AP Ration Card eKYC Last Date Extended
AP Ration Card eKYC Last Date జూన్ 30, 2025 కు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాంకేతిక సమస్యలు, బయోమెట్రిక్ సమస్యలో, ఆధార్ సమస్యలు, వలసలు ఉన్నవారు, ఇతర వివిధ కారణాల వల్ల Ration Card eKYC పూర్తి చేయని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గడువులోపు రేషన్ కార్డు ఈ కేవైసీ అవ్వని వారివి ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతారు మరియు రేషన్ నిలిపివేయడం జరుగుతుంది.
రేషన్ కార్డు eKYC ఎవరు చేసుకోవాలి ?
రేషన్ కార్డులో పేరు ఉండి ఒక్కసారి కూడా రేషన్ తీసుకొని వారు, శాశ్వతంగా వలసలో ఉన్నవారు, ఆధార్ కార్డులో వయసు 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లలు పేరుపై ఉన్న రేషన్ పక్కదారి పట్టకుండా, బోగస్ కార్డులను తీసివేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం Ration Card eKYC Necessity తప్పనిసరి చేసింది. మరోవైపు 2020లో రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. కానీ వారి పేర్లను ఇంకా తొలగించలేదు. కొంతమంది అడ్రస్సులు కూడా మారిపోయాయి.. వీరంతా ఈ-కేవైసీ చేసుకోవాల్సి ఉంది. అడ్రస్ మారిన వారు ఎక్కడ రేషన్ తీసుకుంటున్నారో అక్కడ ఈ-కేవైసీ చేసుకోవచ్చు.. కానీ చాలామందికి ఈ విషయం తెలియదంటున్నారు అధికారులు. అలాగే సాంకేతిక సమస్యల వల్ల కొందరి ఈ-కేవైసీ పూర్తి కాలేదంటున్నారు. అందరూ ఈ-కేవైసీ చేసుకోవాల్సి ఉంది అంటున్నారు. అందరికీ ఈ-కేవైసీ పూర్తి చేస్తామని.. కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.
AP Ration Card eKYC Last Date ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ జనవరి నెల 2025 నుండి ప్రారంభమైంది. ముందు మర్చి నెలాఖరు వరకు పెంచగా, తరువాత ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. అయిన చాలా వరకు eKYC పూర్తి అవ్వలేదు. అందుకే చివరి తేదీ జూన్ 30, 2025 వరకు పొడిగించటం జరిగింది.
Ration Card eKYC ఎక్కడ చేసుకోవాలి ?
రేషన్ కార్డు లొ పేరు ఉండి Ration Card eKYC Pending ఉన్న వారు Ration Dealers, MDU Vehicle Operators వద్ద Ration Card eKYC చేసుకోవాలి. ఎక్కడ కార్డు ఉన్న ఎక్కడ అయిన eKYC చేసుకోవచ్చు. చాలా మంది తెలియదు అని చెప్తున్నప్పటికి అక్కడ కూడా eKYC అవుతుంది. గ్రామా వార్డు సచివాలయం లొ ఆప్షన్ ఇచ్చినప్పటికి పూర్తి స్థాయిలో పని చెయ్యటం లేదు. కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సరిగా లేకపోవడంతో, రేషన్ డీలర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని కేంద్రాలు మూసి ఉండటం, కొందరు డీలర్లు డబ్బులు వసూలు చేయడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. చాలామంది కూలీ పనులకు వెళ్లడం వల్ల కూడా ఈ-కేవైసీ చేసుకోలేకపోయారని చెబుతున్నారు. అలాగే విద్యార్థులు వేరే ప్రాంతాల్లో చదువుకుంటూ ఉండటంతో పాటుగా పరీక్షల వల్ల ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోయారు. ఈ క్రమంలో మరోసారి గడువు పెంచారు.
Bolla vinay
ReplyDelete