Aadhaar Special Camps in Andhra Pradesh February 2025: Latest News & Updates Aadhaar Special Camps in Andhra Pradesh February 2025: Latest News & Updates

Aadhaar Special Camps in Andhra Pradesh February 2025: Latest News & Updates

Get the latest updates on Aadhaar Special Camps in Andhra Pradesh for February 2025! Find camp dates, venues, enrollment process, and documents required. Stay informed about Aadhaar updates and enrollments in AP. Read more!



Febuary 2025 Aadhaar Special Camps in Andhar Pradesh 

Aadhaar Special Camps in Andhar Pradesh రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 8,53,486 మంది చిన్నారుల గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. 


ఆధార్ క్యాంపులు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి ?  

తేదీ 2025 ఫిబ్రవరి 18 నుండి 21 వరకు మరియు మరలా 24 నుండి 28 వరకు ఆధార్ క్యాంపులు రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్ ప్రాప్తికి అంగన్వాడీ సెంటర్లలో / గ్రామా వార్డు సచివాలయాల్లో జరుగుతున్నాయి. ఆధార్ కిట్ కలిగిన గ్రామా వార్డు సచివాలయాలతో పాటు పోస్ట్ ఆఫీస్ , CSC సెంటర్ల ద్వారా ఈ ఆధార్ స్పెషల్ క్యాంపు లు నిర్వహిస్తున్నారు .


ఆధార్ క్యాంపులు వలన ఎవరికి ఉపయోగం ?

ఈ ఆధార్ క్యాంపులో ముఖ్యంగా వయసు 0 - 6 సంవత్సరాల లోపు పుట్టిన పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు [ బాల ఆధార్ కార్డుల ] నమోదు చేస్తారు . వీటితో పాటు ఇతర ఆధార్ సేవలు కూడా చేస్తారు . 


కొత్త ఆధార్ / బాల ఆధార్ నమోదుకు ఎం కావాలి ?

  1. QR Code ఉన్న పుట్టిన తేదీ సర్టిఫికెట్ 
  2. దరఖాస్తు ఫారం 
  3. బిడ్డ ను క్యాంపు జరిగే ప్రదేశానికి తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు కలిసి తీసుకువెళ్లాలి .  
Download Application Form

కొత్త ఆధార్ / బాల ఆధార్ రిజెక్ట్ అవ్వకుండా జాగ్రత్తలు 

  • కొత్తగా ఆధార్ నమోదు చేయడానికి తెచ్చినటువంటి పుట్టిన సర్టిఫికెట్ ఒరిజినలా ?  కాదా ? అని CRS సర్టిఫికెట్ అయితే  స్కాన్ ద్వారా గాని మీసేవ సర్టిఫికెట్ అయితే మీ సేవ సైట్ లో అప్లికేషన్ స్టేటస్ ద్వారా గాని చెక్ చేయవలెను .

  •  ఆధార్ నమోదు చేయుటకు పిల్లలతో పాటు ఎవరు వస్తున్నారు అని  తప్పనిసరిగా చూడవలెను , ఎందుకంటే ఎవరు వస్తున్నారో వారి ప్రకారం కొత్తగా ఆధార్ నమోదు ప్రక్రియ ఉంటుంది.


టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయినట్టు అయితే ఇటువంటి అప్డేట్లు మీకు రోజు అందుతాయి.


  • బిడ్డ ఆధార్ C/O లో తల్లి పేరు , తల్లి ఆధార్ అడ్రస్ రావాలి అంటే :  ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తల్లి ఉండాలి . తల్లి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను.  బిడ్డ యొక్క C/O సెక్షన్లో తల్లి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తల్లి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తల్లి పేరు , తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric  వద్ద తల్లి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తండ్రి పేరు, తండ్రి ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తండ్రి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తండ్రి బియోమెట్రిక్ వేయరాదు .


  • బిడ్డ ఆధార్ C/O లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ అడ్రస్ రావాలి అంటే :  ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తండ్రి ఉండాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను.  బిడ్డ యొక్క C/O సెక్షన్లో తండ్రి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric  వద్ద తండ్రి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తల్లి పేరు, తల్లి  ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తల్లి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తల్లి బియోమెట్రిక్ వేయరాదు.

ఆధార్ క్యాంపు లో అందించే ఇతర ఆధార్  సేవలు 

ఆధార్ డ్రైవ్ లో అందించే ముఖ్యమైన సేవలు [ Important Services Offered in Aadhaar Drive ]  

  • కొత్త ఆధార్ నమోదు / బాల ఆధార్ ఆధార్ 
  • ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ 
  • ఆధార్ కు e మెయిల్ ఐడి లింక్ 
  • ఆధార్ లో ఫోటో మార్పు 
  • ఫింగర్ ప్రింట్ అప్డేట్ 
  • ఐరిష్ అప్డేట్ 
  • పేరు లో మార్పు 
  • చిరునామా లో మార్పు 
  • ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ 
  • లింగము లో మార్పు 
  • ఆధార్ ప్రింట్ 
  • తప్పనిసరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్

ఆధార్ క్యాంపులో అందించే సేవల ఫీజులు 

  • పిల్లలకు బాల ఆధార్ / కొత్త ఆధార్ - ఉచితం 
  • 5-7 , 15-17 సం. మధ్య వయసు ఉండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఉచితం 
  • ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ - 50/-
  • ఆధార్ - ఇమెయిల్ లింక్ - 50/-
  • డాక్యుమెంట్ అప్డేట్ - 50-
  • పేరు మార్పు - 50/-
  • చిరునామా మార్పు - 50/-
  • పుట్టిన తేదీ మార్పు - 50/-
  • లింగము అప్డేట్ - 50/-
  • ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ - 100/-
  • 7,17 సం. వయసు నిండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - 100/-


ఆధార్ సేవలు పొందేదుకు ఏ డాక్యుమెంట్ లు కావాలి  ?

  • పిల్లలకు బాల ఆధార్ / కొత్త ఆధార్ - బర్త్ సర్టిఫికెట్ + తల్లి / తండ్రి ఆధార్  
  • 5-7 , 15-17 సం. మధ్య వయసు ఉండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఆధార్ కార్డు 
  • ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ - ఆధార్ కార్డు + మొబైల్ నెంబర్ 
  • ఆధార్ - ఇమెయిల్ లింక్ - ఆధార్ కార్డు + ఇమెయిల్ ఐ డి 
  • పేరు మార్పు - ఆధార్ కార్డు + SSC Memo / Other Original Memo / పాన్ కార్డు / DL / పాస్ పోర్ట్ / రేషన్ కార్డు - Photo ఉన్న వారికి / ఆరోగ్య శ్రీ కార్డు - ఫోటో ఉన్నవారికి etc.. 
  • చిరునామా మార్పు - ఆధార్ కార్డు + ఓటర్ కార్డు / రేషన్ కార్డు - ఫోటో ఉన్న వారికి  / ఆరోగ్య శ్రీ కార్డు - ఫోటో ఉన్న వారికి / వికలాంగుల కార్డు / Standard Document etc..
  • పుట్టిన తేదీ మార్పు - ఆధార్ కార్డు + [ For Age Above 18 years  - SSC / Inter / Degree / Other Original Memo ] or  [ For Age Below18 years  - పుట్టిన తేదీ ఒరిజినల్ మెమో ]
  • లింగము అప్డేట్ - ఆధార్ కార్డు 
  • బయోమెట్రిక్ అప్డేట్ ( ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ ) - ఆధార్ కార్డు 
  • 7,17 సం. వయసు నిండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఆధార్ కార్డు 
  • డాక్యుమెంట్ అప్డేట్ - ఆధార్ కార్డు + POI + POA 
Note : అన్ని సర్వీస్ లకు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ అవ్వవల్సిన వ్యక్తి హాజరు అవ్వాలి . 


Febuary 2025 Aadhaar Special Camps in Andhra Pradeh - Guidlines 

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 0 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆధార్ కార్డు లేని వారికి కొత్త ఆధార్ కార్డు నమోదు మరియు ఐదు సంవత్సరాలు దాటి మరియు 15 సంవత్సరాలు దాటి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ ఉన్నవారికి ఈ యొక్క డ్రైవ్ లో ముఖ్యంగా అధిక ప్రాధాన్యతో సర్వీసులు  చేస్తారు.
  • గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆధార్ క్యాంపులను నిర్వహించే అధికారులైన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ మరియు వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులను క్యాంపు నిర్వహిస్తున్న సమయంలో సచివాలయంలో వారికి బదులుగా వేరొక అధికారులను ఇన్చార్జిగా వేస్తూ క్యాంపు సమయంలో వారికి ఎటువంటి డ్యూటీలు అనగా BLO గాని ఇతర డ్యూటీలో గాని వెయ్యరు.


January 2025: Aadhaar Special Camps in Andhra Pradesh – Everything You Need to Know 


Subscribe For More Updates


View More

Post a Comment

0 Comments