AP Sadarem Certificate 2025: Slot Booking, Fees, Documents & Process AP Sadarem Certificate 2025: Slot Booking, Fees, Documents & Process

AP Sadarem Certificate 2025: Slot Booking, Fees, Documents & Process

 

AP Sadarem Certificate 2025 – Online Slot Booking Process, Application Fees, Required Documents, and Status Check Guide for Disability Certification in Andhra Pradesh.

AP Sadarem Certificate Slot Booking 2025: Application Form, Fees, Documents & Check Status

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు శుభవార్త. AP Sadarem Certificate [వికలాంగుల నిర్ధారణ సర్టిఫికెట్] కొరకు Slot Bookings ఓపెన్ అవ్వనున్నాయి. April  4 , 2025 నుండి  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న Grama Ward Sachivalayams  & AP Meeseva Centers లోAP Sadarem Certificate Slot Booking కొరకు ఆప్షన్ ఓపెన్ అవ్వనుంది . Sadarem Slot Booking కొరకు Documents Required ?, Application Fee ?, Download Application Form ? , How to Book Sadarem Slot Booking Date ?   పూర్తి వివరాలను ఈ పోస్టులో చదవండి .

What is AP Sadarem Certificate? 

AP Sadarem Certificate: Disability Certification in Andhra Pradesh for Government Benefits, Eligibility, Application Process, and Online Slot Booking.

Sadarem Certificate అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వికలాంగులకు జారీ చేసే ఒక అధికారిక ధృవపత్రం.  సదరం (SADAREM - Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) అనేది వికలాంగుల అంచనా, పునరావాసం, మరియు శక్తివంతం కోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్. ఈ సర్టిఫికేట్ ద్వారా Sadarem Certificate Use వికలాంగులు ప్రభుత్వ పథకాలు, పెన్షన్, ఉచిత ఉపాధి అవకాశాలు, ప్రయాణంలో రాయితీ, ప్రత్యేక విద్యా సదుపాయాలు, మరియు ఇతర లబ్ధులను పొందగలరు. AP Sadarem Certificate పొందడానికి, ముందుగా ఆన్‌లైన్‌లో Sadarem Slot Book చేసుకుని, నిర్దేశించిన ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పరీక్ష తర్వాత ప్రభుత్వ మెడికల్ బోర్డ్ అంచనా వేసి, Sadarem Certificate జారీ చేస్తారు. 


Benefits of AP Sadarem Disability Certificate 

AP Sadarem Disability Certificate: Key Benefits & How It Helps You

AP Sadarem Disability Certificate ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వికలాంగులకు అందించబడే ప్రామాణిక పత్రం. దీని ద్వారా పలు ప్రభుత్వ పథకాలు, రాయితీలు, మరియు ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి. 

Benefits of AP Sadarem Certificate 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు – వికలాంగులకు సంబంధించిన అన్ని పథకాలలో అర్హత పొందడానికి అవసరమైన అధికారిక సర్టిఫికేట్. 

వికలాంగ పెన్షన్ – వికలాంగుల కోసం ప్రత్యేకంగా అందించే వికలాంగ పెన్షన్ (Disability Pension) పొందేందుకు అర్హత. 

ఉచిత మరియు తక్కువ చార్జీ ప్రయాణ సదుపాయంAPSRTC బస్సుల్లో ఉచిత లేదా రాయితీ ధరకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. 

ఉచిత వైద్యం & ఆరోగ్య బీమా – ఆరోగ్య శ్రీ & ఇతర ప్రభుత్వ వైద్య సేవలు పొందేందుకు వీలైన అధికారిక ధృవీకరణ పత్రం. 

విశేష విద్యా & ఉపాధి అవకాశాలు – వికలాంగుల కోసం ప్రత్యేక విద్యా, స్కాలర్‌షిప్‌లు, మరియు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు. 

ప్రత్యేక గుర్తింపు & రాయితీలు – ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో వికలాంగ రిజర్వేషన్లు, రియాయితీ లెండ్లు, మరియు ప్రత్యేక రాయితీలు పొందే అవకాశం. 

స్వయం ఉపాధి & స్టార్ట్-అప్ రుణాలు – వికలాంగుల కోసం ప్రత్యేకంగా అందించే బ్యాంకు రుణాలు, మద్దతు పథకాలు. 

మొబిలిటీ & సహాయ పరికరాలు – వికలాంగులకు అవసరమైన వీల్‌చైర్స్, హియరింగ్ ఎయిడ్స్, ప్రోస్థటిక్ లిమ్బ్స్ వంటి సహాయ పరికరాలు ఉచితంగా లేదా తక్కువ ధరకే పొందే అవకాశం.


Who is Eligible for AP Sadarem Certificate? 

Who is Eligible for AP Sadarem Certificate?

AP Sadarem Certificate కు అర్హత గల వారు (Eligibility Criteria for AP Sadarem Certificate) 


శారీరక, మానసిక, లేదా బహుళ వికలాంగత ఉన్న వ్యక్తులు 

➡ 40% లేదా అంతకంటే ఎక్కువ శారీరక వికలాంగత (Physical Disability) ఉన్నవారు 

➡ మానసిక అణచింపు (Mental Retardation), ఆటిజం (Autism), లేదా మానసిక వ్యాధులు ఉన్నవారు 

➡ హియరింగ్ లోస్ (Hearing Impairment) లేదా దృష్టి లోపం (Visual Impairment) ఉన్నవారు 

➡ బహుళ వికలాంగత (Multiple Disabilities) గల వ్యక్తులు 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు మాత్రమే 

➡ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసిస్తున్న వ్యక్తి కావాలి. 

➡ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేదా ఇతర చిరునామా ధృవీకరణ పత్రాలు అవసరం. 

  AADHAAR CARD LINKS  

ప్రభుత్వ మెడికల్ బోర్డ్ ద్వారా ధృవీకరణ పొందినవారు 

➡ వికలాంగత అంచనా కోసం ప్రభుత్వ మెడికల్ బోర్డ్ పరీక్షను పూర్తి చేయాలి. 

➡ మెడికల్ బోర్డ్ పరీక్ష ఫలితాల ఆధారంగా సర్టిఫికేట్ మంజూరు చేయబడుతుంది. 


పిల్లలు & పెద్దలకు సమాన అర్హతలు 

➡ 5 ఏళ్లు పైబడిన పిల్లలు, యువత, మరియు వృద్ధులు సదరం సర్టిఫికేట్ పొందేందుకు అర్హులు. 

➡ ప్రత్యేక విద్యా మరియు ఉపాధి అవకాశాల కోసం పిల్లలకు కూడా సర్టిఫికేట్ అవసరం. 


Documents Required for AP Sadarem Certificate Slot Booking 

AP Sadarem Certificate Slot Booking  చేసుకోవడానికి Documents Required

  1. ఆధార్ కార్డు జిరాక్స్
  2. అప్లికేషన్ ఫారం
  3. ఆధార్ కు లింక్ అయినా మొబైల్ కు వచ్చే ఓటిపి
  4. చిరునామా ప్రూఫ్ [ రేషన్ కార్డు / ఆధార్ కార్డు / బ్యాంకు బుక్కు వంటివి ] 
  5. వైకల్యం స్పష్టంగా కనిపించే ఫోటో 
  6. వైద్య నివేదికలు (ఉంటే)
  7. Application Fee : 40/-

How to Apply for AP Sadarem Disability Certificate Online? 

How to Apply for AP Sadarem Disability Certificate Online?

AP Sadarem Disability Certificateకు ఆన్లైన్ లో ఎటువంటి ఆప్షన్ లేదు కేవలం Grama Ward Sachivalayams లేదా AP Mee Seva లో దరఖాస్తు చేసిన తర్వాత రసీదుతో Sadarem Slot Booking Status చెక్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది .

Step-by-Step Guide to AP Sadarem 2025 Slot Booking 

Step 1 : కింద ఉన్న AP Seva Portal link పై click చేసి DA/WEDPS login ID , Password తో login అవ్వాలి.

  SADAREM SLOT BOOKING LINK   

Step 2 : "Other Services" పై click చేయండి.Old Gsws site కి redirect అవ్తుంది.

Step 3 : "Health, Medical & Family Welfare" లో Family Welfare పై click చేయండి.

Step 4 : "Slot Booking for Sadarem Certificate" option పై click చేయండి.

Step 5 : Enter Beneficiary Name, Enter Beneficiary Mobile Number, Enter Beneficiary Aadhaar Number ని enter చేసి Submit పై click చేయండి.

Step 6 : Aadhaar No దగ్గర Beneficiary Aadhaar Number enter చేసి declaration పై click చేసి "Generate OTP" పై click చేయండి.

Note : "Generate OTP" పై click చేసినప్పుడు SADAREM ID వచ్చిందంటే, ఇంతకు ముందే Sadarem కోసం apply చేశారని అర్ధం. ఒకసారి apply చేసిన ID Delete అయ్యే వరకూ కొత్తది రాదు.

Step 7 : Aadhaar Registerd mobile number కి వచ్చిన 6 అంకెల OTP enter చేసి "Validate OTP" పై click చేయండి.

Step 8 : Hospitals ప్రకారం Slots list వస్తుంది, మీకు కావలసిన Catagory ఉంది అనుకుంటే "Submit" పై click చేయండి.

Step 9 : Beneficiary Aadhaar ప్రకారం details display అవుతాయి.

Step 10 : "కార్డు మీద చూపవలసిన పేరు" అనే చోట Beneficiary Name ని తెలుగులో Type చేయండి.

Note : మీరు Enter చేయాలి అనుకుంటే అన్ని Details Enter చేయోచ్చు లేదంటే కేవలం Mandatiey Details మాత్రమే Enter చేయొచ్చు.

Step 11 : "Marital status" దగ్గర click చేసి Beneficiary Married/Unmarried/Widow/Widower/Diversed అనేది enter చేయండి.

Step 12 : "Identification Marks" దగ్గర Beneficiary కి సంభందించిన 2 పుట్టు మచ్చలు enter చేయండి.

Step 13 : "తండ్రి/సంరక్షకుడి పేరు" దగ్గర Beneficiary తండ్రి పేరు తెలుగులో enter చేయండి.

Step 14 : Beneficiary Mandal, Panchayath, Town/Village, Habitation/Ward no, Phone number Enter చేయండి.

Step 15 : Hospital Details దగ్గర మీకు కావల్సిన Hospital యొక్క District ,Hospital Select చేసుకోండి.

Step 16 : "Type of disability" దగ్గర మీరు ఏ రకం Disability checkup కి వెళ్తున్నారో దాన్ని select చేసుకొని Submit పై click చేయండి.

Note : Type of disability option open చేసినప్పుడు, మీరు select చేసుకున్నా hospital లో చూసే సేవలు మాత్రమె కనిపిస్తాయి.

Step 17 : Submit పై click చేయగానే మీరు enter చేసిన primary details గురించి pop-up వస్తుంది దాన్ని ok చెస్తే మనకి ఒక Sadarem id generate అవ్తుంది, కిందనే Ackwnoledgment Downlode పై click చేసి Print తీసుకోండి.

Note : Ackwnoledgment లో మీరు hospital కి వెళ్లాల్సిన date మరియు time చూపిస్తుంది, అలా కాకుండా waiting list వచ్చిన వాళ్లకు తరువాతా slot ok అయినప్పుడు మీరు ఇచ్చిన mobile number కు date మరియు time message వస్తుంది. 


How to Check AP Sadarem Slot Booking Status? 

Sadarem Certificate Slot Booking లో రెండు రకములుగా రసీదులు వస్తాయి , ఒకటి ఏ రోజు , ఎన్ని గంటలకు వెళ్లాలో వివరాలు ఉంటాయి , రెండు WL వెయిటింగ్ లిస్ట్ అని ఉంటుంది . WL అని ఉన్న వారు తదుపరి ప్రభుత్వం Sadarem Certificate Slots విడుదల చేసే వరకు వేచి ఉండాలి . విడుదల చేసాక స్లాట్ బుక్ చేసుకున్న వారికి వారు Sadarem Certificate Slot బుక్ చేసే సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు SMS రూపం లో ఏ రోజు , ఎంత సమయాకు ఆసుపత్రికి వెళ్లాలో వస్తుంది . ఆలా మెసేజ్ రాని వారు , కింద చూపిన విధానంలో ఎప్పటికి అప్పుడు మీ Check Sadarem Status Online  చూసుకోవచ్చు . మీ మొబైల్ లోనే చూసుకోవచ్చు . 


Check Sadarem Status Online Process

Check Sadarem Status Online Process

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి Sadarem Status Online Link పై క్లిక్ చెయ్యండి .

  SADARAM STATUS LINK  

Step 2 : కింద చూపినట్టుగా పేజీ ఓపెన్ అవుతుంది .


Step 3 : Sadarem ID వద్ద మీ వద్ద ఉన్న రసీదులో ఉన్నటువంటిని 17 అంకెల SADAREM ID ను ఎంటర్ చేసి , Captcha కోడ్ ఎంటర్ చేసి Search పై క్లిక్ చెయ్యండి .


Step 4 : కింద చూపిన విధముగా స్లాట్ నిర్దారణ అయితే కింద చూపిన విధముగా తేదీ , సమయం చూపుతుంది . 


Sadarem Slot WL అంటే వెయిటింగ్ లిస్ట్ ఉన్న వారికి కింద చూపిన విధముగా చూపిస్తుంది .


AP Sadarem Helpline & Support for Slot Booking Issues 

AP Sadarem Helpline Numbers 

✅ సాధారణ హెల్ప్‌లైన్ నంబర్: 1902 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవల కోసం) 

✅ వైద్యం & కుటుంబ సంక్షేమ సేవలు: 1907 (సదరం సంబంధిత సమస్యలకు సంప్రదించవచ్చు) 

✅ AP Sadarem Helpline e Mail ID  : 

sadarem.helpdesk@aptonline.in 

✅ APDASCAC (ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ & సీనియర్ సిటిజన్స్ అసిస్టెన్స్ కార్పొరేషన్): 

  • e-Mail ID : mdapvcc@gmail.com 
  • Address : డి.నెం.74-14-2, 1వ అంతస్తు, రాజా నరేంద్ర బిల్డింగ్, కృష్ణ నగర్, యనమలకుదురు రోడ్, విజయవాడ-520007 


AP Sadarem Slot Booking Support 

ఆన్‌లైన్ పోర్టల్ సమస్యలు: 

  • సదరం అధికారిక వెబ్‌సైట్ (sadarem.ap.gov.in)లో స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు సాంకేతిక సమస్యలు ఎదురైతే, "SADAREM Grievances" లేదా "Check Slot Booking Status" ఎంపికను ఉపయోగించి సమస్యను నమోదు చేయవచ్చు. 
  • ఆధార్ నంబర్‌తో లాగిన్ అయ్యి, OTP జనరేట్ కాకపోతే లేదా స్లాట్‌లు అందుబాటులో లేకపోతే, హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. 


మీసేవా / సచివాలయ సపోర్ట్: 

  • స్లాట్ బుకింగ్ కోసం మీసేవా కేంద్రాలు లేదా గ్రామ/వార్డు సచివాలయాలను సందర్శించినప్పుడు సమస్యలు ఎదురైతే, అక్కడి సిబ్బందిని సంప్రదించండి. 
  • వారు సదరం ID లేదా ఆధార్ నంబర్ ఆధారంగా సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తారు. 


సాధారణ సమస్యలు & పరిష్కారాలు: 

  • స్లాట్ అందుబాటులో లేకపోవడం: సదరం వెబ్‌సైట్‌లో "Check Slot Availability" ఎంపికను ఉపయోగించి జిల్లా వారీగా స్లాట్‌లను తనిఖీ చేయండి. 
  • OTP రాకపోవడం: ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయండి. సమస్య కొనసాగితే, హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వండి. 
  • సర్టిఫికెట్ స్టేటస్ తెలియకపోవడం: వెబ్‌సైట్‌లో "Check Status" ఎంపికలో సదరం ID లేదా ఆధార్ నంబర్‌తో స్టేటస్ చూడవచ్చు. 


సలహా: స్లాట్ బుకింగ్ కోసం సిబ్బంది ద్వారా ముందుగా sadarem.ap.gov.in లో లాగిన్ అయి, ఆసుపత్రి వారీగా అందుబాటులో ఉన్న స్లాట్‌లను చూసి బుక్ చేసుకోండి. సమస్యలు పరిష్కారం కాకపోతే, పై హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేసి, మీ సదరం ID లేదా ఆధార్ నంబర్‌తో పాటు సమస్య వివరాలను చెప్పండి. తాజా అప్‌డేట్స్ కోసం సదరం పోర్టల్‌ను లేదా స్థానిక సచివాలయాన్ని సంప్రదించండి. 


Sadarem Certificate Slot Booking, Know Status, Print Certificate Complete Process 



View More

Post a Comment

0 Comments