Farmer Registry Number
దేశంలో ప్రజలకు ఆధార్ కార్డు నెంబరు ఎలానో దేశంలో ఉన్న ప్రతి రైతుకు రైతు గుర్తింపు నెంబరు Farmer Registry ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం Farmer Registry Portal ను ప్రారంభించి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ద్వారా ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులకు Farmer Registry Number రైతు గుర్తింపు నెంబర్ను కేటాయిస్తుంది. ఈ నెంబర్ పొందేందుకు రైతు తప్పనిసరిగా సొంతంగా గానీ లేదా దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో గాని లేదా ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ ఆఫీసుల నందు తప్పనిసరిగా నమోదు చేసుకున్నట్లయితే తుది ఆమోదం తర్వాత 11 అంకెల రైతు గుర్తింపు సంఖ్య ఆ రైతుకు ఇవ్వటం జరుగుతుంది. ఈ నెంబర్ ద్వారా భవిష్యత్తులో విడుదలయ్యే పీఎం కిసాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ, ఇతర రైతుకు సంబంధించిన సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలు, సేవలు, ఇన్పుట్ సబ్సిడీ, కిసాన్ క్రెడిట్ కార్డు, రాయితీలు, ఎరువులు, పంటల బీమా, పంటల కనీస మద్దతు, పంటల రుణాలు, వివిధ రకముల వ్యవసాయ అనుబంధ రంగాల సేవలు, యంత్ర పరికారాలపై సబ్సిడీ, సూక్ష్మ సేద్యం పై రాయితీ, ఇటువటివన్నీ కూడా పొందేందుకు ఈ నెంబరు తప్పనిసరి చేయనుంది కేంద్ర ప్రభుత్వం.
Easy Steps to Get Your Farmer Registry Number Online
రైతు పేరు, భూమి వివరాలు సరిగా ఉన్నట్టయితే సొంతంగా ఎవరికివారు ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో ఆన్లైన్ లో Farmer Registry Number కొరకు అప్లికేషన్ చేసుకోవచ్చు సంబంధిత డిపార్ట్మెంట్ ఆమోదం తర్వాత సంబంధిత రైతుకు 11 అంకెల Farmer Registry Number జనరేట్ అవ్వడం జరుగుతుంది .
Join Telegram Channel
ఆనులైన్లో దరఖాస్తుకు ఉండాల్సినవి
- ఆధార్ కార్డు నెంబరు
- ఆధార్ కార్డుకు లింక్ అయినా మొబైల్
- భూమి పట్టాదారు పాస్ బుక్ లేదా ROR 1B
Farmer Registry Number కొరకు అనులైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి ?
ఆనులైన్లో దరఖాస్తు చేసే ముందు ఇప్పుడు చెప్పబోయే 2 పనులు రైతు తప్పనిసరిగా చేయాలి లేదా రైతు తరుపున ఎవరైనా చేయవచ్చు. ఎవరికి వారు సొంతంగా మొబైల్ లోనే ఇప్పుడు చెప్పే విషయాలని మరియు Farmer Registry Number కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు
- ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబరు లింక్ ఉందో అని తెలుసుకోవడం
- గతంలో Farmer Registry Number నెంబర్ కొరకు దరఖాస్తు చేశారా లేదా అని చూడటం
మొబైల్ నెంబరు లింకు Aadhar Mobile Number Link లేనివారు వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఆధార సెంటర్ కు వెళ్లి 50 రూపాయలు ఫీజుతో ఆధార్ కార్డు , ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబరు, మొబైల్ నెంబర్ లింక్ లేని రైతు ఆధార్ సెంటర్కు వెళ్లి మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్నట్లయితే లింకు చేసిన రెండు రోజులలోపే ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ ను ఫాలో అవ్వండి
గతంలో దరఖాస్తు చేశారా లేదా స్టేటస్ చెక్ చేసుకునే విధానం కింద ఇవ్వబడిన పేజీ ఓపెన్ చేసి AP Farmer Registry Number Enrol Status అనే లింకుపై క్లిక్ చేసినట్లయితే కింద చూపించిన వెబ్ సైట్ కు రీ డైరెక్ట్ అవుతుంది .
ఓపెన్ చేసిన తర్వాత కింద చూపిన ఆప్షన్ పై క్లిక్ చేయండి .
కింద చూపించిన పేజీ కు రీ డైరెక్ట్ అవుతుంది .
ఆధార్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత
Not Registered అని వచ్చినట్టయితే ఇప్పటివరకు ఎక్కడా కూడా armer Registry Number కొరకు దరఖాస్తు చేయలేదు అని అర్థము.
Pending అని వచ్చినట్టయితే నమోదు పూర్తి అయింది కానీ డిపార్ట్మెంట్ ఆమోదం ఇంకా అవ్వలేదు అని అర్థం .
Approved అని వచ్చింది అంటే డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా తుది ఆమోదం అయ్యి 11 అంకెల రైతు గుర్తింపు సంఖ్య జనరేట్ అయింది అని అర్థం
Not Registered అని ఉన్నవారు కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి అదికారిక వెబ్ సైట్ వెళ్ళండి .
Farmer ఎంచుకొని Create a New User Account పై క్లిక్ చేయండి .
Farmer eKYC ను OTP ద్వారా పూర్తి చేయండి .
రైతు మొబైల్ నెంబరు వెరిఫికేషన్ ను రైతు యొక్క మొబైల్ కు వచ్చే ఓటీపీ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది .
Passward ను సెట్ చేసుకోండి Create My Account పై క్లిక్ చేస్తే Account Registration పూర్తి అవుతుంది .
మరలా Login అవ్వండి .
Registry as Farmer పై క్లిక్ చేయాలి .
మొబైల్ నెంబర్ మార్చాలి అనుకుంటున్నారా అని ఉన్న దగ్గర No అని క్లిక్ చేయండి .
రైతు పేరును తెలుగులో ఎంటర్ చేసి రైతు యొక్క కులమును ఎంచుకోవాల్సి ఉంటుంది . రైతు పేరు పక్కన Name Matching Score [ NMS ] కౌంట్ చూపిస్తుంది . NMS
- 0-60% - MRO Approval అవసరం .
- 61-80% - VRO Approval అవసరం .
- 81-100% - VAA / VHA / VRO Approval అవసరం ఉంటుంది .
రైతు గ్రామం పేరును తెలుగులో నమోదు చేసి చిరునామ వివరాలలో ఏవైనా తప్పుగా ఉంటే కింద చూపినట్టుగా బాక్స్ పెట్టి సొంతంగా అప్డేట్ చేయవచ్చు .
Lans Owner Details లో owner సెలెక్ట్ చేసుకోవాలి . occupation Details లో Agriculture / Land Owned Farmer లో ఒకటి లేదా రెండిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు . Fetch Land Details పై క్లిక్ చేయాలి .
భూమి ఉన్న జిల్లా, మండలము, రెవెన్యూ గ్రామము సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైతు భూమిలో ఒక సర్వే నెంబర్ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. తరువాత రైతు యొక్క పేరును సెలెక్ట్ చేసుకుని రైతు యొక్క సర్వే నెంబర్లను సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి .
ఇదేవిధంగా రైతుకు ఏ ఏ గ్రామాల్లో భూమి ఉన్నదో ఆ గ్రామాన్ని ఎంచుకొని సర్వే నెంబర్లు ఎంచుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చివరగా Verify All Land అనే ఆప్షన్పై టిక్ చేసినట్లయితే అన్ని సెలెక్ట్ అవుతాయి .
Department Select చేసుకొని , చెక్ బాక్స్ లో టిక్ చేసి , Save పై క్లిక్ చేయాలి . Department మీకు కనిపించక పోతే logout అయ్యి ఎం , మరల ట్రై చేస్తే అవుతుంది .
e Sign ప్రక్రియను Aadhaar - OTP ద్వారా పూర్తి చేయండి .
Show e Sign Document పై క్లిక్ చేస్తే PDF Downlod అవుతుంది .
తరువాత Status Not Registered నుండి Pending అక్కడ నుండి Approved కు విలుతుంది . ఏదైనా సమస్య ఉంటె Online లో కాకుండా మీకు దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్రం లో Farmer Registry Number కొరకు నమోదు చేసుకోండి .