How to Apply AP Ration Card via Manamitra WhatsApp – Step-by-Step Guide (2025) How to Apply AP Ration Card via Manamitra WhatsApp – Step-by-Step Guide (2025)

How to Apply AP Ration Card via Manamitra WhatsApp – Step-by-Step Guide (2025)

 

P Ration Card new process 2025 AP Ration Card WhatsApp number 2025 How to apply AP Ration Card through WhatsApp AP Ration Card Apply Online 2025 Manamitra WhatsApp Ration Card Application

AP Ration Card 2025: Apply Online Through Manamitra WhatsApp in Minutes

AP Ration Card Apply Online 2025 - Manamitra WhatsApp Governance  ద్వారా Ration / Rice Card Services కు  Apply చేసుకునే Option  AP ప్రజలకు ఓపెన్ అయింది. ఇప్పటివరకు  Ration / Rice Card Services కు దరఖాస్తు చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పనిసరిగా వారి సొంత గ్రామ లేదా వార్డు సచివాలయంలో మాత్రమే అవకాశం ఉండేది ఇప్పుడు Manamitra WhatsApp Governance  లో ఆప్షన్ రావడం వలన రాష్ట్రంలో / దేశంలో /  ప్రపంచంలో ఎక్కడ నుండి అయినా రేషన్ కార్డు సర్వీసులకు Mana Mitra WhatsApp Governance Mobile Number 955230009 ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది.  రేషన్ కార్డ్ సర్వీసెస్ పొందాలంటే AP Household Mapping తప్పనిసరి అది WhatsApp లో Apply చేసిన లేదా Grama Ward Sachivalayam లో Apply  చేసిన .

Ration Card Services Available in AP Mana Mitra WhatsApp Governance 

ration card services list in ap mana mitra whatsapp governance

  1. రేషన్ కార్డులో సభ్యుల చేర్పు [ Adding in Rice Card ]
  2. రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు [ Member Delection  in Rice Card  ] 
  3. రేషన్ కార్డులో తప్పుగా నమోదు అయిన ఆధార్ నెంబరు కరెక్షన్ [ Aadhaar Correctionin Rice Card ]
  4. రేషన్  కార్డు సరెండరు [ Surrender of Rice Card
  5. రేషన్ కార్డు రెండుగా విభజన [ Splitting of Rice Card ]  

Apply AP Ration Card In WhatsApp Process 2025 



How To Apply Ration Card Services in WhatsApp ? 

అన్ని  Ration / Rice Card Services కు WhatApp ద్వారా Apply చేయాలి అంటే కింద చూపించిన Mobile Number మీ ఫోన్ లో తప్పనిసరిగా మీకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకోవాలి లేదా కింద లింక్ పై Click చేసినట్లయితే నేరుగా WhatsApp లోకి వెళ్లి Message లోకి వెళ్తారు 

9552300009

తరువాత WhatsApp ను ఓపెన్ చేసి ఆ నెంబర్ కు Hi అని మెసేజ్ చేసి, Manamitra WhatsApp లో Language Change కావాలి అంటే తెలుగు లో భాష కావాలి అంటే TE అని అదే ఆంగ్లం లో సేవలు కావాలి అంటే EN అని మెసేజ్ చేయాలి . 

AP Manamitra WhatsApp Governance Language Change Process for How To Apply Ration Card Services in WhatsApp ?


తర్వాత డిపార్ట్మెంటు -  Civil Supplies Department  ను ఎంచుకోవాలి అందులో ఏ సర్వీస్కు మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ సర్వీసులు ఎంచుకొని కుటుంబ HOF పెద్ద లేదా రేషన్ కార్డులో అందుబాటులో ఉన్న వారి ఆధార నెంబర్ను ఎంటర్ చేసి ఆధారు నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీను నమోదు చేసి దరఖాస్తును ప్రారంభించాల్సి ఉంటుంది.

How To Apply Ration Card Services in WhatsApp ?


ఒక్కొక్క సేవకు ఒక్కొక్క విధంగా దరఖాస్తు విధానమనేది ఉంటుంది . దరఖాస్తులు మీరు ప్రారంభించిన తర్వాత మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు ఏదైనా సమస్య గాని మీకు వచ్చినట్లయితే అప్పుడు teluguhelper.com@gmail.com అనే మేలుకు పూర్తి వివరాలతో మరియు ఫోటోలతో మెయిల్ చేసినట్లయితే అందులో మీ మొబైల్ నెంబర్ను పంపినట్టయితే మీకు ఫోను చేసి సహాయం చేయడానికి Telugu Helper Youtube Channel వారు మీకు అందుబాటులో ఉంటారు. 

AP Ration Card Apply Doubts FAQ Quation and Answers Help desk
దరఖాస్తు ప్రక్రియకు అవసరమైన వివరాలన్నీ నమోదు చేసి సంబంధిత ఫోటోలు లేదా డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి వివరాలన్నీ సరిగా ఎంటర్ చేసి అప్లికేషన్ కు అవసరమయ్యే Application Fee [ Rs.24/- ] ను మీ మొబైల్ లో ఉన్న ఏదైనా సరే Payment App ద్వారా ఉదాహరణకుPhone Pay / Gpay వంటి యాప్ ద్వారా పేమెంట్ పూర్తి చేసిన తరువాత మీకు అప్లికేషన్ నెంబర్ [ Ex. T25XXXXXX ] అనేది వస్తుంది. 

rice ration card Service member addition through whatsapp application number for ekyc


ఆ అప్లికేషన్ నెంబర్ను నోట్ చేసుకొని రాష్ట్రంలో ఉన్న ఏదైనా సరే గ్రామా లేదా వార్డు సచివాలయంలో ఉద్యోగులైనటువంటి గ్రామ సచివాలయంలో ఉన్న మహిళా పోలీసు లేదా డిజిటల్ అసిస్టెంట్ లేదా విఆర్ఓ లేదా పంచాయతీ కార్యదర్శి అదే వార్డు సచివాలయంలో అయితే వార్డు మహిళా పోలీసు లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లేదా వార్డు రెవెన్యూ సెక్రెటరీ లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి యొక్క GSWS Employees App లో New Rice Card eKYC అనే ఆప్షన్ లో Application No వద్ద మీరు చెప్పినటువంటి అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేసి ఎవరైతే రేషన్ కార్డుకు ఈ కేవైసీ కు అవసరం ఉంటుందో అంటే బయోమెట్రిక్ అవసరం ఉంటుందో వారి యొక్క బయోమెట్రిక్ ని పూర్తి చేసి ఈ కేవైసీను పూర్తి చేయాల్సి ఉంటుంది .

rice card ration card ekyc process at gsws employees app and ekyc status checking link
ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత అప్లికేషన్ అనేది దరఖాస్తుదారుడు ఏ గ్రామా లేదా వార్డు సచివాలయ పరిధికి వస్తాడు ఆ సంబంధిత విఆర్వో లేదా రెవెన్యూ సెక్రెటరీ వారి యొక్క ఏపీ సేవ వెబ్సైట్ యొక్క లాగిన్ కు వెళ్తుంది . అక్కడ Rice Card Six Step Validation ఆరు దశల ధ్రువీకరణ అనేది ఆటోమేటిక్గా రేషన్ కార్డులో ఉన్న సభ్యుల ఆధారు నెంబర్ కు లింక్ అయినటువంటి ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియ అనేది జరుగుతుంది . 

ration card six step validation form vro login ap seva portal accept reject process
అక్కడ అర్హుల అనర్హుల అనే విషయం అనేది చూపించడం జరుగుతుంది. దానిని విఆర్వో వారు ప్రింటు తీసుకొని ఫీల్డ్ లో విసిట్ చేసి ఎంక్వైరీ పూర్తి చేసి ఎంక్వయిరీ రిపోర్ట్ గా రాసి ఆ యొక్క డాక్యుమెంట్ను వారి యొక్క లాగిన్ లో అప్లోడ్ చేసి ఆ యొక్క దరఖాస్తును ఆమోదించాలా లేదా రద్దు చేయాల అని విఆర్ఓ వారి లాగిన్ లో చేయడం జరుగుతుంది. అప్లికేషన్ రద్దు అయితే మాత్రం అక్కడితో దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది అదే అప్లికేషన్ ఆమోదం పొందినట్లయితే అప్పుడు సంబంధిత MRO వారి లాగిన్ కు అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది .

MRO వారు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లను ఆమోదించడం జరుగుతుంది. MRO వారు ఆమోదించిన తర్వాత ప్రభుత్వం ద్వారా మాత్రమే మీకు స్మార్ట్ రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది.

time period for ap ration card services rice card sla period
ఇక్కడ  అప్లికేషన్ వాట్సాప్ ద్వారా చేసిన రోజు నుంచి eKYC కు 3 రోజులు,  eKYC పూర్తయిన తర్వాతVRO వారు ఆమోదం లేదా రద్దు చేయడానికి 7 రోజులు VRO వారు ఆమోదం చేసిన తర్వాత MRO వారు ఆమోదం చేయడానికి 11 రోజులు మొత్తం గా రేషన్ కార్డులో చేర్పులు ఎక్కువగాను 21 రోజులు అదే కొత్త రేషన్ కార్డుకు 6 నెలల సమయం అనేది ఉంటుంది .


Guidlines For Ration Card Services in Manamitra WhatsApp Governance 

1. రేషన్ కార్డులో సభ్యుల చేర్పు [ Adding in Rice Card ] 

ap ration card member addition new rules 2025

  • పుట్టిన పిల్లలు మరియు వివాహమైన వారిని రేషన్ కార్డులో చేర్చడానికి అవకాశం ఉంది
  • గతంలో పుట్టిన పిల్లల వయసు 15 సంవత్సరాల లోపు ఉంటే మాత్రమే రేషన్ కార్డులో చేర్చడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎంత వయసు ఉన్నా సరే రేషన్ కార్డులో చేరుకు అవకాశం ఉంది
  • గ్రామా లేదా వార్డు సచివాలయంలో వివాహమైన వారిని రేషన్ కార్డులో చేర్చడానికి ఎటువంటి వివాహ దృవీకరణ పత్రము మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు కానీ వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసే సమయంలో మ్యారేజ్ ఫోటో మరియు మ్యారేజ్ సర్టిఫికెట్ అప్లోడింగ్ సమయంలో అడుగుతుంది 
  • దరఖాస్తు ఎవరు పేరు చేస్తున్నారో వారు తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండి తీరాల్సిందే కానీ ఎవరినైతే కార్డులో చేరుస్తున్నారో వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోయినా అప్లికేషన్ తీసుకుంటుంది .
  •  వివాహం ద్వారా రేషన్ కార్డులో చేరాలి అంటే పెళ్లి ఫోటో మరియు మ్యారేజ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి అదే పుట్టిన వారికి రేషన్ కార్డులో చేర్చాలి అంటే పుట్టిన తేదీ సర్టిఫికెట్ తప్పనిసరిగా డాక్యుమెంట్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కావున ఆయా సర్టిఫికెట్లు ముందుగానే మీ మొబైల్ లో ఉంచుకోండి . 

  • ఈ సర్వీస్కు ఫీజు 24 రూపాయలు

  • ఈ సర్వీసు దరఖాస్తు చేసిన రోజు నుంచి 21 రోజులలోపు పూర్తి అవుతుంది. 
  • తుది ఆమోదం సంబంధిత MRO

2. రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు [ Member Delection  in Rice Card  ]

ap ration card member deletion nre rules 2025

  • రేషన్ కార్డులో ఎవరైతే చనిపోయి ఉంటారో వారిని మాత్రమే రేషన్ కార్డు నుండి నేరుగా తొలగించడానికి అవకాశం ప్రస్తుతానికైతే ఉంది. 
  • చనిపోయిన వారిని రేషన్ కార్డు నుండి తొలగించాలి అంటే వారి మరణ ధ్రువీకరణ పత్రము అదే డెత్ సర్టిఫికెట్ తప్పనిసరిగా పిడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 
  •  కుటుంబంలో ఒకరికి ఉద్యోగ రీత్యా కార్డు నుండి వేరు చేయాలి అంటే అటువంటి వారికి ఎటువంటి ఆప్షన్ లేదు వారు తప్పనిసరిగా కార్డుని సరెండర్ చేసుకోవాల్సి ఉంటుంది. 
  • రేషన్ కార్డులో వ్యక్తులు శాశ్వతంగా వలసలు అనగా ఇతర దేశాలలో లేదా ఇతర రాష్ట్రాలలో శాశ్వత వలసలో ఉన్నట్లయితే లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ ఇతర రాష్ట్రం లేదా ఇతర దేశ లో వివాహం ద్వారా శాశ్వతంగా ఉన్నట్లయితే అటువంటి వారికి రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు అనే సర్వీసులో కొత్తగా శాశ్వత వలస [ Permanent Migration ] అనే ఆప్షను ఇవ్వను ఇవ్వనుంది గ్రామ వార్డు సచివాలయాలలో మే 25 నుండి ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది ఆయా సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి వారి లాగిన్ లో ఈ ఆప్షన్ రానుంది అదేవిధంగా వాట్సాప్ లో కూడా ఈ ఆప్షన్ను ప్రభుత్వం తీసుకొని రానుంది .  
  • ఈ సర్వీస్కు ఫీజు 24 రూపాయలు

  • ఈ సర్వీసు దరఖాస్తు చేసిన రోజు నుంచి 21 రోజులలోపు పూర్తి అవుతుంది. 

  • తుది ఆమోదం సంబంధిత MRO

3. రేషన్ కార్డులో తప్పుగా నమోదు అయిన ఆధార్ నెంబరు కరెక్షన్ [ Aadhaar Correctionin Rice Card ]

ap ration card wrong aadhaar correction rules 2025

  • రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులలో ఎవరిదైనా సరే ఆధార నెంబర్ తప్పుగా ఉన్నట్టయితే ఆ ఆధారు నెంబర్ను సరి చేసుకునేందుకు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. 
  •  చాలాసార్లు పాత ఆధార్ నెంబరు అదే రేషన్ కార్డులో ఉన్న ఆధారు నెంబరు వివిధ కారణాల వలన రద్దు అయినట్లయితే అప్పుడు మరల కొత్త ఆధార్ కార్డును పొందాల్సి ఉంటుంది పొందిన తర్వాత ముందుగా చేయాల్సిన పని ఏంటంటే హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో పాత ఆధార్ నెంబరు బదులు కొత్త ఆధార్ నెంబర్ను నమోదు చేసుకోవాలి ఆ అవకాశం గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి అదే వార్డు సచివాలయంలో వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి పాత గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్ నందు కలదు. అప్డేట్ చేసుకున్న ఒకరోజు తర్వాత మాత్రమే వాట్సప్ ద్వారా లేదా గ్రామా లేదా వార్డు సచివాలయం ద్వారా ఈ సర్వీస్కు దరఖాస్తు చేసుకోవాలి.
  •  దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ కేవైసీ సమయంలో ఆధార్ మారిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది వారి వయసు ఐదు సంవత్సరాలలోపు ఉన్నట్టయితే వారికి అవసరం లేదు వారికి బదులు తల్లి లేదా తండ్రి బయోమెట్రిక్ వేస్తే సరిపోతుంది. 
  • ఈ సర్వీస్కు ఫీజు 24 రూపాయలు
  • ఈ సర్వీసు దరఖాస్తు చేసిన రోజు నుంచి 21 రోజులలోపు పూర్తి అవుతుంది. 
  • తుది ఆమోదం సంబంధిత MRO


4. రేషన్ కార్డు రెండుగా విభజన [ Splitting of Rice Card ]

ap ration card splitting processs new rules 2025

ప్రస్తుతానికి రేషన్ కార్డు విభజన ఐదు రకములుగా జరుగుతుంది

Normal Split: 

అంటే కుటుంబంలో కనీసం నలుగురు ఉంటూ అందులో రెండు జంటలు ఉన్నట్టయితే ఆ రెండు జంటలను పిల్లలతో సహా వేరుగా చేయవచ్చు

Widow / Widower Split: 

ఈ ఆప్షన్ ద్వారా భర్త చనిపోయిన భార్యను లేదా భార్య చనిపోయిన భర్తను కార్డు నుండి వేరు చేయవచ్చు. ఇందుకు కనీసం కార్డులో ముగ్గురు సభ్యులు ఉండాలి. 

Divorce Split(With Children): 

విడాకులు తీసుకున్న వారు పిల్లలతో సహా వేరుగా కార్డు పొందేందుకు ఈ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Single Member Split: 

ఒకరిని మాత్రమే రేషన్ కార్డు నుండి విభజన చేసేందుకు ఈ ఆప్షన్ పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆప్షన్లు 

  • Widow (female) and never had any children
  • Widower (male) and never had any children
  • Unmarried and above 50 years of age
  • Transgender

Marriage Split: వివాహమైన మహిళ లేదా వివాహమైన పురుషుడు కలిసి ఒకే రేషన్ కార్డులో ఉంటూ పిల్లలు లేకుండా ఉంటే ఇద్దరికీ మాత్రమే రేషన్ కార్డు కావాలి అంటే ఈ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు.

  • ఈ సర్వీస్కు దరఖాస్తు ఫీజు 48 రూపాయలు ఉంటుంది
  • ఈ సర్వీసు గడువు 6 నెలలు ఉంటుంది 
  • తుది ఆమోదం తెలుపు వారు MRO 

5. రేషన్ కార్డు రెండుగా విభజన [ Splitting of Rice Card ]

ap ration card surrender process rules 2025

  • స్వచ్ఛందంగా రేషన్ కార్డును రద్దు చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
  • దారిద్ర రేఖకు దిగువున ఉన్నప్పుడు రేషన్ కార్డు కలిగి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అత్యున్నత సాయికి లేదా ఆరు దశల దృవీకరణలో ప్రభుత్వం నిర్ణయించిన లిమిట్ కన్నా పైబడి ఉన్నప్పుడు /  రేషన్ కార్డు వద్దు అనుకుంటే ఈ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసి రేషన్ కార్డును స్వయంగా రద్దు చేసుకోవచ్చు


Post a Comment

0 Comments