ఆరోగ్య శ్రీ కార్డుల eKYC విధానం , మొబైల్ యాప్ డౌన్లోడ్ విధానం , రిపోర్ట్ ఆరోగ్య శ్రీ కార్డుల eKYC విధానం , మొబైల్ యాప్ డౌన్లోడ్ విధానం , రిపోర్ట్

ఆరోగ్య శ్రీ కార్డుల eKYC విధానం , మొబైల్ యాప్ డౌన్లోడ్ విధానం , రిపోర్ట్


YSR Aarogya Sri - 25L Cards eKYC , Report , Mobile App Download Processs , Report

YSR Aarogya Sri Cards eKYC - Mobile App Downloads latest News 


జగనన్న ఆరోగ్య సురక్ష  సమాచారం / Jagananna Aarogya Suraksha :

  • జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత జనవరి ఒకటి 2024 నుండిప్రారంభం అయ్యింది . ఇక ప్రతి ఆరు నెలలకు ఒకసారి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది.
  • గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు వారి సచివాలయంలో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు కోసం 15 రోజుల ముందుగానే సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయవలసి ఉంటుంది.వాలంటీర్లు GSWS Volunteer మొబైల్ యాప్ లో వారి సచివాలయం లో క్యాంపు తేదీ కు 15 రోజుల ముందు మొదటి విడత సర్వే, 3 రోజులకు ముందు 2వ విడత సర్వే చేయాలి .హెల్త్ క్యాంపు జరుగు తేదీ విడుదల అయిన తరువాత క్యాంపు తేదీకి ముందు 3 రోజుల ముందు సచివాలయ పరిధిలో ప్రజలందరికీ తెలియజేయవలసి ఉంటుంది.
  • ఆరోగ్య సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది సహాయంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సచివాలయ పరిధిలో సజావుగా జరిగే విధముగా పంచాయతీ కార్యదర్శి వారు చూసుకోవలసి ఉంటుంది.

వైస్సార్ ఆరోగ్య శ్రీ మొబైల్ యాప్ డౌన్లోడ్ సమాచారం :

వైస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 
  1. అందిస్తున్న సేవలు , 
  2. మెడిసిన్ సదుపాయం , 
  3. ఆరోగ్య శ్రీ సేవలు కలిగిన ఆసుపత్రి లిస్ట్ , 
  4. వైస్సార్ ఆరోగ్య ఆసరా సమాచారం , 
  5. ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా పొందిన మొత్తం నగదు సమాచారం మరియు 
  6. ఆరోగ్య శ్రీ సేవలు పొందుటకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో 
పూర్తి సమాచారం వైస్సార్ ఆరోగ్య మొబైల్ యాప్ లో ఉంటుంది . కావున రాష్ట్రములో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ కలిగిన వారు అందరు తప్పనిసరిగా ఆరోగ్య శ్రీ మొబైల్ యాప్ లు డౌన్లోడ్ చేసుకొని ఆరోగ్య శ్రీ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి

YSR Aarogya Sri App Download Process :

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా YSR Aarogya Sri (4.2) మొబైల్ డౌన్లోడ్ చేసుకోగలరు .
Download Aarogya Sri App
Step 2 : ఓపెన్ చేసాక User Login పేజీ ఓపెన్ అవుతుంది .

Step 3 : User Login లో ఆరోగ్య శ్రీ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి లేదా ఆరోగ్య శ్రీ కార్డు పై ఉన్న స్కానర్ ను స్కాన్ చేయాలి .
Step 4 : ఆధార్ నెంబర్ ద్వారా అయితే ఆధార్ కు లింక్ అయినా మొబైల్ కు OTP వస్తుంది . ఆరోగ్య శ్రీ కార్డు లేదా స్కానర్ను ద్వారా అయితే ఆరోగ్య శ్రీ కార్డుకు లింక్ అయినా మొబైల్ కు OTP వస్తుంది . OTP Verification పేజీ లో Continue పై క్లిక్ఆ చేయాలి .  
Step 5 : OTP ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి .
Step 6 : కింద చూపిన విధంగా పేజీ ఓపెన్ అవుతుంది . ఇంతటితో పని పూర్తి అయిన్నట్టు అర్థము .

Note : ఆరోగ్య శ్రీ యాప్ రిపోర్ట్ ఆన్లైన్ లో చూపించాలి అంటే తప్పకుండ ఒక్క మొబైల్ లో ఒక్క ఆరోగ్య శ్రీ కార్డు దారు మాత్రమే లాగిన్ అవ్వాలి. అప్పుడే Online Report లో సరిగా అప్డేట్ అవుతుంది. 


Aarogya Sri Apps Download Report


 ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం సర్వే :

  • మహిళా పోలీస్ వారితో గ్రామ వాలంటీర్లు ఒక హెల్త్ టీముగా ఏర్పడి ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ బౌచర్లను పంపిణీ చేయవలసి ఉంటుంది.
  • మహిళా పోలీస్ వారు ANM / CHO వారితో కలిసి ప్రతి ఇంటిలో కనీసం ఒకరి మొబైల్ లో నైనా ఆరోగ్యశ్రీ యాప్ మరియు డిసా యాప్ ను డౌన్లోడ్ చేసుకునే విధంగా సూచనలు ఇవ్వవలెను.
  • వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి పెరిగిన ఆరోగ్యశ్రీ మొత్తం అమౌంటు కోసం వివరిస్తూ ఆరోగ్యశ్రీ సర్వీసుల కోసం తెలియజేసి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను వారికి అందించి eKYC తీసుకోవలసి ఉంటుంది.


గ్రామ వార్డు వాలంటీర్లు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసి eKYC తీసుకునే విధానము :
New Aarogya Sri Cards eKYC Process by GSWS Volunteers :

గ్రామ వార్డు సచివాలయాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చిన తర్వాత మాత్రమే ఈ సర్వే చేయుటకు అవకాశం ఉంటుంది. సర్వే చేయు సమయంలో వాలంటీర్లు సిటిజన్ కు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మొత్తం 25 లక్షలకు పెంచబడినట్టు తెలియజేస్తూ మరియు 25 లక్షలు కార్డుపై ప్రింట్ చేయబడి ఉన్నట్టు తెలియజేయాలి.


Step 1 : ముందుగా గ్రామ వార్డు వాలంటీర్ వారు కింద ఇవ్వబడిన లింకు ద్వారా కొత్తగా అప్డేట్ అయినటువంటి GSWS Volunteers యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయాలి.

Download GSWS Volunteer App

Step 2 : వాలంటీర్ వారి CFMS ID ద్వారా Login అవ్వాలి. లాగిన్ సమయం లో Biometric / IRIS / Facial ద్వారా లాగిన్ అయ్యే అవకాశం ఉంది.


andhra-pradesh-ups-free-medical-treatment-scheme-limit-to-rs-25l-monthly-social-pension-to-rs-3k


Step 3 : Home Page లో "Aarogya Sri" ఆప్షన్ పై టిక్ చేయాలి. Select Type of Search వద్ద Aarogyasri Card Number మరియు Aadhar Card Number. రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ను ఎంటర్ చేయాలి.



Step 4 : ఆరోగ్యశ్రీ నెంబర్ ద్వారా లేదా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కుటుంబా వివరాలు ఓపెన్ అవుతాయి. అందులో "Handed Over New Arogya Sri Card to the Family ? ( కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ను ఈ కుటుంబానికి అందించారా? ) అందించినట్లయితే Yes అని టిక్ చేయాలి. తరువాత వారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు కింద చూపిస్తుంది. ఎవరు అయితే అందుబాటులో ఉన్నారో వారి పేరుతో విచ్చేసిన తర్వాత వారి eKYC ను Biometric / IRIS / Facial ద్వారా తీసుకోవాలి.




Step 5 : ఆ కుటుంబానికి సంబంధించి కార్డు డెలివరీ పూర్తి అయినట్టు అర్థం. ఈ విధంగా వారి క్లస్టర్ పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారందరికీ కూడా సర్వే పూర్తి చేయవలసి ఉంటుంది. OTP  ఆప్షన్ ద్వారా ఫ్యామిలీ లో ఎవరో ఒకరి ekyc తీసుకొని ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయవచ్చు . 


ఆరోగ్య శ్రీ కార్డుల eKYC కు అందుబాటులో లేకపోతే వారికి Death / Migration చేసే విధానం :



Aarogya Sri Cards eKYC Report Link : 

Click Here


మరింత సమాచారం >>
close