Disburse NTR Bharosa Pension Amount Without Delay
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NTR Bharosa Pension Scheme ద్వారా రాష్ట్రంలో ఉన్న పింఛన్దారులందరికీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని పెన్షన్ పంపిణీ అధికారులు Pension Disburse Officers [ PDO ] గా నియమిస్తూ వారి ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. పెన్షన్ పంపిణీ నెలలో మొదటి 2 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ మొదటి రోజు మధ్యాహ్నానికే పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని అధికారులు తెలియజేస్తున్నందున తక్కువ సమయంలో ఎక్కువ పెన్షన్లను పంపిణీ చేసేందుకు పెన్షన్ పంపిణీ అధికారులు పాటించాల్సిన చిన్నపాటి విషయాలు ఇప్పుడు చూద్దాం
పెన్షన్ పంపిణీ అధికారులు NTR Bharosa Pension Scheme అనే మొబైల్ యాప్ ద్వారా పెన్షన్ను పంపిణీ చేస్తున్నారు.
AP Pension Disbursement Time
గతంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభమయ్యేది కానీ ప్రస్తుతం ఉదయం 7 గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభమవుతుంది. కావున పెన్షన్ను త్వరగా పంపిణీ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఏడు గంటలకే పెన్షన్ ప్రారంభం చేయాల్సి ఉంటుంది. అధికారికంగా ఏడు గంటలు అని చెప్పినప్పటికీ ఆరు నుండి పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమై అవకాశం ఉంది కావున అధికారులు ఎవరూ కూడా అలసత్వం చేయకుండా పెన్షన్ పంపిణీ త్వరగా జరగాలంటే మాత్రం తప్పనిసరిగా 6:45 -7 కే పెన్షన్ పంపిణీను ప్రారంభించండి .
Door Step Disbursemnt
పెన్షన్ పంపిణి తప్పనిసరిగా PDO లు పింఛను దారుని ఇంటివద్ద చేయాలి . లేని పక్షాన IVRS ద్వారా పెన్షన్ దారునికి ఫోన్ కాల్ వెళ్తుంది. అందులో ఇంటి వద్ద ఇవ్వ లేదు అని చెప్తే వారికీ షో కాస్ నోటీసులు అందుతాయి . పెన్షన్ దారుడి ఇష్టపూర్వకంగా వేరే ఎక్కడ అయినా తీసుకున్న అప్పుడు దానికి సంబందించిన ఆప్షన్ ను PDO లు సెలెక్ట్ చేసి , పెన్షన్ ఇవ్వాలి . పెన్షన్ ఇవ్వటానికి లంచం తీసుకోవటం , ఇచ్చిన పెన్షన్ నగదుతో తగ్గించి ఇవ్వటం వంటివి చెయ్యరాదు .
Use Latest Scanner App
పెన్షన్ పంపిణీ ప్రక్రియ త్వరగా అవ్వాలి అంటే తప్పనిసరిగా మీ మొబైల్ లో మీరు ఏదైతే L1 Scanner ఉపయోగిస్తున్నారో దానికి సంబంధించి లేటెస్ట్ మొబైల్ యాప్ అనేది మీ వద్ద ఉండాలి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Mantra L1 Device లను పంపిణీ చేసింది కావున ప్రతి సిబ్బంది వారి మొబైల్ లో Mantra L1 Device కి సంబంధించినటువంటి మొబైల్ యాప్ తప్పనిసరిగా ఉండాలి మరియు లేటెస్ట్ ది అప్డేటెడ్ గా ఉన్నట్లయితే పెన్షన్ పంపిణీ చేసే సమయంలో మీకు ఎటువంటి సమస్య అనేది రాదు .
Take Authentication At a Time
పెన్షన్ పంపిణీ చేసే సమయంలో పింఛన్దారుడు పక్కపక్కన ఇళ్లల్లో ఉన్నట్టయితే పెన్షన్ పంపిణీ చేయు అధికారులు ముందుగా వారి బయోమెట్రిక్ లేదా ఐరిష్ లేదా ఫేస్ ద్వారా ధ్రువీకరణను పూర్తి చేసి, నగదును తర్వాత పంచుకున్నట్లయితే Online Report లో ఎక్కువ మందికి పెన్షన్ పంపిణీ చేసినట్టుగా నమోదు అవుతుంది . తక్కువ సమయంలో ఎక్కువ పెన్షన్ దారులకు పెన్షన్ పంపిణీ చేసినట్టుగా రిపోర్టు చూపిస్తుంది ఇలా చేయడం వలన ఒక్కొక్కసారి మొబైల్ యాప్ సర్వర్ పని చేయనప్పుడు తక్కువ సమయంలో ఎక్కువమందికి పూర్తి చేసినట్టు అయితే సర్వర్ పని చేయని సమయంలో మీరు నగదును నిదానంగా పంపిణీ చేసుకోవచ్చు .
Do This While Server is Down
చాలాసార్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పుడు సర్వర్ పనిచేయని సమయంలో పెన్షన్ పంపిణీ చేయు అధికారుల వద్ద ఉన్నటువంటి నగదును పింఛనుదారును వారీగా సపరేట్ చేసుకోవడం , అప్పటివరకు పంపిణీ చేసిన రిపోర్టును మొబైల్ యాప్ లో మరియు ఫిజికల్ గా ఉన్న నగదును కంపేర్ చేసుకోవడం, ఇంకా ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికి ఇచ్చాము అనే క్లారిటీ ఉన్నట్టయితే పెన్షన్ పంపిణీ అనేది చాలా త్వరగా పూర్తి అవుతుంది .
Prefer Best Practice While Taking Biometric
పింఛను పంపిణీ చేసే సమయంలో అందరు పింఛనుదారులకు బయోమెట్రిక్ లేదా ఫేసు లేదా ఐరిస్ పడతాయని గ్యారెంటీ ఉండదు కొందరికి వయసరీత్యా ధ్రువీకరణ అనేది ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు వారికి పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు చివరగా ప్రాధాన్యం ఇచ్చినట్లయితే మిగిలిన వారి యొక్క బయోమెట్రిక్ త్వరగా పూర్తవుతుంది కాబట్టి అప్పుడు ముందుగా బయోమెట్రిక్ లేదా ఫేసు లేదా ఐరిస్ సరిగా పడిన వారి పూర్తిచేసుకుని చివరగా సమస్య ఉన్నవారికి పంపిణీ చేసినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ మందికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది .
Charge Mobile Before Start
పింఛను పంపిణీ అనేది మొబైల్ యాప్ లో చేస్తారు కాబట్టి పెన్షన్ పంపిణీకు ముందుగానే మొబైల్ యాప్ చార్జింగ్ 100% ఉండేలా చూసుకోవడం వలన పెంచను పంపిణీ పూర్తయ్యే వరకు మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం వంటివి జరగవు కాబట్టి ఎటువంటి ఆటంకం ఉండదు కాబట్టి పెన్షన్ పంపిణీ త్వరగా పూర్తయి అవకాశం ఉంటుంది ఒకవేళ పెన్షన్ పంపిణీ మధ్యలోనే మొబైల్ గాని చార్జింగ్ లేకపోవడం వలన స్విచ్ ఆఫ్ అయినట్లయితే అప్పుడు పెన్షన్ పంపిణీ ఆటంకం జరుగుతుంది కాబట్టి కంపెనీకి ముందుగానే మొబైల్ లో పూర్తిగా చార్జింగ్ చేసుకొని వెళ్లడం మంచిది