AP Work From Home Survey 2025 by GSWS AP Work From Home Survey 2025 by GSWS

AP Work From Home Survey 2025 by GSWS

Work From Home Survey 2025 : Process, Reports, Questions, and more


Work From Home Survey

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మరియు ఇతర ఉద్యోగులకు Work From Home (WFH) అవకాశాలను మరింత ప్రోత్సహించేందుకు Work From Home Survey నిర్వహిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రానికి చెందిన వేలాది మంది యువతకు స్వగ్రామంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ద్వారా కలిగే ప్రయోజనాలు, సవాళ్లు, అవసరమైన మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లభించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. 


 Join Telegram Channel 

Work From Home Survey Benefits 

Work From Home Survey వల్ల కలిగే ప్రయోజనాలు 

  • స్వస్థలంలో ఉద్యోగ అవకాశాలు – రాష్ట్రానికి చెందిన యువత తమ స్వగ్రామంలోనే ఉంటూ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. 
  • రద్దీ తగ్గింపు – మహానగరాల్లో ట్రాఫిక్, గృహ అద్దె భారం, ఇతర ఖర్చులు తగ్గుతాయి. 
  • పర్యావరణ పరిరక్షణ – ప్రయాణ అవసరం తగ్గడం వల్ల కాలుష్య నివారణలో భాగస్వామ్యం అవుతుంది. 
  • ప్రత్యామ్నాయ ఐటీ హబ్‌ల అభివృద్ధి – రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ మౌలిక వసతుల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.



Eligibility For Work From Home Survey 

Work From Home Survey ను ఎవరికి చేస్తున్నారు  ?

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పూర్తి అయి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరికీ Work From Home Surveyను చేస్తున్నారు .
  • ఎవరి పేరు అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటుందో వారికి మాత్రమే ఈ సర్వే చేయడం జరుగుతుంది .


How to enrol in AP Work From Home Survey ?

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న Work From Home Surveyలో పేరును సొంతంగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. కేవలం గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగుల వారి లాగిన్ లో సర్వే చేయుటకు మాత్రమే ఆప్షన్ ఇవ్వటం జరిగింది. ఎవరైతే ఇష్టం ఉన్నవారు సంబంధిత సచివాలయ ఉద్యోగిని కాంటాక్ట్ అయినట్లయితే వారి మొబైల్ యాప్ లో మీ యొక్క సర్వేను చేయడం జరుగుతుంది.

Quations in AP Work From Home Survey 2025 

Work From Home Surveyలో అడిగే ప్రశ్నలు 
Quations in AP Work From Home Survey 2025

  1. విద్యార్హత ఏమిటి ?
  2. ప్రస్తుతం పని చేస్తున్నారా లేదా ?
  3. ప్రస్తుతం పని చేస్తున్నట్లయితే వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పనిచేస్తున్నారు. ?
  4. వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారా ? ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్నారా ? లేదా హైబ్రిడ్ మోడల్ లో కొంతకాలం ఇంటి వద్ద కొంతకాలం ఆఫీస్ లో పనిచేస్తున్నారా ?
  5. ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్టయితే మీ ఇంటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉన్నదా ?
  6. వర్క్ ఫ్రొం హోమ్ అవకాశం ఉన్నట్టయితే మీ ఇంటిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవకాశం ఉందా ?
  7. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్ తో ఇంటర్నెట్ సదుపాయం ఉంది ? 
  8. మీ ఇంట్లో వర్క్ ఫ్రం హోం కింద మీ స్నేహితులకు లేదా మీ కొలీగ్ / మీ తోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కొరకు ఇంట్లో ప్లేస్ లేదా సపరేట్గా రూమ్ ఉన్నదా ?
  9. ఉంటే ఆ రూమ్ యొక్క కొలత ?
  10. ఎంతమంది వరకు వర్క్ ఫ్రం హోం కింద ఆ రూమ్ లో పనిచేయటం అవకాశం ఉంటుంది ?
  11. ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్ లో పనిచేయుటకు ఇష్టం ఉన్నదా ?
  12. పనిచేయటం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హాజరు అవుతారా ?

Work From Home Survey Process in GSWS Employees Login

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో Work From Home Survey సర్వే ఏ విధంగా చేస్తారో కింద ఇవ్వటం జరిగినది .

ముందుగా కొత్తగా అప్డేట్ అయిన GSWS Employees Mobile App ను డౌన్లోడ్ చేసుకోవాలి.


తరువాత ఉద్యోగుల లాగిన్ ఐడి ఎంటర్ చేసి బయోమెట్రిక్ లేదా ఫేసు లేదా  లాగిన్ అవ్వాలి అయిన వెంటనే కింద చూపిన విధంగా హోం పేజీ ఓపెన్ అవుతుంది . Work From Home Survey అనే ఆప్షన్ ఎంచుకోవాలి


 గ్రామా /  వార్డు సచివాలయంలో క్లస్టర్ వారీగా లేదా ఆధార్ నెంబరు ప్రాప్తికి ఎవరికైతే సర్వే చేయాలో వారి పేరును ఎంచుకోవచ్చు .



 క్లస్టర్ల వారీగా అయితే కింద చూపించినట్టుగా సచివాలయ పరిధిలో ఉన్న అన్ని క్లస్టర్ల వివరాలు చూపిస్తుంది .


 సర్వే ఎవరికైతే స్టార్ట్ చేయాలో వారు ఏ క్లాస్ పరిధిలోకి వస్తే ఆ నష్టాన్ని ఎంచుకొని ఆ క్లస్టర్ లో వారి యొక్క పేరును చర్చి ద్వారా లేదా స్క్రోల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి . 



 కింద చూపించిన వాటిలో సర్వే చేస్తున్న వారి విద్యా అర్హతను పెంచుకోవాల్సి ఉంటుంది .


 ప్రస్తుతం ఎటువంటి పనిచేయకుండా భవిష్యత్తులో ఎటువంటి పనిని చేయుటకు ఇష్టం లేని వారికి కింద చూపిన ఆప్షను సెలెక్ట్ చేసి సర్వేను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసినప్పుడు ఎవరికైతే సర్వే చేస్తున్నారో వారి యొక్క బయోమెట్రిక్ లేదా ఫేసు లేదా ఐరిస్ లేదా ఓటీపీ ద్వారా ధ్రువీకరించి ఆ యొక్క వ్యక్తికి సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది



 ప్రస్తుతం ఎటువంటి పనిచేయకుండా, భవిష్యత్తులో ఇంటి వద్ద నుండి ప్రభుత్వం ఎటువంటి పనిని కల్పించిన చేయుటకు ఇష్టంగా ఉంటూ, ప్రభుత్వం కల్పించే ఏదైనా ట్రైనింగ్ కు హాజరు అవ్వటానికి ఇష్టంగా ఉంటూ, ఇంటి వద్ద నుండి పనిచేయుటకు ఇంటిలో అన్ని వసతులు ఉంటూ,  ఇంట్లో వైఫై ఫెసిలిటీ ఉంటూ , ఇంట్లో మీతో పాటుగా మిగిలిన వారికి అకామిడేషన్ అనగా మీ ఇంట్లోనే లేదా వర్క్ చేయుటకు ఏదైతే రూము ఉంటుందో ఆ రూములో మీతో పాటుగా ఎక్కువ మందిని ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేయుటకు అవకాశం ఉన్నట్టు ఉన్నట్టయితే వారు కింద చూపించినట్టుగా అన్ని వివరాలు ఇచ్చి చివరగా ధ్రువీకరించి సర్వే వారికి పూర్తి చేయాల్సి ఉంటుంది .


 ప్రస్తుతం ఇంటి వద్ద కాకుండా బయట వర్క్ ఫ్రం ఆఫీస్ పని చేస్తున్న వారికి కింద చూపించినట్టుగా సర్వేను ఆప్షన్లు సెలెక్ట్ చేసుకుని ఓటిపి ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది .



 ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం ద్వారా ఇంటి వద్ద పనిచేస్తున్న వారికి కింద తెలిపిన విధముగా ఆప్షను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తారు .



 కొన్ని రోజులు ఇంటి వద్ద నుండి మరికొన్ని రోజులు ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్న వారికి కింద చూపించిన విధముగా ఆప్షన్లు సెలెక్ట్ చేసి వారికి సర్వేను సబ్మిట్ చేస్తారు .



కొత్తగా అప్డేట్ అయినా మొబైల్ యాప్ లో సర్వేకు సంబంధించి ఒకరికి సర్వే చేస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల్లో సర్వే చేస్తున్న వారిది లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా సరే బయోమెట్రిక్ లేదా ఓటీపీ లేదా ఫేసు లేదా ఐరిస్ ద్వారా ధ్రువీకరణ చేయవచ్చు



Work From Home Survey Report Link 

వర్క్ ఫ్రం హోం సర్వే ఏ సచివాలయంలో ఎంతమందికి జరిగిందో కింద 



ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి ఫోటోలో చూపిస్తున్నట్టుగా లింక్ పై క్లిక్ చేసినట్లయితే నేరుగా అధికారిక వెబ్సైట్కు మీకు రీ డైరెక్ట్ అవుతుంది అక్కడ మీరు రిపోర్ట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు .

Work From Home Survey Report



Work From Home Survey Process Vide


Work From Home Survey Tips to GSWS Employees 

Work From Home Survey Tips to GSWS Employees


  1. ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు పూర్తయి 50 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ ఈ GSWS Work From Home Survey చేయాలి కావున ఒక్కొక్కరికి బయోమెట్రిక్ లేదా ఓటీపీ లేదా ఫేసు లేదా ఐరిస్ ద్వారా సర్వే చేయాల్సి ఉంటుంది కావున ముందుగా ఎవరికైతే వర్క్ ఫ్రొం హోమ్ ద్వారా ఉద్యోగం లేదా పని చేయనివారు ఉంటారో వారికి ముందుగా పూర్తి చేయండి.
  2. సర్వే ప్రారంభానికి ముందే ముందుగా సచివాలయ ఉద్యోగులు వారి క్లస్టర్లో ఉన్న వారందరి మొబైల్ నెంబర్లు రాసుకొని ఉంటే ఆ లిస్టు ద్వారా ఓటిపి ఆప్షన్ ద్వారా సర్వే త్వరగా పూర్తి చేయవచ్చు. 
  3. మొబైల్ నెంబర్లు రాసుకొని వారు ఎవరైనా ఉంటే వారు సర్వే ప్రారంభానికి ముందే మీ యొక్క క్లస్టర్లో లేదా మీ గ్రామంలో అందరి వివరాలు తెలిసిన వారి వద్దకు వెళ్లి ఎవరు ఎక్కడ ఉన్నారు? వారి మొబైల్ నెంబర్లు ,అన్నీ తెలుసుకోండి. తద్వారా సర్వే చేసే సమయంలో ఓటిపి ద్వారా వేగంగా చేసే అవకాశం ఉంటుంది.
  4. సర్వే ప్రారంభానికి ముందు మీ క్లస్టర్లో వారి అందరి పేర్లు పేపర్ పై రాసుకున్నట్టయితే ఎన్ని అవుతున్నాయి ? ఎన్ని అవటం లేదు ? ఒక కుటుంబానికి ఎన్ని అవుతున్నాయి ? అనే ఒక క్లారిటీ ఉంటుంది . లేకపోతే ఒకే కుటుంబానికి చెందిన వారికి పదే పదే ఒకే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.
  5. సర్వే చేస్తున్నప్పుడే ఇంట్లో ఉన్న వారి పేర్లు ఒక్కొక్కరిగా అడగండి. 18 సంవత్సరాల లోపు ఉన్న వారి పేర్లు కాకుండా పెన్షన్లు తీసుకుంటున్న వారి పేర్లు కాకుండా అంటే 50 సంవత్సరాలు పైబడిన వారి పేర్లు కాకుండా మిగిలిన వారు ఎవరెవరున్నారో అడిగి ఒక పేపర్ పై రాసుకొని, వెంటనే మొబైల్ యాప్ లో సెర్చ్ లో కూడా వారి పేర్లు Search చేసినట్లయితే వారి పేర్లను పేపర్ పై రాసుకొని వారికి ముందుగా సర్వే చేసినట్లయితే ఇంటింటికీ సర్వే అనేది పూర్తవుతుంది . ఆ ఇంట్లో ఉన్న వారందరి పేర్లు కూడా ఈ సర్వేలో కవర్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కువ % GSWS Work From Home Survey ను తక్కువ సమయంలో చేసే అవకాశం ఉంటుంది.
  6. ఈ సర్వే గ్రామ లేదా వార్డు సచివాల సిబ్బంది క్లస్టర్ Tag చేసినప్పటికీ మీకు తెలిసిన ఉద్యోగి లేదా మీ సహా ఉద్యోగి ఆయా వీధిలోకి లేదా ఆ క్లస్టర్లోకి ఏదైనా పని పై వెళ్ళినప్పుడు మీకు సహాయం చేయమని చెప్పండి. అవకాశం ఉంటే సచివాలయం కు వచ్చిన లేదా రోడ్డుపై కనిపించిన లేదా దగ్గరలో ఎక్కడ కనిపించినా అందరూ వారి యొక్క క్లస్టర్ కనుక్కొని వారి యొక్క సర్వేను అక్కడే పూర్తి చేయవచ్చు ఎందుకంటే మొబైల్ తీసుకువస్తే ఓటిపి ద్వారా మొబైల్ తీసుకురాకపోతే ఫేస్ ద్వారా స్కానర్ అందుబాటులో ఉంటే బయోమెట్ల ద్వారా సర్వేలు పూర్తి చేయవచ్చు .
  7. శాశ్వత వలస ఉన్న వారి, చనిపోయిన వారి, సర్వే ఇష్టం లేని  వారి వివరాలన్నీ ఒక పేపర్ పై నోట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకున్నట్లయితే భవిష్యత్తులో అధికారులు అడిగినట్లయితే ఉపయోగపడుతుంది.
  8.  మీ క్లస్టర్ పరిధిలో పెండింగ్లో ఉన్న వారికి మరియు సర్వే చేస్తున్న వారికి కింద చూపించిన విధంగా రిమార్కులను రాసుకున్నట్లయితే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా లేదా పై అధికారులు రిపోర్ట్ అడిగిన చూపించడానికి లేదా పంపించడానికి సులువుగా ఉంటుంది


Post a Comment

13 Comments
  1. Work from home Sir last cheppandi.date extend cheyyandi

    ReplyDelete
  2. Work from home survey extend cheyyandi.baita vunnamu

    ReplyDelete
  3. registration lost date yeppudu cheppandi

    ReplyDelete
  4. Work from home survey lost date extended cheyyindi Sir

    ReplyDelete
  5. Please give me re correction option, my survey,rong survey doing my sachicivalayam workers,give me re correct option

    ReplyDelete
  6. Most survey employee not corect data mentioned this survey please give re correction survey

    ReplyDelete
  7. Good CM sir, surve lo software ante No cheppinattu gurthu okavela adi correct ayithe naku software job estara, nenu msc chemisyry ayindi naku job vastada sir

    ReplyDelete
  8. Sachivalam Employees are not Asking If u r intersting r not for the job just ask otp and ,They Submitted Their Own Decision With out Proper Information

    ReplyDelete
  9. Nenu Mtech cse.....job isthara

    ReplyDelete
  10. Ee job eppudu istharu

    ReplyDelete