GSWS Employees Rationalization 2025: Government’s New Plan Explained
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరియు సచివాలయాల హేతుబద్దీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వరకే ప్రభుత్వ ఉత్తర్వులు GOMS No.1 విడుదల చేసిన విషయం తెలిసినదే దానికి అనుగుణంగా హేతుబద్ధీకరణకు సంబంధించి PPT రూపంలో కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రభుత్వం వెల్లడించింది . గ్రామ లేదా వార్డు సచివాలయాలను మరియు సచివాలయం సిబ్బందిని ఎలా హేతుబద్దీకరణ చేయాలనుకుంటుందో ఒక్కసారి చూద్దాం...
Click Here to Know GOMS No1 Full Details
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామా / వార్డు సచివాలయాలను జనాభా ప్రాతిపదికన 3 కేటగిరీలుగా విభజన చేయనున్నారు..
- కేటగిరి A అంటే 2500 కంటే జనాభా తక్కువ ఉన్నటువంటి సచివాలయాల
- కేటగిరి B సచివాలయాలు అంటే 2051 నుండి 3500 జనాభా వరకు ఉన్నటువంటి సచివాలయాలు
- కేటగిరి C సచివాలయాలు అంటే 3501 నుండి దానికన్నా ఎక్కువ జనాభా కలిగిన గ్రామ వార్డు సచివాలయాలు
ప్రస్తుతం వాటి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ? అంటే ఏ క్యాటగిరిలో ఎన్ని సచివాలయాలు ? వాటిలో ఎంత మంది సచివాల సిబ్బంది పనిచేస్తున్నార ? సగటున ఎంతమంది సచివాలయాలు ఒక్కో సచివాలయంలో ఉన్నారు ? ఆయా సచివాలయంలో ఉన్నటువంటి జనాభా ఎంత ? ఒక సచివాలయానికి ఎంత మంది జనాభా ? ఒక్క ఉద్యోగి ఎంతమంది జనాభా కిందకి వస్తున్నారు ? అనే విషయాలు కింద ఇవ్వటం జరిగింది .
గ్రామా సచివాలయాలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయాల సిబ్బంది వారీగా , ఎన్ని సచివాలయాలు ఉన్నాయి అనే వివరాలు ఒకసారి చూడండి .
గ్రామా వార్డు సచివాలయ సిబ్బందిని రెండు విభాగాలుగా మార్చనున్నారు మొదటి విభాగం కింద Multipurpose Functionaries వస్తారు రెండవ విభాగం కింద Technical Functionaries వస్తారు .
Multipurpose Functionaries
Technical Functionaries
క్యాటగిరి వారీగా సచివాలయంలో ఎంత పాపులేషన్ ఉంటుంది ? ఎంతమంది టెక్నికల్ మరియు మల్టీపర్పస్ ఉద్యోగులు ఉంటారు ? మొత్తంగా ఎంత మంది ఉద్యోగులు ఉంటారో ? ఒకసారి చూడండి
సచివాలయం మొత్తం జనాభా 2500 కన్నా తక్కువ ఉంటే ఏ ఏ ఉద్యోగులు ఉంటారో ఒక్కసారి చూడండి
సచివాలయం మొత్తం జనాభా 2501 నుండి 3500 మంది ఉంటే ఏ ఏ ఉద్యోగులు ఉంటారో ఒకసారి చూడండి
సచివాలయ పరిధిలో జనాభా 3501 కన్నా ఎక్కువ ఉంటే ఏ ఏ ఉద్యోగులు ఉంటారో ఒకసారి చూడండి
సచివాలయాల హేతుబద్దీకరణ తరువాత ఏఏ కేటగిరీ సచివాలయంలో ఎంత మంది సిబ్బంది ? ఎన్ని సచివాలయాలు ? ఉండనున్నాయి అంటే
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న వారిలో 12125 సిబ్బంది హేతుబద్ధీకరణ తర్వాత మిగులు సిబ్బంది గా ఉండనున్నారు . ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిన లిస్టు ప్రకారం 27794 మంది సిబ్బంది హేతుబద్ధీకరణ తర్వాత మిగులు సిబ్బంది గా ఉండనున్నారు . వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న వారిలో 3371సిబ్బంది హేతుబద్ధీకరణ తర్వాత మిగులు సిబ్బంది గా ఉండనున్నారు . ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిన లిస్టు ప్రకారం 6115 మంది సిబ్బంది హేతుబద్ధీకరణ తర్వాత మిగులు సిబ్బంది గా ఉండనున్నారు .
గ్రామ సచివాలయాలలో మిగులు సిబ్బంది వివరాలు :
వార్డు సచివాలయాలలో మిగులు సిబ్బంది వివరాలు :
ఏ ఏ క్యాటగిరీ సచివాలయంలో ఏ రకమైన ఉద్యోగి ఉంటారు అనే విషయాన్ని చాట్ రూపంలో ఇవ్వటం జరిగింది ఒకసారి చూడండి
గ్రామ వార్డు సచివాలయ శాఖ ఎలా ఉండాలని ప్రభుత్వం అనుకుంటుంది ?
ఏ సచివాలయం ఏ కేటగిరీ కింద ఉందో తెలుసుకోవడానికి క్యాటగిరి వారిగా సచివాలయాల జాబితాను తెలియజేయగలరు
ReplyDelete