e-shram card apply online in telugu
కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో e-SHRAM ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజలకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3000 పింఛను. ఇ-శ్రామ్ కార్డ్ యొక్క లబ్ధిదారుడు మరణిస్తే మరణ బీమా రూ.2,00,000 ఆర్థిక సహాయం మరియు కార్మికుడు పాక్షికంగా వికలాంగుడైనట్లయితే రూ.1,00,000 అందుతుంది . ప్రయోజనాలు అతని/ఆమె జీవిత భాగస్వామికి అందించబడతాయి. లబ్ధిదారులు భారతదేశం అంతటా చెల్లుబాటు అయ్యే 12-అంకెల UAN నంబర్‌ను కూడా అందుకుంటారు.
e Shram Card Eligibility
- భవన మరియు నిర్మాణ కార్మికులు,
- వలస కార్మికులు,
- చిన్న మరియు సన్నకారు రైతులు,
- వ్యవసాయ కూలీలు,
- కౌలు రైతు,
- మత్స్యకారులు,
- పశుపోషణలో నిమగ్నమైన వారు,
- బీడీ రోలింగ్ లేబులింగ్ మరియు ప్యాకింగ్;
- భవన మరియు నిర్మాణ కార్మికులు;
- తోలు కార్మికులు,
- వడ్రంగి;
- ఉప్పు కార్మికులు,
- ఇటుక బట్టీలు మరియు రాతి క్వారీలలో కార్మికులు,
- సా మిల్లులలో కార్మికులు;
- మంత్రసానులు;
- క్షురకులు,
- కూరగాయలు మరియు పండ్ల విక్రేతలు;
- వార్తాపత్రిక విక్రేతలు,
- రిక్షా పుల్లర్లు;
- ఆటో డ్రైవర్లు;
- సెరికల్చర్ కార్మికులు;
- వడ్రంగులు;
- చర్మ శుద్ధి కార్మికులు;
- సాధారణ సేవా కేంద్రాలు;
- వీధి వర్తకులు;
- MNGRGA కార్మికులు;
- ఇళ్లలో పనిచేసే పనిమనుషులు,
- అగ్రికల్చరల్ వర్కర్స్,
- స్ట్రీట్ వెండోర్స్,
- ఆశ వర్కర్స్,
- అంగన్వాడీ వర్కర్స్,
- మత్స్య కార్మికులు,
- ప్లాంటేషన్ వర్కర్స్,
- ఇళ్లకు తిరిగి పాలు పోయు వారు ,
- హమాలీలు,
- లఘు వ్యాపారస్తులు మొదలైనవారు.
- ESI & EPF సభ్యత్వం లేనివారు అర్హులు
- 16-59 సంవత్సర మధ్య వయస్కులు ఈ పథకమునకు అర్హులు పుట్టిన తేదీ (26-08-1961 to 25-08-2005) మధ్య ఉన్నవారు అర్హులు
e Shram Card Apply online Documents Required
- ఆధార్ కార్డు
- బ్యాంకు పాస్ బుక్
- ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్
- అప్లికేషన్ ఫారం
e-shram card apply online Process in Telugu
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి e Shram Card Apply online Link పై క్లిక్ చెయ్యండి .
Step 2 : అందులో Self Registration వద్ద ఆధార్ నెంబర్ తో లింక్ అయిన మొబైక్ నెంబర్ ఎంటర్ చేసి , CAPTCHA కోడ్ టచ్ చేసి గెట్ వాటిపై క్లిక్ చేయాలి. ఓటిపి ఎంటర్ చేసి కన్ఫార్మ్ చేసిన తర్వాత ఆధార్ ఈ కేవైసీ ఆప్షన్ చూపిస్తుంది.
Step 3 : ఆధార్ ఈ కేవైసీ వివరాలు చూపిస్తాయి అందులో బ్యాంకు వివరాలు, ఆధార్ యొక్క చివరి నాలుగు అంకెలు మరియు బ్యాంకు ఆధార్ లింక్ స్టేటస్ చూపిస్తాయి. Agree పై క్లిక్ చేసి Continue To Enter Other Details పై క్లిక్ చేయాలి
Step 4 : Personal Information లో భాగంగా
మొబైల్ నెంబర్ను
ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ( Optional)
ఈమెయిల్ ( Optinal )
వివాహం స్థితి
తండ్రి పేరు
రిజర్వేషన్
దివ్యంగ స్థితి నామినీ వివరాలు ఇవ్వాలి
Step 5 : Residential Detail లో భాగం గా
ఇంటి నెంబరు
లొకాలిటీ
రాష్ట్రము
జిల్లా
మండలము
పిన్ కోడ్
ప్రస్తుత చిరునామాల ఉన్నటువంటి సంవత్సరాలు వలస కార్మికులు కాదా అవునా ఇవ్వాలి.
Step 6 : Educational Qualifications లో భాగం గా
విద్యా అర్హత
నెలవారి జీతము స్లాబ్
నెలవారీ జీతం కు సంబంధించిన ప్రూఫ్ ఉన్నట్లయితే అప్లోడ్ చేయాలి.
Step 7 : Occupation Details లో భాగం గా
ప్రాథమిక వృత్తి,
ప్రాథమిక వృత్తిలో సంవత్సరాల అనుభవం,
ఇంకొక వృత్తి ఏదైనా చేసినట్లయితే దానిని తెలియ జేయాలి,
వృత్తి ఆధారిత సర్టిఫికెట్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేయాలి.
స్కిల్స్ ఉన్నట్లయితే వాటిని మెన్షన్ చేయాలి,
తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయాలి.
Step 8 : బ్యాంకు అకౌంట్ వివరాలు ఇవ్వాలి. ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఎకౌంటు active lo ఉన్నట్లయితే, అదే బ్యాంకు ను లింకు చేయాలనుకుంటే YES ఫై క్లిక్ చేసి SAVE & CONTINUE పై క్లిక్ చేయాలి. లేదా వేరొక బ్యాంకు ఎకౌంటు ఇవ్వాలి అనుకుంటే రిజిస్టర్ విత్ బ్యాంకు అకౌంట్ వద్ద నో ను సెలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చి SAVE & CONTINUE పై క్లిక్ చేయాలి.
Step 9 : ఇప్పటివరకు ఇచ్చిన వివరాలు అన్ని చూపిస్తాయి సరిచూసుకొని అన్నీ సరి పడినట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ వద్ద టిక్ ఇచ్చి సబ్మిట్ పై క్లిక్ చెయ్యాలి. ఒకవేళ వివరాలు తప్పుగా నమోదు అయినట్లయితే వెనుకకు వెళ్లి మరల వివరాలు ఇవ్వవలెను.
Step 10 : UAN కార్డు డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకోవలెను.