P4 Survey Grama Sabha Importance
AP రాష్ట్ర వ్యాప్తంగా P4 Policy Grama Sabha లు. AP P4 Survey రాష్ట్రవ్యాప్తంగా Matrch 20 తో పూర్తి అయింది. ప్రభుత్వం AP P4 Policy ను మార్చి 30, 2025 నుండి అమలులోకి తీసుకురానుంది. అందులో భాగంగా P4 Survey చేసిన ప్రజల వివరాలలో రాష్ట్రవ్యాప్తంగా మార్చి 22 & 23లలో P4 Grama Sabhalu నిర్వహించి , ప్రభుత్వం పరిగణిస్తున్న 5 విషయాలను పరిగణలోకి తీసుకొని ఆనులైన్లో ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే లిస్టులను P4 Grama Sabha లో ప్రవేశపెట్టి అందులో ఎటువంటి ఫిర్యాదులు వస్తే వాటిని నమోదు చేసుకొని , గ్రామ సభలో లిస్టులో పేరు రాని వారి ప్రస్తావన వచ్చినట్టయితే వారి వివరాలను నమోదు చేసుకుని మార్చి 24 లేదా 25 తేదీలలో డేటాను డిజిటల్ రూపంలో GSWS old Portal లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది .
P4 Grama Sabhalu ఎప్పుడూ ఉంటాయి ?
రాష్ట్రవ్యాప్తంగా P4 Grama Sabhaలను మార్చి 22 మరియు 23న సంబంధిత MPDO వారు వేసినP4 Grama Sabha Schedule ప్రాప్తికి మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో ఈ యొక్క P4 Grama Sabha లు నిర్వహించడం జరుగుతుంది .
గ్రామసభల ముఖ్య ఉద్దేశం ఏమిటి ?
గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ Grama Sachivalayam Staff చేసినటువంటి AP P4 Survey 2025 లో వివరాల ఆధారంగా Panchayat Secretary వారి యొక్క Old GSWS Web Site లో సర్వేలో అడిగిన అన్ని ప్రశ్నలపై కాకుండా ప్రభుత్వం నిర్ధారించిన 5 ప్రశ్నలకు సంబంధించి లిస్టులో డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, ఆయా వివరాలను గ్రామ సభలో చర్చించి, నిర్ధారించుకొని ఆ యొక్క వివరాలను పంచాయతీ కార్యదర్శి వారి యొక్క Old GSWS Web Site లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది .
P4 Mismatch List లో ఎవరి పేర్లు వస్తాయి ?
ఇంట్లో సంపాదిస్తున్న వ్యక్తి ఉన్నారా ?
- ఇంట్లో ఒకరు కూడా సంపాదించని వ్యక్తి ఉంటే లిస్టులో పేరు వస్తుంది
ఇంటికి త్రాగునీరు సదుపాయం ఉన్నదా ?
- ఇంటికి త్రాగునీటి సదుపాయం కింద రౌండ్ ట్రిప్పు టైం 30 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే లిస్టులో పేరు వస్తుంది
ఇంట్లో ఎవరికైనా బ్యాంకు అకౌంట్ ఉందా ?
- ఇంట్లో ఎవరికి బ్యాంకు ఎకౌంటు లేకపోతే అప్పుడు లిస్టులో పేరు వస్తుంది.
ఇంట్లో LPG ఉందా ?
- ఇంట్లో గ్యాస్ తో కాకుండా ఇతర పద్ధతుల్లో వంట చేస్తున్నట్లయితే అప్పుడు మాత్రమే లిస్టులో పేరు వస్తుంది
ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఉందా ?
- ఏ విద్యుత్ కనెక్షన్ లేకపోతే అప్పుడు మాత్రమే పేరు వస్తుంది
P4 Mismatch List లో పేరు లేక పోతే ఎం చేయాలి ?
గ్రామ సభలో ప్రవేశపెట్టిన లిస్టులో ఏ కుటుంబంలో P4 Mismatch List లో సంబంధించి పేరుగాని రాకపోతే అటువంటి వారి యొక్క పేర్లను గ్రామ సభలో నమోదు చేసుకొని గ్రామసభ పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శి వారి యొక్క పాత గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్లో P4 Additiion Screen లో జోడించవచ్చు .
P4 Mismatch List ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?
ముందుగా Old GSWS Portal వెబ్సైట్లో సంబంధిత పంచాయతీ కార్యదర్శి వారు లాగిన్ అవ్వాలి.
కేవలం Sachivalayam Code-PS లాగిన్ లో మాత్రమే కాకుండా -PS1, -PSIV1, -PSIV2 etc.. ఇటువంటి లాగిన్ లో కూడా లిస్ట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
లాగిన్ అవ్వకపోతే : మీయొక్క డిజిటల్ అసిస్టెంట్ అధికారి యొక్క AP Seva Porta --> Other Services లో Edit Employees Details అనే ఆప్షన్ ద్వారా మీ పాత పేరును Vacant అని పెట్టి , మరలా వివరాలను సరిగా ఇచ్చి సబ్మిట్ చేస్తే New User Name వస్తుంది దానిని నోట్ చేసుకొని, HRMS Portal లో Forget Password ఆప్షన్ ద్వారా కొత్త పాస్వర్డ్ ను సెట్ చేసుకోవచ్చు. అప్పుడు Old GSWS Portal లాగిన్ అవ్వాలి .
తర్వాత P4 Mismatch Screen అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి.
అప్పుడు
P4 Mismatch Screen - List Download & Data ENtry + Entry
P4 Addition Screen - Data Entry For Unlisted Persons
ఇప్పుడు కింద ఇవ్వబడిన యూజర్ మాన్యువల్ ఫాలో అయ్యి డేటా ఎంట్రీ ని పూర్తి చేయవచ్చు .
P4 Data on Discrepancies Dash Board - Report
మొత్తం వచ్చిన లిస్టులో ఎన్నింటికి GSWS old Porta లో డేటా ఎంట్రీ పూర్తి [ P4 Data on Discrepancies ] చేశారో తెలుసుకునే రిపోర్ట్ కోసం కింద లింక్ పై క్లిక్ చేయండి.
LIST LO UNNAVI ANNI CLEAR CHEYYALA
ReplyDelete