Digital Key Validation Process in AP Seva Portal
గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ కి ఉపయోగించి ఇస్తున్నటువంటి అన్ని సర్వీసుల ఆమోదం కొరకు ఇకనుంచి తప్పనిసరిగా డిజిటల్ కి ధ్రువీకరణ చేయవలసి ఉంటుంది. డిజిటల్ కి ధ్రువీకరణ ఒకసారి చేస్తే సరిపోతుంది ప్రతిసారి చేయవలసిన అవసరం ఉండదు. డిజిటల్ కి ధ్రువీకరణ అనేది డిజిటల్ కీ యొక్క సీరియల్ నెంబర్ ఆధారంగా చేయడం జరుగుతుంది.
డిజిటల్ కి ధ్రువీకరణ ఎవరు చేయాలి?
గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు మరియు వార్డు సచివాలయాల్లోని వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు ఎవరికి అయితే డిజిటల్ కి ఇవ్వడం జరిగిందో వారు మాత్రమే ఈ ధ్రువీకరణ చేయవలసి ఉంటుంది.
డిజిటల్ కి ధ్రువీకరణ చెయ్యకపోతే ఏమవుతుంది ?
డిజిటల్ కి ధ్రువీకరణ చెయ్యకపోతే పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్స్ సెక్రెటరీ వారి ఏపీ సేవా పోర్టల్ లో వివాహ దృవీకరణ లేదా ఇతర సర్టిఫికెట్ల ఆమోదం చేయు సమయంలో సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసే సమయంలో "Incorrect serial number. Please Try Again." అనే మెసేజ్ చూపిస్తుంది. సర్టిఫికెట్ ఆమోదం అవ్వదు. సర్వీసు Beyond SLA లోకి వెళ్లడం జరుగుతుంది.
డిజిటల్ కి ధ్రువీకరణ కొరకు ఏం కావాలి ?
డిజిటల్ కి ధ్రువీకరణ కొరకు తప్పనిసరిగా డిజిటల్ కి ఉన్నటువంటి పెన్ డ్రైవ్ మరియు పంచాయతీ కార్యదర్శి లేదా అడ్మిన్ సెక్రటరీ యొక్క ఏపీ సేవ పోర్టల్ యొక్క లాగిన్ వివరాలు అవసరం ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్లో లేటెస్ట్ వెర్షన్ డిజిటల్ కి సాఫ్ట్వేర్లు Em Bridge మరియు HyperPKI ePass 2003 Install అయి ఉండాలి.
Download Latest embridge - ePass2003 Software's 👇
డిజిటల్ కి ధ్రువీకరణ చేయు విధానము :
Step 1 : ముందుగా పైన తెలిపిన సాఫ్ట్వేర్లు కంప్యూటర్లు డౌన్లోడ్ చేసుకొని రన్ చేసిన తరువాత డిజిటల్ కి పెన్ డ్రైవ్ ను కంప్యూటర్కు ఇన్సర్ట్ చేసి "Digital Key Token Manager - HyperPKI Token Manager for HYP2003" ను ఓపెన్ చెయ్యాలి.
Step 2 : కింద చూపిన విధంగా సీరియల్ నెంబర్ను నోట్ చేసుకోవాలి.
Step 3 : ఏపీ సేవా పోర్టల్ లో లాగిన్ అయిన తరువాత పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్స్ సెక్రటరీ Profile Update ఆప్షన్ ఆప్షన్ పై క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ఫీల్డ్ లో ముందుగా కాపీ చేసుకున్న సీరియల్ నెంబర్ను ఎంటర్ చేసి అప్డేట్ చేయాలి.
Step 4 : అప్డేట్ చేసిన తర్వాత తరువాతి లెవెల్ లో ప్రొఫైల్ ఆమోదం చేయు ఎంపీడీఓ / ఎంసీ వారి ఏపీ సేవ పోర్టల్ లో ప్రొఫైల్ అప్డేట్ రిక్వెస్ట్ ను ఆమోదం చేసిన తర్వాత డిజిటల్ కి ధ్రువీకరణ పూర్తి అవుతుంది. వివిధ సర్టిఫికెట్ల ఆమోదంలో ఇకనుంచి ఎటువంటి సమస్య రాదు.