రైస్ కార్డు Rice Card / రేషన్ కార్డు Ration Card సేవలపై ప్రజలలో వస్తున్న సమస్యలను AP Ration Card Issues దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP Govt వారు కింద తెలిపిన ప్రశ్నలకు సమాధానాలు Ration Card FAQ విడుదల చేయడం జరిగినది.
ప్రశ్న 1 : ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులో వ్యక్తిని తొలగించాలంటే కేవలం మరణించిన వారికి డెత్ సర్టిఫికెట్ ఉంటే మాత్రమే అవకాశం ఉంది. పనుల రిత్యా, బయట రాష్ట్ర వ్యక్తులను వివాహం చేసుకొని అక్కడ కార్డులో చేరాలన్న మరియు శాశ్వత వలసలు ఉన్నవారికి తొలగించడానికి అవకాశం లేదు వారిని ఎలా రేషన్ కార్డు నుండి తొలగించాలి ?
మే 25, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్ నందు Rice Card Migration Category అనే కొత్త ఆప్షన్ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఆ ఆప్షన్ ద్వారా సరైన ఆధారాలు సబ్మిట్ చేసి రేషన్ కార్డు నుండి తొలగిపోవచ్చు.
ప్రశ్న 2 : రేషన్ కార్డులో గతంలో 15 సంవత్సరాలు వయసు పైబడిన వారికి జోడించడానికి అవకాశం ఉండేది కాదు ఇప్పుడు అవుతుందా ?
రేషన్ కార్డులో 15 లేదా 15 కన్నా ఎక్కువ వయసు ఉన్న వారిని కార్డులో జోడించడానికి /చేర్చడానికి అవకాశం ఉంది.
ప్రశ్న 3 : రేషన్ కార్డులో ఒకరు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆదాయం నెలకు 12,000 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే వారిని మాత్రమే రేషన్ కార్డు నుండి తొలగించడానికి అవకాశం ఉందా ?
కుటుంబంలో ఒకరు మాత్రమే ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలలో ఉద్యోగం చేస్తూ నెలకు ఆదాయం గ్రామాల్లో 10000 పట్టణాల్లో 12000కు మించి ఉన్నట్లయితే వారిని మాత్రమే రేషన్ కార్డు నుండి తొలగించడానికి అవకాశం లేదు మొత్తం కుటుంబం రేషన్ కార్డుకు అనర్హులు. ప్రస్తుతానికి రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే వారు స్వచ్ఛందంగా రేషన్ కార్డును సరెండర్ చేసుకోవడానికి అవకాశం ప్రస్తుతానికి ఉన్నది.
ప్రశ్న 4 : ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ పింఛన్దారులు [ సామాజిక పింఛన్దారులు కారు ] ఉన్నట్టయితే వారికి రేషన్ కార్డు వస్తుందా రాదా ? ప్రస్తుతం రన్నింగ్ లో ఉంటే పరిస్థితి ఏమిటి ?
ప్రభుత్వ పింఛనుదారులు రేషన్ కార్డులో ఉన్నట్టయితే వారు రేషన్ కార్డుకు అనర్హులు అటువంటివారు స్వయంగా సచివాలయంలో / WhatsApp ద్వారా రేషన్ కార్డును సరెండర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రేషన్ కార్డులో పింక్ కార్డు వంటి ఆప్షన్లు లేవు.
ప్రశ్న 5 : కొన్ని సందర్భాల్లో రేషన్ కార్డులో వ్యక్తి చనిపోయినప్పటికీ కార్డు నుండి ఆ వ్యక్తిని తొలగించడానికి కుదరటం లేదు అలా ఎందుకు అవుతుంది ?
చనిపోయిన వ్యక్తి ఉన్నటువంటి కుటుంబంలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగము లేదా ప్రభుత్వ పింఛను లేదా ప్రైవేటు ఉద్యోగం శాలరీ నెలకు గ్రామాల్లో పదివేలకు పైగా పట్టణాల్లో 12 వేలకు పైగా ఉన్నట్టయితే లేదా నాలుగు చక్రాలు వాహనం ఉన్నట్టయితే లేదా తడిభూమి మూడు ఎకరాలు పొడుభూమి 10 ఎకరాలు ఉన్నట్టయితే ఆ కుటుంబం మొత్తం రేషన్ కార్డుకు అనర్హులు. అటువంటి సందర్భంలో చనిపోయిన వ్యక్తిని తొలగించడానికి కాకుండా నేరుగా కార్డు సరెండర్ చేయాల్సి ఉంటుంది.
ప్రశ్న 6 : రేషన్ కార్డులో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగము లేదా ప్రైవేటు ఉద్యోగం ఆదాయం గ్రామాల్లో పదివేలకు పైగా పట్టణాల్లో 12,000 కు పైగా ఉన్నట్టయితే తొలగించడానికి అవుతుందా ?
తొలగించడానికి అవ్వదు.
ప్రశ్న 7 : తప్పుడు ఆధార్ కార్డు నమోదు చేయడం వల్ల చనిపోయినట్టు చూపించిన లేదా తప్పుగా చనిపోయినట్టు డిక్లేర్ చేసిన అటువంటి కేసులో రేషన్ కార్డులో వారిని మరల చేర్చడం ఎలా ?
ePDS వెబ్సైట్లో తాసిల్దార్ వారి లాగిన్ లో డెత్ రివర్ చేయుటకు ఆప్షన్ ఇచ్చి ఉన్నారు. సచివాలయ సిబ్బంది తప్పుగా మరణించినట్టు నమోదైన వారి సరైన ఆధార్ నెంబర్ను తీసుకొని రేషన్ కార్డులో చేర్పు ఆప్షన్ ద్వారా రేషన్ కార్డు లోకి చేర్చవచ్చు .
ప్రశ్న 8 : విడాకులు తీసుకున్న లేదా లీగల్ గా విడిపోయిన వారికి కొత్తగా రేషన్ కార్డు పొందే అవకాశం ఉందా ?
ఉంది, విడాకులు తీసుకున్న వారికి మరియు లీగల్ గా విడిపోయిన వారికి కొత్తగా రాసి పొందేందుకు అవకాశం లు సచివాలయంలో అందుబాటులో ఉన్నాయి దానికి ముందుగా గ్రామ వార్డు సచివాలయ హౌస్ మ్యాపింగ్ డేటా బేస్ లో విభజన అయి ఉండాలి .
ప్రశ్న 9 : బంధుత్వాలు తప్పుగా ఉండటం వలన రేషన్ కార్డు విభజన కుదరటం లేదు వారికి ఏం చేయాలి ?
డిజిటల్ అసిస్టెంట్ / ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ నందు బంధుత్వాలు మార్పు చేయుటకు కొత్తగా ఆప్షన్ రానుంది. రైస్ కార్డ్ సర్వీసెస్ సెక్షన్ లోనే ఈ ఆప్షన్ ఇవ్వడం జరుగును. ఆప్షన్ ద్వారా బంధుత్వాలు, చిరునామా, జెండారు, వయసు వంటి వివరాలను అప్డేట్ చేయవచ్చు.
ప్రశ్న 10 : దేనిని చూసి ఒక కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇస్తారు అంటే అర్హతలు ఎలా నిర్ధారిస్తారు ?
హౌస్ మ్యాపింగ్ లో ఉన్న సభ్యుల వివరాల ఆధారంగా అందరి ఆరు దశల ధ్రువీకరణ సరిగా ఉందా లేదా రేషన్ కార్డు అర్హతలకు లోబడి ఉన్నట్టయితే వారికి మాత్రమే రేషన్ కార్డు కొత్తగా ఇవ్వటం జరుగుతుంది.
ప్రశ్న 11 : కేవలం 50 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే సింగిల్ మెంబర్ కార్డు దరఖాస్తుకు అవకాశం ఉందా లేదా అందరికీ అవుతుందా ?
అవును కేవలం 50 సంవత్సరాలు వయసు పైబడిన వారికి మాత్రమే సింగిల్ మెంబర్ రేషన్ కార్డు దరఖాస్తు కు అవకాశం ఉన్నది. [ వితంతువులకు మహిళలు / పురుషులు, విడాకులు తీసుకున్న వారికి మినహా ]
ప్రశ్న 12 : ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ దరఖాస్తులు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి ?
రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకునే వారికి కేవలం ఆదాయపు పన్ను క్లియరెన్స్ పై మాత్రమే కాకుండా ఇతర పెరామీటర్ల పై కూడా ఆధారపడి అప్లికేషన్లు ఆమోదం లేదా రిజెక్ట్ అవ్వడం జరుగుతాయి కాబట్టి రివ్యూ ఆధారంగా అవి రిజెక్ట్ అవ్వడం లేదా ఆమోదం అవుతాయి.
ప్రశ్న 13 : రేషన్ కార్డులో చిరునామా బంధుత్వాలు జెండారు మరియు వయసు మార్పు చేసుకోవడం ఎలా ?
సచివాలయాలలో రేషన్ కార్డులో చిరునామా బంధుత్వాలు జెండారు మరియు వయసు మార్పు చేసుకోవడానికి కొత్తగా ఆప్షన్ ఇవ్వనున్నారు. కార్డులో ఇతర వివరాలన్నీ కూడా ఈ కేవైసీ ద్వారా మార్పు జరుగుతాయి .
ప్రశ్న 14 : రేషన్ కార్డులో ఆధార్ కార్డు నెంబర్ తప్పుగా నమోదు అవ్వడం వలన ఇంట్లో ఎవరైనా చనిపోయినట్టు దరఖాస్తు చేస్తున్న సమయంలో ఈ కేవైసీ అవటం లేదు దానిని ఎలా క్లియర్ చేయాలి ?
పై సమస్య ఉన్నవారికి Correction Of Wrong Aadhaar Seeding సర్వీసును ఇవ్వడం జరిగింది.
ప్రశ్న 15 : రేషన్ కార్డులో చనిపోయిన వ్యక్తిని తొలగించే సమయంలో కార్డులో ఉన్న ఇతర సభ్యుల ఈకేవైసీ తప్పనిసరి అవ్వటం వలన దేశాలకు వెళ్లిన వారు ఈ కేవైసీ అవకాసం లేనందున అటువంటి అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని ఎలా క్లియర్ చేయాలి ?
ఇప్పుడు ఇటువంటి సందర్భాలలో అందరూ ఈకేవైసీ అవసరం లేదు అందుబాటులో ఉన్నవారు ఈ కేవైసీ వేస్తే సరిపోతుంది.
ప్రశ్న 16 : రేషన్ కార్డు సర్వీసుకు దరఖాస్తు చేసే సమయంలో బంధుత్వాలలో కొందరికి సెల్ఫ్ లేకపోవడం ఒకే బంధుత్వం అందరికీ ఉండడం వంటి సమస్యల వలన దరఖాస్తుకు అవకాశం కుదరటం లేదు వాటిని ఎలా అధికమించాలి ?
బంధుత్వాలు మార్పుకు కొత్తగా ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.
ప్రశ్న 17 : రేషన్ కార్డు బంధుత్వంలో WIFE ఆప్షన్ ఇవ్వలేదు ఎందుకు ?
జాతీయ ఫుడ్ సెక్యూరిటీ చట్టం ప్రకారం ఇంట్లో ఉన్న వయసు ఎక్కువ కలిగిన మహిళను కుటుంబ పెద్ద HOF గా రేషన్ కార్డులో ఉంచాల్సి ఉంటుంది . అందువలన రేషన్ కార్డులో WIFE ఆప్షన్ అనేది ఉండదు . వారికి కేవలం HOF ఆప్షన్ మాత్రమే ఉంటుంది .
ప్రశ్న 18 : 2024 లో దరఖాస్తు చేసిన వారు మరలా ఇప్పుడు దరఖాస్తు చేయాలా ?
గతంలో దరఖాస్తు చేసి ఆయా అప్లికేషన్లు ఎమ్మార్వో వారి లాగిన్ లో డిజిటల్ సంతకం కొరకు పెండింగ్లో ఉన్నట్లయితే వారు ఇప్పుడు దరఖాస్తు చేయనవసరం లేదు .
ప్రశ్న 19 : రైస్ కార్డు కోసం దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు ?
దరఖాస్తుకు ఎటువంటి చివరి తేదీ లేదు . ఎప్పుడు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తు చేసిన 21 రోజుల్లో తుది ఆమోదం అయ్యేలా ప్రభుత్వం నిర్ణయించింది .
ప్రశ్న 20 : Mana Mitra - WhatsApp Governance లో రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చా ?
Mana Mitra - WhatsApp Governance Number 9552300009 నెంబర్ ద్వారా ప్రస్తుతానికి రైస్ కార్డు లో తప్పుడు ఆధార్ మార్పు , రైస్ కార్డు సరెండర్ కు అవకాశం ఉంది . త్వరలో మిగతా సేవలు ఇస్తారు .
ప్రశ్న 21 : రైస్ కార్డు సేవలకు టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి ?
1967
772944541250
ReplyDeleteMy wife and me and my children mapping separately but my wife have ration card in her parents but I don't have ration card, now we are unable apply new ration card , system shows member have already ration card. Even we meet eligible criteria.
ReplyDelete