima Portal

YSR Bima Death Certificate Upload Process By Panchayat Secretary

వైయస్సార్ భీమా పథకానికి సంబంధించి క్లైమ్ చేయు సమయంలో మరణ ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయుట ఆలస్యం అవుతున్న కారణంగా కొందరికి భీమా నగదు చెల్లింపు ఆలస్యం అవుతుంది. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మరణ ధ్రువీకరణ పత్రము ( డెత్ సర్టిఫికేట్ ) నమోదు చేయువారే డైరెక్ట్ గా వైయస్సార్ బీమా పోర్టల్ లో అప్లోడ్ చేయవలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం జరిగినది. మరణము గ్రామపంచాయతీలో సంభవిస్తే పంచాయతీ కార్యదర్శి అదే ఆసుపత్రిలో సంభవిస్తే మెడికల్ ఆఫీసర్ వారు మరణమును నమోదు చేసి సర్టిఫికెట్ను వైయస్సార్ భీమా పోర్టల్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది.


వైస్సార్ బీమా పథకం వలన ఉపయోగం ఏమిటి ?

కుటుంబంలో ప్రాథమికంగా సంపాదిస్తున్న వ్యక్తి అటాస్మాత్తుగా మరణించినట్లయితే లేదా వికలాంగులుగా మారినట్టయితే ఆ కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల అందరికీ కూడా వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా నగదు అందిస్తున్న విషయం తెలిసినదే. ఈ పథకానికి లేబర్ డిపార్ట్మెంట్ వారు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడం జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ వారు అమలుపరిచే ఏజెన్సీగా ఉంది. 2023-24 సంవత్సరానికి గాను వైయస్సార్ బీమా పథకం కింద మొత్తం 1,21,73,818 లబ్ధిదారులు నమోదు చేసుకొని ఉన్నారు.


వైయస్సార్ భీమా పథకం కింద వచ్చే లబ్ది ఎంత ?

  • 18-50 సంవత్సరాల మధ్య వయసు కలిగి సాధారణ సంభవిస్తే నేరుగా ప్రభుత్వం ద్వారా ఒక లక్ష రూపాయలు నామినీ కు అందించడం జరుగుతుంది.
  • 18-70 సంవత్సరాల మధ్య వయసు కలిగి ప్రమాదవశాత్తు లేదా శాశ్వత వికలాంగులుగా మారినట్టయితే వారికి అక్షరాల ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందించడం జరుగుతుంది.


వైస్సార్ బీమా 2023-24 వర్తింపు సమయం ఎంత  ?

  • ప్రమాదవశాత్తు మరణానికి సంబంధించి తేదీ జూలై 16 2023 నుండి జూలై 15 2024 వరకు ఉంటుంది.
  • సాధారణ మరణానికి సంబంధించి తేదీ జూలై 1 2023 నుండి జూన్ 30 2024 వరకు ఉంటుంది.


సర్టిఫికెట్ అప్లోడ్ ఎన్ని రోజుల్లో చెయ్యాలి ?

మరణ ధ్రువీకరణ పత్రము అప్లోడ్ కు ఉన్నటువంటి SLA సమయం 21 రోజులు అయినప్పటికి పంచాయతీ కార్యదర్శి లేదా మెడికల్ ఆఫీసర్ వారు మరణ నమోదు అయిన వెంటనే అనగా సాధారణ మరణానికి క్లైమ్ నమోదు తేదీ నుండి మూడు రోజులు (T+3 days ) మరియు ప్రమాదవశాత్తు మరణానికి క్లైమ్ నమోదు రోజు నుంచి ఆరు రోజుల (T+6 Days) లోపు సర్టిఫికెట్లను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

YSR Bima Death Certificate Upload Order Copy pdf :

వైస్సార్ భీమా అధికారిక వెబ్ సైట్ :

Click Here


User ID :

GPS_GP Code 

Default Password :

Gps@98765


ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీ యొక్క పంచాయతీ కోడు 210101 అయితే అప్పుడు User ID GPS_21010 మరియు Password Gps@98765


గ్రామ పంచాయతీ కోడ్ తెలుసుకునే లింక్ /  Know Grama Panchayat Codes  👇   

Click Here