AP P4 Survey 2025 : Everything You Need to Know (Process, FAQs & Reports) AP P4 Survey 2025 : Everything You Need to Know (Process, FAQs & Reports)

AP P4 Survey 2025 : Everything You Need to Know (Process, FAQs & Reports)

 

AP P4 Survey 2025 AP P4 Survey Process AP P4 Survey Report AP P4 FAQs AP P4 Compliance Guide

AP P4 Model Survey 2025 

స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదరికంలో దిగువన ఉన్నటువంటి 20% కుటుంబాలను వెతికి వారి యొక్క స్థితిగతులు, ఆర్థిక ప్రమాణాలు పెంచేందుకుగాను వారిని ఎంచుకునేందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా AP P4 Survey 2025 సర్వేను ప్రారంభించింది. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేయనున్న P4 కోసం ఈనెల 8 నుంచి 18 వరకు [2వ విడత] చేపట్టనున్న సర్వే ప్రక్రియ శనివారం [ మర్చి 8, 2025 ]  ప్రారంభం అవుతుంది.  రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ భాగస్వామ్యం (పీ4)తో ఉగాది నుంచి ఈ కార్యక్రమం చేపట్టనుంది.  కుటుంబ వివరాలు, సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మొత్తం 27 ప్రశ్నల ద్వారా సమాచారం సేక రించనున్నట్టు తెలిపారు.  సర్వే పూర్తయ్యాక ఈనెల 21వ తేదీన సమాచార జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించనున్నారు .  ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామి కవేత్త ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని చెప్పారు. 


AP P4 Survey 2025 


సర్వే వివరాలు వివరాలు  
సర్వే ప్రారంభం మర్చి 8, 2025  [ 2వ విడత ]
సర్వే ముగింపు మర్చి 18 , 2025
జాబితా ప్రదర్శన   మర్చి 21 , 2025 [ గ్రామ సభలో ]    
సర్వే చేయువారు గ్రామా వార్డ్ సచివాలయ సిబ్బంది 
ఎవరికి  చేస్తారు  ఏపీ రాష్ట్ర ప్రజలకు   
ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబంలో ఒక
పారిశ్రామికవేత్తను
తయారు చేయడం
ప్రయోజనంపేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు,
ఆర్థిక సహాయం
వీడియో  
Click Here 


ఈ సర్వే ను మొదటి విడతలో 10 జిల్లాలలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరిని సర్వే చేయుటకు సర్వేయర్లుగా నియమిస్తూ GSWS Employees Latest Verions App నందు AP P4 Survey 2025 ఆప్షన్ను ఇవ్వటం జరిగినది. రెండవ విడత సర్వే మార్చి 08 , 2025 నుండి ప్రారంభం అవుతుంది . 


AP P4 Survey 2025 Last Date ఈ సర్వే ఫిబ్రవరి 20, 2025న ప్రారంభమై మార్చి 2, 2025న మొదటి విడతల ముగిస్తుంది. సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని క్లస్టర్లలో ఉన్న అన్ని కుటుంబాలకు ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుంది. ప్రజలు కూడా ఈ ఒక్క సర్వేలో భాగమై మీయొక్క ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలపై అడిగే ప్రశ్నలపై సరైన సమాధానాలు ఇచ్చి  ఆంధ్ర విజన్ 2047 లో భాగం అవ్వండి . 


AP P4 Survey 1st Phase Districts  

  1. అనంతపురం 
  2. అన్నమయ్య 
  3. చిత్తూరు 
  4. కర్నూలు 
  5. నంద్యాల 
  6. ప్రకాశం 
  7. నెల్లూరు 
  8. సత్యసాయి 
  9. తిరుపతి 
  10. వైఎస్ఆర్ కడప

2వ విడత P4 Survey మర్చి 8 నుండి మిగతా జిల్లా లలో ప్రారంభం అవ్వనుంది . 

సర్వే మొబైల్ యాప్ . సర్వే చేయు విధానము,  సర్వేలో అడుగు ప్రశ్నలు సర్వే రిపోర్టు అన్ని విషయాలు ఈ పోస్టులు ఉన్నాయి .


Download GSWS Employees Latest App 


AP P4 Model Survey 2025 Process 

ముందుగా పైన ఇవ్వబడిన లేటెస్ట్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సచివాలయం ఉద్యోగుల User Id & Face / Irish / Biometric  ద్వారా లాగిన్ అయిన తర్వాత హోం పేజీలో ఉన్నP4 Survey  అనే ఆప్షన్పై టిక్ చేయాలి . 



Cluster ను సెలెక్ట్ చేస్తే , మొత్తం కుటుంబాల వివరాలు వస్తాయి . భాషను మార్చుకోవడానికి కుడివైపు చివరన ఉన్నటువంటి ఆప్షన్ ద్వారా అవకాశం ఉంది.  ఎవరికి సర్వే చేయాలనుకుంటున్నారో వారి పేరుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్రశ్నలు ఉంటాయి . 

Q1 : ఇంట్లో అందుబాటులో ఉన్నారా ?

Yes 

No -  

  • రాష్ట్రంలో వేరే సచివాలయంలో వలస వెళ్లారా ? 
  • వేరే రాష్ట్రానికి వలస వెళ్లారా ? 
  • చనిపోయారా

Q2 : అందుబాటులో ఉన్న వారి పేరు 

HH Maping ప్రకారం వారి ఇంట్లో ఉన్న వారి పేర్లు వస్తాయి. అందుబాటులో ఉన్న వారి పేర్లు ఎంచుకోవాలి


Q3 : ఆధార నెంబరు 

HH Maping ప్రకారం ఆధార్ నెంబర్ వస్తుంది . 


Q4 : ఈ సర్వేలో బాగా మవ్వడానికి మీకు సమ్మతి ఉన్నదా లేదా ?

సమ్మతి లేకపోతే ఇంతటితో సచివాలయం ఉద్యోగుల వారి యొక్క ధ్రువీకరణతో ఆ కుటుంబానికి సర్వేను పూర్తి చేసెయ్యొచ్చు.  

సమ్మతి ఉన్నట్టయితే అప్పుడు కింద ప్రశ్నలు అడుగుతుంది 


Q5 : పెద్ద ఫోను ఉన్నదా ?

ఉంటే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటిపి వెరిఫికేషన్ చేయాలి 


Q6 : కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారు [ చిన్న పిల్లలు డిపెండ్ అయిన వాళ్ళు అందరితో సహా ] 

20 సభ్యుల వరకు పూర్తి సభ్యులను  నమోదు చేయాలి


Q7 : కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తున్న వారు ఉన్నారు ?


Q8 :  ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నారా ? 


Q9 :  సభ్యులు ఎవరైనా గడిచిన రెండు సంవత్సరాలలో ఆదాయపు పన్ను ఇన్కమ్ టాక్స్ చెల్లించారు రిటర్న్ దాఖలు చేశారా ? 


Q10 :  ప్రస్తుతం ఉన్న ఇల్లు ఎటువంటి రకము : 

కచ్చా - పెంకుటిల్లు  / రేకు టిల్లు etc... 

కచ్చా - RCC / Cement house 


Q 11 : ఇంట్లో ఎవరికైనా బ్యాంకు ఖాతా ఉందా లేదా ? 


Q 12 : పట్టణా లేదా మునిసిపాలిటీ పరిధిలో ఆస్తులు ఏమైనా ఉన్నాయా ? 


Q13 : వాణిజ్యతర నాలుగు చక్రాలు వాహనము ఉందా ? 

తన ఉపాధి నిమిత్తం కాకుండా సొంత అవసరాల నిమిత్తం నాలుగు చక్రాల వాహనం ఉంటే 


Q14 : వాణిజ్యతర ద్విచక్ర వాహనం ఉందా ? 

స్కూటీ బైక్ ఇలా 


Q 15 : విద్యుత్ కనెక్షన్ ఉందా ?

విద్యుత్ కనెక్షన్ ఉంటే విద్యుత్ బిల్లు నెలసరి సరాసరిగా ఎంత వస్తుందో నమోదు చేయాలి 


Q16 : మీకు త్రాగు నీరు ఎలా అందుతుంది ? 

  • ఇంటి వద్ద కొళాయి నీరు 
  • ప్రజా కుళాయిలు 
  • గొట్టపు బావులు 
  • బోరు బావులు 
  • తవ్విన బావులు మరియు బుగ్గలు 
  • ట్యాంకర్ ట్రక్కు 
  • బాటిల్ వాటర్ 


Q 17 : ఎటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు 

  • లాప్టాప్ 
  • కంప్యూటర్ 
  • టీవీ 
  • ఫ్రిడ్జ్ 
  • వాషింగ్ మిషన్ 
  • ఎసి 
  • ఏవి కావు 


Q 18 : మీరు ఎలాంటి వంట ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు ?

  • ఎల్పీజీ గ్యాస్ 
  • సాంప్రదాయ పేడ వ్యవసాయ పంటలు కలప బొగ్గు లేదా బొగ్గుతో సంబంధిత వస్తువులతో 


  సర్వేలో ప్రశ్నలు అన్ని నింపిన తర్వాత చివరిలో వెయ్యాలిసిన Thumb / OTP సర్వే చేస్తున్న ఉద్యోగి వెయ్యాలి, బెనిఫిషరీ కాదు. .


AP P4 Model Survey FAQ 

1. సర్వే చేసే ముందు సర్వేయర్ ఇంటి సభ్యులకు తెలియజేయాల్సిన ముఖ్య అంశాలు ఏమిటి ?

  • ఈ సర్వే ఏ పథకం అందజేతను ప్రభావితం చేయదు
  • ఇది 'మినహాయింపు' (exclusion) సర్వే కాదు, ఇది గృహ వినియోగ నిర్వహణ యొక్క P4 ప్రోగ్రామ్ భాగమైన' (inclusion) సర్వే.
  • సేకరించిన డేటా ఆధారంగా, ఇంటి అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగంతో కలిసి ప్రత్యేక ప్రాజెక్టులు అమలు చేయబడతాయి.
  • ప్రభుత్వం సమర్థంగా ప్రణాళికలు రూపొందించేందుకు ఖచ్చితమైన డేటా అందించడం ముఖ్యం.


2. ఇంటి వారిని సర్వే సమయంలో అందుబాటులో లేనప్పుడు సర్వేయర్ ఏమి చేయాలి?

వారు వలస వెళ్లకపోతే లేదా మరణించి లేకపోతే, సర్వేయర్ తిరిగి వెళ్లి సర్వే చేయాలి.


3. కుటుంబం వలస వెళ్లినట్లయితే లేదా మరణించినట్లయితే సర్వేయర్ ఏమి చేయాలి?

కుటుంబం అందుబాటులో లేదని 'No' గా ఎంచుకోవాలి.

తదుపరి కారణాలను ఎంపిక చేయాలి:

  • 'రాష్ట్రంలో వలస' అయితే, వారు వెళ్లిన కొత్త సచివాలయాన్ని ఎంచుకోవాలి.
  • 'రాష్ట్రం బయట వలస' లేదా 'మరణం' అయితే, సర్వేయర్ బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించాలి.


4. ఒక కుటుంబం సర్వేలో పాల్గొనడానికి నిరాకరించినట్లయితే సర్వేయర్ ఏమి చేయాలి?

  • సర్వే ఉద్దేశ్యం ఏమిటో వారికి వివరించాలి:
  • ఇది ఇంటి వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మాత్రమే.
  • ప్రభుత్వ ప్రాజెక్టుల ద్వారా అవసరమైన కుటుంబాలకు ప్రైవేట్ రంగ సహాయాన్ని అందించడమే లక్ష్యం.
  • ఈ సర్వే డేటా ప్రస్తుత స్కీమ్ల అమలుపై ఎటువంటి ప్రభావం చూపదు.
వారు ఇంకా నిరాకరిస్తే, 'Denied Consent' అనే ఎంపికను ఎంచుకోవాలి. ఇది సర్వేయర్ బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించబడాలి.


5. P4 సర్వేలో సంపాదన కలిగిన వ్యక్తులుగా ఎవరిని పరిగణించాలి?

ఏదైనా ఆదాయ వనరు కలిగి ఉన్నవారిని సంపాదన కలిగిన సభ్యులుగా పరిగణించాలి.


ఉదాహరణలు:

  • వ్యవసాయ భూమి కలిగి ఉన్నవారు
  • వ్యవసాయ కూలీలు
  • పెన్షన్ పొందుతున్న వృద్ధులు
  • అద్దె ఆదాయం పొందుతున్న వారు


6. కచ్చా ఇల్లు అంటే ఏమిటి?

  • గోడలు లేదా పైకప్పు మట్టి, కలప, కలప పొదలు, కాల్చని ఇటుకలతో తయారై ఉంటే కచ్చా ఇల్లు (Kutcha house) అని పిలుస్తారు.
  • గోడలు మరియు పైకప్పు రెండూ సిమెంట్, కాల్చిన ఇటుకలు లాంటి మన్నికైన పదార్థాలతో తయారై ఉంటే, అది పక్కా ఇల్లు (Pakka house) అవుతుంది.


7. వాణిజ్యేతర (non-commercial) 4-వీలర్ లేదా 2-వీలర్ అంటే ఏమిటి?

ఆ కుటుంబ జీవనోపాధికి ఉపయోగించని వాహనం.

ఉదాహరణలు:

  • వాణిజ్య నంబర్ ప్లేట్ (Yellow plate) ఉన్న కార్లు → వాణిజ్య వాహనంగా పరిగణించాలి.
  • ఇంట్లో వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లు, బైకులు వాణిజ్యేతర వాహనంగా పరిగణించాలి.


8. 'రౌండ్ ట్రిప్' అంటే ఏమిటి?

ఇంటి నుండి నీటి మూలానికి వెళ్లి తిరిగి రావడానికి మొత్తం పట్టే సమయం.

ఉదాహరణ:

  • నీటి మూలానికి వెళ్లడానికి 10 నిమిషాలు, తిరిగి ఇంటికి రావడానికి 10 నిమిషాలు అయితే, మొత్తం రౌండ్ ట్రిప్ సమయం 20 నిమిషాలు.


9. సాంఘిక-ఆర్థిక (socio-economic) ప్రశ్నలకు సమాధానాలు సర్వేయర్ తనంతట తాను ధృవీకరించాలా?

సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన సమాచారం అందుకోవడానికి ప్రయత్నించాలి. ఆస్తి యజమాన్యం, పట్టణ ఆస్తులు, వాణిజ్యేతర 4-వీలర్, తాగునీటి అందుబాటు, విద్యుత్ వినియోగం వంటి అంశాలపై కనీస స్థాయిలో ప్రత్యక్ష ధృవీకరణ చేయవచ్చు.


ఉదాహరణలు:

  • ఒక ఇంట్లో టీవీ లేనట్లు చెబితే, కానీ టీవీ శబ్దం వినిపిస్తే - టీవీ ఉందని నమోదు చేయాలి.
  • ఒకకుటుంబం విద్యుత్ లేనని చెప్పినా, ఫ్యాన్ తిరుగుతుంటే → విద్యుత్ ఉందని నమోదు చేయాలి.

What is AP P4 Survey 2025 ?



AP P4 Survey Report Link 

AP P4 Survey Status Link

Post a Comment

3 Comments
  1. Replies
    1. Yes
      Please helpful this job
      Thanks 🙏

      Delete
  2. How to correct data in p4 survey after submission

    ReplyDelete