New Member Household Mapping Adding Process AP 2025 New Member Household Mapping Adding Process AP 2025

New Member Household Mapping Adding Process AP 2025

 


New Member Household Mapping Adding Process AP 2025 


AP Household Mapping Self Update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అందించే ఈ - సర్వీసులకు, సర్వేలకు, పథకాలకు మరియు ఇతర సేవలు అయిన రిజిస్ట్రేషన్ సేవలు, స్కూల్ అడ్మిషన్ , అంగన్వాడీ సేవలు, ఇసుక బుకింగ్, RTO సేవలు వంటి సేవలకు ప్రజల వివరాలు ఆటోమేటిక్ గా వచ్చేందుకు ఉపయోగపడే సర్వీస్ అయిన House Hold Mapping ను ఇప్పడు ఎవరికివారు సొంతంగా చేసుకోవచ్చు. 


హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ చేసుకోవాలి అంటే, మీకు ఎక్కడైతే శాశ్వత చిరునామా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు చిరునామా కలిగి ఉంటారో అక్కడ చేసుకుంటే మంచిది. ఒకప్పుడు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యేది. తరువాత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయినటువంటి పంచాయతీ కార్యదర్శి మరియు డిజిటల్ అసిస్టెంట్ అధికారులకు ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగినది. కానీ వాటితో పాటుగా ప్రస్తుతం ఎవరికి వారు సొంతంగా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో Adding అవుటకు ఆప్షన్ కలదు. ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ ద్వారా 

  • పుట్టిన పిల్లలు, 
  • ఇంటికి వచ్చిన కొత్త కోడలు , 
  • ఎక్కడ మ్యాపింగ్ లేని పూర్తి కుటుంబ సభ్యులు, 
  • హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో లేని ఇతర కుటుంబ సభ్యులను 
  • అవివాహితుడు మరియు విడివిడిగా నివసిస్తున్నారు 
  • వితంతువు
  • కుటుంబ సభ్యులు లేని ఒంటరి 
  • ట్రాన్స్ జెండర్

హౌస్ మ్యాపింగ్ లో ఆడింగ్ చేయవచ్చు. 


మ్యాపింగ్ చేసేముందు మన కుటుంబ హౌస్వోల్డు మ్యాపింగ్ లో ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకుంటే మంచిది. అలా తెలుసుకోవాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామా లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించినట్టయితే వారు కింద చెప్పిన ప్రాసెస్ లో ఇంటిలో ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని అయితే తెలియజేస్తారు. ఆ తరువాత మీ కుటుంబంలో మ్యాపింగ్ లో లేని వారిని మీరు సొంతంగా ఎలా యాడ్ చేసుకోవాలో కూడా కింద చెప్పడం జరిగినది. 


హౌస్ మ్యాపింగ్ లో ఎవరెవరు ఉన్నారని తెలుసుకునే ప్రాసెస్ [ ఉద్యోగుల లాగిన్ ]

Start 

Login to NBM Portal 

Scheme Eligibility Check 

Scheme Eligibility Check 

Enter Aadar Number 

Select Any Scheme 

Select Year 2024-25

Submit

కింద చూపిన విధంగా కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వారి వివరాలు చూపిస్తుంది. 



ఇప్పుడు పైన చూపిస్తున్న మీ కుటుంబంలో మీరు గాని లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పేరు లేకపోతే వెంటనే కింద తెలిపిన విధానం ద్వారా మీ యొక్క కుటుంబ సభ్యులను మీ కుటుంబంలో Adding చేసుకోవచ్చు. లేదా కొత్తగా మొత్తం కుటుంబాన్ని హౌస్ మ్యాపింగ్ చేసుకోవచ్చు . 


Step 1 : ముందుగా కింద తెలిపిన లింక్ ఓపెన్ చేయండి. 

Open House Mapping Link

Step 2 : Tick చేయండి. login పై క్లిక్ చేయండి. 



Step 3 : Aadar Authentication వద్ద Tick చేసి, ఎవరిని హౌస్ మాపింగ్ లో యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి, Get OTP పై క్లిక్ చేస్తే ఆధార్కు లింక్ అయినా నెంబర్ కు ఆరు అంకెల ఓటిపి వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయండి. 



Step 4 : ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఏజ్ ఆటోమెటిగ్గా వస్తుంది. తరువాత కింద డేటాను ఎంటర్ చేయాలి.

  1. మొబైల్ నెంబర్
  2. డోర్ నెంబర్ & వీధి పేరు*
  3. జిల్లా*
  4. మండలం*
  5. సచివాలయం*
  6. క్లస్టర్ 
  7. వివాహ స్థితి 
  8. విద్య అర్హత 
  9. వృత్తి 
  10. కులం*
  11. ఉప కులం*
  12. మతము 

వివరాలను నమోదు చేయాలి. * ఉన్నవి తప్పనిసరి .



Step 5 : తరువాత Do You Want To Add Members ? అనే ప్రశ్న ఎదురవుతుంది. దీని అర్థం కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఉన్నారా లేదా ఒకరి కన్నా ఎక్కువ ఉన్నారా అని. కుటుంబంలో ఒకరు మాత్రమే ఉంటే NO అనిటిక్ చేసి కింద తెలిపిన నాలుగు ఆప్షన్లలో ఒకటిని ఎంచుకోవాలి. 

  • అవివాహితుడు మరియు విడివిడిగా నివసిస్తున్నారు
  • వితంతువు/వితంతువు
  • కుటుంబ సభ్యులు లేని ఒంటరి
  • ట్రాన్స్ జెండర్

పై వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసినట్లయితే హౌస్ మ్యాపింగ్ దరఖాస్తు పూర్తి అవుతుంది. 24 - 48 గంటలలోపు హౌస్ మాపింగ్ లో పేరు చూపిస్తుంది. 

కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ సభ్యులు ఉన్నట్టయితే YES పైటిక్ చేస్తే నెక్స్ట్ సెక్షన్కు వెళ్తుంది. 



Step 6 : Enter Family Details Screen చూపిస్తుంది. ప్రస్తుతం మ్యాపింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరి కుటుంబంలో ఆడ్ అవ్వాలనుకుంటున్నారో ఆ కుటుంబంలోని సభ్యుల ఒకరి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి SEARCH పై క్లిక్ చేయాలి. 



Step 7 : ఎంటర్ చేసిన వ్యక్తి ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారో మ్యాపింగ్ ఐడి మరియు పూర్తి పేరు వస్తుంది. Do you want to add yourself to this member's household? అనే ప్రశ్న వద్ద YES అని tick చేసి Submit చేస్తే చాలు. 

పై పని చేసిన 24 నుండి 48 గంటల్లోపు హౌస్ మ్యాపింగ్ లో పేరు యాడ్ అవుతుంది. 


ఇంపార్టెంట్ సమాచారం కోసం వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.


New Member Household Mapping Adding Process AP 2025 Video 


View More

Post a Comment

0 Comments