NPS Vatsalya Scheme NPS Vatsalya Scheme

NPS Vatsalya Scheme

NPS Vatsalya Scheme Eligibility , Benefits , Returns , Apply Process , Invest Amount , Conditions etc.. NPS Vatsalya Scheme Eligibility Apply Online Benefits Returns etc


NPS Vatsalya Scheme 

What is NPS Vatsalya Scheme ?

పిల్లల కోసం ఎన్పీఎస్ వాత్సల్యను NPS Vatsalya Scheme ను కేంద్ర ప్రభుత్వం తేదీ September 18,2024 న ప్రారంభించింది. పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ పెన్షన్ ఖాతాను వినియోగించుకోవచ్చు.రెగ్యులర్‌ 'నేషనల్ పెన్షన్ స్కీమ్‌'కు దీనిని ఒక ఎక్స్‌టెన్షన్‌గా తీసుకువచ్చింది. పిల్లలకు మంచి ఆర్థిక భవిష్యత్ కల్పించాలని ఆశించే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు. 18 నుంచి 70 ఏళ్లలోపు ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ సేవింగ్స్ కమ్ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌లో తమ పిల్లల పేరు మీద మదుపు చేయవచ్చు. 'ఎన్‌పీఎస్‌'లానే, ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకాన్ని కూడా 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (పీఎఫ్ఆర్‌డీఏ)యే నిర్వహిస్తుంది. ఈ స్కీమ్‌ ప్రత్యేకంగా పిల్లల కోసం, మైనర్ల కోసం రూపొందించారు. కనుక తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల పేరిట ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు. NPS Vatsalya Scheme ఖాతాను ఆన్లైన్లో లేదా బ్యాంక్ శాఖను లేదా పోస్టాఫీసులో ప్రారంభించొచ్చు. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాలో కనీసం రూ.1000 మదుపు చేయొచ్చు. భవిష్యత్లో మంచి ప్రతిఫలం అందుకోవాలనుకునేవారు ఎన్పీఎస్ ఖాతాను ఎంచుకోవచ్చు. 


ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో 2004లో జాతీయ పింఛను పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దీని ద్వారా పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు కల్పిస్తుండడంతో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో NPS Scheme మరింత విస్తరించాలనే లక్ష్యంతో చిన్న పిల్లలకు సైతం ఇందులో అవకాశం కల్పిస్తూ NPS Vatsalya Scheme పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తోంది కేంద్రం. Sukanya Samriddhi Yojana , Public Provident Fund PPF వంటి పథకాలకు ఇది అదనమని చెప్పవచ్చు. గడిచిన పదేళ్లలో 1.86 కోట్ల మంది ఎంపిక చేసుకున్నారని, వారి మదుపు విలువ రూ.13 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. ఎన్పీఎస్లో పెట్టుబడులు ఈక్విటీలో 14 శాతం, కార్పొరేట్ డెట్లో 9.1 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీల్లో 8.8 శాతం చొప్పున ప్రతిఫలం ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎన్పీఎస్ ఖాతాకు NPS Vatsalya Scheme అదనం. 


చిన్నారుల పేరు మీద ఎవరైనా ఖాతా తెరిస్తే వారికి 18 ఏళ్లు వచ్చాక సాధారణ ఖాతాగా మారుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించాయి. పథకం ప్రారంభం సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్ కొందరు చిన్నారుల పేరు మీద వాత్సల్య ఖాతాలను ప్రారంభించింది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా వాత్సల్య స్కీమ్లో ఎప్పటికప్పుడు మార్పులు చేపడతామని కేంద్రం తెలిపింది.


What is the Eligibility Of NPS Vatsalya Scheme  ?

  • ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం ప్రత్యేకంగా బాలబాలికల కోసం రూపొందించారు. ఈ కొత్త పథకం కింద, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖాతాలను తెరవవచ్చు. వారి పదవీ విరమణ పొదుపుకు సహకరించవచ్చు. ఇది వారికి మరింత ఆర్థిక బలాన్ని ఇస్తుంది.
  • తల్లిదండ్రులు, సంరక్షకులు, భారతీయ పౌరులు, NRIలు అందరూ తమ మైనర్ పిల్లల కోసం ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవడానికి అర్హులు.

What is NPS Vatsalya scheme benefits ?

  • NPS Vatsalya Scheme లో చేరడం ద్వారా ముందస్తుగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. దీని ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే వడ్డీపైన వడ్డీ లభిస్తుంది. 
  • మైనర్‌కు 18 ఏళ్లు నిండిన తర్వాత ఖాతాను సాధారణ NPS ఖాతాగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది లేటెర్మ్ రిటైర్మెంట్ ప్లాన్‌కి సాఫీగా మారడానికి వీలు కల్పిస్తుంది. రిటైర్మెంట్ నాటికి పెద్ద మెుత్తంలో డబ్బు చేతికి అందుతుంది. 
  • మైనర్లుగా ఉన్నప్పుడే ఈ ఖాతా తీసుకోవడం వల్ల పదవీ విరమణ నాటికి పెద్ద మొత్తంలో నగదు చేతికి అందుతుంది. అలాగే చిన్న తనం నుంచే పొదుపు అలవాటు చేసినట్లవుతుంది. 
  • సాధారణంగా ఎన్‌పీఎస్ స్కీమ్‌‌లో టైర్ 1, టైర్ 2 అనే రెండు ఖాతాలు ఉంటాయి. టైర్-1 ప్రాథమిక పింఛను అకౌంట్, ఇందులో చేరినపపుడు విత్ డ్రాలపై పరిమితులు ఉంటాయి. ఇక టైర్-2 అనేది స్వచ్ఛంద పొదుపు పథకం. 
  • ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీసీడీ (1బీ) ద్వారా రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. 
  • ఇది సెక్షన్ 80సీ కింద రూ.1,50,000లకు అదనం. అంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. 
  • రిటైర్మెంట్ తర్వాత అంటే 60 ఏళ్లు వచ్చాక ఎన్‌పీఎస్‌ నిధిలో 60 శాతం డబ్బులు ఒకేసారి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ పథకాలు కొనుగోలు చేయాలి. దీని ద్వారా నెల నెలా చేతికి స్థిరమైన పెన్షన్ లభిస్తుంది.



What is the Minimum Amount to Invest in NPS Vatsalya Scheme  ?

తల్లిదండ్రులు పిల్లల పేరు మీద సంవత్సరానికి రూ .1,000 పెట్టుబడి పెట్టడానికి కూడా అనుమతిస్తుందని అంటున్నారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్ డీఏ) ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.



What are the Conditions Of NPS Vatsalya Scheme  ?

  • NPS Vatsalya Scheme లో సంవత్సరానికి కనిష్ఠంగా రూ.1000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. అందువల్ల తల్లిదండ్రులు తమ ఆర్థిక స్తోమతకు తగినట్లుగా దీనిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. 
  • మైనర్లు లేదా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లల కోసం ఈ పథకంలో పెట్టుబడులు పెట్టాలంటే, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కచ్చితంగా తమ పేరుతో కేవైసీ (నో యువర్ కస్టమర్‌) పూర్తి చేయాల్సి ఉంటుంది. 
  • మీరు కావాలని అనుకుంటే మీ పిల్లల వయస్సు 18 ఏళ్లు దాటిన తరువాత ఈ స్కీమ్‌ నుంచి ఎగ్జిట్ కావచ్చు. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. మీకు వచ్చిన డబ్బులో 20 శాతాన్ని మాత్రమే వెనక్కు తీసుకోవచ్చు. మిగతా 80 శాతం డబ్బును కచ్చితంగా ఒక యాన్యుటీ ప్లాన్‌లో రీ-ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 
  • మీ పిల్లలకు 18 ఏళ్లు దాటక ముందు కూడా ఈ NPS Vatsalya Scheme నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇందుకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి. 
  • NPS Vatsalya Scheme లో చేరి, మూడేళ్లు గడచిన తరువాత, అప్పటి వరకు మీరు కట్టిన డబ్బులో 25 శాతాన్ని వెనక్కు తీసుకోవచ్చు. ఈ విధంగా మీ పిల్లలకు 18 ఏళ్లు వచ్చే లోపు 3 సార్లు డబ్బులు వెనక్కు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ పిల్లల చదువుల కోసం, వైద్య ఖర్చుల కోసం ఈ డబ్బులు వాడుకోవచ్చు. 
  • పీఎఫ్ఆర్‌డీఏ నిబంధనల ప్రకారం, పిల్లలు 75 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యానికి గురైనప్పుడు కూడా ఈ పథకం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. 
  • 18 ఏళ్లు దాటిన తరువాత మీ పిల్లల వయస్సు 18 ఏళ్లు దాటిన తరువాత ఈ ఎన్‌పీఎస్ వాత్సల్య అనేది రెగ్యులర్ ఎన్‌పీఎస్ స్కీమ్‌గా మారిపోతుంది. కనుక మీ పిల్లలు తమకు 18 ఏళ్లు దాటిన మూడు నెలల్లోపు కేవీసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. 
  • మీ పిల్లలు కావాలనుకుంటే అప్పటి వరకు కట్టిన డబ్బుల్లో 20 శాతాన్ని వెనక్కు తీసుకోవచ్చు. మిగతా 80 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లోనే కొనసాగించాలి. ఒక వేళ మీ మొత్తం కార్పస్ రూ.2.5 లక్షలలోపే ఉంటే, అప్పుడు ఆ మొత్తం డబ్బును వెనక్కు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 


NPS Vatsalya Return Calculator 

ఉదాహరణకు అప్పుడే పుట్టిన బిడ్డ పేరు మీదుగా తల్లిదండ్రులు NPS Vatsalya Scheme లో నెలకు రూ.1000 చొప్పున డబ్బులు పెట్టారని అనుకుందాం. 18 ఏళ్ల తరువాత ఆ బిడ్డకు ఎంత డబ్బు వస్తుందంటే? సంవత్సరానికి వచ్చే వడ్డీ - 12.86 శాతం (హిస్టారికల్ యావరేజ్‌ రేటు ప్రకారం) అనుకుంటే, మొత్తం పెట్టుబడి - (12 నెలలు X రూ.1000 X 18 సంవత్సరాలు) - రూ.2,16,000 మొత్తం వడ్డీ - రూ.6,32,718 మొత్తం కార్పస్ (నిధి) - రూ.8,48,000 .


ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ మొత్తం డబ్బులో మీరు 20 శాతాన్ని (రూ.1,69,600) మాత్రమే మీరు విత్‌డ్రా చేసుకోగలుగుతారు. మిగతా 80 శాతాన్ని (రూ.6,78,400) ఒక యాన్యుటీ స్కీమ్‌లో రీ-ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు రిటైర్ అయ్యేటప్పుడు పెద్ద మొత్తంలో రిటర్న్ వస్తుంది. 


How to get 11 Crores in NPS Vatsalya Scheme ?

మీరు కనుక సంవత్సరానికి రూ.10,000 చొప్పున మీ పిల్లల పేరు మీద NPS Vatsalya Scheme లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. రేట్ ఆఫ్ రిటర్న్‌ 12.86 శాతం చొప్పున లెక్కవేస్తే, మీ పిల్లలకు 60 ఏళ్లు వచ్చే నాటికి ఏకంగా రూ.11.05 కోట్లు లభిస్తాయి. నోట్‌ : ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఎంచుకున్న యాన్యుటీ ప్లాన్‌ను బట్టి ఈక్విటీల్లో, గవర్నమెంట్ సెక్యూరిటీల్లో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. వాటి పెర్ఫార్మెన్స్ బట్టి మీకు వచ్చే రిటర్నులు ఆధారపడి ఉంటాయి.


How to Apply NPS Vatsalya Scheme ?

NPS Vatsalya Scheme ఖాతాను ఆన్లైన్లో లేదా బ్యాంక్ శాఖను లేదా పోస్టాఫీసులో ప్రారంభించొచ్చు. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాలో కనీసం రూ.1000 మదుపు చేయొచ్చు. భవిష్యత్లో మంచి ప్రతిఫలం అందుకోవాలనుకునేవారు ఎన్పీఎస్ ఖాతాను ఎంచుకోవచ్చు.