pm vishwakarma online process telugu
పీఎం విశ్వకర్మ యోజన పథకానికి రాష్ట్రములో ఉన్న అన్ని జిల్లాల వాసులకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవ్వటం జరిగింది .CSC లాగిన్రి లో జిస్ట్రేషన్ చేయు విధానం ఇప్పుడు చూద్దాం
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి లాగిన్ పేజీకి వెళ్తుంది. ప్రస్తుతం లబ్ధిదారుడు లేదా సిటిజెన్ లాగిన్ పని చేయడం లేదు కేవలం CSC లాగిన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
Step 2 : Login అనే ఆప్షన్ పై క్లిక్ చేసి అందులో CSC Login పై క్లిక్ చేయాలి. అందులో CSC - Register Artisans అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : వెంటనే CSC Login Page కి వెళ్తుంది. అందులో User Name, Password & Captcha Code ఎంటర్ చేసి SIGN IN పై క్లిక్ చేయండి.
Step 4 : Register Now పేజీ ఓపెన్ అవుతుంది. అందులో "Is There Any Government Employee Within Your Family?" అనగా కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా ? అనే ప్రశ్న అడుగుతుంది దానికి అవునా / కాదా అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కుటుంబం అనగా భర్త - భార్య మరియు 18 సంవత్సరాలు పూర్తి అయిన వివాహం కానీ పిల్లలు వస్తారు. తరువాత CONTINUE పై క్లిక్ చేయాలి.
Step 5 : తరువాత "Have you availed credit/ loan facility under similar schemes of central government or state government for self-employment/ business development e.g. PMEGP or have outstanding loan under PM SVANidhi or Mudra?" అనే ప్రశ్న అడుగుతుంది దీని అర్థము గతంలో PM SVANidhi లేదా ముద్ర లేదా PMEGP వాటిలో లేదా ఇతర లోన్ తీసుకున్నారా అని అడుగుతుంది. తీసుకున్నట్టయితే YES అని తీసుకోకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. రెండు NO అని సెలెక్ట్ చేస్తే అర్హులు అవుతారు.తరువాత CONTINUE పై క్లిక్ చేయాలి.
Step 6 : తరువాత Aadhaar Verification పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ను మరియు 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి Captcha Code ఎంటర్ చేసి Terms పై టిక్ చేసి Continue పై క్లిక్ చేయాలి.
Step 7 : One Time Password పేజీ ఓపెన్ అవుతుంది దానిలో ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు 6 అంకెల ఓటిపి వస్తుంది ఆ ఓటీపీను ఎంటర్ చేసి Continue పై క్లిక్ చేయాలి.
Step 8 : Aadhaar Verification పేజీ ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబరు చూపిస్తుంది సరిగా ఉన్నట్టయితే Verify Biometric అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Mantra లేదా ఇతర బయోమెట్రిక్ స్కానర్ ద్వారా సిటిజన్ యొక్క బయోమెట్రిక్ పూర్తి చేయాలి.
Step 10 : తరువాత పేజీలో వ్యక్తిగత వివరాలు ఆధార్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. వివాహ స్థితి, కుల వివరాలు, దివ్యాంగుల కాదా, దివ్యాంగులు అయితే దివ్యంగ రకము ఎంచుకోవాలి. Are you doing business in same state? అనే ప్రశ్నకు మీ యొక్క వ్యాపారం మీ యొక్క చిరునామా రెండు ఒకటే రాష్ట్రంలో అయితే YES అని లేకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. Are you doing business in same District ? అనే ప్రశ్నకు మీ యొక్క వ్యాపారం మీ యొక్క చిరునామా రెండు ఒకటే జిల్లాలో అయితే YES అని లేకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. దరఖాస్తుదారుడు మైనారిటీ అయితే YES అని కాకపోతే NO అని సెలెక్ట్ చేయాలి మైనారిటీ అయితే Select Minority లో మైనార్టీ రకమును ఎంచుకోవాలి.
Step 11 : తర్వాత పేజీలో Contact details పేజీ ఓపెన్ అవుతుంది అందులో మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు ఎంటర్ చేసి పాన్ కార్డు నెంబరు ఉన్నట్టయితే ఎంటర్ చేయండి లేకపోతే అవసరం లేదు.
Step 12 : తర్వాత పేజీలో Family details వివరాలు అడుగుతుంది అందులో రేషన్ కార్డు నెంబరు ఉన్నట్టయితే ఎంటర్ చేయండి లేకపోతే అవసరం లేదు. రేషన్ కార్డు ద్వారా వివరాలు రాకపోయినట్టయితే Add Row అనే ఆప్షన్ ద్వారా కుటుంబంలో ఉన్న కుటుంబంలో ఉన్న అందరిని Add చేయాలి పేరు, దరఖాస్తు దారుణతో సంబంధము మరియు వారి ఆధార్ కార్డు నెంబరు Add చేయవలసి ఉంటుంది. అలా కుటుంబంలో ఉన్న అందరి పేర్లు యాడ్ చేయాలి.
Step 13 : తర్వాతే పేజీలో Aadhar address వివరాలు అడుగుతుంది ఆధార్ కార్డులో ఉన్న చిరునామా ప్రకారం ఆటోమేటిక్గా వివరాలు వస్తాయి. Current address మీరు ప్రస్తుతం ఉన్న చిరునామా ఆధార్ కార్డులో ఉన్న చిరునామా ఒకటే అయితే Same as Aadhaar address ఎంచుకోవాలి లేకపోతే Other ను ఎంచుకోవాలి. తరువాత దరఖాస్తుదారుడు గ్రామపంచాయతీలో ఉన్నట్లయితే Do you come under Gram Panchayat ? అనే ప్రశ్నకు Yes అని లేకపోతే NO అని సెలెక్ట్ చెయాలి. చిరునామా సెక్షన్లో జిల్లా ను పాత జిల్లా పేరు ఎంచుకున్నట్లయితే అప్పుడు మాత్రమే బ్లాక్ వివరాలు చూపిస్తుంది లేకపోతే చూపించడం లేదు. ఆ విధంగా బ్లాక్ ను మరియు గ్రామపంచాయతీను సెలెక్ట్ చేసుకోవాలి.
Step 14 : Profession / Trade Details పేజీ ఓపెన్ అవుతుంది అందులో Profession / Trade Name ఎంచుకోవాలి. 18 రకముల చేతి వృత్తులు ఉంటాయి. అందులో దరఖాస్తుదారుని వృత్తి ప్రకారము ఎంచుకోవాలి. Business Address లో Same As Aadhaar Address, Same As Current Address, Other అనే మూడు ఆప్షన్లో ఉంటాయి వృత్తి ఎక్కడ చేస్తున్నారో దానికి అనుగుణంగా మూడు ఆప్షన్లు సెలెక్ట్ చేసుకుని పై క్లిక్ Save చేయాలి.Next పై క్లిక్ చేయాలి
Step 15 : Saving Bank Details పేజీ లో Name Of The Bank, IFSC Code, Name Of The Branch, Account Number వివరాలు ఇవ్వాలి.
Step 16 : Credit Support పేజీ లో Do You Want Credit Support? అంటే ప్రస్తుతం మీకు ఆర్థిక సహాయం కావాలా అని అడుగుతుంది. కావాలి అనుకుంటే Yes అని అవసరం లేదు అనుకుంటే May be later పై టిక్ చేయాలి. Yes పెట్టినట్టయితే ఎంత నగదు కావాలి ? ఏ బ్యాంకులో నగదు జమ అవ్వాలి? లోను దేనికోసం వాడుతారు? అనే వివరాలు అడుగుతుంది. వివరాలన్నీ ఇవ్వవలసి ఉంటుంది.
Note : మొదటి విడతలో ఒక లక్ష రూపాయలు ఐదు శాతం వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది దానిని 18 నెలలలో కట్టవలెను. రెండో విడతలో రెండు లక్షల రూపాయలు ఐదు శాతం వడ్డీకి 30 నెలలలో పేమెంట్ చేయవలసి ఉంటుంది, ఇది కేవలం మొదటి విడత పూర్తి అయిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి అవుతుంది.
Step 17 : Digital Incentive Details పేజీ లో ఫోన్ పే / గూగుల్ పే ఇలా డిజిటల్ పేమెంట్ చేస్తే వారికీ 100/- కి 1/- కమీషన్ ఇవ్వటం జరుగును. దానికి గాను UPI ID ఎంటర్ చేయాలి. లేకపోతే NO అని పెట్టవచ్చు. తరువాత SAVE & NEXT పై క్లిక్ చేయాలి.
Step 18 : తర్వాతే పేజీలో Skill Training, Toolkit, Marketing Support వివరాలు చూపిస్తుంది వాటిపై టిక్ చేసి Save & Next పై క్లిక్ చేయండి.
Step 19 : Declaration Details పేజీ లో అన్ని వివరాలు చదువుకొని Terms & Conditions పై టిక్ చేసి Submit పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోవాలి. తరువాత డాష్ బోర్డు లోకి తీసుకు వెళ్ళటం జరుగుతుంది అందులో అప్లికేషన్ పిడిఎఫ్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా అప్లికేషన్ ఏ స్థాయిలో ఉందో కూడా చూపిస్తుంది.
PM Surya Ghar Muft Bijli Yojana Scheme Details in Telugu
PM Vishwakarma Scheme Registration Process User Manual :
PM Vishwakarma Scheme All Details
సర్పంచుల లాగిన్ సమాచారం - ప్రధానమంత్రి విశ్వశర్మ యోజన సూచనలు :
PM Vishwakarma (ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన) పథకం ద్వారా అన్ని రంగాల వృత్తుల వారికి లబ్ది చేకూర్చేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/ వార్డు సచివాలయాలలోనూ మరియు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC), మీసేవలోనూ, PM Vishwakarma.gov.in వెబ్ సైట్లో లబ్దిదారుల యొక్క దరఖాస్తులును ఆన్లైన్ చేయాల్సిందిగా తెలియజేయడమైనది
Step 1: అన్ని గ్రామ పంచాయితీల సర్పంచుల చేత ప్రధాన మంత్రి విశ్వకర్మ పోర్టల్ ఆన్ బోర్డ్ (PM Vishwakarma.gov.in) లో సర్పంచ్ ల యొక్క ఆధార్ నెంటర్ మరియు ఆధార్ కు లింక్ చేసి ఉన్న ఫోన్ నెంటర్ ను ఉపయోగించి OTP ద్వారా మరియు గ్రామ సర్పంచుల యొక్క బయోమెట్రిక్ ద్వారా యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ను ఈ దిగువ లింక్ ద్వారా క్రియేట్ చేయాలి.
Note : e-Gram Swaraj మరియు PM Vishwakarma.gov.in ( ప్రధానమంత్రి విశ్వకర్మ పోర్టల్ ) లో సర్పంచ్ (ఆధార్ కార్డు) యొక్క పేర్లు మరియు వివరములు (ప్రొఫైల్) ఒకేలా ఉండేటట్లు సరిచేసి తదుపరి మాత్రమే గ్రామ సర్పంచ్ యొక్క యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ను క్రియేట్ చేయవలెను.
Step 2 : తదుపరి గ్రామ పంచాయితీలలోనూ, గ్రామ సచివాలయాలలో మరియు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC(మీసేవ) లలోనూ వృత్తుల లబ్దిదారుల యొక్క దరఖాస్తులను ఆన్లైన్ చేయాలి.
Step 3 : ప్రధాన మంత్రి విశ్వకర్మ దరఖాస్తులను గ్రామ సర్పంచ్/ ప్రధాన్ స్థాయిలో ధృవీకరించబడాలి, అర్హత ఆధారంగా మొదటి స్థాయి ధృవీకరణ ఆమోదించబడాలి లేదా తిరస్కరించాలి (వెరిఫై & అప్రూవ్ లేదా రిజెక్ట్ చేయాలి).
గ్రామ సర్పంచులను (Onboard) త్వరగా చేర్చేందుకు పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచ్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని మరియు పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లతో ప్రస్తుతం పెండింగ్ ఉన్న దరఖాస్తులును(మొదటి స్థాయి ధృవీకరణ) త్వరగా వెరిఫై చేయాలి. దీనికి సంబంధించిన ఏమైనా సాంకేతిక సమస్యలు, ఎదురయ్యే ప్రశ్నల నివృత్తి కోసం దయచేసి PM విశ్వకర్మ హెల్స్ ఇమెయిల్ - pm-vishwakarma@dcmsme.gov.in మరియు టోల్ ఫ్రీ నెంబర్ 18002677777