Aadhaar Special Camps in Andhra Pradesh - May 2025
May 2025 నెల Aadhaar Special Camps in Andhra Pradesh ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డ్రైవింగ్ లో ముఖ్యంగా పుట్టిన పిల్లలకు మరియు ఆధార్ కార్డు లేని పిల్లలకు కొత్త ఆధార్ కార్డు నమోదు చేయటం, 5 & 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ కు అధిక ప్రాధాన్యత ఉంటుంది వీటితోపాటు ఆధార్ కి సంబంధించిన అన్ని సర్వీస్ లు కూడా ఈ యొక్క స్పెషల్ ఆధార్ డ్రైవ్ లో జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆధార్ పై ఎటువంటి సమస్యలు ఉన్న, ఈ యొక్క ఆధార స్పెషల్ డ్రైవ్ ను ఉపయోగించుకొని మీ ఆధార్ సమస్యలను క్లియర్ చేసుకోగలరు.
ఈనెల జరిగే ఆధార్ స్పెషల్ క్యాంపులో పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేని పిల్లలకు కొత్తగా ఆధార్ నమోదు చేయుటకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేకుండా ఆధార్ ను ఎలా పొందాలి ? అసలు ఈ ఆధార్ క్యాంప్లో ఏ ఏ సర్వీస్లు ఉంటాయి ? ఆ సర్వీసులకు సంబంధించి సర్వీస్ ఫీజు ఎంత ఉంటుంది ? ఏ డాక్యుమెంట్లు అవసరమవుతాయి ? ఆధారు సెంటర్లో నమోదు చేసుకున్న తర్వాత ఆ స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలి ? ఆధార్ దరఖాస్తు ఫారాలను ఎలా సులువుగా డౌన్లోడ్ చేసుకోవాలి? ఇలా పూర్తి వివరాలు ఈ పోస్ట్ లో చూద్దాం...
New Aadhaar Without Birth Certificate
PM JANMAN Aadhaar Program ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కింద ఇవ్వబడిన 10 జిల్లాలలో ఉన్నటువంటి PVTG లో పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేని వారికి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను Download విడుదల చేయడం జరిగింది. Domicile Certificate ద్వారా ఆధార్ కార్డు ఎలా నమోదు చేసుకోవాలో పూర్తి వివరాలతో కూడిన ప్రాసెస్ Download ను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.
కింద తెలిపిన జిల్లాలలో PVTG లో ఎవరైతే ఉన్నారో వారు మీకు దగ్గరలో PM JANMAN Program కింద ఆధార్ స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేసినట్లయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ను పొందగలరు .
- ALLURI SITHARAMA RAJU
- ANANTHAPUR
- ELURU
- KAKINADA
- NANDYAL
- PALNADU
- PARVATHIPURAM MANYAM
- PRAKASAM
- SRIKAKULAM
- VIZIANAGARAM
పై జిల్లాలలో ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక వెసులుబాటు కింద ట్రైబల్ ప్రజలు కింద తెలిపిన డాక్యుమెంట్లతో కొత్తగా ఆధార్ కార్డు పొందడం మరియు ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది .
May 2025 Aadhaar Special Camp Schedule
ఈనెల 5 నుంచి 8 వరకు, తిరిగి 12 నుంచి 15 వరకు రెండు దశల్లో ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. 0-6 ఏళ్లలోపు చిన్నారుల కోసం ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిన్నారుల జనన ధ్రువీకరణ ఒరిజినల్ పత్రాలను తల్లిదండ్రులు ప్రత్యేక శిబిరాల్లో చూపించి ఆధార్ నమోదు చేయించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనన ధ్రువీకరణ పత్రం పొందిన 1,07,358 మంది చిన్నారులు ఆధార్ నమోదు చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. ఆధార్ ఇప్పటికే నమోదు చేయించుకొంటే అదే విషయాన్ని తెలియజేసి గ్రామ, వార్డు సచివాలయాల్లోని రికార్డుల్లో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
List Of Services Available at Aadhaar Camps
- కొత్త ఆధార్ నమోదు / బాల ఆధార్ ఆధార్
- ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్
- ఆధార్ కు e మెయిల్ ఐడి లింక్
- ఆధార్ లో ఫోటో మార్పు
- ఫింగర్ ప్రింట్ అప్డేట్
- ఐరిష్ అప్డేట్
- పేరు లో మార్పు
- చిరునామా లో మార్పు
- ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్
- లింగము లో మార్పు
- ఆధార్ ప్రింట్
- తప్పనిసరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
Service Charge of Aadhaar Services in Camps
- పిల్లలకు బాల ఆధార్ / కొత్త ఆధార్ - ఉచితం
- 5-7 , 15-17 సం. మధ్య వయసు ఉండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఉచితం
- ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ - 50/-
- ఆధార్ - ఇమెయిల్ లింక్ - 50/-
- డాక్యుమెంట్ అప్డేట్ - 50-
- పేరు మార్పు - 50/-
- చిరునామా మార్పు - 50/-
- పుట్టిన తేదీ మార్పు - 50/-
- లింగము అప్డేట్ - 50/-
- ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ - 100/-
- 7,17 సం. వయసు నిండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - 100/-
Documents Required For Aadhaar Services in Aadhaar Camps
- పిల్లలకు బాల ఆధార్ / కొత్త ఆధార్ - బర్త్ సర్టిఫికెట్ + తల్లి / తండ్రి ఆధార్
- 5-7 , 15-17 సం. మధ్య వయసు ఉండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఆధార్ కార్డు
- ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ - ఆధార్ కార్డు + మొబైల్ నెంబర్
- ఆధార్ - ఇమెయిల్ లింక్ - ఆధార్ కార్డు + ఇమెయిల్ ఐ డి
- పేరు మార్పు - ఆధార్ కార్డు + SSC Memo / Other Original Memo / పాన్ కార్డు / DL / పాస్ పోర్ట్ / రేషన్ కార్డు - Photo ఉన్న వారికి / ఆరోగ్య శ్రీ కార్డు - ఫోటో ఉన్నవారికి etc..
- చిరునామా మార్పు - ఆధార్ కార్డు + ఓటర్ కార్డు / రేషన్ కార్డు - ఫోటో ఉన్న వారికి / ఆరోగ్య శ్రీ కార్డు - ఫోటో ఉన్న వారికి / వికలాంగుల కార్డు / Standard Document etc..
- పుట్టిన తేదీ మార్పు - ఆధార్ కార్డు + [ For Age Above 18 years - SSC / Inter / Degree / Other Original Memo ] or [ For Age Below18 years - పుట్టిన తేదీ ఒరిజినల్ మెమో ]
- లింగము అప్డేట్ - ఆధార్ కార్డు
- బయోమెట్రిక్ అప్డేట్ ( ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ ) - ఆధార్ కార్డు
- 7,17 సం. వయసు నిండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఆధార్ కార్డు
- డాక్యుమెంట్ అప్డేట్ - ఆధార్ కార్డు + POI + POA
Documents Required For New Child Aadhaar
- QR Code ఉన్న పుట్టిన తేదీ సర్టిఫికెట్
- దరఖాస్తు ఫారం
- బిడ్డ ను క్యాంపు జరిగే ప్రదేశానికి తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు కలిసి తీసుకువెళ్లాలి .
- తల్లి లేదా / మరియు తండ్రి ఆధార్ కార్డు
Tips to New Baal Aadhaar Enrolment For Child
- కొత్తగా ఆధార్ నమోదు చేయడానికి తెచ్చినటువంటి పుట్టిన సర్టిఫికెట్ ఒరిజినలా ? కాదా ? అని CRS సర్టిఫికెట్ అయితే స్కాన్ ద్వారా గాని మీసేవ సర్టిఫికెట్ అయితే మీ సేవ సైట్ లో అప్లికేషన్ స్టేటస్ ద్వారా గాని చెక్ చేయవలెను .
- ఆధార్ నమోదు చేయుటకు పిల్లలతో పాటు ఎవరు వస్తున్నారు అని తప్పనిసరిగా చూడవలెను , ఎందుకంటే ఎవరు వస్తున్నారో వారి ప్రకారం కొత్తగా ఆధార్ నమోదు ప్రక్రియ ఉంటుంది.
- బిడ్డ ఆధార్ C/O లో తల్లి పేరు , తల్లి ఆధార్ అడ్రస్ రావాలి అంటే : ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తల్లి ఉండాలి . తల్లి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను. బిడ్డ యొక్క C/O సెక్షన్లో తల్లి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తల్లి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తల్లి పేరు , తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric వద్ద తల్లి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తండ్రి పేరు, తండ్రి ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తండ్రి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తండ్రి బియోమెట్రిక్ వేయరాదు .
- బిడ్డ ఆధార్ C/O లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ అడ్రస్ రావాలి అంటే : ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తండ్రి ఉండాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను. బిడ్డ యొక్క C/O సెక్షన్లో తండ్రి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric వద్ద తండ్రి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తల్లి పేరు, తల్లి ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తల్లి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తల్లి బియోమెట్రిక్ వేయరాదు.