April 2025 Aadhaar Special Camps Dates, Locations & Services Updates
ఆధార్ కార్డు లేనివారికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నవారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం April 2025 Aadhaar Special Camps Schedule విడుదల చేయడం జరిగింది . దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది అసలు ఈ ఆధార్ డ్రైవ్ లేదా క్యాంపు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది ?, ఏ సర్వీసులు చేస్తారు ?, సర్వీస్ ఫీజు ఎంత ఉంటుంది ?, అప్లికేషన్ ఫారాలు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ? ఇలా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.
Aadhaar Camps Schedule
తేదీ 2025 ఏప్రిల్ 3 నుండి 4 వరకు మరలా 8 నుండి 11 వరకు ఆధార్ క్యాంపులు రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్ Aadhaar Special Camps Schedule ప్రాప్తికి అంగన్వాడీ సెంటర్లలో / గ్రామా వార్డు సచివాలయాల్లో జరుగుతున్నాయి.
Aadhaar Camps Use
ఈ ఆధార్ క్యాంపులో ముఖ్యంగా వయసు 0 - 6 సంవత్సరాల లోపు పుట్టిన పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు [ బాల ఆధార్ కార్డుల ] నమోదు చేస్తారు . వీటితో పాటు ఇతర ఆధార్ సేవలు కూడా చేస్తారు .
List Of Services Available at Aadhaar Camps
- కొత్త ఆధార్ నమోదు / బాల ఆధార్ ఆధార్
- ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్
- ఆధార్ కు e మెయిల్ ఐడి లింక్
- ఆధార్ లో ఫోటో మార్పు
- ఫింగర్ ప్రింట్ అప్డేట్
- ఐరిష్ అప్డేట్
- పేరు లో మార్పు
- చిరునామా లో మార్పు
- ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్
- లింగము లో మార్పు
- ఆధార్ ప్రింట్
- తప్పనిసరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
Service Charge of Aadhaar Services in Camps
- పిల్లలకు బాల ఆధార్ / కొత్త ఆధార్ - ఉచితం
- 5-7 , 15-17 సం. మధ్య వయసు ఉండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఉచితం
- ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ - 50/-
- ఆధార్ - ఇమెయిల్ లింక్ - 50/-
- డాక్యుమెంట్ అప్డేట్ - 50-
- పేరు మార్పు - 50/-
- చిరునామా మార్పు - 50/-
- పుట్టిన తేదీ మార్పు - 50/-
- లింగము అప్డేట్ - 50/-
- ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ - 100/-
- 7,17 సం. వయసు నిండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - 100/-
Documents Required For Aadhaar Services in Aadhaar Camps
- పిల్లలకు బాల ఆధార్ / కొత్త ఆధార్ - బర్త్ సర్టిఫికెట్ + తల్లి / తండ్రి ఆధార్
- 5-7 , 15-17 సం. మధ్య వయసు ఉండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఆధార్ కార్డు
- ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ - ఆధార్ కార్డు + మొబైల్ నెంబర్
- ఆధార్ - ఇమెయిల్ లింక్ - ఆధార్ కార్డు + ఇమెయిల్ ఐ డి
- పేరు మార్పు - ఆధార్ కార్డు + SSC Memo / Other Original Memo / పాన్ కార్డు / DL / పాస్ పోర్ట్ / రేషన్ కార్డు - Photo ఉన్న వారికి / ఆరోగ్య శ్రీ కార్డు - ఫోటో ఉన్నవారికి etc..
- చిరునామా మార్పు - ఆధార్ కార్డు + ఓటర్ కార్డు / రేషన్ కార్డు - ఫోటో ఉన్న వారికి / ఆరోగ్య శ్రీ కార్డు - ఫోటో ఉన్న వారికి / వికలాంగుల కార్డు / Standard Document etc..
- పుట్టిన తేదీ మార్పు - ఆధార్ కార్డు + [ For Age Above 18 years - SSC / Inter / Degree / Other Original Memo ] or [ For Age Below18 years - పుట్టిన తేదీ ఒరిజినల్ మెమో ]
- లింగము అప్డేట్ - ఆధార్ కార్డు
- బయోమెట్రిక్ అప్డేట్ ( ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ ) - ఆధార్ కార్డు
- 7,17 సం. వయసు నిండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఆధార్ కార్డు
- డాక్యుమెంట్ అప్డేట్ - ఆధార్ కార్డు + POI + POA
Note : అన్ని సర్వీస్ లకు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ అవ్వవల్సిన వ్యక్తి హాజరు అవ్వాలి . వీటితో పాటు ఇంకా చాలా డాకుమెంట్స్ ఉంటాయి .
Documents Required For New Child Aadhaar
- QR Code ఉన్న పుట్టిన తేదీ సర్టిఫికెట్
- దరఖాస్తు ఫారం
- బిడ్డ ను క్యాంపు జరిగే ప్రదేశానికి తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు కలిసి తీసుకువెళ్లాలి .
- తల్లి లేదా / మరియు తండ్రి ఆధార్ కార్డు
Tips to New Baal Aadhaar Enrolment For Child
- కొత్తగా ఆధార్ నమోదు చేయడానికి తెచ్చినటువంటి పుట్టిన సర్టిఫికెట్ ఒరిజినలా ? కాదా ? అని CRS సర్టిఫికెట్ అయితే స్కాన్ ద్వారా గాని మీసేవ సర్టిఫికెట్ అయితే మీ సేవ సైట్ లో అప్లికేషన్ స్టేటస్ ద్వారా గాని చెక్ చేయవలెను .
- ఆధార్ నమోదు చేయుటకు పిల్లలతో పాటు ఎవరు వస్తున్నారు అని తప్పనిసరిగా చూడవలెను , ఎందుకంటే ఎవరు వస్తున్నారో వారి ప్రకారం కొత్తగా ఆధార్ నమోదు ప్రక్రియ ఉంటుంది.
- బిడ్డ ఆధార్ C/O లో తల్లి పేరు , తల్లి ఆధార్ అడ్రస్ రావాలి అంటే : ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తల్లి ఉండాలి . తల్లి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను. బిడ్డ యొక్క C/O సెక్షన్లో తల్లి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తల్లి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తల్లి పేరు , తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric వద్ద తల్లి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తండ్రి పేరు, తండ్రి ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తండ్రి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తండ్రి బియోమెట్రిక్ వేయరాదు .
- బిడ్డ ఆధార్ C/O లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ అడ్రస్ రావాలి అంటే : ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తండ్రి ఉండాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను. బిడ్డ యొక్క C/O సెక్షన్లో తండ్రి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric వద్ద తండ్రి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తల్లి పేరు, తల్లి ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తల్లి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తల్లి బియోమెట్రిక్ వేయరాదు.