GSWS Volunteers Salary Status , Working Status GSWS Volunteers Salary Status , Working Status

GSWS Volunteers Salary Status , Working Status

GSWS Volunteers Salary Status , Working Status

Gram Ward Volunteers Salaries,Resign and Working Status Update

రాజినామ చేయని వాలంటీర్స్ అందరికి గౌరవ వేతనం క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు గ్రామా వార్డు వాలంటీర్లు ఎన్నికల విధులకు మరియు రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఆదేశాలను ఉల్లంఘించిన వాలంటీర్లకు వెంటనే విధుల నుండి తొలగించడం జరుగుతుంది.DDO వారి లాగిన్ లొ గ్రామ వార్డు వాలంటీర్లను తొలగించిన వెంటనే ఆయా నెలకు సంబంధించి జీతాల బిల్లులో వాలంటీర్ల పేర్లు కనిపించవు. అదేవిధంగా నెలలో ఏ రోజు విధుల నుండి తొలగించిన ఆ నెలకు సంబంధించి గౌరవ వేతనం పూర్తిగా వారి ఎకౌంట్ కు క్రెడిట్ అవ్వదు. 

అలాగే వాలంటీర్స్ ని కూడా ప్రభుత్వం లో ఒక భాగంగా చేస్తూ వారికీ కూడా కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అయ్యే వరకూ గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుంది. అందులో భాగంగా మార్చి, ఏప్రిల్ నెల గౌరవ వేతనం కూడా క్రెడిట్ చేయ్యటం జరిగింది. మే నెల కి సంబందించిన గౌరవ వేతనం కూడా రాజీనామా చేయని గ్రామా / వార్డు వాలంటీర్లకు క్రెడిట్ అవుతుంది.


ఎటువంటి లాగిన్ లేకుండా  వాలంటీర్లు ప్రస్తుతం పని చేస్తున్నారా ? లేదా రాజీనామా చేసారా ? అని తెలుసుకొనే విధానము :

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకును ఓపెన్ చేయవలెను. 

Volunteers Working Status Link

Step 2 : కింద తెలిపిన విధముగా వెబ్సైటు ఓపెన్ అవుతుంది.

Step 3 Search By వద్ద గ్రామా / వార్డు వాలంటీర్ యొక్క CFMS ID లేదా ఆధార్ నెంబర్ పెంచుకోవాలి. Enter Field వద్ద ముందుగా ఏది సెలెక్ట్ చేస్తే దానికి అనుగుణంగా CFMS ID / ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి  Get Details  పై క్లిక్ చేయాలి. 


Step 4 : వెంటనే కింద తెలిపిన వాలంటీర్ వివరాలు వస్తాయి

  1. CFMS ID
  2. Date of Joining (DD/MM/YYYY)
  3. Bank IFSC Code
  4. Secretariat
  5. District
  6. Panchayat / Municipality Name
  7. Volunteer Status
  8. DDO Code
  9. Terminated Date
  10. Name
  11. Aadhar Number
  12. Bank Account Number
  13. Cluster
  14. Mandal
  15. DDO Name
  16. Position ID
  17. Secretariat Code 

వివరాలు వస్తాయి. 

కింద చూపిన విధముగా Volunteer Status వద్ద Active అని ఉంటే ప్రస్తుతం సచివాలయంలో వాలంటీరు పనిచేస్తున్నాడు అని అర్థము. వీరికి June 2024 నెల జీతము జూన్ మొదటి వారం లొ క్రెడిట్ అవుతుంది. 

కింద చూపిన విధముగా Volunteer Status వద్ద Terminated అని ఉంటే వాలంటీరు రాజీనామా చేశారు అని అర్థము లేదా విధుల నుండి తొలగించడం జరిగినది అని అర్థము. Terminated Date వద్ద ఏ రోజు రాజీనామా చేశారు ఆ తేదీ ఉంటుంది. వీరికి ఏ నెల నుంచి విధుల నుంచి తొలగించారు ఆ నెల నుండి జీతము రాదు. 


వాలంటీర్లు గమనించాల్సింది ఏమిటంటే నెలలో ఏ రోజు రాజీనామా చేసిన DDO వారి లాగిన్ లో వాలంటీర్లను ఉద్యోగుల జాబితా నుండి తీసివేసినట్టయితే ఆ నెలకు సంబంధించి వాలంటీర్ల జీతము అనేది క్రెడిట్ అవ్వదు. వాలంటీర్లు ఎన్ని రోజులు పనిచేశారు అన్ని రోజులకు మాత్రమే జీతం క్రెడిట్ అవ్వాలి అంటే తప్పనిసరిగా DDO వారు ఆ నెల మొత్తానికి జీతం పెట్టేవరకు ఆ వాలంటీర్ను ఉద్యోగుల లిస్టు నుండి తీసివేయరాదు. ఎన్ని రోజులు పనిచేశారో అన్ని రోజులకు జీతం పెట్టిన తరువాత నెల ఆఖరులో రాజీనామా చేసిన తేదీను నమోదు చేసి ఆయా వాలంటీర్ను విధుల నుండి తొలగించవచ్చు. 


DDO లాగిన్ లొ వాలంటీర్ల రాజీనామ స్థితి తెలుసుకొనే విధానము : 

ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. 

Nidhi Portal Link

Step 1 : DDO వారి CFMS ID మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఎటువంటి ఓటీపీ అడగదు. 


Step 2 : HR & Payroll ను ఎంచుకోవాలి.



Step 3 : Employee Transfer Out Actions ను సెలెక్ట్ చేయాలి.



Step 4 : DDO Code వద్ద పంచాయతీ ను ఎంచుకోవాలి. 



Step 5 : View Actions పై టిక్ చేయాలి. 



Step 6 : Status వద్ద ప్రస్తుత ఉద్యోగుల వర్కింగ్ స్టేటస్ తెలుస్తుంది.




వాలంటీర్ల శాలరీ స్థితి తెలుసుకునే విధానము : 

గ్రామ/వార్డ్ వాలంటీర్ యొక్క గౌరవ వేతన స్థితిని (Payment Status), సచివాలయ సిబ్బంది యొక్క సాలరీ (స్టేటస్) మరియు ఇతర సిటిజెన్ బిల్ స్టేటస్ తెలుసుకునేందుకు ఆను లైన్ లో అవకాశం ఉన్నది.

ఈ ప్రాసెస్ ద్వారా కింద తెలిపిన విషయాలు తెలుసుకోవచ్చు

  1. బిల్ పెట్టారా ? లేదా?
  2. బిల్ పెడితే ఏ తరీకున అప్రూవ్ అయినది?
  3. ఏ కారనాల చేతనైన రిజెక్ట్ అయినది?
  4. పేమెంట్ ఏ రోజున జరిగినది?
  5. డిడిఓ కోడ్
  6.  పేమెంట్ మొత్తం 
  7. బిల్ నెంబర్
  8. మొత్తం ఎర్నింగ్ మరియు డిడక్షన్ ఎంత ?
  9.  ఎవరు ఎప్పుడు బిల్ చేసారు ?

అను అంశాలను ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి గ్రామ/వార్డ్ వాలంటీర్ యొక్క CFMS ID లేదా సచివాలయ సిబ్బంది యొక్క CFMS ID నమోదు చేసి చెక్ చెయ్యవచ్చు.

Click Here For Salary Status

వెంటనే కింద చూపిన పేజీ ఓపెన్ అవుతుంది .

ఇక్కడ Beneficiary Search దగ్గర Enter Beneficiary Code అదే సెలెక్ట్ అయి వుంటుంది దానిని అలాగే వుంచి, Beneficiary Code దగ్గర వాలంటీర్ యొక్క CFMS ID లేదా సచివాలయ సిబ్బంది యొక్క CFMS ID ను నమోదు చేసి MONTH/YEAR దగ్గర ఏ నెల యొక్క గౌరవ వేతన స్థితిని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ నెలను ఎంచుకుని Display బటన్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా పేమెంట్ స్టేటస్ కనిపించును.


View More

Post a Comment

0 Comments