How to Update Your Aadhaar Name Using a Bank Passbook: A Complete Guide
మన బ్యాంకు పాసుబుక్ Bank Passbook తో కూడా ఆధార్ కార్డులో పేరుని Aadhaar Name Update అప్డేట్ చేసుకోవచ్చు . బ్యాంకు పాస్ బుక్ లో మనకు కావాల్సిన విధముగా పేరు ఉంటే చాలు . ఆధార్ కార్డు Aadhaar Card లో బ్యాంకు పాస్ బుక్ Bank Passbook లో ఉన్నట్టుగా పేరుని అప్డేట్ చేసుకోవచ్చు . ఇక్కడ పేరు అప్డేట్ చేసుకోవడం అంటే ఉన్న పేరులో స్పెల్లింగ్ కరెక్షన్ చేయడం అని అర్థము . పూర్తిగా పేరు మొత్తాన్ని వేరే పేరుగా మార్చుకోవడానికి బ్యాంకు పాస్ బుక్ Bank Passbook తో అవ్వదు .
బ్యాంకు పాస్ బుక్ Bank Passbook తో మన ఆధార్ కార్డులో పేరుని Aadhaar Name Correction With Bank Passbook ఎలా మార్చుకోవాలి ? ఎక్కడ మార్చుకోవాలి? ఎంత ఛార్జ్ అవుతుంది ? సర్టిఫికెట్ ఎలా ఉండాలి ? ఎన్ని రోజుల్లో అప్డేట్ అవుతుంది ? అనే పూర్తి విషయాలు ఈ పోస్టులో చూద్దాం .
డాక్యుమెంట్స్ ఏం అవసరం అవుతాయి ?
![]() |
Bank Passbook |
![]() |
Bank eKYC Docuemnt |
మీ బ్యాంకు పాస్ బుక్ తో ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి తప్పనిసరిగా కింద తెలిపిన డాక్యుమెంట్లు ఉండాలి
- ప్రభుత్వ బ్యాంకు పాస్బుక్ ఒరిజినల్ ఉండాలి.
- బ్యాంకు పాసుబుక్కుపై తప్పనిసరిగా అప్లికేంట్ యొక్క ఫోటో మరియు బ్యాంకు ఉద్యోగి యొక్క సంతకము స్టాంపు ఉండాలి అప్పుడు మాత్రమే బ్యాంకు పాస్బుక్ చెల్లుబాటు అవుతుంది . బ్యాంకు పాస్ బుక్ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి.
- Bank eKYC Document కూడా ఉండాలి .
- Bank eKYC Document అంటే ఒక పేపర్ ఉంటుంది . మోడల్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు .దానిపై మీయొక్క ఫోటో అంటించి బ్యాంక్ మేనేజర్ వారి స్టాంపు మరియు సంతకం వేయిస్తే సరిపోతుంది.
- Application Form
Download Application & KYC Form
![]() |
Aadhaar Apploication Forms and kyc Document |
ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి ?
ఆధార్ కార్డులో Bank Passbook తో పేరు మార్చుకోవటానికి Aadhaar Name Correction With Bank Passbook సొంతంగా ఆన్లైన్ లో అవకాశం లేదు. కేవలం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ కు వెళ్లి మాత్రమే మీరు Bank Passbook తో ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది .
అప్లికేషన్ ఫీజు ఎంత ?
ఆధార్ కార్డులో Bank Passbook తో పేరు మార్చుకోవటానికి Aadhaar Name Correction With Bank Passbook అప్లికేషన్ ఫీజు ఆధార్ సెంటర్లో కేవలం 50 రూపాయలు మాత్రమే.
ప్రాసెస్ ఎలా ఉంటుంది ?
మొదటగా అప్లికేషన్ చేయువారు ఆధార్ సెంటర్ పైన చెప్పిన విధంగా ఉన్నటువంటి బ్యాంకు పాసుబుక్ Bank Passbook, Bank eKYC Document మరియు దరఖాస్తు ఫారం ను తీసుకొని వెళ్ళాలి.
⏬
దరఖాస్తు ఫారం ఫిల్ చేయాలి . [ ఫిల్ చేయు విధానము ]
⏬
ఆధార్ ఆపరేటర్ వారు అప్లికేషన్ చేస్తున్న వారి ఫోటో మరియు ఐరిష్ లేదా బయోమెట్రిక్ తీసుకుంటారు .
⏬
బ్యాంకు పాసుబుక్ Bank Passbook, Bank eKYC Document ఒరిజినల్ స్కాన్ చేస్తారు .
⏬
బ్యాంకు పాసుబుక్ Bank Passbook, Bank eKYC Document లో ఉన్నటువంటి పేరును నమోదు చేస్తారు.
⏬
ఆపరేటర్ వారి బయోమెట్రిక్ వేసి దృవీకరణ చేస్తారు .
⏬
చివరగా రసీదు ప్రింట్ వస్తుంది . రసీదు పై ఆపరేటర్ మరియు దరఖాస్తుదారుని సంతకం చేసి అప్లోడ్ చేస్తారు .
⏬
50 రూపాయల ఫీజు తీసుకుంటారు.
⏬
ఆధార్ ఆపరేటర్ వారు రసీదును అప్లికేట్కు ఇస్తారు .
ఎన్ని రోజుల్లో పేరు అప్డేట్ అవుతుంది ?
ఆధార్ కార్డులో Bank Passbook తో పేరు మార్చుకోవటానికి Aadhaar Name Correction With Bank Passbook సాధారణంగా ఆధార్ కార్డులో పేరు అప్డేట్ అవ్వటానికి రెండు రోజుల నుంచి పది రోజుల సమయం పడుతుంది డాక్యుమెంట్లో ఏదైనా సమస్య ఉన్న లేదా బయోమెట్రిక్ సమస్య ఉన్న పది రోజులకు మించి 90 రోజుల వరకు సమయం పడుతుంది .
అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ?
ఆధార్ కార్డులో Bank Passbook తో పేరు మార్చుకోవటానికి Aadhaar Name Correction With Bank Passbook అప్లికేషన్ స్టేటస్ను ఎవరికి వారు సొంతంగా మొబైల్ లోనే తెలుసుకోవచ్చు . అప్లికేషన్ స్టేటస్ తెలుసుకుని పూర్తి ప్రాసెస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Check Aadhaar Application Status
స్టటస్ తెలుసుకున్న తర్వాత పేరు మారినట్టు వచ్చినటువంటి ఫోటో కూడా పెట్టడం జరిగింది ఒకసారి చూడండి.
![]() |
Success Case Confimation |
Aadhaar Name Update With Bank Passbook Full Process Video
కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయినట్టు అయితే ఇటువంటి అప్డేట్లు మీకు రోజు అందుతాయి.