Why Andhra Pradesh needs Jagan? Volunteers Survey
Why Andhra Pradesh needs Jagan? అనే సర్వేను వాలంటీర్ల Beneficiary Outreach Program (BOP) యాప్ లాగిన్ లో చేయవలసి ఉంటుంది. ఏ సచివాలయానికైతే సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు ఆవిష్కరణ జరుగుతుందో జరిగిన మరుసటి రోజు నుంచి ఈ సర్వే ప్రారంభం అవుతుంది. ఆవిష్కరణ రోజు నుంచి వారం రోజులపాటు ఈ సర్వే వాలంటీర్లు చేయవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే ...? (Why AP needs Jagan) అనే కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు చేయవలసిన సర్వేను థంబ్ (వేలి ముద్ర) తీసేయడం జరిగింది, కావున వాలంటీర్లు ఇపుడు బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ (Beneficiary outreach app)లో ఓటిపి (OTP) ద్వారా చేయవచ్చు.రోజుకి 15 గృహాలు మాత్రమే చేయగలరు అనే పరిమితి కూడా తీసేయబడినది, కాబట్టి ప్రతి ఒక్క వాలంటీర్ ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే ...?(Why AP needs Jagan) సర్వే తొందరగా మొదలు చేసి, ఆలస్యం చేయకుండా 100% శాతం పూర్తి చేయవలసిందిగా మనవి.
Why Andhra Pradesh needs Jagan ? వాలంటీర్లు సర్వే చేయు విధానము
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన Beneficiary Outreach Program (BOP) లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
Step 2 : ఓపెన్ చేసిన తరువాత వాలంటరీ యొక్క 12 అంకెల ఆధార నెంబర్ ఎంటర్ చేసి Biometric లేదా Face లేదా Irish ద్వారా లాగిన్ అవ్వాలి.
Step 3 : Home Page లో "Why Andhra Pradesh needs Jagan?" అనే ఆప్షన్ పై టిక్ చేయాలి.
Step 4 : వాలంటీర్ యొక్క క్లస్టర్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటే వాలంటీర్ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్ వివరాలన్నీ కూడా చూపిస్తుంది. ఎవరికి సర్వే చేయాలో వారి కుటుంబ పెద్ద పేరును సెలెక్ట్ చేసుకున్నట్లయితే వివరాలతో కూడిన Display ఓపెన్ అవుతుంది.
Step 5 : House Hold Details అనగా Head of House Hold Name, Head of House Hold Id వివరాలు display అవుతాయి. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే...బుక్లెట్ కుటుంబ సభ్యులకు అందించారా? అన్నే ప్రశ్నకి yes మరియు No అన్నే option లు ఉంటాయి, ఈ ప్రశ్నకి సంబంధించిన optionని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.
Step 6 : ఇక్కడ Witness ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత Ekyc చేయాలి.
Step 7 : Biometric లేదా Face లేదా Irish ద్వారా Ekyc పూర్తి అయిన తరువాత Volunteers యొక్క ఆధార్ నెంబర్ తో Authentication చేయవలసి ఉంటుంది.
Step 8 : Authentication పూర్తి అయిన తర్వాత Data Saved Successfully అనే సందేశం వచ్చినట్టయితే పూర్తి అయినట్టు. ఆ విధంగా క్లస్టర్ పరిధిలో రోజుకు 15 హౌస్ హోల్డ్ లను పూర్తి చేయవలసి ఉంటుంది.