Aarogya Sri Card eKYC Process Aarogya Sri Card eKYC Process

Aarogya Sri Card eKYC Process

Aarogya Sri Card eKYC Process


Arogyasri Photo not available members eKYC Process by GSWS Volunteers

Aarogy Sri Cards eKYC Latest News 

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డుల పరిధి ను 5 లక్షల నుండి 25 లక్షలకు పెంచిన విషయం అందరికీ తెలిసినదే. దానికి అనుగుణంగా పెరిగినటువంటి పరిధితో కూడిన కొత్త PVC కార్డులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల లబ్ధిదారులకు గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్న విషయం తెలిసినదే.
  • ప్రభుత్వం అందించినటువంటి కొత్త కార్డులలో కుటుంబ పెద్ద యొక్క ఫోటోలు లేకుండా కొన్ని వచ్చి ఉన్నాయి. అటువంటి కార్డులకు గ్రామ వార్డు వాలంటీర్లు కుటుంబ పెద్ద తో ఫోటో / ఈ-కేవైసీ తీసుకొని సబ్మిట్ చేసినట్టయితే కొత్త కార్డులు కుటుంబ పెద్ద ఫోటోతో రావడం జరుగుతుంది.
  • దీనికి అనుగుణంగా తేదీ ఫిబ్రవరి 17 2024 నాడు గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ నందు గ్రామ వార్డు వాలంటీర్ వారి లాగిన్ లో లబ్ధిదారుని ఫోటో / ఈ-కేవైసీ తీసుకొనుటకు ఆప్షన్ కొత్తగా ఇవ్వటం జరిగినది.


 Aarogya Sri Cards Photo Not Available eKYC Process / ఈ కేవైసీ తీసుకునే విధానము

Step 1 : ముందుగా గ్రామ వార్డు వాలంటీర్ వారు కింద ఇవ్వబడిన కొత్తగా అప్డేట్ అయిన GSWS Volunteer App డౌన్లోడ్ చేసుకోవాలి.

Download GSWS Volunteer App

Step 2 : వాలంటీర్ వారి CFMS ఐడి తో బయోమెట్రిక్ / ఐరిష్ / ఆధార్ ఫేస్ ద్వారా లాగిన్ అవ్వాలి. లాగిన్ విజయవంతంగా అయిన తర్వాత హోం పేజీలో ఉన్నటువంటి ఆరోగ్య శ్రీ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. 


Step 3 : ఆరోగ్యశ్రీ అనే ఆప్షన్పై టిక్ చేసిన వెంటనే రెండు ఆప్షన్లో చూపిస్తాయి. అవి

1. Acknowledgment of Beneficiary

2. eKYC For Photos Missing Beneficiaries

సిటిజన్ కు కొత్త 25 లక్షల కార్డులు ఇచ్చే సమయంలో ఈ కేవైసీ తీసుకోటానికి 1. Acknowledgment of Beneficiary ఆప్షన్ ను ఎంచుకోవాలి. అదే ఆరోగ్యశ్రీ కార్డు మీద లబ్ధిదారుని ఫోటో లేకపోయినట్లయితే అప్పుడు 2. eKYC For Photos Missing Beneficiaries అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.


Step 4 : eKYC For Photos Missing Beneficiaries పైటిక్ చేసిన వెంటనే కింద చూపిన విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. Select Type Of Search Aadhaar Number / Aarogya Sri Card Numbers ఉంటాయి.లబ్ధిదారుని సంబంధించి పై రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి, ఆధార్ కార్డు నెంబరు లేదా ఆరోగ్యశ్రీ కార్డు నెంబరు ఎంటర్ చేయాలి.

Step 5 : వెంటనే కింద చూపబడిన కుటుంబ పెద్ద eKYC కు అందుబాటులో ఉన్నారా ?

అనే ప్రశ్న అడుగుతుంది అందుబాటులో ఉన్నట్టయితే "అవును" అని అందుబాటులో లేకపోతే "కాదు" అని సెలెక్ట్ చేయాలి.

Step 6 : అందుబాటులో ఉన్నట్టయితే బయోమెట్రిక్ లేదా ఐరిష్ లేదా ఆధార్ ఫేసు లేదా ఆధార్ ఓటీపీలో ఏదైనా ఒక ఆప్షన్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయాలి.

Step 7 : అందుబాటులో లేకపోయినట్టు అయితే లేరు అని సెలెక్ట్ చేసి అదే ఇంటిలో అందుబాటులో ఉన్న మిగతా కుటుంబ సభ్యులలో ఒకరి పేరును సెలెక్ట్ చేసి ఈ కేవైసి పూర్తి చేయాలి.

ఇలా వారి క్లస్టర్ పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డు పై ఫోటో రాని  ఆరోగ్యశ్రీ కార్డులు అన్నిటికీ కూడా ఈ కేవైసీ తీసుకోవాలి. ఇంతటితో వాలంటీర్ యొక్క పని పూర్తి అయినట్టు. 


Aarogya Sri Cards Photo Mismatch eKYC Report :

Click Here