Talliki Vandanam Scheme Full Details Telugu Talliki Vandanam Scheme Full Details Telugu

Talliki Vandanam Scheme Full Details Telugu

Talliki Vandanam Scheme Full Details Telugu

Talliki Vandanam Scheme Full Details Telugu  

Talliki Vandanam Scheme Details 

పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరమవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం Talliki Vandanam Scheme అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తు, డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గిస్తుంది.


Aim Of Talliki Vandanam Scheme 

దారిద్య్ర  రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో 1 నుండి XII (ఇంటర్మీడియట్) వరకు చదువుతున్న పిల్లలున్న తల్లులు లేదా పిల్లల సంరక్షకులకు (తల్లి లేనిచో) కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలు/ కాలేజీలు/గుర్తింపు పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలం/జూనియర్ కాలేజీలలో చదివించడానికి వీలుగా ఆర్ధిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం.


Eligibility Of Talliki Vandanam Scheme 

Eligibility Of Talliki Vandanam Scheme

1. మొత్తం కుటుంబ ఆదాయం : 

గ్రామీణ ప్రాంతాలు నెలకు రూ. 10000/- లోపు పట్టణ ప్రాంతాలు - నెలకు రూ. 12000/-ల లోపు ఉండాలి. 

2. మొత్తం కుటుంబానికి గల భూమి :

3 ఏకరాలు కంటే తక్కువ మాగాణి లేదా 10 ఏకరాలు కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్ఠంగా 10 ఏకరాలు లోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులు 

3. తల్లి లేదా లబ్ధిదారు కలిగి ఉండాల్సిన ధృవపత్రాలు : 

తల్లి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. 

4. ప్రభుత్వ ఉద్యోగి/పెన్షన్ దారులు : 

కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయింపు ఉంటుంది. 

5. నాలుగు చక్రాల వాహనం : 

లబ్దిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (ట్రాక్టర్, టాక్సీ, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి). 

6.విద్యుత్ వినియోగం : 

గడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు పదాసరి 300 యూనిట్లు మించరాదు. 

7.ఆదాయపు పన్ను : 

ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు. 

8. పట్టణాల్లో ఆస్తి : 

మున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అ ల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులు. (పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది). 

9. వయస్సు & లింగం : 

ఈ షరతు వర్తించదు. 

10. పుట్టిన తేదీ ధ్రువీకరణ : 

ఆధార్ కార్డు / సమీకృత ధృవీకరణపత్ర 

11. బ్యాంకు ఖాతా వివరాలు : 

తల్లి/ లబ్ధిదారు యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా, ఆధార్ తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండి ఉండాలి. 

12. హాజరు : 

విద్యార్థులు 75% హాజరు ఉండేలా చూసుకోవాలి.

Note : ఇచ్చినటువంటి అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలు పైన ఇవ్వటం జరిగినది. తల్లికి వందనం పథకానికి సంబంధించి    అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత అర్హత ప్రమాణాలు మారే అవకాశం ఉంటుంది .


Talliki Vandanam Scheme Amount 

ఏడాదికి రూ .15,000 /-  తల్లి లేదా సంరక్షకుల బ్యాంకు అకౌంటు లో జమ అవుతుంది . 


Talliki Vandanam Scheme - Aadhaar Mandatory 

  • తల్లికి వందనం Talliki Vandanam Scheme , స్టూడెంట్ కిట్ పథకాలకు Students Kits Scheme ఆధార్ తప్పనిసరి అని పాఠ శాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
  • ఆధార్ తప్పనిసరిగా ఉండాలని లేనిపక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకుని ఉండాలని వివరించింది.
  • ఆధార్ నంబరుతో పాటు పాన్, పాస్పోర్ట్, బ్యాంకు పాస్బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు లాంటి మొత్తం పది గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలని పేర్కొంది.
  • తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు, స్టూడెంట్ కిట్ పథకంలో విద్యార్థులకు బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం ఇస్తున్నట్లు తెలిపింది.

Download Talliki Vandanam Scheme Primary GO

Talliki Vandanam Scheme GO Main Points 

  • ఆధార కార్డు ధ్రువీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధ్రువీకరణ ఉంటుంది కావున తల్లులకు / సంరక్షకులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను.
  • పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది. ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం సంబంధించి ఆధార ధ్రువీకరణకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది .
  • ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని Jagananna Ammavodi ప్రస్తుతం తల్లికి వందనంగా Talliki Vandanam Scheme సవరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జీవో ను విడుదల చేసింది.
  • గత ప్రభుత్వం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే 15000 చెల్లిస్తుండగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి 15000 చెల్లించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
  • 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు తల్లికి వందనం కింద అమౌంట్ పొందాలంటే తప్పనిసరిగా వారికి ఆధార్ ఉండాలి.
  • ఆధార్ కార్డ్ ఒకవేళ విద్యార్థి పేరుతో లేకపోతే వెంటనే దరఖాస్తు చేసి దరఖాస్తు చేసినటువంటి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ తో పాటు కింద ఇవ్వబడిన ఏదో ఒక ప్రూఫ్ ని జత చేయాల్సి ఉంటుంది.
    • బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, 
    • పాన్ కార్డ్, 
    • పాస్పోర్ట్, 
    • రేషన్ కార్డ్, 
    • మేజర్ అయితే ఓటర్ కార్డ్, 
    • nrega కార్డు, 
    • డ్రైవింగ్ లైసెన్స్ లేదా 
    • వ్యక్తిని గుర్తిస్తూ ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ లేదా తాహసిల్దార్ జారీ చేసిన దృవ పత్రం అయినా ఉండాలి.
  • ఆధార్ కార్డు ఎన్రోల్ చేస్తుంటే నెలలోపే వస్తుంది కాబట్టి ఇప్పటినుంచే లబ్ధిదారులు ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఎక్కువ శాతం మంది మైనర్ పిల్లలే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ పిల్లలకు ఆధార్ కార్డుకి అప్లై చేయాల్సి ఉంటుంది.
  • గత ప్రభుత్వం మాదిరి గానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒకటి నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ పథకం కింద నగదు పొందాలంటే తప్పనిసరిగా 75% హాజరు ఉండాలని నిబంధన ను కొనసాగించడం జరిగింది.
  • పైన పేర్కొన్నటువంటి అర్హతలను తల్లికి వందనం పథకం తో పాటు విద్యా కానుక స్టూడెంట్ కిట్స్ పథకానికి కూడా అమలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 



Post a Comment

0 Comments