NTR Bharosa Pension Scheme Details NTR Bharosa Pension Scheme Details

NTR Bharosa Pension Scheme Details

 

NTR Bharosa Pension Scheme Details in Telugu

NTR Bharosa Pension Scheme Details in Telugu

సామాజిక భద్రతా పెన్షన్ లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన ఉత్తర్వులను విడుదల చేసింది. వైయస్సార్ పెన్షన్ కానుక పథకం YSR Pension Kanuka Scheme  పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం NTR Bharosa Pension Scheme గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం జరిగినది . ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ప్రస్తావిస్తున్నటువంటి పెన్షన్ నగదు రూ3,000 ను ₹4,000 కు పెంచుతూ ప్రభుత్వ జీవో విడుదల చేసినది. 


కొత్తగా పెన్షన్ పెట్టుకోటానికి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం లొ పెన్షన్ దరఖాస్తూ చేసిన వారికి ప్రస్తుతం ఆమోదిస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. కొత్తగా దరఖాస్తు చేసుకోవటానికి ఆప్షన్ ఇచ్చినట్టయితే GSWS Helper టెలిగ్రామ్ ఛానల్లో తెలియచేయడం జరుగును. 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు వారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ తరువాత  పెన్షన్ పెంపుపై సంతకం చేయడం అందరికీ తెలిసినదే , అందులో భాగంగా పెన్షన్ పెంపుకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగినది.  ఇకనుంచి పెన్షన్ల పంపిణీ NTR Bharosa Pension Scheme ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అందించడం జరుగుతుంది. 


Rs.4000/- Pension Categories  

NTR Bharosa Pension Scheme లో రూ.4000/- పెన్షన్ ఎవరికి అందనుంది :

  1. వృద్ధాప్య పింఛను దారులకు 
  2. వితంతువులకు 
  3. చేనేత కార్మికులు,  
  4. చర్మ కళాకారులు ,
  5. మత్స్యకారులు, 
  6. ఒంటరి మహిళలు, 
  7. సాంప్రదాయ  
  8. చెప్పులు కుట్టేవారు, 
  9. ట్రాన్స్‌జెండర్లు, 
  10. ART(PLHIV), 
  11. డప్పు కళాకారులు మరియు  
  12. కళాకారులకు పెన్షన్లు

Download NTR Bharosa Pension Scheme GO

NTR Bharosa Pension Scheme Pension Enhancement Details 

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో మిగిలిన వారికి పెంపు ఎలా ఉందో చూద్దాం

  • వికలాంగుల  పెన్షన్ను 3000 రూపాయల నుండి 6000 రూపాయలకు పెంచడం జరిగినది. వికలాంగులతో పాటుగా కుష్ఠు వ్యాధిగ్రస్తులకు కూడా 6000 రూపాయలకు పెంచడం జరిగినది.
  • పూర్తిగా వికలాంగులైనటువంటి 5000 పెన్షన్ అందుకున్న వారికి ప్రస్తుతం 5000 నుండి 15వేలకు పెంచడం జరిగినది.
  • ఎవరైతే కింద తెలిపిన కేటగిరీకి చెందినవారు 5000 పెన్షన్ తీసుకుంటున్నారు వారికి 10వేల కు పెంచుతూ ఉత్తర్వులు విడుదల అయినవి

    • దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు, 
    • ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్-గ్రేడ్ 4, 
    • కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి,  
    • CKDU డయాలసిస్‌పై CKD సీరం క్రియేటినిన్> 5 mg, 
    • CKDU డయాలసిస్‌పై CKD అంచనా వేసిన GFR <15 ml, 
    • CKDU ఆన్‌లో  డయాలసిస్ CKD చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ


NTR Bharosa Pension Scheme Enhanced Pension Disbursement Date

రూ .4000/- పెన్షన్ తీసుకుంటున్న వారికీ :

  • పైన తెలిపిన 4000 రూపాయల పెన్షన్లకు సంబంధించి వారికి వచ్చేనెల అనగా జూలై 1 2024 పెన్షన్ను , 2024 ఏప్రిల్ మొదటి నుంచి అనగా ఈ మూడు ( ఏప్రిల్ , మే , జూన్ ) నెలలకు 3000 మరియు పెంచిన 4000 మొత్తం రూ .7000 పంపిణీ చేయడం జరుగుతుంది. ఆగస్టు నెల నుంచి ఎప్పటిలాగే నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది . 

మిగతా పెన్షన్ దారులకు :

  • నాలుగు వేల రూపాయలు పెన్షన్లు మినహా మిగిలిన పెన్షన్ అందరికీ కూడా పెంచిన నగదును జూలై 1 , 2024 నుండి పంపిణీ చేయడం జరుగును  .

NTR Bharosa Pension Scheme Enhanced Pension Amount Details :

పెంచిన నగదు పెన్షన్ నగదు యొక్క వివరాలు








Post a Comment

0 Comments