జన్ భాగీదారీ ( సామజిక సమతా సంకల్పం ) కార్యక్రమం పూర్తి సమాచారం - Jan Bhagidhari Program Full Details జన్ భాగీదారీ ( సామజిక సమతా సంకల్పం ) కార్యక్రమం పూర్తి సమాచారం - Jan Bhagidhari Program Full Details

జన్ భాగీదారీ ( సామజిక సమతా సంకల్పం ) కార్యక్రమం పూర్తి సమాచారం - Jan Bhagidhari Program Full Details


Jan Bhagidhari Program GO , User Manual , Banner , Photo , GSWS Staff Works , Online Process

జన్ భగీదారి ప్రోగ్రాం పేరు ను సామజిక సమతా సంకల్పం గా మారుస్తూ ఉత్తరువులు విడుదల.

జన్ భాగీదారీ కార్యక్రమం అంటే ఏమిటి ? 

విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నారు.ఈ క్రమంలో రాష్ట్రమంతటా జన భాగీదారీ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది.నాయకులు స్థానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇందులో భాగంగా సచివాలయాల్లో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు.ఉద్యోగులు, ప్రజలతో అంబేడ్కర్ బాటలో పయనిస్తామంటూ సంతకాలు చేయిస్తారు.



ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయి ? వాటిని ఎవరు చేయాలి  ?

కార్యక్రమం 1 : 

  • గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఈవెంట్ జరుగు తేదీనాడు సచివాలయ సిబ్బంది మరియు వారి వాలంటీర్లతో పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు వారి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మరియు ప్రజా ప్రతినిధులకు ఆహ్వానించి వారిచే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి ఫోటో ఫ్రేమునకు పూలమాల వేయించవలెను.


కార్యక్రమం 2  :

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసిన తరువాత అంబేద్కర్ బ్యానర్ పెక్సీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తున్నట్టుగా ప్రతిజ్ఞ చేస్తున్నట్టు అందరి సంతకాలను పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు  తీసుకోవలసి ఉంటుంది.


కార్యక్రమం 3  :

  • ప్రోగ్రాంకు హాజరు అయినటువంటి సభ్యుల ఫోటోలు మరియు సంతకాలు చేసినటువంటి బ్యానర్ ఫోటోలు మరియు ఇతర కార్యక్రమాలు అన్నిటిని కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఇచ్చినటువంటి కింద వెబ్సైటు లింకులో డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.


కార్యక్రమం 4  :

  • వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు వారి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో లేదా కాలేజీలలో ఈ జన భాగీ దారి ప్రోగ్రామ్ కు సంబంధించి ఆయా స్కూల్ హెచ్ఎంలు లేదా ప్రిన్సిపల్ కోఆర్డినేషన్తో ఫోటోలను పైన ఇవ్వబడిన వెబ్సైటు ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ఫోటోలు అప్లోడ్ చేయాలి. 



షెడ్యూల్ ఏమిటి ? 

  • రాష్ట్రవ్యాప్తంగా జనవరి 9 నుంచి మొదలై జనవరి 18 వరకు కార్యక్రమం జరుగుతుంది. జనవరి 19న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నారు. తేదీ జనవరి 7 నుంచి నుంచి 11వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది.


సచివాలయ ఉద్యోగుల పనులు ఏమిటి ? 

1.Jan bhagidari ప్రోగ్రాం కి సంబంధించి ముందుగా ఫ్లెక్స్ మరియు అంబేద్కర్ గారి ఫోటో లోకల్ గానే PS/WAS ప్రింటింగ్ వేయించుకోవాలి.

  • ఫోటో ఫ్రేమ్ - 16×20 ఇంచీలు
  • ఫ్లెక్స్ బ్యానర్ 4×6 అడుగులు

Photo Frame & Flex Banner Link 👇

Download Banner & Flex


2.ప్రోగ్రామ్ జరిగిన రోజు  DA/WEDPS వారు లాగిన్ నందు అందరూ సంతకాలు చేసిన ఫ్లెక్స్, అంబేద్కర్ గారి ఫోటో,ఈవెంట్ అప్ లోడ్ చేసి 19 వ తారీకు న జరిగే విజయవాడ ప్రోగ్రామ్కు సచివాలయం పరిధి లో 5 మెంబెర్స్ డీటైల్స్ ఎంటర్ చేయవలెను


3.WEA/WEDPS వారు సోషల్ జస్టిస్ అవేర్నెస్ క్యాంప్ అలాగే స్కూల్ మరియు కాలేజీ లెవెల్ నందు ఈవెంట్స్ (డ్రాయింగ్, డిబేట్,essay writing,quiz)కండక్ట్ చేయవలెను. మరియు వారి లాగిన్ నందు అప్డేట్ చేయవలెను.

Note : ఈ కార్యక్రములు అన్ని Jan 7-11 లోపు పూర్తిచేయాలి.


DA /WEDPS లాగిన్ ఎలా అవ్వాలి ? ఏఏ డేటా అప్లోడ్ చేయాలి ? 

DA / WEDPS వారు ముందుగా కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి.

Jan Bhagidhari Website

ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పోర్టల్ ( vsws.co.in ) సైటు లో ఉపయోగించే ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ను పై వెబ్సైట్లో ఉపయోగించినట్టయితే లాగిన్ అవుతుంది.

లాగిన్ అయిన తరువాత మొత్తం నాలుగు ఆప్షన్లు చూపిస్తుంది

1. Photo Frame Acknowledgem

2. Flex Board Acknowledgement

3. Garlanding Event

4. Citizen's Registration


1. Photo Frame Acknowledgement :

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి ఫోటో సచివాలయముకు రిసీవ్ చేసుకున్న తరువాత ఇందులో సమాచారాన్ని ఎంటర్ చేయాలి. అడిగే ప్రశ్నలు

  • Photo Frame Received Date 
  • Is The Photo Frame In Good Condition
  • Upload The Image

Submi చేయాలి.

2. Flex Board Acknowledgement :

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బ్యానర్ ఫ్లెక్స్ సచివాలయం కు అందుకున్న తరువాత ఇందులో వివరాలను ఎంటర్ చేయాలి. అడిగే ప్రశ్నలు 

  • Flex Board Received Date 
  • Is The Flex Board In Good Condition
  • Upload The Image

Submi చేయాలి.

3. Garlanding Event :

సచివాలయం కు ఇవ్వబడిన షెడ్యూల్ తేదీ ప్రకారము అంబేద్కర్ వారి విగ్రహము లేదా ఫోటో పై పూలమాల వేసి, బ్యానర్ పై సంతకాలు చేసిన తరువాత ఇందులో డేటాను ఎంటర్ చేయాలి.

  • Garlanding event date
  • Number of citizens participated in the Garlanding
  • Number of citizen signed on the flex board
  • Upload the Garlanding photo
  • Upload the flex board photo with signatures

Submi చేయాలి.

4. Citizen's Registration :

విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నారు. కార్యక్రమమునకు ఎవరైతే హాజరు అవుతారో వారికి ఇచట రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్టర్ చేయుటకు "Register New Citizen" పై టిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయుటకు ఆధారు నెంబరు ఉంటే సరిపోతుంది. హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ ప్రకారము వారి యొక్క పేరు, b డేట్ అఫ్ బర్త్, లింగము వస్తుంది. తరువాత వారు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది. ఈ విధముగా సచివాలయ పరిధిలో కనీసం ఐదుగురి పేర్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.ఇంతటితో సచివాలయ పరిధిలో DA / WEDPS వారి పని పూర్తి అయినట్టు. 


WEA / WEDPS లాగిన్ ఎలా అవ్వాలి ? ఏఏ డేటా అప్లోడ్ చేయాలి ?

WEA / WEDPS వారు ముందుగా కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి.

Jan Bhagidhari Website

CR App కు ఉపయోగించే యూసర్ ఐడి మరియు పాస్వర్డ్ ను పై వెబ్సైట్లో ఉపయోగించినట్టయితే లాగిన్ అవుతుంది.లాగిన్ అయిన తరువాత మొత్తం నాలుగు ఆప్షన్లు చూపిస్తుంది

1. Citizen's Registration

2. Social Justice Awareness Camps 

3. School Level Events 

4. College Level Events 


1. Citizen's Registration :

విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నారు. కార్యక్రమమునకు ఎవరైతే హాజరు అవుతారో వారికి ఇచట రిజిస్ట్రేషన్ చేయాలి.రిజిస్టర్ చేయుటకు "Register New Citizen" పై టిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయుటకు ఆధారు నెంబరు ఉంటే సరిపోతుంది. హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ ప్రకారము వారి యొక్క పేరు, b డేట్ అఫ్ బర్త్, లింగము వస్తుంది. తరువాత వారు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది. ఈ విధముగా సచివాలయ పరిధిలో కనీసం ఐదుగురి పేర్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.

2. Social Justice Awareness Camps

WEA / WEDPS వారు వారి సచివాలయ పరిధిలో సామాజిక న్యాయ అవగాహన కార్యక్రమంలో సంబంధించి ఎక్కడ ఏ తేదీన చేస్తారో వాటి వివరాలు ముందుగా షెడ్యూలు ఇవ్వవలసి ఉంటుంది. షెడ్యూల్ కు అడిగే వివరాలు 

  • Name of the gram panchayat
  • Name of the street
  • Name of the habitation
  • Date of the event

 తర్వాత సబ్మిట్ పై ప్రెస్ చేయాలి.

పై వివరాలు సబ్మిట్ చేసిన తరువాత మరలా లాగిన్ అయినట్టు అయితే ఇదే ఆప్షన్లో కింద చూపిన విధంగా లిస్టు చూపిస్తుంది. కార్యక్రమము జరిపిన తరువాత Action ఆప్షన్ ద్వారా వివరాలు అప్లోడ్ చేయాలి అందులో అడిగే ప్రశ్నలు.

  • Number Of People Participated
  • Name Of The Chief Guest Attended
  • Upload Group Photos Of Citizens Attended For The Camp
  • Upload Short Video Of The Camp

తర్వాత సబ్మిట్ పై ప్రెస్ చేయాలి.

3. School Level Events :

WEA / WEDPS వారు వారి సచివాలయ పరిధిలో పాఠశాలలలో డ్రాయింగ్ / క్విజ్ / డిబేట్ / ఎస్సే రైటింగ్ పోటీలనుకండక్ట్ చేసి వాటి యొక్క వివరాలను ఈ సెక్షన్లో అప్లోడ్ చేయాలి. పైన చెప్పిన విధంగానే ముందుగా ఏ రోజు ఏ కార్యక్రమాలు ఏ పాఠశాలలో చేస్తున్నారో వాటికి సంబంధించి Upload Event Details ఆప్షన్ ద్వారా కింద తెలిపిన వివరాలను నమోదు చేయాలి.

  • Selection of school
  • Selection of event type drawing / quiz / debate / essay writing
  • Event date
  • Number of students participated
  • Photo of the event with students

తర్వాత సబ్మిట్ పై ప్రెస్ చేయాలి.

పై విధముగా అన్ని పాఠశాలలో అన్ని కార్యక్రమాలు జరిగే విధంగా చూసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని తుది సబ్మిట్ చేయాలి.


4. College Level Events 

WEA / WEDPS వారు వారి సచివాలయ పరిధిలో కాలేజీలలో డిస్కషన్ / డిబేట్ కండక్ట్ చేసి వాటి యొక్క వివరాలను ఈ సెక్షన్లో అప్లోడ్ చేయాలి. పైన చెప్పిన విధంగానే ముందుగా ఏ రోజు ఏ కార్యక్రమాలు ఏ కాలజీ లో చేస్తున్నారో వాటికి సంబంధించి Upload Event Details ఆప్షన్ ద్వారా కింద తెలిపిన వివరాలను నమోదు చేయాలి.

  • College Name
  • Mandal Name
  • College Location
  • Type Of Event : Discussion / Debate
  • Event Date
  • Nember Of Students Participated
  • Photo Of The Event With The Students

తర్వాత సబ్మిట్ పై ప్రెస్ చేయాలి.



జన్ భగీదారి టెక్నికల్ సమస్యలకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ?

వెబ్సైటు మరియు కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నట్టయితే కింద తెలిపిన వారికి e-మెయిల్ లేదా ఫోన్ చేయగలరు. 

Jan Bhagidhari Program Downloads : 👇


Jan Bhagidhari Program All Reports : 👇

Jan Bhagidhari Report Link


మరింత సమాచారం >>
close