Children without Aadhaar verification By GSWS Employees
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పుట్టిన ప్రతి బిడ్డకు [ 0 - 6 సంవత్సరాలు ] ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు , పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఇవ్వబడిందా లేదా అని తెలుసుకునే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మొబైల్ యాప్ GSWS Employees Mobile App లో వెరిఫికేషన్ కొరకు కొత్తగా Children without Aadaar ఆప్షన్ ఇవ్వడం జరిగింది . గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైనటువంటి పంచాయతీ కార్యదర్శులు లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ మరియు మహిళా పోలీసులు అధికారులు సచివాలయ సిబ్బంది సహాయంతో ఈ సర్వేను ఫిబ్రవరి 28 , 2025 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
How to Find Children Without Aadhaar ?
సర్వే ఆప్షను ఓపెన్ చేసిన తర్వాత సచివాలయ పరిధి , గ్రామ పరిధి కాకుండా ఆ యొక్క సెక్టార్ పరిధిలో ఉన్నటువంటి పిల్లల వివరాలన్నీ కూడా వస్తున్నాయి. అందులో గ్రామం పేరు ఇచ్చినప్పటికీ వారి యొక్క వివరాలు తప్పుగా ఉండే అవకాశం ఉంది కావున , సర్వే చేయువారు మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు , ఊర్లో ప్రజలు విషయాలు అవగాహన ఉన్నటువంటి పెద్దలు , వీరిని కాంటాక్ట్ అయ్యి పేర్లను తెలియజేసినట్లు అయితే వారి క్లస్టర్ ఏంటి ఎక్కడ ఉంటారు అనే విషయాలు తెలుస్తుంది.
ముందుగా లిస్ట్ లో ఉన్నటువంటి మీ గ్రామం పేరుతో ఉన్నటువంటి పేర్లను ఒక పేపర్ పై నోట్ చేసుకోండి . తర్వాత పైన చెప్పిన వారి ద్వారా వారి యొక్క మొబైల్ నెంబర్ను పక్కన నోట్ చేసుకొని , వారికి ఫోన్ చేయడం గాని లేదా నేరుగా వారిని కాంటాక్ట్ అవ్వడం గాని అవ్వండి. ఫోన్ చేసి పిల్లల పేర్లు ధృవీకరించి వారికి ఆధార్ కార్డు వచ్చిందా రాలేదా ? , దరఖాస్తు చేశారా లేదా ? , , పుట్టిన సర్టిఫికెట్ ఉందా లేదా ? అనే విషయాలను కనుక్కొని యాప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది . ఈ విధంగా లిస్టులో ఉన్నటువంటి పెండింగ్ వారివి సర్వే వేగవంతంగా అయ్యే అవకాశం ఉంది.
ఈ విధంగా వివరాలు సబ్మిట్ చేసినట్లయితే ఆధార్ కార్డు లేనటువంటి పిల్లల వివరాలు, పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేనటువంటి వివరాలు , రెండు ఉండి ఆధార్ కార్డు పొందనటువంటి వారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉంటాయి . దీని ద్వారా గ్రామ / వార్డు సచివాలయాల ద్వారా , పోస్ట్ ఆఫీస్ , ఇతర ప్రైవేటు సంస్థల ద్వారా ఆధార్ క్యాంపులు నిర్వహించే సమయంలో వీరికి ప్రాధాన్యతతో కొత్త ఆధార్ కార్డులు చేయుటకు ప్రభుత్వం కసరత్తు చేయనుంది .
How to Do Children Without Aadhaar Survey ?
Step 1 : ముందుగా గ్రామ లేదా వార్డు సచివాలయం ఉద్యోగులు కింద ఇవ్వబడిన
అధికారిక మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Step 2 : మొబైల్ యాప్ లో User ID కింద సచివాలయం కోడు - ఉద్యోగ హోదా ఎంటర్ చేసి బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా ఐరిస్ ద్వారా లాగిన్ అవ్వాలి.
Step 3 : హోం పేజీలో ఉన్నటువంటి Children Without Aadhaar అనే ఆప్షన్ తో టిక్ చేయాలి.
Select Cluster వద్ద ఏదో ఒక క్లస్టర్ ఎంచుకోవాలి.
ప్రస్తుతానికి వివరాలు క్లస్టర్ వారిగా ఇవ్వలేదు మొత్తం ఏ క్లస్టర్ ఎంటర్ చేసిన అన్ని వివరాలు ఓపెన్ అవుతున్నాయి .
Step 4 : ఎంటర్ చేసిన వెంటనే కింద చూపినట్టుగా మొత్తం సెక్టార్ పరిధిలో పెండింగ్ ఉన్నటువంటి పిల్లల వివరాలనేవి వస్తున్నాయి
- బిడ్డకు పేరు పెట్టినట్టయితే పేరు వస్తుంది లేకపోతే Baby Of అని చెప్పి తల్లి పేరు వస్తుంది,
- లింగము ,
- తల్లి పేరు,
- తల్లి ఆధార్ చివరి 4 అంకెలు ,
- అంగన్వాడి పేరు,
- అంగన్వాడి కోడ్ వివరాలనేవి వస్తున్నాయి
దానికి అనుగుణంగా సంబంధిత ANM లేదా మహిళా పోలీస్ వారు లేదా ఇతర సచివాలయ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు , ఆశ వర్కర్లు, గ్రామ విషయాలు తెలిసిన పెద్దలు ఈ వివరాలు అడిగినట్లయితే వారు ఎక్కడ ఉంటారు ? వారి యొక్క ఫోన్ నెంబర్ ? తదితర వివరాలు చెప్తారు.
Step 5 : వివరాలు నమోదుకు అందుబాటులో ఉన్న వారి యొక్క సెక్షన్ పై క్లిక్ చేసినట్లయితే మొదటగా
పిల్లవాడికి ఆధార్ కార్డు ఉన్నదా ? అని ప్రశ్న అడుగుతుంది అక్కడ ఉంటే Yes అని లేకపోతే No సబ్మిట్ చేయాలి . ఉన్నట్లయితే ఆధార్ నెంబరు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డు లేనివారికి పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఉందా లేదా ? అని అడుగుతుంది ఉంటే Yes అని లేకపోతే No అని పెట్టి సబ్మిట్
Step 6 : చేసేటప్పుడు బయోమెట్రిక్ లేదా ఐరిష్ లేదా ఫేసు లేదా ఓటీపీ ధృవీకరణ చేయాల్సి ఉంటుంది.