Seva Mitra, Seva Ratna and Seva Vajra - Volunteer Awards 2024 - Grama Ward Volunteers Appreciation Program
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి 2.5 లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి ఏటా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఇస్తున్నటువంటి సేవ పురస్కారాలకు సంబంధించినటువంటి అమౌంట్ ను ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం విడుదల చెయ్యనుంది. 2024 ఫిబ్రవరి నెల 15న గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో పర్యటనలో భాగంగా వాలంటీర్లకు అవార్డులు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్. పది రోజుల పాటు జరగనున్న అవార్డుల పంపిణీ.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ కనబరిచినటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ప్రతి ఏటా సేవ వజ్ర, సేవ రత్న, సేవ మిత్రా అనే మూడు కేటగిరీలలో వాలంటీర్లకు అవార్డులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటివరకు సేవా వజ్ర కింద 45 వేల రూపాయలు, సేవా రత్న కింద 30 వేల రూపాయలు, సేవా మిత్ర కింద 15వేల రూపాయలు వాలంటీర్లకు అందజేస్తున్న విషయం తెలిసినదే.
2024 సంవత్సరం లో పెంపు జరిగింది ఇలా...
- సేవ వజ్ర - ₹30,000 నుంచి ₹45,000 రూపాయలు వరకు
- సేవ రత్న - ₹20,000 నుంచి ₹30,000 రూపాయలు వరకు
- సేవ మిత్ర - ₹10,000 నుంచి ₹15,000 రూపాయలు వరకు
సేవ వజ్ర / Seva Vajra Award :
- వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన.. మొదటి ఐదు మంది వాలంటీర్లను సేవా వజ్ర పేరుతో సత్కరిస్తారు.
- వారికి 45 వేల రూపాయల నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ అందిస్తారు.
- మొత్తం 175 నియోజకవర్గాల పరిధిలో 875 మందికి సేవావజ్ర పురస్కారాలు అందిస్తారు.
- అయితే ఈ ఏడాది 30 వేల రూపాయలను పెంచి 45 వేలుగా ఇవ్వనున్నారు.
సేవ రత్న / Seva Ratna Award :
- ఇక రెండో విభాగమైన సేవా రత్న కింద ప్రతి మున్సిపాలిటీ, మండలం పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన ఐదుగురు వాలంటీర్లను, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పదిమంది వాలంటీర్లను గుర్తించి, వారికి 30 వేల నగదు బహుమతి, సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్తో సత్కరిస్తారు.
- మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 4150 మంది వాలంటీర్లకు సేవారత్న అవార్డు అందిస్తారు.
- ఈ ఏడాది సేవ రత్న అవార్డు కింద ఇచ్చే అమౌంట్ ను 20 వేల నుంచి 30 వేలకు పెంచారు.
సేవ మిత్ర / Seva Mitra Award :
- మూడో విభాగమైన సేవా మిత్ర కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,50,439 మందికి వాలంటీర్లకు 15వేల రూపాయల నగదు బహుమతి అందిస్తారు.
- అలాగే సర్టిఫికేట్, మెడల్, శాలువా, బ్యాడ్జ్లతో సత్కరిస్తారు. అయితే ఏడాది పాటు ప్రజల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రాని వాలంటీర్లకు సేవామిత్ర కింద అవార్డులు అందిస్తారు.
- ఈ ఏడాది సేవ రత్నాలకు 10 వేలకు బదులుగా 15 వేలు ఇవ్వనున్నారు.
వాలంటీర్ అవార్డులు ఎప్పుడు ప్రకటిస్తారు ?
2024 సంవత్సరానికి సంబంధించి వాలంటీర్ సేవ పురస్కారాలను ఫిబ్రవరి 15 తేదీన ప్రకటించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలిపింది.మార్చి నెలలోపు అందరి ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సేవ అవార్డులకు సంబంధించినటువంటి అమౌంట్ ను జమ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి 10 రోజుల పాటు నగదు పంపిణి జరుగుతుంది .
అవార్డుతోపాటు నగదు పురస్కారం :
- కనీసం ఏడాదిపాటు వాలంటీర్‌గా పనిచేస్తూ ఎటువంటి ఫిర్యాదులకు తావులేని వలంటీర్లను ఈ ఏడాది సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- కేవలం గౌరవ వేతనంతోనే నిస్వార్థంగా పనిచేస్తున్న వలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఈ సత్కారాలను నిర్వహిస్తోంది. దీంతోపాటు వాలంటీర్ల హాజరు, పింఛన్ పంపిణీ, ఇతర సర్వేలను పరిగణనలోకి తీసుకుంటారు.
- ఇలా ప్రతి నియోజకవర్గం ఐదుగురు చొప్పున 875 మంది వాలంటీర్లకు ‘సేవా వజ్ర’ (Seva Vajra Award) పురస్కారం, రూ.30 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్..
- ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఐదుగురు చొప్పున, నగరపాలక సంస్థ నుంచి 10 మంది చొప్పున ఎంపిక చేసి మొత్తంగా 4,220 మందికి ‘సేవారత్న’ అవార్డు ( Seva Ratna Award ), రూ. 20 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్ ఇవ్వనుంది.
- అయితే ఈసారి సేవా మిత్ర కింద కూడా రూ.20వేలు ఇచ్చినట్టు అయితే సుమారు 2 లక్షల మందికి ‘సేవావిుత్ర’ పురస్కారం ( Seva Mitra Award ), రూ.20 వేల నగదు అందె అవకాశం ఉంది.
జిల్లాల వారీగా Seva Mitra , Seva Ratna , Seva Vajra అవార్డు గ్రహీతల లిస్ట్ - 2024 : Grama Ward Volunteer Awards lists 2024 :
కింద జిల్లా పేరు పక్కన ఇచ్చిన Seva Mitra - Seva Ratna - Seva Vajra పై క్లిక్ చేస్తే లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది .
- కృష్ణ జిల్లా - Krishna - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- అన్నమయ్య జిల్లా - Annamaya - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- గుంటూరు జిల్లా - Guntur - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- తిరుపతి జిల్లా - Tirupathi - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- శ్రీ సత్య సాయి జిల్లా - Sri Sathya Sai - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- నెల్లూరు జిల్లా - Nellore - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- విజయనగరం జిల్లా - Vizianagaram - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- కోనసీమ జిల్లా - Konaseema - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- ఎన్టీఆర్ జిల్లా - NTR - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- కర్నూల్ జిల్లా - Kurnool - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- అల్లూరి సీతారామరాజు జిల్లా - Alluri Seetharama Raju - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- పార్వతీపురం మన్యం జిల్లా - Parvathipuram Manyam - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- కాకినాడ జిల్లా - kakinada - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- విశాఖపట్నం జిల్లా - Visakhapatnam - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- ఏలూరు జిల్లా - Eluru - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- చిత్తూర్ జిల్లా - Chittoor - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- ప్రకాశం జిల్లా - Prakasam - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- శ్రీకాకుళం జిల్లా - Srikakulam - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- బాపట్ల జిల్లా - Bapatla - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- అనకాపల్లి జిల్లా - Anakapalli - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- పశ్చిమ గోదావరి జిల్లా - West Godavari - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- వైస్సార్ కడప జిల్లా - YSR Kadapa - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- పల్నాడు జిల్లా - Palnadu - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- అనంతపురం జిల్లా - Ananthapuramu - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- తూర్పు గోదావరి జిల్లా - East Godavari - Seva Mitra - Seva Ratna - Seva Vajra
- నంద్యాల జిల్లా - Nandyal - Seva Mitra - Seva Ratna - Seva Vajra
Note : ఒక్కొక్క జిల్లాల వారీగా లిస్టులు విడుదల అవుతున్నాయి అయిన వెంటనే ఇదే పేజీలో అప్డేట్ చేయడం జరుగును. కావున ఈ పేజీను సేవ్ చేసుకోగలరు. Search ఆప్షన్ ద్వారా మీ మీ పేర్లు సెర్చ్ చెయ్యగలరు .
Seva Mitra , Seva Ratna , Seva Vajra 2024 Volunteer Awards లిస్ట్ లో పేరు రాని వారు ఎం చేయాలి ?
2024 సంవత్సరానికి సంబంధించి Seva Mitra , Seva Ratna , Seva Vajra 2024 Volunteer Awards Lists లో పేరు రాని గ్రామా లేదా వార్డు వాలంటీర్లు వారి సచివాలయం కు ట్యాగ్ చేసిన MLO వారికి తెలియాజేసినట్టు అయితే వారు FOA ద్వారా లిస్ట్ లో పేర్లు జోడించే అవకాశం ఉంటుంది . లేదా పేర్లు రాని వారు వారి దరఖాస్తు ను సంబంధిత DDO వారికి అందిస్తే వారి ద్వారా MPDO / MC వారికి , వారి ద్వారా జిల్లా గ్రామా వార్డు సచివాలయ నోడల్ అధికారి వారికి అందితే వారు స్టేట్ టీం వారికి తెలియజేసి అర్హులు అయినవారికి లిస్ట్ లో జోడించే అవకాశం ఉంటుంది.
AP Volunteer Awards 2024 Payment Status - Seva Mitra , Seva Ratna , Seva Vajra 2024 Payment Status :
అవార్డులకు సంబంధించి నగదు 2024 ఫిబ్రవరి 15 నుంచి మొదలు అయ్యి 10 రోజుల వరకు అనగా ఫిబ్రవరి 25 వరకు గ్రామా వార్డు వాలంటీర్ల బ్యాంకు ఖాతా లో జమ అవుతూ ఉంటుంది . అయితే Seva Mitra , Seva Ratna , Seva Vajra పొందే వాలంటీర్ల పేమెంట్ స్టేటస్ తెలుసుకునేందుకు కింద లింక్ ఓపెన్ చేసి
Beneficiary Search వద్ద Enter Beneficiary Code ను సెలెక్ట్ చేసుకోవాలి Beneficiary Code వద్ద వాలంటీర్ వారి CFMS ID ను చేయాలి .Month/Year వద్ద 02/2024 ను ఎంచుకోవాలి తరువాత Display పై క్లిక్ చేయాలి . పేమెంట్ వివరాలు చూపిస్తాయి , తరువాత పేమెంట్ అయిన వెంటనే SMS రూపం లో సందేశం వస్తుంది . అదే బ్యాంకు ఖాతా లో నగదు ను PhonePay , Gpay , PayTM లాంటి ప్లాట్ ఫార్మ్ లా ద్వారా కానీ , లేదా బ్యాంకు ఖత కు లింక్ అయినా మొబైల్ నెంబర్ ద్వారా ఉచితం గా మిస్డ్ కాల్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు .
వాలంటీర్స్ అవార్డ్స్ అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది ?
- ముఖ్య మంత్రి గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ కు వందనం కార్యక్రమం ఫిబ్రవరి 15 న నిర్వహించడం జరిగింది.
- 15 నుండి షెడ్యూల్ వైస్ గా సేవ వజ్ర , సేవ రత్న పొందిన జిల్లా స్థాయిలో వాలంటీర్స్ కు జిల్లా కలెక్టర్లు మరియు ప్రజా ప్రతినిధుల సమక్షంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
- ఆ తర్వాత ప్రతి నియోజకవర్గం వారీగా / మండల వారీగా M. L. A 's ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
- ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నుండి వాలంటీర్స్ కు అమౌంట్ క్రెడిట్ అవుతుంది గమనించగలరు.
వాలంటీర్లకు అందనం కార్యక్రమం ప్రభుత్వ ఉత్తరువులు :
Volunteers Appreciation Program Circular :
...