Widow Pensions in Andhra Pradesh (Spouse Category)
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లకు New Pensions in AP దరఖాస్తు చేయాలనుకునే వారికి శుభవార్త. ప్రభుత్వం 89,788 కొత్త పింఛన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. వారికి మే నెల నుండి 4వేల రూపాయలు పెన్షన్ అందుతుంది. భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి భార్య [ వితంతువుకు ] Spouse కేటగిరీ కింద పెన్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే, ఇక్కడ భర్త కేవలం వృద్ధాప్య పింఛను మాత్రమే కాదు ఏ రకము పెన్షన్ తీసుకుంటున్న వారి భార్య పెన్షన్ కు అర్హులు. సచివాలయంలోని WEA / WWDA అధికారుల వారి లాగిన్ లో పెన్షన్ దరఖాస్తు కొరకు ఆప్షన్ కలదు. ఆ పింఛనుదారులు ఎవరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
What Are the New Widow Pensions in AP Under the Spouse Category?
రాష్ట్రంలో పింఛను తీసుకుంటున్న పురుషుడు చనిపోతే అదే కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదు అనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2024 నవంబర్ నెల 1 నుండి చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకు వితంతు పెన్షన్ Widow Pension (Spouse) కోటాలో ఇస్తున్న విషయం తెలిసిందే. వారికి ప్రతి నెల 4000 రూపాయల Monthly Pension Amount for Widows in AP పెన్షన్ అందుతుంది. ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం మరికొంతమందికి లబ్ధి చేకూరుస్తూ ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది.
Eligibility Criteria for Widow Pensions in Andhra Pradesh (AP)
2023 డిసెంబర్ 1 నుండి 2024 అక్టోబర్ 31 మధ్య ఎవరైతే పింఛన్ తీసుకుంటూ పురుషులు చనిపోయినట్టయితే వారి భార్యలకు వితంతు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది అందులో మొత్తంగా 89,788 పింఛనుదారులు ఖరారు చేస్తూ లిస్టులను కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. వీరికి గాను పెన్షన్ పంపిణీకు నెలకు ప్రభుత్వానికి దగ్గరగా 30 కోట్ల ఖర్చు అవ్వనుంది.
Required Documents for Widow Pension Application in AP
చనిపోయిన భర్త యొక్క డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, భార్య యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, New Pension Application Form ను గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ [ Welfare and Education Assistant ] మరియు వార్డు సచివాలయంలో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ [ Ward Welfare & Development Secretary ] అధికారులకు అందించినట్టయితే వారి లాగిన్ లో మీ యొక్క వివరాలను అప్డేట్ చేయడం జరుగుతుంది అంటే కొత్తగా పింఛన్ కొరకు దరఖాస్తు చేయడం జరుగుతుంది.
How to Apply for Widow Pension in AP Under the Spouse Category
ప్రభుత్వం విడుదల చేసిన లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకుగాను కింద ఇవ్వబడిన లిస్టును డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో గాని లేదా కంప్యూటర్లో గాని స్విచ్ ఆప్షన్ ద్వారా లేదా జిల్లా మండలం సచివాలయం ద్వారా సచివాలయ పరిధిలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. లిస్టులో మీ పేరు లేకపోతే అంటే పింఛన్ తీసుకుంటూ ఎవరైతే భర్త చనిపోతారో వారి యొక్క పేరుగాని లిస్టు లేకపోతే అప్పుడు పైన చెప్పిన డాక్యుమెంట్లతో సచివాలయంలో పైన చెప్పిన అధికారులను కాంటాక్ట్ అయినట్టు అయితే మీకు ఆరు దశల దృవీకరణలో ఎటువంటి సమస్య లేకపోతే కొత్తగా దరఖాస్తు చేయడం జరుగుతుంది ఒకవేళ ఆరు దశల ధ్రువీకరణలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే దరఖాస్తు చేసిన ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు.
Latest Updates on Widow Pensions in AP – 2025
60 సంవత్సరాల లోపు పింఛను పొందకుండా చనిపోయిన పురుషుల భార్యలకు, 50 సంవత్సరాలు పూర్తయిన బీసీలకు, 60 సంవత్సరాలు పూర్తయిన వృద్ధులకు, వికలాంగుల సర్టిఫికెట్ కలిగిన దివ్యాంగులకు ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. దానిపై ఎటువంటి అధికారిక సమాచారం వెలువడిన వెంటనే Telugu Helper WhatsApp Channel లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా WhatsApp Channel లో జాయిన్ అవ్వండి .