AP Caste Survey 2024 Process AP Caste Survey 2024 Process

AP Caste Survey 2024 Process



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నటువంటి కుల గణన సర్వే ఇప్పటివరకు కేవలం రాష్ట్రవ్యాప్తంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నటువంటి వారికి మాత్రమే చేయుటకు అవకాశం ఉండేది. హౌస్ మ్యాపింగ్ లో లేనటువంటి వారికి కూడా కుల గణన సర్వే చేయుటకు ఆప్షన్ ప్రభుత్వం కొత్తగా ఇవ్వటం జరిగినది. ఎవరైతే కుల గణన సర్వేలో భాగం అవ్వాలి అనుకుంటున్నారో వారికి వారుగా ఆన్లైన్ లో వారి వివరాలు నమోదు చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఏ విధంగా నమోదు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


Step 1 : హౌస్ మ్యాపింగ్ లో లేనటువంటి వారు కుల గణన సర్వే 2024లో దరఖాస్తు చేసుకోవటానికి ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.

Click Here

Step 2 : Applications ఆప్షన్ లో Caste Survey - Members not in household 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


Step 3 : Caste Survey - 2024 Details అనే పేజీ లో ఎవరికి దరఖాస్తు చేయాలో వారి యొక్క Aadhaar Number ఎంటర్ చేయాలి. Tick చేసి Get Details పై ఎంటర్ చేయాలి.

Step 4 : హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పేరు నమోదు చేయకపోతే మాత్రమే ఇక్కడ వివరాలు నమోదు చేయుటకు ఆప్షన్ ఉంటుంది. ఆధార్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. ఆ OTP ను ఎంటర్ చేసి Verify OTP పై క్లిక్ చేయాలి.

Step 5 : Data Loaded Successfully అని వస్తుంది. OK పై క్లిక్ చేయాలి.

Step 6 : అభ్యర్థి యొక్క పేరు,పుట్టిన తేదీ, లింగము మరియు చిరునామా వివరాలు ఆధార్ కార్డు ప్రకారము Basic Details From Aadhaar సెక్షన్ లో చూపిస్తుంది.

Step 7 : తరువాత Survey Details to Fill పేజీ ఓపెన్ అవుతుంది. అందులో కింద తెలిపిన ప్రశ్నలు అడుగుతుంది

  1. జిల్లా పేరు
  2. మండలము లేదా మున్సిపాలిటీ పేరు
  3. పంచాయతీ పేరు
  4. సచివాలయం పేరు
  5. హేబిటేషన్ పేరు
  6. వార్డు నెంబరు
  7. డోర్ నెంబరు
  8. వీధి పేరు
  9. PIN Code
  10. మొబైల్ నెంబర్
  11. ఇంటి రకము 
  12. మరుగుదొడ్డి వసతి 
  13. తాగునీటి వసతి 
  14. గ్యాస్ సదుపాయము 
  15. వివాహ స్థితి
  16. మతము
  17. కులము
  18. ఉప కులము
  19. విద్యా అర్హత 
  20. వృత్తి
  21. వ్యవసాయ భూమి
  22. ఇంటి స్థల భూమి

పై వివరాలు నమోదు చేయు సమయంలో డ్రాప్ డౌన్ చూపిస్తుంది దానిలో మీకు అనుగుణంగా వివరాలు సెలెక్ట్ చేసుకోవచ్చు.


Step 8 : చివరగా డిక్లరేషన్ పై టిక్ చేసి సబ్మిట్ చేయాలి. తరువాత Your AP Caste Survey 2024 details Submitted Successfully అని వస్తే సర్వే పూర్తి అయినట్టు.



View More