Free Gas scheme in Andhra pradesh Free Gas scheme in Andhra pradesh

Free Gas scheme in Andhra pradesh

Free Gas scheme in Andhra pradesh Apply Online, Eligibility , Application Status , Documents Need , Last Date etc..


Free Gas scheme in Andhra pradesh 


AP Free Gas Cylinder Scheme 2024

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ల పెంపు అమలు చేయగా.. అన్న క్యాంటీన్లను 2024 ఆగస్టు  నెల 15 నుంచి ప్రారంబించారు. అయితే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టారు. మహిళలకు ఇచ్చిన ముఖ్య  హామీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు Free Gas Cylinders in Andhra Pradesh. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను రూపొందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 


రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు.. వీటిలో దీపం పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే పథకం వర్తించదని తెలుస్తోంది. విద్యుత్ బిల్, ఆధార్‌తో లింకైన ఫోన్‌ నంబర్‌, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని చెబుతున్నారు. ఈ పథాకానికి సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు.


మీ రేషన్ కార్డ్ ద్వారా అర్హులో - కారో చూడండి  


ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. దీపావళి నుంచి మరో హామీని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. సూపర్ సిక్స్లోలో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్న చంద్రబాబు.. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులను కూడా చేపడతామని తెలిపారు. మరోవైపు ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో మహాశక్తి పథకం కింద మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి హమీ ఇచ్చింది. ఈ హామీని నెరవేరుస్తూ తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనుంది.


ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పై సీఎం గారి మాటల్లో  


మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మంచిపనులకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని చంద్రబాబు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం ఈ నెల 20 నుంచి 26 వరకూ నియోజకవర్గంలోని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.


గత అసెంబ్లీ సమావేశంలో  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు సిలిండర్లపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను అదించడం లేదని.. 2016 నుంచి 24 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంత మందికి ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎంయూఐ పథకం కింద మొదటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే వివిధ శాఖలతో చర్చించి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని.. సభా ముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తామన్నారు. తేదీ 18-09-2024 నాడు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పై  ప్రకటన చేశారు.  


సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి హామీలిచ్చారు. అయితే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్నారు. ఏపీ ఎన్నికల కంటే ఏడాది ముందుగానే హామీ ఇచ్చారు. . సూపర్ సిక్స్ పథకాల్లో ఇది కూడా ముఖ్యమైన హామీ. దీంతో ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చే పనిలో పడింది. ఇప్పుడు ఆదిశగా కసరత్తు మొదలు పెట్టింది. ప్రభుత్వం దీపావళి 2024 నుండి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు విదానం , కావాల్సిన డాక్యుమెంట్లు వాటిపై ఇంకనూ పూర్తి సమాచారం రావాల్సి ఉంది .