How To Pay Electricity Bill APEPDCL
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో EPDCL పరిధిలో అనగా ఉమ్మడి గోదావరి,విశాఖ ,విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి కస్టమర్లు Phonepe ,Google pay వంటి యాప్ల ద్వారా పవర్ బిల్లును పేమెంట్ చేసేవారు ప్రస్తుతం RBI వారి ఆదేశాల మేరకు 3rd పార్టీ యాప్ల ద్వారా అంటే ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పవర్ బిల్ పేమెంట్ ఇకమీదట జరగదు దానికి బదులుగా EPDCL అధికారిక వెబ్సైట్లో గాని లేదా మొబైల్ యాప్ లో గాని పేమెంట్ చేస్తే అవుతుంది .
How to Pay power bill apepdcl Process
అధికారిక వెబ్సైట్లో పేమెంట్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు పూర్తిగా చూద్దాం
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయండి .
Step 2 : కింద చూపిన విధముగా Click Here to Pay అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి .
Step 3 : తరువాత సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందనే ఇచ్చినటువంటి కూడిక ను నెంబర్ వేసి SUBMIT పై క్లిక్ చేయండి .
Step 4 : చేసిన తర్వాత కింద చూపిన విధముగా మీ యొక్క
- సర్వీస్ నెంబరు
- కస్టమర్ పేరు
- గ్రామము
- బిల్ తేదీ
- పేమెంట్ చేయడానికి చివరి తేదీ
- కనెక్షన్ తీసివేయు తేదీ
అనే వివరాలు చూపిస్తుంది .
Is Your Service Disconnected ? అంటే కరెంటు కనెక్షన్ తీసి వేసినట్టయితే Yes అని తీయకపోతే No అని సెలెక్ట్ చేసుకొని Click Here to Pay అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి .
Step 5 : కింద చూపిన విధముగా * మార్క్ పై క్లిక్ చేయండి .
Step 6 : కింద చూపిన విధముగా Bill Desk ను సెలెక్ట్ చేసుకోండి.
Step 7 : పేమెంట్ చేయాలా అని అడుగుతుంది OK పై క్లిక్ చేయండి.
Step 8 : మీ వద్ద క్రెడిట్ కార్డు ఉన్న ,డెబిట్ కార్డు ఉన్న , ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న , ఎటువంటి యాప్స్ అంటే గూగుల్ పే ఫోన్ పే వంటి యాప్స్ ఉన్న పేమెంట్ చేయవచ్చు . ప్రస్తుతానికి QR కోడ్ ద్వారా పేమెంట్ చేయుటకు గాను కింద చూపిన విధముగా QR పై క్లిక్ చేయండి .
Step 9 : తరువాత రెండు ఆప్షన్లు చూపిస్తాయి రెండిటిలో ఏదో ఒక దానిపై అంటే BHIM గాని Bharat QR గాని సెలెక్ట్ చేసుకుని Make Payment పై క్లిక్ చేయండి .
Step 10 : క్యూఆర్ కోడ్ చూపిస్తుంది దానిని మీ ఫోన్ లో ఉన్నటువంటి యాప్ల ద్వారా స్కాన్ చేయండి లేదా యూపీఐ ఐడి ఎంటర్ చేసి మేక్ పేమెంట్ చేసినట్టయితే మీ మొబైల్ యాప్ కు పేమెంట్ వస్తుంది అక్కడ పేమెంట్ చేసేయండి.
Step 11 : పేమెంట్ పూర్తయిన తర్వాత కింద చూపిన విధముగా మీకు రసీదు చూపిస్తుంది దానికిగాను ప్రింట్ పై టిక్ చేసి పిడిఎఫ్ గా సేవ్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. ఇలా మీ పవర్ బిల్లును ప్రతినెల పేమెంట్ చేసుకోవచ్చుడి.