JVD joint account guidelines
తాజా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తేదీ నవంబర్ 10 ,2023 నుండి జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలను పొందాలనుకుంటే నగదు జమ అయ్యే బ్యాంకు ఖాతా విద్యార్థి మరియు వారి యొక్క తల్లి పేరు మీద ఉండాలి.ఇప్పటివరకు విద్యార్థుల తల్లుల ఖాతా ల్లోనే ఆ మొత్తాన్ని జమచేస్తున్నారు. ఇకపై జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవె నలో లబ్ధిదారులైన విద్యార్థులు తమ తల్లితో కలిసి ఉమ్మడి ఖాతా తెరవాలి. కొత్తగా తెరిచే ఈ ఖాతాలో విద్యార్థి ప్రాథమిక ఖాతాదారు గాను, తల్లి ద్వితీయ ఖాతాదారుగాను ఉం డాలి. ఇప్పటికే విద్యార్థికి ఉంటే తల్లిని లేదా తల్లికి ఉండే ఖాతాలో విద్యార్థిని చేర్చి ఉమ్మడి ఖాతాగా మార్చవచ్చు. తల్లులతోపాటు విద్యా ర్థులకూ బాధ్యత ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ విద్యార్థు లకు, చివరి సంవత్సరం విద్యార్థులకు జాయింట్ ఖాతా అవసరంలేదు.
బ్యాంకు ఖత లు తెరిచే సమయం లో విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఉండటం మరియు బ్యాంకుల వద్ద పెద్ద సంఖ్య లో వెయిటింగ్ ఉంటున్న కారణంగా జాయింట్ బ్యాంకు ఖాతా ను లబ్ధిదారులు వారికి నచ్చిన సమయంలో ఓపెన్ చేసుకోవచ్చు . నవంబర్ నెలలో విడుదల చేసే విడత లో పాత విధానం లో ఆధార్ సీడ్ అయిన తల్లి బ్యాంకు ఖాతా నగదును జమ చెయ్యటం జరుగును . కానీ 2024 ఫిబ్రవరి నెలలో జమ చేయు విడతలో మాత్రం జాయింట్ ఖాతా లో మాత్రమే జమ అవుతుంది . కావున పై విషయాన్నీ ప్రజలు గమనించి సమయం అనుగుణంగా ఖాతా ను ఓపెన్ చేసుకోవాలి .
జాయింట్ బ్యాంకు అకౌంట్ ఎవరు ఓపెన్ చేయాలి ?
ప్రస్తుతం లబ్ధి పొందుతున్న అందరు విద్యార్థులు జాయింట్ బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మరియు SC విద్యార్థులు జాయింట్ ఖాతా తెరవవలసిన అవసరం లేదు. తల్లి లేదా తండ్రి లేని విద్యార్థులు వారి సంరక్షకుల తో కలిపి జాయింట్ ఖాతా ను ఓపెన్ చేయాలి.
జాయింట్ ఖాతా ఎలా ఉంటుంది ?
- కొత్తగా ఓపెన్ చేసే జాయింట్ బ్యాంకు ఖాతా అనేది విద్యార్థి ప్రాథమిక అకౌంట్ హోల్డర్ గా తల్లి / తండ్రి / సంరక్షకులు రెండవ అకౌంట్ హోల్డర్ గా ఉండాలి.
- బ్యాంకు యొక్క లావాదేవీలు / ఆపరేషన్ అనేది విద్యార్థి మరియు తల్లి ఇద్దరు కలిపి / వేరు వేరుగా చేసుకునే అవకాశం ఉంటుంది.
- జాయింట్ ఖాతాకు డెబిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ / మొబైల్ బ్యాంకింగ్ / ఇతర కార్డులు ఇవ్వబడదు.
- బ్యాంకు ఖాతా నుండి నగదును తీయుటకు గాను తప్పనిసరిగా విద్యార్థి మరియు తల్లి యొక్క సంతకాలు ఉండాలి.
- విద్యార్థి ఖాతాకు ప్రాథమిక అకౌంట్ హోల్డర్ గా ఉండుట కారణంగా పథకాల లబ్ధి పొందటానికి గాను జాయింట్ ఖాతా కు తల్లి యొక్క ఆధార్ నెంబరు సీడ్ చేయకూడదు.
- కొత్త జాయింట్ ఖాతా ఓపెన్ చేయడానికి ఇటువంటి చార్జి ఉండదు. ఖాతా ఓపెన్ చేయు సమయంలో ఎటువంటి రుసువు అవసరం ఉండదు. విద్యార్థి మరియు తల్లి యొక్క ఇష్టం మేరకు వారు రెగ్యులర్ సేవింగ్ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు దానికి బ్యాంకు నిర్ణయించిన చార్జీ పేమెంట్ చేయవలసి ఉంటుంది.
- జాయింట్ ఖాతా పై చెక్కుబుక్కు తీసుకోవడం అనేది విద్యార్థి మరియు తల్లి యొక్క ఇష్టం మేరకు ఉంటుంది తప్పనిసరిగా తీసుకోవాలని అయితే రూల్ లేదు.
- ఒకవేళ తల్లి మరణించినట్టయితే విద్యార్థి మరియు విద్యార్థి యొక్క తండ్రితో జాయింట్ ఖాతాను ఓపెన్ చేయాలి.
జాయింట్ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ? JVD Joint Bank Account Documents Required ?
- విద్యార్థి మరియు తల్లి యొక్క 3 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
- విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు కాపీ
- విద్యార్థి ఐడి కార్డు
- ఆధార్ కార్డులో విద్యార్థి యొక్క పూర్తి డేట్ అఫ్ బర్త్ చూపించకపోతే అప్పుడు విద్యార్థి యొక్క బర్త్ సర్టిఫికెట్ లేదా పూర్తి డేట్ అఫ్ బర్త్ ఉన్న కాలేజీలో ఇచ్చినటువంటి స్టడీ సర్టిఫికెట్.
నవశకం లాగిన్ లో కొత్త జాయింట్ అకౌంట్ వివరాలు అప్లోడ్ చేయుట గూర్చి
- విద్యార్థి మరియు తల్లి కలిపి ఓపెన్ చేసిన జాయింట్ బ్యాంకు అకౌంట్ బుక్ యొక్క మొదటి పేజీని జిరాక్స్ తీసి విద్యార్థి యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డుతో కలిపి సచివాలయంలో WEA / WEDPS వారికి అందించాలి.
- సంబంధిత సచివాలయ ఉద్యోగులు నవ సకం లాగిన్ లో వివరాలు అప్లోడ్ చేసిన తరువాత ఆయా వివరాలను జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ వారు జ్ఞానభూమి పోర్టల్ వివరాలతో సరిచూసుకొని ఫైనల్ సబ్మిషన్ చేయవలసి ఉంటుంది.
- ప్రతీ సచివాలయం కి కూడా ఒక కోఆర్డినేషన్ ఆఫీసర్(ASWO/ABCWO/ ATWO/HWO) ని మ్యాప్ చేయడం.. జరిగింది. WEA/ WEDP నవశకం లో ఖాతా వివరాలు అప్లోడ్ చేసిన పిదప అవి కోఆర్డినేషన్ ఆఫీసర్ వారి లాగిన్ కి వస్తాయి. కోఆర్డినేషన్ ఆఫీసర్ ఆ డీటెయిల్స్ చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తారు.
- అలానే జిల్లాలో గల ప్రతీ బ్యాంకు కి కూడా WEA/WEDP లను మ్యాప్ చేయడం జరుగుతుంది. WEA/WED లు సంబంధిత బ్యాంకు మేనేజర్ తో సంప్రదించి ఆ బ్యాంకు పరిధిలో అకౌంట్స్ ఓపెన్ చేసే విదంగా చూడాలి. అలానే ఫీల్డ్ లెవెల్ లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయాలి.
- కలెక్టర్ గారికి మరియు బ్యాంకు ఉన్నతాధికారులుతో సమావేశం నిర్వహించి ఈ ఉమ్మడి ఖాతాల పై వారికి INSTRUCTIONS ఇస్తారు.
- ఈ యొక్క కార్యక్రమం అంతనూ కూడా మనకి ప్రభుత్వం వారు జారీ చేసిన టైం లైన్ ప్రకారం 24/11/2023 వ తేదీ లోపు జిల్లాలో గల అందరి విద్యార్థులు కి పూర్తి అవ్వాలి. లేనిచో 28/11/2023 న నాడు 4వ విడత విడుదల చేసే సొమ్ము జమ కాదు.
- కావున ఈ యొక్క టాస్క్ అత్యంత ప్రధానమైనది గా భావించి ఈ యొక్క 10 రోజులు ఈ యొక్క కార్యక్రమం పై ప్రత్యేక శ్రద్ధ వహించగలరు. మేము జిల్లా ఆఫీస్ నుండి ప్రతీ రోజు పెండింగ్ రిపోర్ట్స్ మీకు తెలియచేయడం జరుగుతుంది.
జాయింట్ ఖాతా ఎప్పటి లోపు ఓపెన్ చేయాలి ?
jvd joint account opening last date 2023
తేదీ నవంబర్ 24 2023 లోపు జాయింట్ ఖాతాలను ఓపెన్ చేసి సచివాలయానికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చివరి తేదీ వరకు ఆగకుండా ఈ పనిని త్వరగా చేసుకున్నట్లయితే త్వరలో విడుదల అయ్యే JVD నగదు ఆ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
JVD Joint Account FAQ - ప్రశ్న - సమాదానాలు :
ప్ర: ఒక కుటుంబం లో ఇద్దరి విద్యార్థులు ఉన్నట్లయితే రెండు అకౌంట్స్ ఓపెన్ చేయాలా?
స: అవసరం లేదు ఆ ఇద్దరి పిల్లలకు మరియు తల్లికి ఒకే అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది.
---------------------------------------
ప్ర: అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక NPCI చేయించుకోవాలా?
స : ఈ యొక్క ఉమ్మడి ఖాతాలకు ఎటువంటి NPCI కూడా అవసరం లేదు.
---------------------------------------
ప్ర: పోస్టల్ లో కూడా ఉమ్మడి ఖాతా ఓపెన్ చేసుకోవచ్చా?
స : పోస్టల్ లో ఉమ్మడి ఖాతాలు ఇవ్వరు కనుక ఇతర బ్యాంకు లును మాత్రమే సంప్రదించాలి.
---------------------------------------
ప్ర: ఉమ్మడి ఖాతా ఓపెన్ చేసుకున్నాక ఏమి చేయాలి.
స : ఖాతా ఓపెన్ చేసుకున్నాక విద్యార్థి లేదా తల్లి ఆ ఖాతా యొక్క మొదటి పేజీ కాపీ ని సంబంధిత (household mapped) WEA/ WEDPS కి అందచేయాలి.
---------------------------------------
ప్ర : ఇప్పుడు అన్ని కులముల విద్యార్థులుకి, మరియు అన్ని ఏడాది విద్యార్థులు కి కూడా ఈ ఉమ్మడి ఖాతా ను తెరువాలా?
స : 2022-23 వ విద్యాసంవత్సరానికి సంబంధించి చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులుకి (అన్ని కులములు కూడా) ఉమ్మడి ఖాతా తెరువనవసరం లేదు. అలానే షెడ్యూల్డ్ కులములుకు చెందిన అన్ని ఏడాదిల విద్యార్థులుకు కూడా తెరువనవసరం లేదు.
---------------------------------------
ప్ర: ఖాతా తెరువటకు బ్యాంకు లో ఎటువంటి Documents సమర్పించాలి ?
1) తల్లి మరియు విద్యార్థి యొక్క 3 పాస్పోర్ట్ ఫోటోలు
2) విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు
3) విద్యార్థి ఐడి కార్డ్ (కాలేజీ ఐడి)
4) ఆధార్ కార్డు లో విద్యార్థి పూర్తి డేట్ ఆఫ్ బర్త్ లేని యెడల DOB సర్టిఫికెట్ లేదా 10వ తరగతి మార్కుల మెమో.
---------------------------------------
ప్ర: ఖాతా లో మినిమం అమౌంట్ 1000రూ లేదా 3000రూ ఉంచాలా?
స :అవసరం లేదు అకౌంట్ పూర్తిగా జీరో అకౌంట్ కావున సొమ్ము ని జమ చేయనవసరం లేదు.
---------------------------------------
ప్ర: ఉమ్మడి ఖాతా తెరిచేటపుడు Primary అకౌంట్ హోల్డర్ ఎవరు ఉండాలి?
స :Primary అకౌంట్ హోల్డర్ స్టూడెంట్ మాత్రమే ఉండాలి.
---------------------------------------
ప్ర: విద్యార్థి. ఇదివరకే ఇండివిడ్యువల్ ఖాతా కలిగి ఉంటే తల్లిని వారి ఖాతాకు కానీ లేదా తల్లి ఇదివరకే ఇండివిడ్యువల్ ఖాతా కలిగి ఉంటే విద్యార్థిని వారి ఖాతాకు జోడించవచ్చా?
స: లేదు కచ్చితంగా నూతనంగా మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకనగా ఈ అకౌంట్కు ఎటువంటి డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండకూడదు. కనుక నూతన అకౌంట్ కచ్చితంగా ఓపెన్ చేసుకోమనండి.
---------------------------------------
ప్ర: తల్లి మరణించి ఉన్న విద్యార్థులుకు ఏమి చేయాలి?
స: వాళ్ళ Father లేదా సంరక్షకుడు తో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.
--------------------------------------